మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములుకండి
నగరంపాలెం (గుంటూరు వెస్ట్) : మాదక ద్రవ్యరహిత సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట్రతిపాఠి అన్నారు. మాదక ద్రవ్యాల వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు డ్రగ్స్ వద్దు బ్రో, సంకల్పం ర్యాలీని మంగళవారం గుంటూరులోని మహాత్మగాంధీ పార్క్ వద్ద ప్రారంభించారు.
కార్యక్రమంలో మేయర్ కొవెలమూడి రవీంద్ర, తూర్పు డీఎస్పీ అబ్దుల్‌అజీజ్, పోలీస్ అధికారు, సిబ్బంది పాల్గొన్నారు.
సమీక్షా సమావేషశం
మాదక ద్రవ్యాల నివారణ కోసం విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట్రతిపాఠి అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్లో మంగళవారం(నవంబర్ – 2025) నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి మాట్లాడుతూ ఏ ఒక్కరిపై అయిన ఒక మాదక ద్రవ్యాల కేసు నమోదైనా, అతని విధిగా సస్పెక్ట్ షీట్ నమోదు చేయాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ సంకల్పం, డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమాల ద్వారా మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై జిల్లా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. సమావేశంలో జిల్లా ఏఎస్పీలు జీవీ రమణమూర్తి (పరిపాలన), హనుమంతు (ఏఆర్) పాల్గొన్నారు.
గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట్రతిపాఠి


