గుంటూరు
న్యూస్‌రీల్
వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యుడు టీజేఆర్ సుధాకర్‌బాబు ఫిబ్రవరి 18లోపు పార్టీ కమిటీల ఏర్పాటు కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై అలుపెరుగని పోరాటం
పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ పార్టీ జిల్లా కమిటీ నేతలు పూర్తిస్థాయిలో సంస్థాగత నిర్మాణంపై బాధ్యతగా ముందుకు సాగాలన్నారు.
పార్టీ పార్లమెంట్ జిల్లా పరిశీలకులు పోతిన మహేష్ మాట్లాడుతూ సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయటంతోపాటు డిజిటలైజేషన్ చేయటం ద్వారా ప్రతి ఒక్కరికి ఐడీ కార్డుతోపాటు అనేక భద్రతలను కల్పించటం జరుగుతుందన్నారు.
తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ మండలం, గ్రామం, డివిజన్, వార్డు స్థాయిల్లో గతంలో చేసిన తప్పులకు ఆస్కారం లేకుండా, అక్కడ నేతల సమ్మతితోనే సంస్థాగతంగా పార్టీ నేతలను ఏర్పాటు చేసుకుందామన్నారు.
పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ అధికారం కోల్పోయినప్పటీకి.. పొన్నూరు వంటి నియోజకవర్గంలోని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నియంతృత్వ పోకడలపై పోరాటం చేస్తూ.. ప్రజలకు అండగా నిలుస్తున్నామన్నారు.
మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి మాట్లాడుతూ పార్టీ అధిష్టానం చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా ముందుకు సాగుదామన్నారు.
పార్టీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా మాట్లాడుతూ సంస్థాగత కమిటీ ఏర్పాటులో పూర్తిస్థాయిలో సహకరిస్తామని, పార్టీ జిల్లా, నగర కమిటీ నేతలు వారి వంతు ప్రయత్నం చేయాలని సూచించారు.
ఆదివారం శ్రీ 11 శ్రీ జనవరి శ్రీ 2026
పార్టీ నేతలతో విస్త్రృత స్థాయి సమావేశం
తెనాలి: తెనాలి మార్కెట్‌యార్డులో శనివారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.1500, గరిష్ట ధర రూ.3200, మోడల్ ధర రూ.2400 వరకు పలికింది.
విజయపురిసౌత్: నాగార్జునకొండకు శనివారం పర్యాటకులు పోటెత్తారు. లాంచీస్టేషన్‌కు రూ.2,73,950 ఆదాయం సమకూరినట్లు యూనిట్ మేనేజర్ కె.మస్తాన్‌బాబు తెలిపారు.
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా రౌడీషీటర్లకు, నేరచరిత్ర కలిగిన వారికి శనివారం పోలీస్ మార్క్ కౌన్సెలింగ్ నిర్వహించారు. సాధారణ కౌన్సెలింగ్‌గా భ్రమించి– హాజరైన రౌడీషీటర్లు, నేరచరిత్ర కలిగిన వారికి పోలీస్ మార్క్ కౌన్సెలింగ్ రుచి చూపించినట్లు అదనపు ఎస్పీ రమణమూర్తి తెలిపారు. కౌన్సెలింగ్ అనంతరం, గుంటూరు వెస్ట్ సబ్ డివిజన్ పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో లక్ష్మీపురంలోని ఎన్టీఆర్ స్టేడియం నుంచి మదర్ థెరిసా విగ్రహం వరకు పరేడ్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రజాశాంతికి భంగం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, ఎవరినీ ఉపేక్షించబోమని, చట్టానికి లోబడి నడుచుకోవాలని హెచ్చరించారు. అవసరమైతే పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాలు అమలు చేస్తామని హెచ్చరించారు. జిల్లాను ప్రశాంత జిల్లాగా ఉంచడమే లక్ష్యంగా, శాంతిభద్రతల పరిరక్షణ కోసం గుంటూరు జిల్లా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంటూరు నగరంలోని పలువురు సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
విజయపురిసౌత్: నాగార్జుసాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 557.20 అడుగులకు చేరింది. ఇది 225.9508 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడి కాలువకు 9,800, ఎడమకాలువకు 7,272, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 30,150, ఎస్‌ఎల్‌బీసీకి 2,200, వరద కాలువకు 300 క్యూసెక్కులు విడుదలవుతోంది. దీంతో సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్‌ఫ్లోగా 49,722 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 49,722 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.
పట్నంబజారు(గుంటూరుఈస్ట్): రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన పాలన సాగుతోందని, ప్రజలు కూటమి పాలనపై పూర్తిస్థాయిలో విసిగిపోయారని వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యుడు టీజేఆర్ సుధాకర్‌బాబు పేర్కొన్నారు. గుంటూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, గుంటూరు పార్లమెంట్ జిల్లా పరిశీలకులు పోతిన మహేష్, పార్టీ నగర అధ్యక్షురాలు, తూర్పు సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా, తెనాలి సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, మంగళగిరి సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, తాడికొండ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు, ప్రత్తిపాడు సమన్వయకర్త బలసాని కిరణ్‌కుమార్, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు నిమ్మకాయల రాజనారాయణ, షేక్ గులాం రసూల్‌లతో కలిసి విలేకరుల సమావేశంలో సుధాకర్‌బాబు మాట్లాడారు. గ్రామస్థాయి నుంచి వైఎస్సార్ సీపీని బలోపేతం చేసే దిశగా వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మహాయజ్ఞం ప్రారంభించారని తెలిపారు. జనవరి ఐదు నుంచి ఫిబ్రవరి 18వ తేదీలోగా గ్రామ స్థాయి నుంచి డివిజన్, వార్డుల స్థాయి కమిటీల ఏర్పాటుపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఈ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా స్థానిక నేతలు, కార్యకర్తల నిర్ణయం మేరకు కమిటీలను, అధ్యక్షులను నియమిస్తామని తెలిపారు. రాష్ట్రంలో బాధ్యత కలిగిన ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్సార్ సీపీ పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాయని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ పాలనలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని, పదవుల్లో సైతం వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవ్వటం తథ్యమన్నారు. సోషల్ మీడియాను బలోపేతం చేసి కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై అలుపెరుగని పోరాటం చేస్తున్నామన్నారు.
సంస్థాగత నిర్మాణంపై దృష్టి
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ సంస్థాగత నిర్మాణం చేయాలని వైఎస్ జగన్ ఆదేశించారన్నారు. రానున్న 45 రోజుల్లో సంస్థాగత నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. వీటిపై ప్రత్యేక దృష్టి సారించి ముందుకు సాగుతామని వివరించారు. ఈనెల 17, 18, 19, తేదీల్లో జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించి, సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారిస్తామన్నారు. ఇప్పటీకే అనేక నియోజకవర్గాల్లో కమిటీ నియామకం పూర్తయ్యిందని, త్వరితగతిన మిగతావి కూడా పూర్తి చేస్తామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబుకు సంస్థాగత నిర్మాణ బాధ్యతలు అప్పజెప్పారని తెలిపారు. వైఎస్ జగన్ ఎక్కడకు వెళ్లినా ప్రజలు లక్షలాది మందిగా తరలివచ్చి బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. పూర్తిస్ధాయిలో పార్టీ బలోపేతం దిశగా కృషి చేస్తామమని స్పష్టం చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నేతలు మెట్టు వెంకటప్పారెడ్డి, ఈమని రాఘవరెడ్డి, నందేటి రాజేష్, పఠాన్ సైదాఖాన్, సీడీ భగవాన్, మామిడి రాము, పానుగంటి చైతన్య, శేషగిరి పవన్‌కుమార్, కేసరి సుబ్బులు, పల్లపు మహేష్, ఉడుముల పిచ్చిరెడ్డి, వినోద్, విఠల్, యార్లగడ్డ మదన్‌మోహన్, ఓర్సు శ్రీనివాసరావు, రమణి, ప్రభు తదితరులు పాల్గొన్నారు.
I
వైఎస్సార్ సీపీ జిల్లా ముఖ్య నేతలు, జిల్లా కమిటీ నేతలతో శనివారం పార్టీ జిల్లా కార్యాలయంలో విస్తృత స్థాయి అంతర్గత సమావేశం నిర్వహించారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యుడిగా నియమితులైన టీజేఆర్ సుధాకర్‌బాబు మాట్లాడుతూ సమష్టి కృషితోనే సంస్థాగత నిర్మాణం సాధ్యపడుతుందన్నారు. ఉగాదిలోగా పార్టీ క్యాడర్‌కు ఐడీ కార్డులు ఇవ్వాలన్నదే వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమన్నారు.
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు


