సీఎస్‌ఎస్ నిధులు నూరుశాతం వినియోగించాలి
కలెక్టర్ తమీమ్ అన్సారియా
గుంటూరు వెస్ట్: జిల్లాలో కేంద్ర ప్రాయోజిత పథకాలకు(సీఎస్‌ఎస్) మంజూరు చేసిన నిధులు నూరుశాతం నిర్దేశించిన కాలపరిమితిలో వినియోగించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. బీఎల్‌ఓలకు కలర్ ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాను జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవతో కలసి అందజేశారు. అదే విధంగా జనవరి 15 నాటికి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల పరిష్కారానికి ఈ–ఆఫీస్ విధానం ను అమలు చేయాలని ఆదేశించారు.


