మెడిసిన్ చదువుతా
తెనాలి: ఇంటర్‌లో బైపీసీ తీసుకుని మెడిసిన్ చేయాలనుందని పదో తరగతిలో 595 మార్కులు సాధించిన వివేక విద్యాసంస్థల విద్యార్థిని సీహెచ్ పరమేశ్వరి తన లక్ష్యాన్ని వెల్లడించింది. తెనాలి వివేక విద్యాసంస్థల్లో చిన్నప్పటి నుంచి చదవటం, ఉపాధ్యాయుల సూచనలు తనకు ఎంతగానో ఉపకరించినట్లు పేర్కొంది. వారందరికీ రుణపడి ఉంటానని చెప్పింది. తన తండ్రి అనంతరాజు సాధారణ పండ్ల వ్యాపారి కాగా, తల్లి శివలక్ష్మి గృహిణి అని తెలిపింది. తన చదువు కోసం వారు పడిన కష్టం మరువలేనిదని పేర్కొంది. న్యూరో సర్జన్‌గా స్థిరపడాలనేది లక్ష్యమని, అందుకోసం పట్టుదలతో చదువుతానని తెలిపింది.
– సీహెచ్ పరమేశ్వరి


