‘కపిరాజు’ నాటికకు ప్రథమ బహుమతి | - | Sakshi
Sakshi News home page

‘కపిరాజు’ నాటికకు ప్రథమ బహుమతి

Apr 28 2025 12:53 AM | Updated on Apr 28 2025 1:15 AM

మార్టూరు : శ్రీకారం రోటరీ కళాపరిషత్‌ ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 24, 25, 26 తేదీల్లో మార్టూరులో నిర్వహించిన తెలుగు రాష్ట్రాల స్థాయి నాటిక పోటీలు శనివారంతో ముగిశాయి. ఇరవై కేటగిరీలకు గాను ఆరింటిలో బహుమతులను కై వసం చేసుకుని న్యూ స్టార్‌ మోడ్రన్‌ థియేటర్‌ విజయవాడ వారి ‘కపిరాజు’ నాటిక అగ్రస్థానంలో నిలిచింది. నాలుగు కేటగిరిల్లో బహుమతులు పొంది కళానికేతన్‌ వీరన్నపాలెం వారి ‘రుతువులేని కాలం’ నాటిక ద్వితీయ స్థానం, మూడు కేటగిరిల్లో బహుమతులు సాధించి విశ్వశాంతి కల్చరల్‌ అసోసియేషన్‌ హైదరాబాద్‌ వారి స్వేచ్ఛ నాటిక తృతీయ స్థానంలో నిలిచింది. కపిరాజు నాటికకు సంబంధించి ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ దర్శకుడిగా ఎమ్మెస్‌ చౌదరి బహుమతులు అందుకున్నారు. ఉత్తమ సహాయ నటుడిగా పవన్‌ కల్యాణ్‌, ఉత్తమ మేకప్‌ మెన్‌గా దినేష్‌, పవన్‌ కుమార్‌, దిలీప్‌ రెండు ప్రత్యేక బహుమతులు అందుకున్నారు. కళానికేతన్‌ వీరన్నపాలెం వారి ‘రుతువులేని కాలం’ నాటికకు తృతీయ ఉత్తమ ప్రదర్శనతోపాటు ఉత్తమ రచయితగా అగస్త్య, ఉత్తమ హాస్యనటునిగా సురేంద్రబాబు, సురభి పూజిత ప్రత్యేక బహుమతులు అందుకున్నారు. విశ్వశాంతి కల్చరల్‌ అసోసియేషన్‌ హైదరాబాద్‌ వారి ‘స్వేచ్ఛ’ నాటికకు గాను ఉత్తమ నటుడిగా గోవాడ వెంకట్‌, మంజు భార్గవి ప్రత్యేక బహుమతితోపాటు ఉత్తమ ద్వితీయ ప్రదర్శనగా ఎంపికై ంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement