breaking news
Yadadri District News
-
నృసింహుడికి లక్ష పుష్పార్చన
యాదగిరిగుట్ట: ఏకాదశిని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఉత్సవమూర్తులకు లక్ష పుష్పార్చన నిర్వహించారు. గులాబీ, చామంతి, బంతి, తులసీ దళంతో స్వామి, అమ్మవారికి పుష్పార్చన చేశారు. అనంతరం ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, జోడు సేవోత్సవం తదితర పూజలు నిర్వహించారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయాన్ని ద్వారబంధనం చేశారు. అంతకుముందు తెల్లవారుజామున సుప్రభాత సేవ, గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, సహస్రనామర్చన జరిపించారు. -
చౌటుప్పల్‌లో చెడ్డీగ్యాంగ్!
చౌటుప్పల్ : చౌటుప్పల్‌లో చెడ్డీగ్యాంగ్ హల్చల్ చేసింది. గురువారం అర్ధరాత్రి దాటాక పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం సమీపంలో గల అంజనసాయి మెడోస్ వెంచర్లోకి చొరబడ్డారు. తాళం వేసి ఉన్న ఇంటి తాళాలు పగులగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. చేతిలో మారణాయుధాలతో ముగ్గురు దొంగలు సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని చిన్నకొండూర్ గ్రామానికి చెందిన డొప్ప నరేష్ సెంట్రింగ్ పని చేస్తుంటాడు. అంజనసాయి మెడోస్ వెంచర్‌లోని కృష్ణవేణి హైస్కూల్ వెనుక వైపున ఉన్న చీకూరి శ్రీనివాస్ ఇంట్లో కుటుంబసభ్యులతో కలిసి అద్దెకు ఉంటున్నాడు. నారాయణపురం మండలం పుట్టపాక గ్రామంలోని బంధువుల నివాసంలో జరిగిన ఫంక్షన్ కోసం ఈనెల 16న కుటుంబసభ్యులతో కలిసి వెళ్లాడు. శుక్రవారం తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో ఇంట్లో దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించాడు. ఆందోళనకు గురై వెంటనే బీరువా తెరిచి చూడగా.. 8గ్రాముల బంగారం, 8.5తులాల వెండితోపాటుగా నగదు కన్పించలేదు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. వారు అక్కడకు చేరుకుని ఆధారాలు సేకరించారు. పరిసరాల్లోని సీసీ కెమెరాలు పరిశీలించారు. చెడ్డీగ్యాంగ్ పనేనని అనుమానం ముగ్గురు సభ్యులు గల బృందం ఈ చోరీ చేసినట్లు గుర్తించారు. ఈ ముగ్గురు దొంగలు ముసుగులు ధరించారు. అందులో ఒక వ్యక్తి డ్రాయర్ మాత్రమే ధరించి, ఒంటికి నూనె రాసుకుని ఉన్నాడు. మరో ఇద్దరు వ్యక్తులు చేతుల్లో మారణాయుధాలు పట్టుకున్నారు. అయితే దొంగతనానికి పాల్పడింది చెడ్డీ గ్యాంగ్ సభ్యులేనా లేక స్థానికంగా ఉండే దొంగలే ముసుగులు ధరించి హల్చల్ చేశారా అని తెలియాల్సి ఉంది. బాధితుడు డొప్ప నరేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. రాత్రివేళ తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ చౌటుప్పల్‌లోని అంజనసాయి మెడోస్ వెంచర్లో ఘటన -
రీజినల్ రింగ్ రోడ్డు రాష్ట్రమంతా ఒకేలా నిర్మించాలి
చౌటుప్పల్ : రీజినల్ రింగ్ రోడ్డును రాష్ట్రమంతటా ఒకేలా నిర్మించాలని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్ఆర్ఆర్ భూనిర్వాసితులు శుక్రవారం హైదరాబాద్‌లోని సీపీఐ కార్యాలయంలో వారిని కలిసి న్యాయం చేయాలని కోరుతూ వినతిప్రతం అందజేశారు. ఈ సందర్భంగా పల్లా వెంకట్‌రెడ్డి, కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. రైతుల న్యాయమైన పోరాటానికి తమవంతు సహకారం అందిస్తామన్నారు. కొన్ని పరిశ్రమలకు ప్రయోజనం కల్పించడం, కొంత మంది బడా వ్యక్తులకు మేలు చేకూరేలా అలైన్‌మెంట్‌ను మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టానుసారంగా కాకుండా ఆర్ఆర్ఆర్ను శాసీ్త్రయంగా నిర్మించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆర్ఆర్ఆర్ భూ నిర్వాసితులకు ఇచ్చిన హామీలను నిలుపుకోవాలన్నారు. కోట్ల రూపాయలు విలువ చేసే భూములను తక్కువ ధరకు లాక్కోవాలని చూడడం భావ్యం కాదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని అలైన్‌మెంట్‌ను మార్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్ చింతల దామోదర్‌రెడ్డి, నిర్వాసితులు నడికుడి అంజయ్య, గుజ్జుల సురేందర్‌రెడ్డి, పల్లె శేఖర్‌రెడ్డి, జాల వెంకటేశ్, జాల శ్రీశైలం, సందగళ్ల మల్లేష్, నాగవళ్లి దశరథ, నెల్లికంటి నాగార్జున, భరత్, శ్రీనివాస్, బద్రుద్దీన్, నవీన్ తదితరులున్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి -
నేడు నాగార్జునసాగర్‌కు ఏపీ గవర్నర్
నాగార్జునసాగర్ : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ శనివారం నాగార్జునసాగర్‌కు రానున్నారు. రెండు రోజుల పాటు ఆయన కుటుంబసభ్యులతో కలిసి సాగర్‌లో పర్యటిస్తారు. ఉదయం 11.50 గంటలకు హెలికాప్టర్ ద్వారా ఏపీ గవర్నర్ సాగర్‌కు చేరుకుంటారు. రెండు రోజుల పాటు ఆయన సాగర్‌లోనే ఉండి వివిధ ప్రదేశాలను సందర్శించనున్నారు. ఏపీ గవర్నర్ పర్యటకు సంబంధించి ఏర్పాట్లను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. అనంతరం విజయవిహార్‌లో అధికారులతో సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించారు. అనంతరం బీసీగురుకుల విద్యాలయంలో ఉన్న హెలీప్యాడ్, లాంచిస్టేషన్‌ను ఆమె సందర్శించారు. కలెక్టర్ వెంట మిర్యాలగూడ సబ్‌కలెక్టర్ అమిత్ నారాయణ్, అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్, మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖరరాజు, సీఐ శ్రీనునాయక్, జిల్లా టూరిజం అధికారి శివాజీ, పెద్దవూర తహసీల్దార్ శాంతిలాల్, ఆర్ఐ దండ శ్రీనివాస్‌రెడ్డి, వైద్యవిధానపరిషత్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ మాతృనాయక్, డాక్టర్ రవి, సూపరింటెండెంట్ ఇంజినీర్ మల్లికార్జున్‌రావు, మున్సిపల్ కమిషనర్ వేణు, అధికారులు పాల్గొన్నారు. ఏర్పాట్లను పరిశీలించిన నల్లగొండ కలెక్టర్ -
గంజాయి విక్రయిస్తున్న యువకుల అరెస్టు
బీబీనగర్ : మండలంలోని కొండమడుగు మెట్టు వద్ద గంజాయి విక్రయిస్తున్న నలుగురు యువకులను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. బొడుప్పల్కు చెందిన భూక్యా ఆజాద్నాయక్, హయత్‌నగర్ కుంట్లూరు పరిధిలోని రావినారాయణ కాలనీకి చెందిన వల్లెపు వంశీ, మేకల స్టాలిన్, బుడ్డ సునీల్ ఛత్తీస్‌ఘడ్‌లో గంజాయి కొనుగోలు చేసి తీసుకొచ్చారు. అందులో కొంత తాము సేవించేందుకు ఉంచుకొని మిగతా దానిని విక్రయించేందుకు కొండమడుగు మెట్టు వద్దకు ఆటోలో వచ్చారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు అనుమానాస్పదంగా ఉన్న వారిని పట్టుకొని విచారించారు. తాము గంజాయి విక్రయించేందుకు వచ్చినట్లు వారు చెప్పడంతో అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. వారి నుంచి 1.394 గ్రాముల గంజాయి, ఆటో, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. యువకులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. యువకులను పట్టుకున్న ఎస్ఐ రమేశ్, సిబ్బందిని సీఐ అభినందించారు. -
ఆశలు నింపిన డిండి
డిండి: ఈ ఏడాది విస్తారంగా కురిసిన వర్షాలకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని దుందుబి వాగు దిగువకు పరవళ్లు తొక్కుతుండడంతో మండల కేంద్రంలోని డిండి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి అలుగు పోస్తోంది. వానాకాలం సీజన్‌కుగాను ఆయకట్టులోని ఎడమ కాలువ ద్వారా 12,500 ఎకరాలు, కుడి కాలువ ద్వారా 250 ఎకరాల సాగుకు నీటిని విడుదల చేశారు. గత రెండు నెలలుగా డిండి ప్రాజెక్టు నిండుకుండలా మారి అలుగు పోస్తుండడంతో వానాకాలంతోపాటు యాసంగి సీజన్లో కూడా పంటలకు నీరు అందుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా చేపల వేటనే నమ్ముకున్న 600 మత్స్యకార కుటుంబాలకు డిండి ప్రాజెక్టు జీవనాధారంగా మారింది. రెండు సంవత్సరాల వరకు చేతినిండా పని దొరకుతుందని, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన బాధ తప్పిందని వారు పేర్కొంటున్నారు. రెండు నెలలుగా అలుగు పోస్తున్న డిండి ప్రాజెక్టు హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు, మత్స్యకారులు -
ప్రేమించాలని బాలికపై యువకుడి దాడి
కేతేపల్లి: తనను ప్రేమించాలని ఇంట్లో ఒంటరిగా ఉన్న మైనర్ బాలికపై ఓ యువకుడు దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కేతేపల్లి మండలంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేతేపల్లి మండలానికి చెందిన కొరివి మధు అనే యువకుడు గ్రామంలోని బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈక్రమంలో గురువారం బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించిన యువకుడు లోపలికి ప్రవేశించాడు. తనను ప్రేమించాలని బాలికను బెదిరించాడు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో చంపుతానని బెదిరించి, కత్తితో బాలికపై దాడి చేసి గాయపరిచాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుడిని కోర్టులో రిమాండ్ చేసినట్లు కేతేపల్లి ఎస్ఐ సతీష్ తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతిభువనగిరిటౌన్ : రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. భువనగిరికి చెందిన యాకుబ్(38) భువనగిరి పట్టణంలో చికెన్ సెంటర్ నడుపుతున్నాడు. మూడు రోజుల క్రితం యాకుబ్ తన దుకాణానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రమంలో కారు ఢీ కొట్టడంతో ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతిచెందాడు. అతడికి భార్య, సంవత్సరంన్నర కుమార్తె ఉంది. -
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
అడవిదేవులపల్లి : కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అడవిదేవులపల్లి మండలంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం బాపన్బాయి తండాకు చెందిన సపావత్ రజిత (32)కు నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం బాల్నేపల్లి గ్రామానికి చెందిన రమావత్ ఆంజనేయులుతో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులున్నారు. ఆంజనేయులు మండల కేంద్రంలోని ప్రైవేటు పాఠశాలను నడిపించేవాడు. వీరిద్దరూ గత కొంతకాలంగా తరుచూ గొడవపడుతున్నారు. గురువారం రాత్రి కూడా ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అందరూ నిద్రిస్తున్న సమయంలో రాత్రి 10గంటల తరువాత రజిత ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. నిద్రమత్తులో నుంచి లేచిన ఆంజనేయులు భార్య ఉరివేసుకున్న విషయాన్ని గమనించి హుటాహుటిన మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించాడు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతురాలి తండ్రి పరశురాములు శుక్రవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
అధిక వడ్డీ కేసులో మరో నలుగురి అరెస్టు
పెద్దఅడిశర్లపల్లి, కొండమల్లేపల్లి : అధిక వడ్డీ ఆశచూపి అమాయక గిరిజనులను మోసం చేసిన బాలాజీనాయక్ కేసులో మరో నలుగురు ఏజెంట్లను శుక్రవారం గుడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం దేవరకొండ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ మౌనిక కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. పెద్దఅడిశర్లపల్లి మండలం పలుగుతండాకు చెందిన రమావత్ వినోద్, రమావత్ సురేష్, రమావత్ రమేష్, రమావత్ చిరంజీవి అధిక వడ్డీ వ్యాపారంలో బాలాజీనాయక్‌కు ప్రధాన ఏజెంట్లుగా వ్యవహరిస్తూ ప్రజల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. వీరిపై వచ్చిన ఫిర్యాదుల మేరకు గుడిపల్లి ఎస్ఐ నర్సింహులు ఈ నలుగురిని అరెస్టు చేసి వారి నుంచి రూ6 కోట్ల 77 లక్షల విలువైన ఆస్తి పత్రాలు, నాలుగు కార్లు, నాలుగు ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఎస్పీ నేతృత్వంలో మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి విచారణ చేస్తున్నట్లు ఏఎస్పీ మౌనిక తెలిపారు. ఇప్పటికే బాలాజీనాయక్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసి కేసు విచారణను వేగవంతం చేశామని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 310 మంది బాధితులు గుడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారని తెలిపారు. సమావేశంలో సీఐ నవీన్‌కుమార్, కొండమల్లేపల్లి, గుర్రంపోడు, పీఏపల్లి ఎస్ఐలు అజ్మీరా రమేష్, మధు, నరసింహులు, నల్లగొండ స్పెషల్ టీం ఎస్ఐ సంపత్ తదితరులు పాల్గొన్నారు. రూ.6.77కోట్ల విలువైన ఆస్తిపత్రాలు, నాలుగు కార్లు, నాలుగు ఫోన్లు స్వాధీనం కొనసాగుతున్న విచారణ వివరాలు వెల్లడించిన ఏఎస్పీ మౌనిక -
నూతనంగా నిర్మిస్తున్న ఇంటిపై నుంచి జారిపడి మృతి
భూదాన్‌పోచంపల్లి: నూతనంగా నిర్మిస్తున్న ఇంటిపై నుంచి ప్రమాదవశాత్తు జారిపడి వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన గురువారం భూదాన్‌పోచంపల్లి మండలం పెద్దగూడెం గ్రామంలో జరిగింది. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దగూడెం గ్రామానికి చెందిన రైతు పారిపల్లి కృష్ణారెడ్డి(55) గ్రామంలో నూతనంగా రెండంతస్తుల ఇంటిని నిర్మిస్తున్నాడు. గురువారం ఇంటి స్లాబ్‌కు క్యూరింగ్ చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి భవనంపై నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారు గమనించి చికిత్స నిమిత్తం కారులో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు పరీక్షించి అప్పటికే కృష్ణారెడ్డి మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య జయమ్మ, కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య జయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మతిస్థిమితంలేని వ్యక్తి.. తిప్పర్తి: తిప్తర్తి మండలం చిన్నాయిగూడెం సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మతిస్థిమితంలేని వ్యక్తి మృతిచెందాడు. ఎస్ఐ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 30ఏళ్ల వయస్సున్న మతిస్థిమితంలేని వ్యక్తి చిన్నాయిగూడెం వద్ద రోడ్డు దాటుతుండగా డీసీఎం వెనుక నుంచి అతివేగంగా ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. గురువారం తిప్పర్తి పంచాయతీ కార్యదర్శి నర్సింహ స్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శంకర్ తెలిపారు. గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యంచందంపేట: నేరెడుగొమ్ము మండలం వైజాక్ కాలనీలో కృష్ణా నది వెనుక జలాల్లో గల్లంతైన నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపురం గ్రామానికి చెందిన తిన్నారపు పృథ్వీరాజ్ మృతదేహం గురువారం లభ్యమైంది. పృథ్వీరాజ్ మంగళవారం స్నేహితులతో కలిసి వైజాగ్ కాలనీలో సరదాగా గడిపేందుకు వచ్చాడు. అదే రోజు ఈత కొట్టేందుకు గాను కృష్ణా నది వెనుక జలాల్లోకి దిగి గల్లంతు కాగా.. గాలింపు చర్యలు చేపట్టిన ఎస్ఎడీఆర్ఎఫ్ బృందాలకు రెండు రోజుల తర్వాత గురువారం మృతదేహం లభ్యమైంది. -
యాసంగిలో వేరుశనగ సాగు అనుకూలం
పెద్దవూర: వేరుశనగ సాగుకు యాసంగి అనుకూలమైదని పెద్దవూర మండల వ్యవసాయ అధికారి సందీప్‌కుమార్ పేర్కొన్నారు. నూనె గింజల ఉత్పత్తిని పెంచడానికి ఆహార నూనెల జాతీయ యంత్రాంగం పథకంలో భాగంగా ప్రభుత్వం రైతులకు నూరు శాతం సబ్సిడీపై వేరుశనగ విత్తనాలను కొన్ని మండలాల్లో పంపిణీ చేసింది. ఈ పంటను వానాకాలం సీజన్లో ఏ పంట విత్తని పొలాల్లో, స్వల్పకాలిక పంటలను సాగు చేసిన పొలాల్లోనూ సాగు చేసుకోవచ్చు. ● శనగను ఆలస్యంగా విత్తినప్పుడు పంట చివరి దశలో బెట్టకు గురై అధిక ఉష్ణోగ్రత వలన గింజ సరిగా గట్టిపడక దిగుబడి తగ్గుతుంది. ● వేరుశనగ సాగు చేయడానికి ముందు 70 రోజుల కాలపరిమితి ఉన్న తృణధాన్యాలైన స్వల్పకాలిక కొర్ర రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ● వేరుశనగను బంక నేలల నుంచి నల్లరేగడి వరకు ఏ భూమిలోనైనా పండించవచ్చు. చౌడు నేలలు, నీరు నిల్వ ఉండే నేలలు దీని సాగుకు పనికిరావు. విత్తే విధానంసాధారణంగా వేరుశనగ పంటను వర్షాధార పంటగా సాగు చేస్తుంటారు. విత్తడానికి సరిపడా తేమ లేనప్పుడు భూమికి ఒక తడి ఇచ్చి విత్తనం వేసుకోవచ్చు. విత్తేటప్పుడు విత్తనాన్ని ఐదు నుంచి ఎనిమిది సెంటీమీటర్ల లోతున తడి మట్టి తగిలేలా జాగ్రత్త తీసుకోవాలి. ● ఒక చ.మీ.కు 33 మొక్కలు ఉండేలా చూసుకోవాలి. నీటి వసతి ఉన్నప్పుడు లావు గింజలు కాబూలీ రకం ఎంచుకున్నప్పుడు వరుసల మ ధ్య 45 నుంచి 60 సెం.మీ. దూరం పాటించాలి. ● ట్రాక్టర్ ద్వారా వేరుశనగ విత్తు పరికరాన్ని వాడి పొలంలో మొక్కల మధ్య తగినంత సాంద్రత ఉండేలా చూసుకోవాలి. ఈ పరికరం ద్వారా విత్తనాన్ని, ఎరువును ఒకేసారి వేసుకోవచ్చు. విత్తనశుద్ధివిత్తనాన్ని విత్తుకునే ముందు ప్రతి కిలో విత్తనానికి పది గ్రాముల ట్రైకోడెర్మా విరిడి పొడిని, మూడు గ్రాముల థైరామ్ లేదా కాప్టాన్‌తో విత్తనశుద్ధి చేయడం వలన విత్తనం ద్వారా, నేల ద్వారా వ్యాపించే తెగుళ్లను చాలా వరకు అరికట్టవచ్చు. కిలో విత్తనానికి 1.5 గ్రాముల టెబ్యుకినజోల్ లేదా 1.5 గ్రాముల ఎటావాక్స్ పవర్‌ను కూడా విత్తనశుద్ధికి వాడవచ్చు. వేరుశనగను మొదటిసారి పొలంలో సాగు చేసినప్పుడు రైజోబియం కల్చర్ పొడిని విత్తనానికి పట్టించాలి. ఎరువుల యాజమాన్యంనేల స్వభావం, నేలలో లభించే పోషకాల మోతాదును బట్టి ఎరువులను వాడాలి. హెక్టారు శనగ సాగుకు 20 కిలోల నత్రజని, 50 కిలోల భాస్వరం అందించే ఎరువులను వేయాలి. నేలలో భాస్వరం నిల్వలు సరిపడా ఉన్నప్పుడు భాస్వరం ఎరువులు వేయాల్సిన అవసరం లేదు. అనిన ఎరువులను ఆఖరి దుక్కిలో వేయాలి. ఎకరాకు 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్ లేదా 50 కిలోల డీఏపీని వేస్తే పంటకు కావాల్సిన నత్రజని, భాస్వరం అందుతాయి. భాస్వరం ఎరువును సింగిల్ సూపర్ ఫాస్పేట్ రూపంలో వేస్తే పంటకు కావాల్సిన గంధకం కూడా అందుతుంది. విత్తనాన్ని విత్తిన 24 గంటల్లోగా ఫ్లూక్లోరాలిన్ ఎకరాకు 1 లీటర్, లేదా పెండిమిథాలిన్‌ను 1.2 లీటర్ల చొప్పున పిచికారీ చేస్తే కలుపును పంట తొలి దశలో సమర్ధవంతంగా నివారించవచ్చు. పైరు విత్తిన 30 రోజల వరకు పొలంలో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. కోత సమయంఆకులు పచ్చబారడం, రాలిపోవడం, కాయలు పసుపుగా మారి మొక్కలు ఎండిపోయి గింజ గట్టిగా మారినప్పుడు కోత కోయాలి. పంట కోసిన వెంటనే గింజలను ఆరబెట్టాలి. నూర్పిడి యంత్రాలతో కానీ, చేతితో గాని నూర్పిడి చేసుకోవచ్చు. రైతులు ఈ విధానాన్ని పాటిస్తే మంచి దిగుబడితో పాటు నాణ్యమైన పంటను పొందవచ్చు.తెగుళ్లు, సస్యరక్షణ చర్యలువేరుశనగ పంటలో ఎండు తెగులు ఆశించిన మొక్కలు ఒక్కసారిగా కాడలతో పాటు ముడుచుకుపోయి చనిపోతాయి. వేరు మరియు కాండాన్ని చీల్చి చూసినప్పుడు గోధుమ లేదా నలుపు రంగులో చార కనిపిస్తుంది. ఎండు తెగులును నివారించేందుకు వేసవిలో లోతుగా దుక్కి దున్నడం వల్ల ముందు పంట అవశేషాలు తీసేయడంతో తెగులు తీవ్రతను తగ్గించవచ్చు. వేరుశనగ పంటలో కుళ్లు తెగులు ద్వారా కాండం మొదలులో ఒక నొక్కు ఏర్పడి మొక్క చనిపోతుంది. తెగులు సోకిన తొలిదశలో తెల్లని శిలీంధ్రం బీజాలు ఆవ గింజల మాదిరి కాండం మీద కనిపిస్తాయి. నేలలో ఎక్కువ తేమ ఉండటం, అంతగా కుళ్లని సేంద్రీయ పదార్థం ఉండటం, ఎక్కువ ఉష్ణోగ్రతలు ఈ తెగులు ఉధృతికి తోడ్పడతాయి. విత్తిన పది నుంచి పదిహేను రోజుల తర్వాత పొలంలో మొదలు కుళ్లు గమనించినప్పుడు ఎకరాకు 200 గ్రాముల కార్భండిజమ్, 600 గ్రాముల మాంకోజెబ్‌ను వాడి మొక్కల మొదలు బాగం తడిచే విధంగా పిచికారీ చేయాలి. వేరుశనగ పండించే అన్ని ప్రాంతాల్లో శనగపచ్చ పురుగు ఎక్కువగా నష్టం కలిగిస్తుంది. పురుగును తట్టుకునే రకాలు అందుబాటులో లేవు. పురుగు మందుల వాడకంతో వాటిని అరికట్టవచ్చు. పురుగు సంతతిపై నిఘా ఉంచడానికి పొలంలో ఒక మీటరు ఎత్తులో లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకుని పురుగు ఉధృతిని బట్టి నివారణ చర్యలు చేపట్టాలి. వేరుశనగ పంటలో పచ్చ రబ్బరు పురుగు నివారణకు ముందుగానే పంట వేసిన 15 రోజులకు ఒక లీటరు నీటిలో 5 మిల్లీలీటర్లు వేపనూనె కలిపి పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి ఎక్కువైతే లీటరు నీటికి 200 మిల్లీలీటర్ల ఇండాక్సాకార్భ్ కలిపి పిచికారీ చేయాలి. -
యాదగిరి క్షేత్రంలో సుదర్శన హోమం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం నిత్యారాధనలు ఆగమశాస్త్రానుసారంగా నిర్వహించారు. వేకువజామున స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాత సేవ చేపట్టి, గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, సహస్రనామార్చనతో కొలిచారు. అనంతరం ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు నిర్వహించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. విద్యుదాఘాతంతో మహిళ మృతిమిర్యాలగూడ టౌన్: ఇంట్లో దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మహిళ మృతిచెందింది. ఈ ఘటన మిర్యాలగూడ మండలం ఉట్లపల్లి గ్రామంలో బుధవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉట్లపల్లి గ్రామానికి చెందిన సిరశాల నర్సమ్మ(58) భర్త గతంలోనే మృతిచెందాడు. ఆమెకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు సంతానం. ఇంట్లో ఆమె ఒంటరిగానే నివాసముంటోంది. నర్సమ్మ ఇంటికి కొంత దూరంలో ఆమె కుమారుడు లింగయ్యకు నివాసముంటున్నాడు. బుధవారం కూలి పనులను వెళ్లిన నర్సమ్మ సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చింది. అనంతరం ఇంటి ఆవరణలో దుస్తులు ఊతికి పక్కనే ఉన్న ఇనుప తీగపై ఆరేస్తుండగా విద్యుదాఘాతానికి గురై కిందపడిపోయింది. రాత్రివేళ ఎవరూ చూడకపోవడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. గురువారం తోటి కూలీలు నర్సమ్మను కూలి పనులకు పిలిచేందుకు ఇంటికి ఆమె వెళ్లగా విగతజీవిగా పడి ఉంది. దీంతో ఆమె కుమారుడికి సమాచారం అందించారు. కాగా ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని మిర్యాలగూడ రూరల్ పోలీసులు తెలిపారు. వ్యవసాయ బావిలో పడి.. అడ్డగూడూరు: వ్యవసాయ బావిలో పడి వృద్ధుడు మృతిచెందాడు. ఈ ఘటన అడ్డగూడూరు మండలం జానకీపురం గ్రామ శివారులో గురువారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జానకీపురం గ్రామానికి చెందిన కట్కూరి లక్ష్మయ్య(86) మంగళశారం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఎంత వెతికినా లక్ష్మయ్య ఆచూకీ లభించకపోవడంతో బుధవారం కుటుంబ సభ్యులు అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గురువారం గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావిలో లక్ష్మయ్య మృతదేహం లభ్యమైంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. -
అప్పులు తీర్చేందుకు చైన్ స్నాచింగ్
శాలిగౌరారం: అప్పులు తీర్చేందుకు గాను మహిళపై దాడి చేసి ఆమె మెడలోని పుస్తెలతాడు అపహరించిన దొంగను పోలీసులు 24 గంటలు గడువక ముందే అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నకిరేకల్‌లోని శాలిగౌరారం సర్కిల్ కార్యాలయంలో నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి విలేకరులకు వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం గ్రామానికి చెందిన నాగుల శ్రీనివాస్ వృత్తిరీత్యా చేనేత కార్మికుడు. ప్రస్తుతం అతడు కుటుంబంతో కలిసి నల్లగొండ పట్టణంలోని పద్మానగర్‌లో నివాసముంటున్నాడు. శ్రీనివాస్ గతంలో తన ఇద్దరు కుమార్తెల వివాహాలు చేసేందుకు గాను అప్పులు చేశాడు. దీనికి తోడు కరోనా సమయంలో అతడి భార్య అనారోగ్యానికి గురికావడంతో మరింత అప్పులు చేశాడు. అప్పులు ఎక్కువ కావడంతో పాటు వాటికి వడ్డీలు పెరిగిపోతుండటంతో అర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో ఎలాగైనా అప్పులు తీర్చాలని శ్రీనివాస్ భావించాడు. ప్రస్తుతం బంగారం ధరలు విరీతంగా పెరగడంతో బంగారం దొంగతనం చేసినట్లైతే అప్పులు తొందరగా తీర్చవచ్చని అనుకున్నాడు. ఈ క్రమంలో బుధవారం నకిరేకల్ మండలం ఓగోడు గ్రామానికి చెందిన ఆవుల సావిత్రమ్మ శాలిగౌరారం మండలం మాధారంకలాన్ శివారులో ఉన్న తన వ్యవసాయ భూమి వద్దకు నడుచుకుంటూ వెళ్తుండగా.. శ్రీనివాస్ స్కూటీపై అటుగా వెళ్తూ.. సావిత్రమ్మను చూసి స్కూటీ ఆపాడు. ఎక్కడకు వెళ్తున్నావ్ అని ఆమెను అడగగా.. ఆమె మాధారంకలాన్ వెళ్తున్నానని చెప్పింది. తాను అటువైపే వెళ్తున్నానని చెప్పి ఆమెను శ్రీనివాస్ తన స్కూటీపై ఎక్కించుకున్నాడు. మాధారంకలాన్ గ్రామ పంచాయతీ పరిధిలోని చౌళ్లగూడెం వద్ద గల 365వ నంబర్ జాతీయ రహదారి జంక్షన్ సమీపంలోకి రాగానే టాయిలెట్ వస్తుందని స్కూటీని ఆపాడు. స్కూటీ దిగిన సావిత్రమ్మ రోడ్డు వెంట నడుచుకుంటూ చౌళ్లగూడెం జంక్షన్ వైపు వస్తుండగా.. వెనుక నుంచి స్కూటీపై వచ్చిన శ్రీనివాస్ ఇనుపరాడ్డుతో సావిత్రమ్మ తలపై విచక్షణారహితంగా కొట్టడంతో ఆమె కిందపడిపోయింది. శ్రీనివాస్ వెంటనే సావిత్రమ్మ మెడలోని నాలుగున్నర తులాల బంగారు పుస్తెలతాడును లాక్కొని స్కూటీపై పారిపోయాడు. దొంగిలించిన బంగారు పుస్తెలతాడును నల్లగొండ పట్టణంలోని మణప్పురం ఫైనాన్స్‌లో తాకట్టుపెట్టి రూ.3.11 లక్షలు రుణం తీసుకున్నాడు. అందులో నుంచి రూ.61వేలు సొంత అవసరాలకు వాడుకొని.. మిగిలిన రూ.2.50 లక్షలు ఇంట్లో పెట్టుకున్నాడు. బాధితురాలి కుమారుడు సైదులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశాల మేరకు శాలిగౌరారం, నకిరేకల్ సీఐల నేతృత్వంలో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నిందితుడు శ్రీనివాస్‌ను గురువారం అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. అతడి నుంచి ద్విచక్ర వాహనం, రూ.2.50 లక్షల నగదు, ఇనుపరాడ్డు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చిబ జడ్జి ఆదేశానుసారం రిమాండ్‌కు తరలించనున్నట్లు తెలిపారు. డీఎస్పీ శివరాంరెడ్డి, శాలిగౌరారం, నకిరేకల్ సీఐలు కొండల్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, శాలిగౌరారం, నకిరేకల్, కేతేపల్లి ఎస్ఐలు సైదులు, లచ్చిరెడ్డి, సతీష్, పోలీస్ సిబ్బంది జానయ్య, లక్ష్మణ్, సతీస్, శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, సురేశ్, శ్రీకాంత్‌ను ఎస్పీ శరత్చంద్ర పవార్ అభినందించారు. మహిళపై దాడిచేసి పుస్తెలతాడు అపహరించిన దొంగ 24 గంటల్లోనే పట్టుకున్న పోలీసులు స్కూటీ, రూ.2.50 లక్షల నగదు స్వాధీనం వివరాలు వెల్లడించిన నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి -
ఏసీబీకి చిక్కిన అగ్నిమాపక శాఖ అధికారి
నల్లగొండ: టపాకాయల దుకాణం లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ నల్లగొండ పట్టణంలోని అగ్నిమాపక శాఖ కార్యాలయం అధికారి సత్యనారాయణరెడ్డి గురువారం ఏసీబీకి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ జగదీశ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. దీపావళి సందర్భంగా టపాకాయల దుకాణం ఏర్పాటు చేసుకునేందుకు గాను అనుమతి కోసం నల్లగొండ ఫైర్ స్టేషన్ అధికారి సత్యనారాయణరెడ్డిని ఓ వ్యాపారి సంప్రదించాడు. ఎన్ఓసీ మొత్తం తానే చేసి ఇస్తానని ఇవ్వాలని సదరు వ్యాపారిని సత్యనారాయణరెడ్డి రూ.10వేలు డిమాండ్ చేశాడు. చివరకు రూ.8వేలకు ఒప్పందం కుదిరింది. దీంతో సదరు వ్యాపారి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. గురువారం నల్లగొండ పట్టణంలోని ఎన్జీ కాలేజీ గ్రౌండ్లో వ్యాపారి నుంచి సత్యనారాయణరెడ్డి రూ.8వేలు లంచం తీసుకుంటుండగా నల్ల గొండ రేంజ్ యూనిట్ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సత్యనారాయణరెడ్డిపై పలు అవినీతి ఆరోపణలు వచ్చాయని వాటిపై పూర్తిస్థాయిలో విచారించి నాంపల్లి ఏసీబీ కోర్టు ముందు హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే 1084 నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. టపాకాయల దుకాణం ఏర్పాటుకు ఎన్ఓసీ ఇచ్చేందుకు లంచం డిమాండ్ -
అంబులెన్స్ సేవలు ఉపయోగించుకోవాలి
మిర్యాలగూడ అర్బన్: అత్యవసర సమయంలో 108 సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జీవీకే ఈఎంఆర్ఐ జీహెచ్ఎస్ రాష్ట్ర ఆడిట్ అధికారి పకీర్ దాస్ అన్నారు. గురువారం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో 108 వాహనాలను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంబులెన్స్‌లో ప్రభుత్వం నిర్దేశించిన అన్ని రకాల పరికరాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని టెక్నీషియన్లకు సూచించారు. అంబులెన్స్‌లోని అత్యవసర సేవలకు ఉపయోగించే పల్స్ ఆక్సిమీటర్, మానీటర్, ఏఈడీ, ఆక్సిజన్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట 108 జిల్లా ప్రోగ్రాం మేనేజర్ సలీం, ఈఎంఈ యల్లావుల మధు, ఈఎంటీ వెలిజాల సైదులు, పైలెట్ పగిళ్ల జానకిరాములు తదితరులు పాల్గొన్నారు. 108 అంబులెన్స్ తనిఖీ వేములపల్లి: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద గల 108 అంబులెన్స్ వాహనాన్ని జీవీకే ఈఎంఆర్ఐ జీహెచ్ఎస్ రాష్ట్ర ఆడిట్ అధికారి పకీర్ దాస్ గురువారం తనిఖీ చేశారు. ఆయన వెంట కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం మేనేజర్ సలీం, ఈఎంఈ ఎల్లావుల మధు, సిబ్బంది విమల, అజ్రకుమార్ తదితరులున్నారు. ఈఎంఆర్ఐ జీహెచ్ఎస్ రాష్ట్ర ఆడిట్ అధికారి పకీర్ దాస్ -
ధాన్యం కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
మునుగోడు: ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మునుగోడు మండలంలోని పులిపలపులు, కల్వలపల్లి గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే రైతులు తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో చండూరు మార్కెట్ చైర్మన్ దోటి నారాయణ, ఎంపీడీఓ యుగేందర్‌రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్లు సింగం వెంకన్న, ఎన్.శేఖర్‌రెడ్డి, సీఈఓ సుఖేందర్, మాజీ ఎంపీటీసీ భీమనపల్లి సైదులు, ఏఈఓ నర్సింహ తదితరులు పాల్గొన్నారు. డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి -
కరెంట్ తీగలు తగిలి యువకుడు మృతి
కొండమల్లేపల్లి: పొలం వద్ద నేలపై పడి ఉన్న కరెంట్ తీగలు తగిలి యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన కొండమల్లేపల్లి మండలం చింతకుంట్ల గ్రామంలో గురువారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతకుంట్ల గ్రామానికి చెందిన జటమోని శ్రీను, వెంకటమ్మ దంపతుల పెద్ద కుమారుడు జటమోని వెంకటేష్(23) గురువారం ఉదయం తమ పొలం వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో పొలం గట్ల పైన నడుచుకుంటూ వెళ్తుండగా అప్పటికే నేలపై పడి ఉన్న విద్యుత్ తీగలు అతడి కాలుకు చుట్టుకోవడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పొలం వద్దకు వెళ్లిన వెంకటేష్ ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా పొలం వద్ద విగతజీవిగా పడి ఉన్నాడు. విద్యుత్ తీగలు నేలపై పడి ఉన్నాయని నాలుగు రోజుల క్రితమే ఫిర్యాదు చేసినప్పటికి లైన్‌మన్, విద్యుత్ అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట ధర్నా.. వెంకటేష్ మృతికి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని పేర్కొంటూ అతడి బంధువులు, గ్రామస్తులు కొండమల్లేపల్లిలోని విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట మృతదేహంతో ధర్నా నిర్వహించారు. పోలీసులు, విద్యుత్ సబ్ స్టేషన్ అధికారులు నచ్చజెప్పి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చేతికొచ్చిన కుమారుడి మరణంతో తల్లిదండ్రులు, బంధువుల రోధనలు మిన్నంటాయి. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అజ్మీరా రమేష్ తెలిపారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని మృతుడి బంధువుల ఆరోపణ కొండమల్లేపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట మృతదేహంతో ధర్నా -
కలెక్టరేట్లో ప్రజావాణి
భువనగిరిటౌన్ : కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పలువురు వినతులు అందజేశారు. కలెక్టర్ హనుమంతరావు వినతులు స్వీకరించడంతో పాటు బాధితులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అదే విధంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. నూతన ఓటర్లకు గుర్తింపు కార్డులు జారీ చేయాలని ఆదేశించారు. అనంతరం ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులు, తహసీల్దార్లతో కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేశారు. తపాల శాఖ ద్వారా గుర్తింపు కార్డుల జారీకి చర్యలు తీసుకోవాలని సూచించారు. మత్స్యగిరీశుడి హుండీ ఆదాయం రూ.11.93 లక్షలువలిగొండ : మండలంలోని వెంకటాపురంలో గల శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీల్లో భక్తులు సమర్పించిన నగదు, ఇతర కానుకలను గురువారం లెక్కించారు. 114 రోజులకు నగదురూపంలో రూ.11,93,431 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ మో హన్‌బాబు తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ భాస్కర్, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కొమ్మారెడ్డి నరేష్‌రెడ్డి సమక్షంలో హుండీ ఆదాయాన్ని లెక్కించారు. సెల్లార్లను 31లోగా ఖాళీ చేయాలిభువనగిరిటౌన్ : సెల్లార్లలో ఏర్పాటు చేసిన దుకాణాలను ఈనెల 31లోపు ఖాళీ చేయాలని అనదపు కలెక్టర్ భాస్కర్‌రావు భవన యజ మానులను ఆదేశించారు. భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని భవనాల యజమానులతో గురువారం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సెల్లార్లను వాహనాల పార్కింగ్ కోసమే వినియోగించాలని, ఇతర అవసరాలకు వినియోగించరాదన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే భవనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. సెల్లార్లలో దుకాణాలు నిర్వహిస్తున్న వారందరికీ నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. జగదేవ్‌పూర్ చౌరస్తాలో ఉన్న జన్మభూమి మడిగెల్లో మున్సిపాలిటీ కేటాయించిన వారు మాత్రమే ఉండాలని, సబ్ లీజ్ దారులు వెంటనే ఖాళీ చేయాలని సూచించారు. సోమవారం లోపు మడిగెల యజమానులకు నోటీసులు జారీ చేయాలని అధికారులకు ఆదేశించారు. మడిగెల నుంచి మున్సిపాలిటీకి పూర్తిస్థాయిలో పన్ను రావడం లేదని, 115 షాపులకు గాను రూ.48.40 లక్షలు బకాయి ఉందని, వెంటనే వసూలు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామలింగం, సిబ్బంది పాల్గొన్నారు. 18 నుంచి జువైనల్ కేసుల విచారణ భువనగిరిటౌన్ : జిల్లాలోని జువైనల్ కేసుల విచారణ ఈనెల 18వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జయరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జువైనల్ కేసుల విచారణకు వారంలో ఒక రోజు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు.జువైనల్ జస్టిస్ బోర్డు న్యాయమూర్తిగా భువనగిరి అదనపు జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ జడ్జిగా వ్యవహరిస్తారని తెలిపారు. జువైనల్ జస్టిస్ బోర్డును భువనగిరిలోని పాత మునిసిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కొనుగోలు కేంద్రాల సందర్శన రామన్నపేట: రామన్నపేట మండలంలోని పల్లివాడ, కక్కిరేణి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం అదనపు కలెక్టర్ వీరారెడ్డి సందర్శించారు. ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. వరి చేను పక్వానికి వచ్చిన తరువాతే కోత కోయాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు పూర్తయ్యాయని, ప్రైవేట్‌కు విక్రయించి నష్టపోవద్దని చెప్పారు. కేంద్రాల నిర్వాహకులకు సహకరించాలని కోరారు. రైతులకు అసౌకర్యం కలుగకుండా కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ లాల్‌బహదూర్‌శాస్త్రి, పీఏసీఎస్ సీఈఓ జంగారెడ్డి ఉన్నారు. -
‘ఉపాధి హామీ’లో జలసంరక్షణ
ఆలేరు: వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పనులకు జిల్లా గ్రామీణాభివద్ధి సంస్థ(డీఆర్డీఏ) అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందులో భాగంగా జలసంరక్షణ పనులకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవడంతో పాటు వాటిని సంరక్షించుకుంటే రాబోయే రోజుల్లో నీటి ఎద్దడి నుంచి గట్టెక్కవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే ఏడాది నుంచి ఉపాధిహామీలో జలసంరక్షణ పనులు విరివిగా చేపట్టాలని సూచించింది. ఈ మేరకు అధికారులు పనులను గుర్తించారు. నవంబర్ 30 వరకు గ్రామసభలుజిల్లాలో 17 మండలాల పరిధిలో 428 గ్రామ పంచాయతీల్లో సుమారు 2.63 లక్షల ఉపాధి కూలీలు, 1.44 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. ఆయా మండలాల పరిధిలోని గ్రామ పంచాయతీల్లో 2026–27 సంవత్సరానికి గాను మొత్తం 58 రకాల పనులను చేపట్టనున్నారు. పనుల గుర్తింపునకు మండలాల వారీగా గ్రామాల్లో సభల నిర్వహణకు డీఆర్డీఏ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఒక్కొక్క మండలంలో పంచాయతీల సంఖ్యకు అనుగుణంగా గ్రామ సభలను మూడు నుంచి నాలుగు రోజులపాటు నిర్వహించనున్నారు. ఈనెలలో గ్రామ సభలు మొదలై నవంబర్ 30 తేదీ వరకు కొనసాగనున్నాయి. చేపట్టబోయే పనులను ప్రజల ఆమోదంతో గుర్తిస్తారు. భూగర్భ నీటి మట్టం పెంపు పనులకు ప్రాధాన్యం కార్యాచరణ సిద్ధం చేసిన డీఆర్డీఏ గ్రామసభల నిర్వహణకు సన్నాహాలు ప్రజల ఆమోదంతో పనుల గుర్తింపువీటికి మొదటి ప్రాధాన్యం అన్ని మండలాల్లో రెగ్యులర్ ఉపాధి పనులతోపాటు భూగర్భ జాలాల వృద్ధికి ఫాంపాడ్స్, మ్యాజిక్ సోప్ పిట్స్, కమ్యూనిటీ సోప్పిపట్స్, నీటి కుంటలు, ఇంకుడుగుంతల నిర్మాణాలు, చెరువులు, కాల్వల్లో పూడికతీత వివిధ రకాల వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ పనులకు మొదటి ప్రాధాన్యం ఉంటుంది.గ్రామస్థాయిలో గుర్తించిన పనులను మండలానికి, అక్కడి నుంచి జిల్లాకు ప్రతిపాదనలు వచ్చిన తర్వాత ఆన్లైన్లో బడ్జెట్ కేటాయింపు జరుగుతుంది.ఈప్రక్రియ తర్వాత వచ్చే ఏప్రిల్ నుంచి పనులు మొదలవుతాయి. జల సంరక్షణ పనులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కార్యాచరణ రూపొందించాం. త్వరలో గ్రామసభలు ప్రారంభిస్తాం. – నాగిరెడ్డి, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ -
రెవెన్యూ ఉద్యోగుల జిల్లా కమిటీ ఎన్నిక
భువనగిరిటౌన్ : తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్ జిల్లా కమిటీని గురువారం భువనగిరిలో జరిగిన సమావేశంలో ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఎం.కృష్ణ, కార్యదర్శిగా ఆర్. శ్రీకాంత్, కోశాధికారిగా జానయ్య, అసోసియేట్ అధ్యక్షులుగా ఎండీ లాయిఖ్అలీ, సీహెచ్ శోభ, మరో 19 మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ వీరారెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, టీజీఓ రాష్ట్ర కోశాధికారి మందడి ఉపేందర్‌రెడ్డి హాజరై మాట్లాడారు. రెవెన్యూ ఉద్యోగులు ఐక్యంగా ఉంటూ తమ సమస్యలు పరిష్కరించుకోవాలని కోరారు. కార్యక్రమంలో భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి, టీజీఓ జిల్లా అధ్యక్షుడిగా చికూరి జగన్మోహన్ప్రసాద్, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడిగా భగత్ పాల్గొన్నారు. ఎన్నికల అధికారులుగా నారాయణరెడ్డి, నిరంజన్ వ్యవహరించారు. -
నేటి నుంచి అభిప్రాయ సేకరణ
సాక్షి, యాదాద్రి: జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి(డీసీసీ) ఎన్నిక ప్రక్రియ మొదలైంది. ఇందుకోసం అధిష్టానం నియమించిన ఏఐసీసీ పరిశీలకుడు శరత్రావత్ గురువారం రాత్రి జిల్లాకు చేరుకున్నారు. నాలుగు రోజుల పాటు ఆయన జిల్లాలోనే మకాం వేసి ప్రతి అంశాన్ని జల్లెడ పట్టనున్నారు. ఆలేరు, భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గాల్లో బ్లాక్‌ల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీలోని అన్ని వర్గాల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తారు. సమావేశాలు తేదీల వారీగా..● శుక్రవారం ఉదయం భువనగిరిలో మీడియాతో మాట్లాడుతారు. అనంతరం జరిగే బ్లాక్‌స్థాయి సమావేశంలో పాల్గొని పార్టీలోని అన్ని వర్గాల నుంచి అభిప్రాయ సేకరణ చేసి, ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ● 18వ తేదీన ఆలేరు, యాదగిరిగుట్ట బ్లాక్‌స్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు. ● 19న ఆదివారం భువనగిరి, భూదాన్‌పోచంపల్లి బ్లాక్‌స్థాయి సమావేశాల్లో పాల్గొంటారు. ● 20న భువనగిరిలో మరోసారి పార్టీ క్యాడర్‌తో సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయ సేకరణ చేయడంతో పాటు ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇందుకోసం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు పూర్తి చేసింది. డీసీసీ అధ్యక్ష పదవి రేసులో ఉన్న వారు దరఖాస్తులు ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారు. ఏఐసీసీ పరిశీలకుడితో పాటు పీసీసీ కోఆర్డినేటర్లు సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి, శాప్ చైర్మన్ శివచరణ్‌రెడ్డి, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి హాజరుకానున్నారు.డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ మొదలు జిల్లాకు చేరుకున్న ఏఐసీసీ పరిశీలకుడు నాలుగు రోజులు ఇక్కడే మకాం బ్లాక్‌ల వారీగా సమావేశాలు -
ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే మెరుగైన సేవలు
భువనగిరిటౌన్ : ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే నాణ్యమైన వైద్యసేవలు అందుతాయని, గర్భిణులు సద్విని యోగం చేసుకోవాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. పోషణమాసంలో భాగంగా భువనగిరిలోని అంగన్వాడీ కేంద్రంలో గురువారం జిల్లా సంక్షేమ శాఖ అధ్వర్యంలో గర్భిణులకు సీమంతం, చిన్నారులకు అన్నప్రాసం చేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. గర్భిణులు తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలని, తద్వారా తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకు వైద్యసేవలు పొందాలన్నారు. ప్రీ ప్రైమరీ స్కూళ్లలో పిల్లల నమోదు పెంచాలని అంగన్వాడీ టీచర్లకు సూచించారు. అంగన్వాడీ కేంద్రాల పనితీరు మెరుగుపర్చడంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లతో సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలను త్వరలోనే ప్రాథమిక పాఠశాల్లో కలుపనున్నట్లు తెలిపారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ అవేజ్ చిస్తీ మాట్లాడుతూ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయలో అమలయ్యేలా చూడాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ మనోహర్, డీఆర్డీఓ నాగిరెడ్డి, ఐసీడీఎస్ సీడీపీఓలు, సూపర్వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ హనుమంతరావు -
కాంగ్రెస్‌కు కంచుకోట నల్లగొండ
● బిశ్వరంజన్ మహంతి మునుగోడు: నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టుందని ఏఐసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి బిశ్వరంజన్ మహంతి అన్నారు. నల్లగొండ డీసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం గురువారం మునుగోడులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన అభిప్రాయ సేకరణ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే మంచి పేరు ఉన్న నాయకుడని, ఆయనకు మంత్రి పదవి చాలా చిన్నదన్నారు. ఆయనకు తగిన పదవి దక్కుతుందన్నారు. రాజగోపాల్‌రెడ్డి ఆవేదన, కోరికను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానన్నారు. డీసీసీ అధ్యక్ష పదవి ఎవరికి ఇచ్చినా తాము పూర్తి మద్దతు ఇస్తామని రాజగోపాల్‌రెడ్డితో పాటు నియోజకవర్గ కార్యకర్తలు ఏకగ్రీవంగా అంగీకరించారు. -
బాధ విన్నారు.. భరోసా ఇచ్చారు
యాదగిరిగుట్ట రూరల్: మండలంలోని పెద్దకందుకూరులో బుధవారం కలెక్టర్ హనుమంతరావు ఇందిరమ్మ ఇళ్ల పరిశీలనకు వచ్చారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన దివ్యాంగుడు కొమ్మగాని రవి తల్లి లక్ష్మి తమ కుటుంబం పేదరికంతో ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్‌కు విన్నవించారు. తన కుమారుడు పుట్టుకతో దివ్యాంగుడని, ఇంట్లో ఇద్దరమే ఉంటామని, చిన్న డబ్బాకొట్టు ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నామని తెలిపింది. పూటగడవడం కష్టంగా ఉందని, ఆదుకోవాలని కలెక్టర్‌ను వేడుకుంది. వెంటనే స్పందించిన కలెక్టర్.. బ్యాంకు అధికారికి ఫోన్‌చేసి రవికి లోన్ ఇవ్వాలని ఆదేశించారు. బ్యాటరీతో నడిచే ట్రై వాహనాన్ని కూడా ఇప్పిస్తానని కలెక్టర్ రవికి హామీ ఇచ్చారు. -
ఉద్యోగం వేటలో ఉన్నారా..
డీఈఈటీ యాప్‌లో వివరాలు నమోదు చేసుకోండిభువనగిరిటౌన్ : ప్రతి సంవత్సరం వేలాది మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి బయటకు వస్తున్నారు. చాలామంది ఉద్యోగాలు ఎక్కడ ఖాళీగా ఉన్నాయో తెలుసుకోలేక పోతున్నారు. ఇలాంటి వారికోసం తెలంగాణ సర్కార్ ప్రత్యేకంగా ఓ యాప్‌ను రూపొందించింది. అదే డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ (డీఈ ఈటీ). చదువు పూర్తయిన వారు, వివిధ కోర్సుల్లో చివరి సంవత్సరంలో ఉన్నవారు డీట్ యాప్ deet. telangana.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకునే విధానం..అభ్యర్థులు తమ పేరు, వ్యక్తిగత వివరాలు, విద్యార్హత, అనుభవం, నైపుణ్యం తదితర వివరాలను యాప్‌లో నమోదు చేసుకోవాలి. వీటికి సంబంధించిన సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాలి. ఆ తరువాత ప్రైవేట్ రంగంలోని ప్రతి కంపెనీ, సంస్థల్లో ఉన్న ఉద్యోగాల వివరాలు వస్తాయి. ఆ సంస్థకు కావాల్సిన నైపుణ్యాలు, వేతనం, అనుభవం వివరాలు కనిపిస్తాయి. అవి ఓకే అనుకుంటే సంబంధిత ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తరువాత సంస్థ ప్రతినిధులు యాప్‌లోనే మీ వివరాలు తెలుసుకుంటారు. ఇంటర్వ్యూ ప్రాంతం, ఇంటర్వ్యూ చేసే వ్యక్తి, సమయం వివరాలు తెలియజేస్తారు. వివిధ రంగాల్లో ఉన్న పోస్టులు, కొత్త అప్డేట్ల గురించి ఈ యాప్‌లో నోటిఫికేషన్లుగా ఇస్తుంటారు. జనరద్దీ ప్రాంతాల్లో యాప్ పోస్టర్లు నిరుద్యోగులు ఎక్కడి నుంచైనా తమ వివరాలను యాప్‌లో నమోదు చేసుకునేందుకు వీలుగా ఉపాధి కల్పన శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు, ప్రజలు ఎక్కువగా తిరిగే ప్రదేశాల్లో క్యూఆర్‌తో కూడిన డీప్ యాప్ పోస్టర్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం కలెక్టరేట్లో వాటిని ఏర్పాటు చేశారు. నిరుద్యోగ యువతకు సమాచారం కోసం ప్రత్యేక యాప్ రూపకల్పన ప్రభుత్వ కార్యాలయాలు, జనరద్దీ ప్రాంతాల్లో యాప్ పోస్టర్లు ఏర్పాటు -
శ్రీగంధం చెట్లను నరికి చోరీకి పాల్పడుతున్న ముగ్గురి అరెస్టు
నల్లగొండ: రైతులు తోటల్లో పెంచుతున్న శ్రీగంధం చెట్లను నరికి చోరీకి పాల్పడుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. కేసు వివరాలను బుధవారం నల్లగొండలోని డీఎస్పీ కార్యాలయంలో ఆయన వెల్లడించారు. బుధవారం ఉదయం కనగల్ సమీపంలో రెండు బైక్‌లపై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు వాహనాలు తనిఖీలు చేస్తున్న పోలీసులను చూసి అక్కడి నుంచి పరారయ్యేందుకు యత్నించారు. పోలీసులు వారిని వెంబడించి పట్టుకుని తనిఖీ చేయగా వారి వద్ద చెట్లు నరికే పరికాలను గుర్తించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గందిగామ్ గ్రామానికి చెందిన దివానా, అరుద్వా గ్రామానికి చెందిన దద్దసింగ్, సుగువా గ్రామానికి చెందిన మజాన్లుగా గుర్తించారు. వీరి వద్ద 11 శ్రీగంధం మొద్దులు (దుంగలు), మూడు సెల్ఫోన్లు, రెండు బైక్‌లు, మూడు రంపాలు, రెండు గొడ్డళ్లు, ఫెన్సింగ్ వైర్ కట్టర్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. మహారాష్ట్రకు చెందిన మరో ముగ్గురు నిందితులు అన్నాబౌ లక్ష్మణ్ గైక్వాడ్, జవాస్, అజుబాలు పరారీలో ఉన్నట్లు చెప్పారు. సమావేశంలో సీఐ ఆదిరెడ్డి, ఎస్ఐలు సైదాబాబు, వెంకన్న, రంజిత్‌రెడ్డి పాల్గొన్నారు. ఫ 11 శ్రీగంధం దుంగలు, మూడు సెల్ఫోన్లు, రెండు బైక్‌లు, ఫెన్సింగ్ వైర్ కట్టర్ స్వాధీనం -
25లోగా సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లించాలి
నల్లగొండ టూటౌన్: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలోని బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ అభ్యసిస్తున్న 1, 3, 5 సెమిస్టర్లకు చెందిన విద్యార్థులు ఈ నెల 25లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని ఎంజీ యూనివర్సిటీ సీఓఈ ఉపేందర్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.100 ఆలస్య రుసుముతో ఈనెల 27లోగా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. పరిశోధనలే సమాజానికి దిక్సూచిఫ ఎంజీయూ వీసీ అల్తాఫ్ హుస్సేన్ నల్లగొండ టూటౌన్: పరిశోధనలే సమాజానికి దిక్సూచి అని మహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీలో ఐక్యూ ఏసీ ఆధ్వర్యంలో 2028లో జరగనున్న మూడవ విడత నాక్ మూల్యాంకనంపై బుధవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వీసీ మాట్లాడుతూ.. అధ్యాపకులు పరిశోధనలపై దృష్టి పెట్టాలన్నారు. ప్రతి అధ్యాపకుడు విద్యార్థులను పరిశోధనల వైపు ప్రోత్సహించాలన్నారు. నాక్ ఏ గ్రేడ్ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. సమావేశంలో గోపికృష్ణ, గోనారెడ్డి, అల్వాల రవి, మిరియాల రమేష్, కొప్పుల అంజిరెడ్డి, రేఖ, అన్నపూర్ణ, ఆకుల రవి, సుధారాణి, శ్రీదేవి, అరుణప్రియ పాల్గొన్నారు. -
సీఎం, మంత్రులకు రైతుల బాధలు పట్టడం లేదు
రామన్నపేట: సీఎం, మంత్రులకు రాజకీయాలు తప్ప.. రైతుల బాధలు పట్టడం లేదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. బుధవారం రామన్నపేట మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కొనుగోలు కేంద్రంలోని ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రైతులు దళారులకు అమ్మి నష్టపోతున్నారన్నారు. మంత్రుల మధ్య సమన్వయలోపం ప్రజలకు శాపంగా మారిందన్నారు. రైతులకు ఇబ్బంది కలుగకుండా యుద్ధ ప్రాతిపదికన ధాన్యాన్ని కొనుగోలు చేసి డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోచబోయిన మల్లేశం, మాజీ ఎంపీపీ నీల దయాకర్ నాయకులు బందెల రాములు, వేమవరపు సుధీర్‌బాబు, గొరిగె నర్సింహ, బద్దుల ఉమారమేష్, సాల్వేరు అశోక్, ఎస్కే చాంద్, మిర్యాల మల్లేశం, జాడ సంతోష్, బొడ్డు అల్లయ్య, లవనం రాము, దండుగుల సమ్మయ్య, ఎండీ ఎజాజ్, ఆవుల శ్రీధర్, గర్దాసు విక్రం, రాస వెంకటేశ్వర్లు, బుర్ర శ్రీశైలం, ఎండీ మోసబ్, సైదులు, ఎండీ అంజద్, బాబు, నరేష్, గణేష్, ఖలీం, యాదయ్య, లింగయ్య ఉన్నారు. ఫ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
భూ నిర్వాసితులకు రాచకొండలో భూములివ్వాలి
చౌటుప్పల్ : రీజినల్ రింగ్ రోడ్డు భూ నిర్వాసితులకు పరిహారంగా రాచకొండలోని భూములు ఇవ్వాలని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చౌటుప్పల్‌లో నిర్మించనున్న ట్రిపుల్ఆర్ జంక్షన్ ప్రాంతాన్ని బుధవారం ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి సందర్శించారు. రీజినల్ రింగ్‌రోడ్డు కోసం గుర్తించిన పొలాలు, వెంచర్లను పరిశీలించారు. భూనిర్వాసితులను కలిసి వారి నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివీస్, శ్రీని పరిశ్రమలను కాపాడేందుకు అలైన్‌మెంట్‌ను చౌటుప్పల్ ప్రాంతంలో 10కిలోమీటర్లు వంకర్లుగా మార్చారని ఆరోపించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తక్షణమే చౌటుప్పల్‌లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ మార్గాలను తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్‌రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి, సహాయకార్యదర్శి సత్యనారాయణ, రాష్ట్ర కమిటీ సభ్యుడు కె.శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు పల్లె శేఖర్‌రెడ్డి, బచ్చనగోని గాలయ్య, నిర్వాసితులు బోరెం ప్రకాష్‌రెడ్డి, వల్లూరి బోవయ్య, సందగళ్ల మల్లేష్, జాల శ్రీశైలం పాల్గొన్నారు. భూనిర్వాసితుల మద్దతుకు సీపీఐ ఉద్యమిస్తుంది సంస్థాన్ నారాయణపురం: రీజినల్ రింగ్ రోడ్డు భూనిర్వాసితులకు న్యాయం జరిగే వరకూ వారికి మద్దతుగా సీపీఐ ఉద్యమిస్తుందని ఆపార్టీ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. సంస్థాన్‌నారాయణపురం మండలంలోని రీజినల్ రింగ్ రోడ్డు వెళ్తున్న దేవిరెడ్డిబంగ్లా, పుట్టపాక గ్రామాల్లో పర్యటించి పొలాలు పరిశీలించారు. ఉత్తర భాగం విషయమై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరిని కలుస్తామన్నారు. దక్షిణ భాగం భూనిర్వాసితులతో ప్రభుత్వ పెద్దలను కలుస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి యానాల దామెదర్‌రెడ్డి, పార్టీ మండల కార్యదర్శి దుబ్బక భాస్కర్, మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని నారాయణరావు, నాయకులు తదితరులున్నారు. ఫ సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి -
రూపాయికి బీఎస్ఎన్ఎల్ సిమ్‌కార్డు
రామగిరి(నల్లగొండ): దీపావళి పండుగకు రూపాయికి బీఎస్ఎన్ఎల్ సిమ్‌కార్డు ఆఫర్ ప్రవేశపెట్టినట్లు ఆ సంస్థ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. దీపావళి ప్రత్యేక పథకం ద్వారా ఒక్క రూపాయి ప్రీపెయిడ్ సిమ్‌కార్డుతో నెల రోజుల పాటు అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాల్స్, రోజుకు 2 జీబీ డేటా, 100 ఎస్ఎమ్ఎస్లు ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఆఫర్ కొత్తగా ప్రీపెయిడ్ సిమ్ తీసుకునే వారికి, పోర్టబులిటీ ద్వారా బీఎస్ఎన్ఎల్లోకి మారే వారికి వర్తిస్తుందని తెలిపారు. మహిళ అదృశ్యంభువనగిరి: మండలంలోని వడాయిగూడెం గ్రామంలో మహిళ అదృశ్యమైంది. గ్రామానికి చెందిన బబ్బూరి శంకరయ్య బుధవారం ఉదయం 10.30 గంటలకు పని నిమిత్తం యాదగిరిగుట్టకు వెళ్లి తిరిగి వచ్చాడు. ఇంట్లో భార్య ఉమారాణి కనిపించకపోవడంతో చుట్టపక్కల, బంధువుల ఇళ్లల్లో వెతికాడు. ఎక్కడా కనిపించకపోవడంతో స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తన భార్య మానసికస్థితి సరిగా లేక కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నట్లు తెలిపాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్‌కుమార్ తెలిపారు. జానకిపురంలో వ్యక్తి.. అడ్డగూడూరు: అడ్డగూడూరు మండల పరిధిలోని జానకిపురం గ్రామానికి చెందిన కట్కూరి లక్ష్మయ్య (86) ఈనెల 13న ఉదయం ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఈమేరకు ఆయన కుమారుడు సోమయ్య బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన తండ్రికి మతిస్థిమితం సరిగా లేదని తెలిపాడు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకట్ రెడ్డి తెలిపారు. కొనసాగుతున్న గాలింపు చందంపేట : నేరెడుగొమ్ము మండలం వైజాక్ కాలనీలోని కృష్ణా వెనుక జలాల్లో మంగళవారం యువకుడు గల్లంతు కాగా.. అతడి ఆచూకీ కోసం చేపట్టిన గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపురం గ్రామానికి చెందిన తిన్నారపు పృథ్వీరాజ్ హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడు తన స్నేహితులతో కలిసి వైజాక్ కాలనీకి రాగా ఈత కోసం కృష్ణా వెనుక జలాల్లో దిగి గల్లంతయ్యాడు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పృథ్వీరాజ్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేస్తున్నట్లు ఎస్ఐ నాగేంద్రబాబు బుధవారం తెలిపారు. -
