
‘గిన్నిస్’లో చినకాకాని బాలుడికి చోటు
చినకాకాని(మంగళగిరి): నగర పరిధిలోని చినకాకానికి చెందిన బాలుడు గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించాడు. ప్రపంచ స్థాయిలో కీబోర్డు ద్వారా క్రిస్టియన్ సంగీతాన్ని ఆప్‌లోడ్ చేసే ప్రక్రియలో ఈ గుర్తింపు లభించింది. ఒక గంట సమయంలో 1,046 వీడియోలను ఇన్‌స్ట్రాగామ్‌లో అప్లోడ్ చేసిన బృందంలో బాలుడు ఇమ్మాన్యేల్ ఉన్నాడు. ఈ మేరకు విజయవాడలో జరిగిన కార్యక్రమంలో తల్లిదండ్రులు పాస్టర్ జేజీసీ పాల్, డాక్టర్ సుజన సమక్షంలో నిర్వాహకులు బాలుడికి అవార్డు అందజేశారు. ఇమ్మాన్యేల్ ఆత్మకూరు నిర్మల స్కూలులో చదువుతున్నాడు.
రెడ్డిపాలెం విద్యార్థికి కూడా..
గుంటూరు రూరల్: రెడ్డిపాలెం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ కుటుంబానికి చెందిన పి.లక్ష్మీనరసయ్య, సుజాతల కుమారుడు పడాల శ్రీనాథ్ స్థానిక పాఠశాలో 6వ తరగతి చదువుతున్నాడు. ఈ బాలుడికి కూడా సంగీత కార్యక్రమానికిగాను నిర్వాహకులు గిన్నిస్ ధ్రువపత్రం అందించారు.

‘గిన్నిస్’లో చినకాకాని బాలుడికి చోటు