పింఛన్‌దారులతో మర్యాదగా వ్యవహరించాలి
గుంటూరు వెస్ట్: పింఛన్‌దారులతో సిబ్బంది మర్యాదపూర్వకంగా మెలగాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని డీఆర్సీ సమావేశ మందిరంలో ఫించన్ల పంపిణీ సిబ్బందికి శుక్రవారం నిర్వహించిన కౌన్సెలింగ్‌లో ఆమె మాట్లాడారు. ఐవీఆర్‌ఎస్ నివేదిక ప్రకారంలో ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు జరిగిన పింఛన్ల పంపిణీలో అనేక లోపాలను గుర్తించారని తెలిపారు. నగదు పంపిణీలో కులమతాలకతీతంగా అందరినీ గౌరవించాలని, వృద్ధులతో మర్యాదపూర్వకంగా మెలగాలని చెప్పారు. అవినీతికి పాల్పడకూడదని తెలిపారు. సిబ్బంది ఇబ్బందులు కలిగించినా, పింఛన్‌దారులతో అమర్యాదగా ప్రవర్తించినా ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. కౌన్సెలింగ్‌కు హాజరుకాని సిబ్బందికి మెమో జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ టి.వి. విజయలక్ష్మి పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలన
తాడికొండ : వీఐటీ ఏపీ విశ్వవిద్యాలయంలో ఈనెల 28న జరిగే కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కానున్న నేపథ్యంలో ఏర్పాట్లను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, అధికారులు పరిశీలించారు. సభా వేదిక ప్రాంగణం, పలు ప్రాంతాలను పరిశీలించారు. వీఐటీ యూనివర్సిటీ వీసీ ఎస్.వి.కోటారెడ్డితో చర్చించారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఎ.భార్గవ్‌తేజ, యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ జగదీష్ చంద్ర ముదిగంటి, ఆర్డీవో కె.శ్రీనివాసరావు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి


