రేపు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్‌ జగన్‌ భేటీ | YS Jagan To Meet With Local Body Representatives On April 24 | Sakshi
Sakshi News home page

రేపు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్‌ జగన్‌ భేటీ

Apr 23 2025 7:37 PM | Updated on Apr 23 2025 8:03 PM

YS Jagan To Meet With Local Body Representatives On April 24

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు, తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలు, అనంతపురం జిల్లా కంబదూరు, తిరుపతి రూరల్‌ వైఎస్సార్‌సీపీ స్థానిక సంస్ధల ప్రజా ప్రతినిధులతో రేపు(గురువారం) ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమం‍త్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశం కానున్నారు.

స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాలలో భాగంగా రేపు తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు, తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలు, అనంతపురం జిల్లా కంబదూరు, తిరుపతి రూరల్‌ వైఎస్సార్‌సీపీ నేతలతో భేటీ కానున్నారు.

ఈ సమావేశానికి ఎంపీపీలు, మున్సిపల్‌ చైర్‌ పర్సన్లు, మున్సిపల్‌ వైస్‌ ఛైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలను ఆహ్వానించారు. వీరితో పాటు ఆయా జిల్లాలకు సంబంధించిన పార్టీ ముఖ్య నాయకులు కూడా హాజరు కానున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement