సెంట్రల్ జీఎస్టీ కమిషనర్‌గా సుజిత్ మల్లిక్
లక్ష్మీపురం: సెంట్రల్ జీఎస్టీ గుంటూరు కమిషనరేట్‌కు నూతన కమిషనర్‌గా సుజిత్ మల్లిక్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు కన్నవారితోటలోని సెంట్రల్ జీఎస్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. ఆయన భువనేశ్వర్ నుంచి గుంటూరుకు ప్రమోషన్‌పై వచ్చారు. రూర్కెలాలోని ఆర్‌ఈసీ నుంచి బీఈ (మెకానికల్ ఇంజినీరింగ్) పూర్తి చేశారు. ఒడిశాలోని ఆంగుల్‌లో నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్‌లో పనిచేశారు. ఆయన 2007లో ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్‌ఎస్)లో చేరారు. వివిధ హోదాల్లో పనిచేసిన తర్వాత సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, కస్టమ్స్‌కు (సీబీఐసీ) తిరిగి వచ్చారు. తర్వాత ఆయన భువనేశ్వర్ జోన్‌లో జీఎస్టీ కస్టమ్స్ విభాగాల్లో పనిచేశారు. వివిధ విభాగాలలో సేవలందిస్తూనే, ఆయన సైబర్ లా – సైబర్ ఫోరెన్సిక్స్‌లో పీజీ డిప్లొమా పొందారు.


