
నిరసన వ్యక్తం చేస్తున్న పీఈటీ అభ్యర్థులు
మంగళగిరి టౌన్: మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయం వద్ద పీఈటీ (ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్) అభ్యర్థులు మంగళవారం నిరసన చేపట్టారు. డీఎస్సీలో పీఈటీ పోస్టుల భర్తీ లేకపోవడాన్ని నిరసిస్తూ ధర్నా నిర్వహించారు.
యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ హామీ ఇచ్చి మోసం చేశారని, మీరైనా న్యాయం చేయాలంటూ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ను ఉద్దేశిస్తూ ఫ్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. డీఎస్సీలో ఖాళీ పీఈటీ పోస్టుల భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆమరణ నిరాహార దీక్షలకు దిగుతామని హెచ్చరించారు. కాన్వాయ్‌లో పవన్ కళ్యాణ్ వస్తున్న సమయంలో పెద్దగా నినాదాలు చేసినా పట్టించుకోకుండా వెళ్లిపోవడంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు.