ఘనంగా విగ్రహాల ప్రతిష్ఠా మహోత్సవం
ముఖ్య అతిథిగా పాల్గొన్న
మాజీ మంత్రి జోగి రమేష్
తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ పరిధిలోని ఇప్పటంలో గౌడ పాలెంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ కోదండ రామ స్వామి విగ్రహంతోపాటు పలు విగ్రహాల ప్రతిష్ఠా మహోత్సవాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వైఎస్సార్‌సీపీ నాయకులు, మాజీ మంత్రి జోగి రమేష్, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి ముందుగా గ్రామంలోని సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గౌడపాలెంలో శ్రీ కోదండరామస్వామి, శ్రీ గణపతి, శ్రీ గంటలమ్మ, పోతురాజు, హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భారీ అన్నదానం చేశారు. వైఎస్సార్‌సీపీ రూరల్ అధ్యక్షుడు అమరా నాగయ్య, మంగళగిరి నియోజకవర్గ మాజీ జేసీఎస్ కన్వీనర్ మున్నంగి వివేకానంద రెడ్డి, గౌడ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 514.60 అడుగుల వద్ద ఉంది. ఇది 139.6134 టీఎంసీలకు సమానం.
ఘనంగా విగ్రహాల ప్రతిష్ఠా మహోత్సవం


