యాదగిరిగుట్ట రూరల్ : ఇందిరమ్మ పథకంతో పేదవాడి సొంతింటి కల సాకారం అవుతుందని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు. యాదగిరిగుట్ట మండలం రామాజీపేట గ్రామంలో ఆదివారం ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమానికి ఆయన హాజరై లభ్ధిదారులు కోల మాధవి మల్లేష్ దంపతులకు నూతన వస్త్రాలు అందజేసి మాట్లాడారు. ప్రతీ నిరుపేద కుటుంబానికి ఇల్లు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామన్నారు. ఇళ్లు లేని పేదలకు గౌరవప్రదమైన జీవితం కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నవీన్‌కుమార్, మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, సర్పంచ్ గడ్డం దేవేందర్, కుండె సిద్దులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
ఫ ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య


