చదువుతో పాటు క్రీడాస్ఫూర్తిని పెంపొందించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

చదువుతో పాటు క్రీడాస్ఫూర్తిని పెంపొందించుకోవాలి

Jan 11 2026 7:41 AM | Updated on Jan 11 2026 7:41 AM

చదువు

చదువుతో పాటు క్రీడాస్ఫూర్తిని పెంపొందించుకోవాలి

గంజాయి కేసుల్లో 11 మంది అరెస్ట్‌

గుంటూరు ఎడ్యుకేషన్‌: ప్రతి ఒక్క విద్యార్థి చదువుతో పాటు క్రీడాస్ఫూర్తిని పెంపొందించుకుని జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వైజాగ్‌ జిల్లా చోడవరం సబ్‌ రిజిస్ట్రార్‌ బలగ గీతాలక్ష్మి అన్నారు. శనివారం భాష్యం విద్యాసంస్థల ఆధ్వర్యంలో వికాస్‌నగర్‌లోని భాష్యం స్పోర్ట్స్‌ ఎరీనా మైదానంలో భాష్యం ఒలంపస్‌ పేరుతో భాష్యం సెంట్రల్‌ లెవల్‌ ఒలంపస్‌ క్రీడా పోటీలను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సబ్‌ రిజిస్ట్రార్‌ గీతాలక్ష్మి మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తూ జీవితాన్ని సమతుల్యం చేసుకోవాలన్నారు. క్రీడలతో నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుని ఎంచుకున్న రంగంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలన్నారు. భాష్యం విద్యాసంస్థల ఛైర్మన్‌ భాష్యం రామకృష్ణ మాట్లాడుతూ భాష్యం ఒలంపస్‌ పేరుతో మూడు రోజులపాటు క్వార్టర్‌ ఫైనల్స్‌, సెమీ ఫైనల్స్‌, ఫైనల్స్‌ జరుగుతాయన్నారు. వీటిలో త్రోబాల్‌, కబడ్డీ, ఖోఖో, క్యారమ్స్‌, చెస్‌, రిలే రేస్‌ పోటీలు జరుగుతాయని, వీటితో పాటు భాష్యం క్రికెట్‌ లీగ్‌ పోటీల్లో 8 జోనల్‌ జట్లు పాల్గొంటాయన్నారు. తొలుత భాష్యం ఒలంపస్‌, భాష్యం జెండాలను ఎగురవేసి క్రీడాజ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు. ఈసందర్భంగా క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పోటీల్లో గెలుపొందిన జట్లకు చైర్మన్‌ భాష్యం రామకృష్ణ ట్రోఫీలను అందజేశారు. భాష్యం విద్యాసంస్థల వైస్‌ చైర్మన్‌ భాష్యం హనుమంతరావు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ భాష్యం సాకేత్‌ రామ్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సింక్రోని గ్లోబల్‌ ఐటీ సొల్యుషన్స్‌తో

వీవీఐటీయూ అవగాహన

పెదకాకాని: విద్యార్థులకు జనరేటివ్‌ ఏఐపై శిక్షణ ఇంటర్న్‌ షిప్‌ అవకాశాల కొరకు ప్రముఖ బహుళ జాతీయ ఐటీ సంస్థ సింక్రోని గ్లోబల్‌ ఐటీ సొల్యుషన్స్‌ తో వీవీఐటీ విశ్వవిద్యాలయం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు వీవీఐటీయూ ప్రొ–చాన్స్‌లర్‌ వాసిరెడ్డి మహదేవ్‌ తెలిపారు. మండల పరిధిలోని నంబూరులోగల యూనివర్సిటీలో శనివారం ప్రొ చాన్స్‌లర్‌ వాసిరెడ్డి మహదేవ్‌ మా ట్లాడుతూ ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులు, అధ్యాపకులకు జనరేటివ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, డేటా ఇంజినీరింగ్‌, డేటా అనలిటిక్స్‌, క్లౌడ్‌ డేటా ఇంజినీరింగ్‌ సాంకేతికపై శిక్షణ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు పరిశ్రమ అనుభవాన్ని అందించడానికి ఇంటర్న్‌షిప్‌ అందించేందుకు తోడ్పాటు ఇవ్వనున్నట్లు తెలిపారు. సింక్రోని సంస్థ సీఈఓ భాను కొంగల, వీవీఐటీయూ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ వై.మల్లికార్జునరెడ్డి ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో వీవీఐటీయూ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ వై.మల్లికార్జునరెడ్డి, అకడమిక్‌ డీన్‌ డాక్టర్‌ కె.గిరిబాబు, ప్లేస్‌మెంట్‌ డైరెక్టర్‌ ఎ.వెంకటేష్‌, ప్లేస్మెంట్‌ బృందం పాల్గొన్నారు.

నగరంపాలెం(గుంటూరు వెస్ట్‌): రెండు వేర్వేరు గంజాయి కేసుల్లో 11 మందిని నగరంపాలెం పోలీసులు అరెస్ట్‌ చేశారు. గుంటూరు జిల్లా పోలీస్‌ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో కేసుల వివరాలను జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు. ముందస్తు సమాచారంతో శుక్రవారం అంకమ్మనగర్‌ ఇరిగేషన్‌ విభాగం కార్యాలయం వెనుక ఖాళీస్థలంలో నగరంపాలెం పోలీసులు తనిఖీలు చేపట్టారన్నారు. అదే రోజు రాత్రి లాల్‌పురం డొంకరోడ్డులోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం సమీపంలోని ఖాళీ స్థలంలోనూ తనిఖీలు కొనసాగాయన్నారు. ఈ క్రమంలో వారి వద్ద గంజాయి గుర్తించారన్నారు. దీంతో మొదటి కేసులో కొరిటెపాడు నాయుడుపేట మూడో వీధిలో ఉంటున్న మేడూరి హేమసాయిచంద్‌ అలియాస్‌ చందు, గౌతమీనగర్‌ మూడో వీధికి చెందిన ముత్తుకూరి సాయిరామ్‌, తన్నీరు నాగసాయి, హనుమయ్యనగర్‌ రెండు, మూడు వీధుల్లో ఉంటున్న మేళం ఏసుమూర్తి, షేక్‌.జానీబాషా, జొన్నలగడ్డ యువరాజుని రెండో కేసులో శ్రీనివాసరావుపేట అరవై అడుగుల రోడ్డులో ఉంటున్న పాలేటి సాల్మన్‌రాజు, నగరంపాలెం ఒకటో వీధికి చెందిన గుంజి హేమంత్‌రాజు, శ్రీనివాసరావుపేట 12వ వీధికి చెందిన సుంకర వంశీకృష్ణ, పట్టాభిపురం రెండో వీధిలో ఉంటున్న పాముల రఘురామ్‌, అడపాబజార్‌కు చెందిన షేక్‌ నాగుల్‌మీరాలను అరెస్ట్‌ చేశామన్నారు. ఆయా కేసుల్లో 4.4 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఈ కేసులు చేధించిన నగరంపాలెం పీఎస్‌ సీఐ సత్యనారాయణ, ఎస్‌ఐలు పి.రాంబాబు, రామచంద్రరెడ్డి, హెచ్‌సీ ఎం.దాసు, కానిస్టేబుళ్లు ఎస్‌కే.జాన్‌సైదా, శ్రీనివాసరావు, సిహెచ్‌.ఉదయచంద్‌, పి.గంగరాజు, ఎస్‌కె.షకీల్‌అహ్మద్‌, టాస్క్‌ఫోర్స్‌ బృందాన్ని జిల్లా ఎస్పీ అభినందించి, ప్రశంసా పత్రాలు అందించారు. మీడియా సమావేశంలో గుంటూరు పశ్చిమ డీఎస్పీ అరవింద్‌ పాల్గొన్నారు.

పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ

మేడికొండూరు: మేడికొండూరులో పట్టాదారు పాసు పుస్తకాలను జిల్లా కలెక్టర్‌ ఎ.తమీమ్‌ అన్సారియా పంపిణీ చేశారు. కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను మేడికొండూరు మండలం విశదల, వెలువర్తి, డోకిపర్రు గ్రామాల్లో శనివారం జిల్లా కలెక్టర్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జారీ చేసిన పట్టాదారు పాసు పుస్తకంపై గల క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే భూమి వివరాలు తెలుస్తాయని చెప్పారు. ఈకేవైసీ పూర్తి అయ్యాకే పాసు పుస్తకం ముద్రించి జారీ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 35,690 పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశామని పేర్కొన్నారు. డో శ్రీనివాసరావు, మండల ప్రత్యేక అధికారి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ వి.శంకర్‌, తహసీల్దార్‌ గాలం రాఘవరావు పాల్గొన్నారు.

4.4 కిలోల గంజాయి స్వాధీనం

పట్టుబడిన వారందరూ

30 ఏళ్ల లోపు వారే.. అందులో

ఏడుగురు పాత నేరస్తులు..

వెల్లడించిన జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌

చదువుతో పాటు క్రీడాస్ఫూర్తిని పెంపొందించుకోవాలి 1
1/2

చదువుతో పాటు క్రీడాస్ఫూర్తిని పెంపొందించుకోవాలి

చదువుతో పాటు క్రీడాస్ఫూర్తిని పెంపొందించుకోవాలి 2
2/2

చదువుతో పాటు క్రీడాస్ఫూర్తిని పెంపొందించుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement