క్రిస్మస్ పండుగకు ఏర్పాట్లు పూర్తి
ఫిరంగిపురం:క్రిస్మస్‌ను పురస్కరించుకొని స్థాని క బాలఏసు దేవాలయంలో ప్రత్యేక పూజాబలి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశా రు. దేవాలయానికి విద్యుత్ దీపాలు వేయడంతో కాంతులీనుతుంది. నవదిన ప్రార్థనల్లో భాగంగా కొత్తపేటకాలనీ, లూర్దునగర్, క్రీస్తునగర్, జగన్ కాలనీ ప్రాంతాల్లో దేవాలయ సహాయ విచారణ గురువు కె.సాగర్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ప్రత్యేక ప్రార్థనలు నిర్వ హించారు. 24న ఉదయం విచారణ గురువులు ఫాతిమా మర్రెడ్డి ఆధ్వర్యంలో దివ్యపూజాబలి, రాత్రి 11.30 గంటలకు క్రీస్తుజయంతి మహోత్సవం, జాగరణ దివ్యపూజాబలిలో మేత్రాసన గురువు చిన్నాబత్తిని భాగ్యయ్య పాల్గొంటారని చెప్పారు. 25న దివ్యపూజాబలి నిర్వహిస్తారని గురువులు ఫాతిమా మర్రెడ్డి, టి.కమలేష్‌లు పాల్గొంటారని తెలిపారు. అదేరోజు రథోత్సవం, తేరు ప్రదక్షణ నిర్వహిస్తారని చెప్పారు.
ఆంధ్రా రోమ్ ఫిరంగిపురం
ఫిరంగిపురం: ఆంధ్రారోమ్‌గా ఫిరంగిపురాన్ని పిలుస్తారని బాలఏసు దేవాలయ విచారణ గురువులు మాలపాటి ఫాతిమా మర్రెడ్డి అన్నారు. బిషప్‌హౌస్‌లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఫిరంగిపురం అనగానే కథోళిక క్రైస్తవులు ఎక్కువ మంది కలిగిన గ్రామంగా ప్రసిద్ధి చెందిందన్నారు. దేవాలయం నిర్మించి 140 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా పండుగను వైభవంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు.
తెనాలిటౌన్: శ్రీ విశ్వావసు నామ సంవత్సర ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీలక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం వైకుంఠపురంలో స్వామివారికి ముక్కోటి ఏకాదశి దశావతార మహోత్సవాలు కనుల పండువగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా మంగళవారం స్వామివారిని నరసింహావతారంలో అలంకరించి పురవీధుల్లో రథంపై ఊరేగింపు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వి.అనుపమ, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
తెనాలిరూరల్: తెనాలి తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా మంగళవారం పరిశీలించారు. తెనాలి తహసీ ల్దార్ కార్యాలయాన్ని దాతల సాయంతో ఆధునికీకరించి ఇటీవల పునఃప్రారంభించిన సంగతి విదితమే. ఈ కార్యాలయాన్ని తన పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ తనిఖీ చేసి, నూతన సౌకర్యాలు, ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. కార్యాలయానికి అధునాతన శోభగులద్దిన తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ, దాతలను అభినందించారు. కలెక్టర్ వెంట తెనాలి సబ్ కలెక్టర్ సంజన సింహా ఉన్నారు.
ప్రత్తిపాడు: పోలేరమ్మ తల్లికి భక్తులు బంగారు హారాన్ని కానుకగా సమర్పించారు. గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండపాటూరు గ్రామంలో కొలువుదీరిన పోలేరమ్మ తల్లికి తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా నెక్కొండ గ్రామానికి చెందిన వి.వి శేఖర్‌రెడ్డి సుమారు రూ.5.60లక్షల విలువచేసే బంగారు హారాన్ని అమ్మవారికి సమర్పించారు. హారాన్ని మంగళవారం ఆలయంలో ఆలయ కార్యనిర్వహణాధికారి జక్కా శ్రీనివాసరావుకు అందజేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
క్రిస్మస్ పండుగకు ఏర్పాట్లు పూర్తి
క్రిస్మస్ పండుగకు ఏర్పాట్లు పూర్తి


