గుంటూరు రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్ సౌకర్యం
లక్ష్మీపురం: నాన్–ఫేర్ రెవెన్యూ చొరవలో భాగంగా, దక్షిణ మధ్య రైల్వే, గుంటూరు డివిజన్, గుంటూరు రైల్వే స్టేషన్‌న్‌లో స్లీపింగ్ పాడ్స్ సౌకర్యాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని గుంటూరు రైల్వే డివిజన్ డీఆర్‌ఎం సుధేష్ఠ సేన్ అన్నారు. గుంటూరు రైల్వే స్టేషన్‌లోని ఒకటో నెంబర్ ఫ్లాట్‌ఫారంలో మంగళవారం ప్రయాణికుల సౌకర్యార్థం నూతనంగా నిర్మించిన స్లీపింగ్ ప్యాడ్స్‌ను ఆమె ప్రారంభించారు. ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలను, బెడ్స్, వాష్ రూమ్‌లను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ స్లీపింగ్ పాడ్స్ సౌకర్యం మొత్తం 64 పడకల సామర్‌ాధ్యన్ని కలిగి ఉందన్నారు.
గుంతకల్లు– మార్కాపురం ప్యాసింజర్ ప్రారంభం
లక్ష్మీపురం: గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని నంద్యాల మీదుగా గుంతకల్లు – మార్కాపూర్ రోడ్ నూతన ప్యాసింజర్ ౖసర్వీస్ ప్రారంభమైంది. రైల్వే మంత్రిత్వ శాఖ గుంతకల్లు– మార్కాపూర్ రోడ్– గుంతకల్లు(నంద్యాల మీదుగా) రోజువారీ ప్యాసింజర్ రైలు సర్వీస్ ప్రవేశపెట్టడానికి ఆమోదం తెలిపిందని గుంటూరు రైల్వే డివిజన్ పీఆర్‌ఓ వినయ్ కాంత్ మంగళవారం తెలిపారు. రైలు నంబర్ 57407/ 57408 గుంతకల్లు – మార్కాపూర్ రోడ్– గుంతకల్లు రోజువారీ ప్యాసింజర్ రైలు సర్వీస్ యొక్క ప్రతిపాదితన కేటాయించడం జరిగిందని తెలిపారు.


