ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించాడని.. | Tragic incident in yadadri | Sakshi
Sakshi News home page

ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించాడని..

Mar 9 2026 5:16 AM | Updated on Mar 9 2026 5:16 AM

Tragic incident in yadadri

ఉరేసుకుని యువతి బలవన్మరణం

వలిగొండ: ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం చెందిన ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా వలి గొండ మండలం ఎం.తుర్కపల్లి గ్రామంలో ఆది వారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఎం.తుర్కపల్లికి చెందిన ముంత మమత (25), మొగిలిపాక గ్రామానికి చెందిన మర్ల మత్స్యగిరి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. 

పెళ్లి చేసు కుందామని మత్స్యగిరిని ఇటీవల మమత కోరగా అతడు నిరాకరించాడు. ఆదివా రం మమత తల్లిదండ్రులు హైదరాబాద్‌కు వెళ్ల గా.. ఆమె సోదరి భవాని వ్యవసాయ బావి వద్ద కు వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తాను ప్రే మించిన వ్యక్తి మోసం చేశాడని మమత సూసై డ్‌ నోట్‌ రాసి, సోదరికి ఫోన్‌ చేసి ‘అమ్మానాన్న జాగ్రత్త’ అని చెప్పి చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసు కుంది. 

మమత సోదరి బావి వద్ద నుంచి ఇంటికి వచ్చి చూసేసరికి ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ కని పించింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ యుగంధర్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement