మైనారిటీల ఆస్తులు దోపిడీకి కుట్ర
నువ్వు అసలు మైనారిటీవేనా..!
వక్ఫ్ భూముల లాక్కుంటుంటే చేతకాని దద్దమ్మలా.. ఎమ్మెల్యేపై వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు నూరిఫాతిమా ధ్వజం
పట్నంబజారు: ముస్లిం మైనారిటీల ఆస్తులు దోపిడీ చేస్తుంటే.. తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ చేతకాని దద్దమ్మలా చూస్తూ.. తనకేమి తెలియదంటూ వ్యాఖ్యలు చేయటం సిగ్గుచేటని వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా నిప్పులు చెరిగారు. అంజుమన్ ఏ ఇస్లామియాకు చెందిన చినకాకానిలోని 71.57 ఎకరాల భూమిని ఇండ్రస్టీయల్ పార్క్ పేరుతో దోచుకుంటుంటే.. మైనారిటీ ఎమ్మెల్యేగా నసీర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఆమె కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన 71 ఎకరాల భూమి చినకాకానిలో ఉందని చెప్పారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఆయన సోదరుడు రవి, ఎమ్మెల్యే నసీర్‌అహ్మద్, కూటమి పెద్దలు కలిసి గుట్టుచప్పుడు కాకుండా ఆ భూములను కై ంకర్యం చేసేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. ఇండ్రస్టీయల్ పార్క్‌కు ఇవ్వాలనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేసిన తరువాత ఇవ్వాలని, అదేమి లేకుండా నేరుగా టెండర్లు పిలవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే నసీర్‌అహ్మద్ ఈవిషయంపై ప్ర శ్నిస్తే తనకేమి తెలియదని చెప్పటం సిగ్గుచేటన్నారు. పర్సంటేజ్ తీసుకుని నోరు మెదపటంలేదని ఆరోపించారు. దీనిపై హైకోర్టును ఆశ్రయిస్తామని, శాంతియుత వాతావరణంలో ఎంతటి పోరాటానికి వెనుకాడబోమన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి షేక్ గులాంరసూల్ మాట్లాడుతూ చినకాకానిలో అంజుమన్‌కు సంబంధించిన భూమి మొత్తం 81.22 ఎకరాలు ఉంటే.. ఇప్పుడు 71 ఎకరాలకు టెండర్లు పిలిచారని, అసలు ఆ 10 ఎకరాలు ఏమైందో తెలియకుండా పోయిందన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నేతలు, మైనారిటీ విభాగం నేతలు పఠాన్ సైదాఖాన్, పఠాన్ అబ్దుల్లాఖాన్, లియాఖత్‌ఆలీ, అప్సర్, కార్పొరేటర్లు ఫర్జానా, ఆబీద్‌బాషా, మెహమూద్, నేతలు వైఎస్సార్ రబ్బాని, జాఫర్, సలీం, షౌకత్, యూసఫ్, రహీమ్ పాల్గొన్నారు.


