ఘనంగా జాతీయ రైతు దినోత్సవం
గుంటూరురూరల్: నగర శివారుల్లోని లాంఫాంలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మంగళవారం జాతీయ రైతు దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకుడు డాక్టర్ జి.శివన్నారాయణ అధ్యక్షత వహించగా, వీసీ డాక్టర్ ఆర్ శారదజయలక్ష్మిదేవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వీసీ మాట్లాడుతూ అకాల పరిస్థితులను తట్టుకుని అధిక ఆదాయం పొందే రకాలను, శాస్త్ర పరిజ్ఞానాన్ని, శాస్త్రవేత్తలు రైతులకు అందజేయాలన్నారు. విస్తరణ సంచాలకుడు డాక్టర్ జి.శివన్నారాయణ, పరిశోధన సంచా లకులు డాక్టర్ పీవీ సత్యనారాయణ మాట్లాడారు. కార్యక్రమంలో అభ్యుదయ రైతులు కొలకలూరు గ్రామానికి చెందిన యన్నం లక్ష్మయ్య, గుడిపూడికి చెందిన గద్దె హనుమంతరావు, మోతడక గ్రామానికి చెందిన మన్నవ వెంకటేశ్వర్లు, గ్రంధసిరి గ్రామానికి చెందిన కిలారి రామారావు, మునిపల్లికి చెందిన గుంటుపల్లి వరప్రసాద్, వేజండ్లకు చెందిన తాడిబోయిన చంద్రశేఖర్‌లను సన్మానించారు.