అబ్దుల్ కలాం స్ఫూర్తితో చదవాలి
నకిరేకల్: విద్యార్థులు అబ్దుల్ కలాం స్ఫూర్తితో చదవాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్ పిల్లలమర్రి రాములు అన్నారు. నకిరేకల్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం నిర్వహించిన ప్రపంచ విద్యార్థుల దినోత్సవం, గోల్డ్‌మెడల్ ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉన్నతమైన కళ, జ్ఞాన సముపార్జన, నిరంతరం శ్రమ, పట్టుదల ఈ నాలుగు నియమాలు అనుసరిస్తే ప్రతి విద్యార్థి అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చన్నారు. నకిరేకల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు రాజధానిలోని కళాశాలలతో పోటీ పడుతుండడం అభినందనీయమన్నారు. మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంపొందించేందుకు కళాశాలలో దాతల సహకారంతో మూడు గోల్డ్ మోడల్స్ ఇవ్వడం అభినందనీయమన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ బెల్లి యాదయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నల్లగొండ ఎన్జీ కళాశాల, రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాళ్లు ఎస్.ఉపేందర్, రహత్ ఖానం, ప్రోగాం కన్వీనర్ శ్రీనివాసాచారి, వైస్ ప్రిన్సిపాల్ నాగు, అధ్యాపకులు ప్రవీణ్‌రెడ్డి, శ్రీనివాస్, హరిత, మధుసూదన్‌రెడ్డి, శంకర్, రవీందర్, నర్సింహాచారి, శివశంకర్ పాల్గొన్నారు. ఫ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్ రాములు -
రైలు నుంచి పడి తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు మృతి
గరిడేపల్లి: మండల పరిధిలోని కీతవారిగూడెం గ్రామానికి చెందిన తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు కీత వెంకటేశ్వర్లు బుధవారం వ్యక్తిగత పనులపై ఢిల్లీ వెళ్తుండగా మార్గమధ్యలో జార్ఖండ్ రాష్ట్రంలోని కడారు ప్రాంతంలో ప్రమాదవశాత్తు రైలు నుంచి పడి మృతి చెందారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో ఈ ప్రాంతం నుంచి చురుకై న పాత్ర పోషించారు. వెంకటేశ్వర్లు మృతి పట్ల మండల బీఆర్ఎస్ నాయకులు సంతాపం తెలిపారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరికి తీవ్రగాయాలుమునగాల: మండలంలోని ఆకుపాముల శివారులో జాతీయ రహదారిపై బుధవారం గుర్తు తెలియని కారు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కోదండరామాపురం గ్రామానికి చెందిన రెణబోతు అప్పిరెడ్డి, రెణబోతు లక్ష్మీనరసింహారెడ్డి ఇద్దరు సోదరులు. లక్ష్మీనరసింహారెడ్డికి చెందిన ద్విచక్రవాహనంపై అప్పిరెడ్డితో కలిసి కోదాడ మండలం కందిబండ గణపవరం గ్రామానికి వెళ్లి తిరిగి వస్తున్నారు. మార్గమధ్యంలో ఆకుపాముల వద్ద విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే కారు అతివేగంగా వచ్చి వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. గాయపడిన వీరిద్దరిని స్థానికులు చికిత్స నిమిత్తం కోదాడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వారి కుటుంబసభ్యులు కోదాడకు చేరుకొని మెరుగైన చికిత్స నిమిత్తం ఖమ్మంకు తరలించారు. ఈ విషయమై స్థానిక ఎస్ఐ ప్రవీణ్‌కుమార్‌ను సంప్రదించగా ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు. -
జల హొయలు
మర్రిగూడ: 2500 ఎకరాల విస్తీర్ణంలో చుట్టూ ఉన్న కొండలు, వాటి మధ్య పరుచుకున్న పచ్చదనం ప్రకృతి ప్రేమికులను ఎంతో మైమరపింపజేస్తోంది. అక్కడే కొలువుదీరిన బుగ్గ శ్రీలక్ష్మీ నర్సింహస్వామి ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక చింతన పెంపొందిస్తోంది. ఎత్తిపోతల పర్యాటక ప్రాంతంగా పేరుగాంచింది. మర్రిగూడ మండల పరిధిలోని అజ్జలాపురం బుగ్గ వద్ద జలపాతం వర్షాకాలం మొదలుకుని ఆరు నెలల పాటు పర్యాటకులను కనువిందు చేస్తుంది. ప్రకృతి అందాలకు దాసోహం మర్రిగూడ మండల కేంద్రం నుంచి 10కిలోమీటర్ల దూరంలో ఈ బుగ్గ ఉంది. ఈ ప్రాంతమంతా కొండలు, లోయలు, పచ్చనిచెట్లతో కూడుకుని ఉంటుంది. వరద నీరంతా ఒకేచోట చేరి కొండపై నుంచి కిందకు దూకుతూ జలపాతాన్ని తలపిస్తుంటుంది. గత ఐదు రోజులుగా నీటి ప్రవాహం వస్తుండడంతో యువకులు, పరిసర ప్రాంతాల ప్రజలు ఇక్కడకు చేరుకుని సందడి చేస్తుంటారు. గుహ మధ్యలో వెలసిన శివలింగం మర్రిగూడ పరిసర ప్రాంతాల నుంచే కాకుండా జిల్లా నలుమూలల నుంచి, హైదరాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల నుంచి కూడా నిత్యం వందల సంఖ్యలో జలపాతం వస్తున్న సమయంలో వచ్చి వెళ్తుంటారు. యువత ఇక్కడ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించుకుంటారు. ఈ జలపాతం దగ్గరకు వెళ్లాలంటే అజ్జలాపురం గ్రామం నుంచి సుమారు 2కి.మీ మేరకు కాలినడక ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కాలినడకన వెళ్లే మార్గంలో వివిధ పక్షుల రాగాలు కాలినడక అలసటను మైమరపింపజేస్తాయి. ఈ ప్రాంతంలో కొలువైన శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయం ఉంటుంది. ఇక్కడ కొండల నడుమ గుహ మధ్యలో శివలింగం కూడా వెలిసింది. ఈ ప్రాంతానికి వచ్చివారు స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ పెద్దఎత్తున మొగలి చెట్లు ఉండడంతో ఈ ప్రాంతమంతా మొగలి పూల సువాసన వెదజల్లుతుంది. ఫ కనువిందు చేస్తున్న అజ్జలాపురం బుగ్గ జలపాతం ఫ అటవీ ప్రాంతమంతా మొగలి పూల సువాసన -
రాజ్యాంగ హక్కులను హరిస్తున్న కేంద్ర ప్రభుత్వం
శాలిగౌరారం: దొంగ ఓట్లను సృష్టించి అధికారంలోకి రావడమే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ దోపిడీకి పాల్పడుతుందని, రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘రైజ్ యువర్ వాయిస్’ అనే నినాదంతో ‘ఓటు చోరీకి వ్యతిరేకంగా రాహుల్‌గాంధీకి మద్దతుగా దేశం బాగు కోసం మా సంతకం’ అనే కార్యక్రమాన్ని బుధవారం శాలిగౌరారం మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారం కోసం ప్రజల రాజ్యాంగ హక్కులను హరిస్తూ ఓట్ల దొంగతనానికి పాల్పడుతుందని విమర్శించారు. అనేక రాష్ట్రాల్లో ఓట్లచోరీతో అధికారం చేపట్టిన బీజేపీ ఇప్పుడు బిహార్‌లోనూ అదేవిధంగా కార్యాచరణ చేపట్టిందన్నారు. ఓట్లచోరీకి వ్యతిరేకంగా జరిగే సంతకాల సేకరణ కార్యక్రమాన్ని తనకు ఓటుహక్కు కలిగి ఉన్న సొంత గ్రామంలోని అదే బూత్ పరిధిలో సంతకాల సేకరణ ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఎంపీ తెలిపారు. కార్యక్రమంలో శాలిగౌరారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాదూరి శంకర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ తాళ్లూరి మురళి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నరిగె నర్సింహ, సింగిల్‌విండో వైస్‌చైర్మన్ చామల మహేందర్‌రెడ్డి, పీసీసీ మాజీ అధికార ప్రతినిధి నూక కిరణ్‌యాదవ్, డీసీసీ ఉపాధ్యక్షులు అన్నెబోయిన సుధాకర్, గంట్ల వేణుగోపాల్‌రెడ్డి, కార్యదర్శి గూని వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కందాల సమరంరెడ్డి, మండల మహిళా అధ్యక్షురాలు ఎర్ర చైతన్య, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గణేశ్ పాల్గొన్నారు.ఫఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి -
రాష్ట్ర హక్కులను కాపాడుతాం
కోదాడ: కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్ర హక్కులను కాపాడేందుకు ఎంత వరకై నా వెళ్తామని ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి కోదాడలో విలేకరులతో మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్ట్‌ను ప్రతిపాదిస్తున్నదని తెలుసుకున్న వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్ర జలవనరులశాఖకు, కేంద్ర ప్రభుత్వానికి తమ వ్యతిరేకతను తెలియజేశామని అన్నారు. రాష్ట్ర నీటిపారుదశాఖ మంత్రి హోదాలో తాను న్యాయస్థానంలో హాజరయ్యానని తెలిపారు. ప్రజల్లో అపోహలు కలిగించడానికి ప్రతిపక్షనేతలు అసత్య ప్రచారాలను చేస్తున్నారని ఆరోపించారు. కృష్ణా జలాల విషయంలో గత ప్రభుత్వం 811 టీఎంసీలలో 299 టీఎంసీలు తెలంగాణకు సరిపోతాయని ఒప్పుకుందన్నారు. తమ ప్రభుత్వం 811 టీఎంసీలలో తెలంగాణకు 70శాతం నీటివాటా కావాలని పోరాడుతోందని చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేసి నీటిని అందిస్తామని దీనికి ఇప్పటికే రూ.4300 కోట్లు కేటాయించామని తెలిపారు. సొరంగం తవ్వకంలో ప్రమాదం జరిగి పనులు ఆగిపోయాయని, దేశంలోనే ఉత్తమ సొరంగ నిపుణులను తీసుకొచ్చి పనులను ప్రారంభించడానికి కృషి చేస్తున్నామన్నారు. డిండి ప్రాజెక్ట్‌కు రూ.1800 కోట్లను కేటాయించి పనులు చేయబోతున్నామని తెలిపారు. గోదావరి జలాలను శ్రీరాంసాగర్ పేజ్–2 ద్వారా సూర్యాపేట జిల్లాకు తీసుకొస్తామని తెలిపారు. ఈ సంవత్సరం వానాకాలంలో రాష్ట్రంలో 67 లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారని, 148. 8 లక్షల టన్నుల ధ్యానం పండబోతున్నదని, దీనిలో 87 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని వివరించారు. దీని కోసం 8432 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు వాటిలో అన్ని సౌకర్యాలను కల్పించామని తెలిపారు. సమావేశంలో కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ పాల్గొన్నారు. ఫ రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి -
బైక్‌ల చోరీ ముఠా అరెస్ట్
భువనగిరిటౌన్ : బైక్‌ల చోరీ ముఠాను భువనగిరి పట్టణ పోలీసులు పట్టుకున్నారు. కేసు వివరాలను బుధవారం భువనగిరి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో పట్టణ ఇన్స్పెక్టర్ రమేష్ వెల్లడించారు. హైదరాబాద్‌లోని యాకుత్‌పుర చెందిన సయ్యద్ తలీబ్ అలియాస్ సమీక్(ఏ1) అలూబా(ఎ2), రేహన్ (ఏ3), ఎండీ సాజిద్(ఏ4)తోపాటు వికారాబాద్ జిల్లా పూడూరు మండలం గోమల్ గ్రామానికి చెందిన మహ్మద్ షోయబ్ అలియాస్ శ్రీనివాస్(ఏ5) ముఠాగా ఏర్పడ్డారు. ప్రధాన నిందితుడు సయ్యద్ తలీబ్ గతంలో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లి ఆగస్టులో బెయిల్‌పై విడుదలయ్యాడు. అతడికి పరిచయమున్న అలూబా, రేహన్, సాజిద్‌తో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. ఈ నలుగురు కలిసి ఇళ్ల ఎదుట పార్కింగ్ చేసి ఉన్న బైక్‌లను చోరీ చేసి వికారాబాద్ జిల్లాకు చెందిన షోయబ్‌కు ఇచ్చేవారు. అతడు తనకు తెలిసిన వాళ్లకు విక్రయించేవాడు. ఇలా వచ్చిన డబ్బును ఐదుగురు కలిసి సమాన వాటాగా పంచుకునేవారు. ఈనెల 6వ తేదీన భువనగిరిలో జరిగిన ద్విచక్రవాహనం చోరీ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను సీసీ కెమెరాలో గుర్తించారు. ఈమేరకు హైదరాబాద్‌లో సయ్యద్ తలీబ్, సాజిద్, మహ్మద్ షోయబ్‌ను అరెస్ట్ చేసి భువనగిరి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. మిగతా ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు ఇన్స్పెక్టర్ చెప్పారు. పట్టుబడ్డ నిందితుల వద్ద రూ.4.80లక్షల విలువైన ఐదు బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎస్సైలు రమేష్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం
ఆలేరురూరల్ : రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆలేరు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలూ తావుండరాదని, రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణకు ప్రభుత్వం రూ.25 వేల కోట్ల బడ్జెట్ కేటాయించిందన్నారు. కొనుగోలు చేసిన వడ్లకు 12 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామన్నారు. వర్షాలకు ధాన్యం తడిసి నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. సన్నరకం వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని, పాత బకాయిలతో కలిపి త్వరలో రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించారు. గత పాలకుల తప్పిదాల వల్లే మదర్ డెయిరీకి నష్టాలు : బీర్ల ఐలయ్య గత పాలకుల తప్పిదాల వల్ల మదర్ డెయిరీ నష్టాల్లోకి వచ్చిందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య విమర్శించారు. సంస్థను లాభాల్లోకి తీసుకురావడానికి నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ వారితో చర్చలు నడుస్తున్నాయని తెలిపారు. దీపావళి నాటికి రైతులకు పాల బిల్లులు అందే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పారు. అనంతరం కొల్లూరు, మందనపల్లిలో కొనుగోలు కేంద్రాలను బీర్ల ఐలయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఐనాల చైతన్య, పీఏసీఎస్ చైర్మన్ మొగులుగాని మల్లేషం, వెంకటేశ్వరరాజు, ఆరె ప్రశాంత్, గంధమల్ల అశోక్, నీలం పద్మ, కట్టెగొమ్ముల సాగర్‌రెడ్డి, తుంగకుమార్, బుగ్గ నవీన్, గాజుల వెంకటేష్, శ్రీకాంత్, కర్రె అజయ్, ఎఫ్‌పివో నిర్వాహాకులు వస్పరి స్వామి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి -
ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి
బొమ్మలరామారం: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. బొమ్మలరామారం మండల కేంద్రంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను బుధవారం ఆయన పరిశీలించారు. లబ్ధిదారులకు సూచనలు చేశారు. నిరుపేదలకు ఇళ్ల నిర్మాణం భారం కావద్దన్న ఉద్దేశంతో సమభావన సంఘాల నుంచి రుణాలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇళ్ల నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయని చెప్పారు. అంతకుముందు తహసీల్ధారు కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు.ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం జరుగకుండా చూడాలని, అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తహసీల్దారు శ్రీనివాసరావుకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు శ్రీనివాసరావు, ఎంపీడీఓ రాజా త్రివిక్రమ్, డిప్యూటీ తహసీల్దార్ సునీల్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ బైసు రాజేష్, ఎంఆర్ఐ వెంకట్‌రెడ్డి, ఎస్ఐ బుగ్గ శ్రీశైలం, వెలుగు ఏపీఎం యాదగిరి, నాయకులు శ్రీరాములు నాయక్, రామిడి జంగారెడ్డి, ఈశ్వర్ పాల్గొన్నారు. ఫ కలెక్టర్ హనుమంతరావు -
రైతుల కల సాకారం చేసిన దాత
పొలాలకు వెళ్లేందుకు రోడ్డు లేక 45 ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నా ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదు. మా గ్రామస్తుడు శేఖర్‌గౌడ్ రైతుల ఇబ్బందులు చూసి తన సొంత డబ్బులతో 4 కిలో మీటర్ల మేర సీసీ రోడ్డు వేయించాడు. శేఖర్‌గౌడ్‌కు రైతులంతా రుణపడి ఉంటాం. –యాదిరెడ్డి, రైతు, గూడూరు గ్రామంపై ఉన్న మమకారంతో అభివృద్ధికి నావంతు తో డ్పాటునందిస్తున్న. పొలాల కు వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో రైతులు సమస్యను నా దృష్టికి తీసుకువచ్చారు. దీంతో నా సొంత డబ్బులు రూ.2 కోట్లు వెచ్చించి నాలుగు కిలో మీటర్ల మేర సీసీ రోడ్డు వేయించా. –తొర్పునూరి రాజశేఖర్‌గౌడ్, రోడ్డు నిర్మాణ దాత, గూడూరు బీబీనగర్: ఉన్నత హోదాలో ఉన్న ప్రజాప్రతినిధులు సైతం పట్టించుకోని ఈ రోజుల్లో రైతుల పడుతున్న ఇబ్బందులను చూసి వారి సమస్యను తీర్చేందుకు ముందుకువచ్చాడు ఓదాత. తన సొంత డబ్బులు రూ.2 కోట్లు ఖర్చు చేసి పంట పొలాలకు చక్కటి రోడ్డు నిర్మింపజేయించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు.. గూడూరుకు చెందిన తొర్పునూరి రాజశేఖర్‌గౌడ్. 4 కి.మీ మేర రోడ్డు నిర్మాణం బీబీనగర్ మండలం గూడూరు శివారు నుంచి భువనగిరి మండలం తాజ్‌పూర్‌కు వెళ్లే పానాదిబాట గుండా 4 కి.మీ మేర గూడూరుకు చెందిన 25 మందికి పైగా రైతుల భూములు ఉన్నాయి. రెవెన్యూ రికార్డు ప్రకారం నక్షలో 33 ఫీట్ల విస్తీర్ణం రోడ్డు ఉన్నప్పటికీ ఈబాట కోసం రైతులు 45 ఏళ్లుగా ఎంపీలు, ఎమ్మెల్యేలను కలిసి విన్నవించినా ప్రయోజనం లేకపోయింది. దీంతో రైతులు పొలాల వద్దకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. గ్రామాభివృద్ధికి తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్న తొర్పూనూరి రాజశేఖర్‌గౌడ్ దృష్టికి రైతులు సమస్యను తీసుకెళ్లగా 4 కి.మీ మేర 30 ఫీట్ల విస్తీర్ణంతో సీసీ రోడ్డు నిర్మించేందుకు ముందుకు వచ్చాడు. పది రోజుల్లోనే పూర్తి రోడ్డు కోసం రాజశేఖర్‌గౌడ్ రూ.2 కోట్లు ఖర్చు చేశా డు. నాణ్యమైన మెటీరియల్ వినియోగించి కేవలం పది రోజుల్లోనే రోడ్డు వేయించాడు. రోడ్డు కోసం రైతులు తమ భూముల్లో కొంత వదులుకున్నారు. రోడ్డు నిర్మాణంతో తమ సమస్య తీరిందని రైతులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఫ పంట పొలాల వద్దకు రహదారి కోసం సొంత నిధులు ఖర్చు ఫ రూ.2 కోట్లతో సీసీ రోడ్డు నిర్మాణం ఫ 45 ఏళ్లకు సమస్య పరిష్కారం ఫ రైతులు, గ్రామస్తుల హర్షం -
డయల్ 112
అత్యవసర సహాయానికి ఒక్కటే నంబర్ ఆలేరు: ఒకే దేశం, ఒకే అత్యవసర నంబర్ నినాదంతో కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన డయల్ 112పై హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (ఏహెచ్‌టీయూ), పోలీసు శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. రాచకొండ సీపీ సుధీర్‌బాబు ఆదేశాల మేరకు ఆలేరు, భువనగిరి, యాదగిరిగుట్ట్ట, రాజాపేట, గుండాల, బీబీనగర్ మండలాల పరిధిలోని పాఠశాలలు, కళాశాల విద్యార్థులకు 112 నంబర్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నంబర్‌తోపాటు సైబర్‌నేరాలు, బాల్యవివాహాల నిర్మూలన, రోడ్డు ప్రమాదాలు, మహిళలు, పిల్లల భద్రత, హ్యుమన్ ట్రాఫికింగ్, మత్తుపదార్థాల రవాణా నిరోధం, కొత్త చట్టాలపైనా ప్రచారం చేస్తున్నారు. అత్యవసర సహాయ సేవల పర్యవేక్షణకు ప్రభుత్వ ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది. గతంలో వేర్వేరు సేవలకు విభిన్న నంబర్లు పోలీసుల సహాయ కోసం 100, బాలల రక్షణకు 1098, వైద్య సహాయానికి అంబులెన్స్ కావాలంటే 108, అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు 101.. ఇలా వేర్వేరు అత్యవసర సేవలకు విభిన్నమైన నంబర్లు ఉండేవి. ఇకపై ఎలాంటి అత్యవసర పరిస్థితి తలెత్తినా కేవలం 112కు ఫోన్ చేస్తే సరిపోతుంది. ఈ వ్యవస్థ ప్రజలకు సహాయాన్ని చేరువ చేయడమే కాకుండా వేగవంతమైన రెస్పాన్స్ అందిస్తుంది. నూతన వ్యవస్థలో జీపీఎస్ కీలకపాత్ర నూతన వ్యవస్థల్లో జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) కీలకపాత్ర పోషిస్తుంది. ఎవరైనా 112కు ఫోన్ చేసిన వెంటనే, వారి కచ్చితమైన స్థానాన్ని గుర్తించి, సమీపంలో అందుబాటులో ఉన్న ఎమర్జెన్సీ రెస్పాన్స్ బృందాలను వెంటనే సంఘటన స్థలానికి పంపేలా ఈ వ్యవస్థను రూపొందించారు. సహాయం అందే వరకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని బాధితులకు అప్డేట్ చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో అధికారులను కమాండ్ కంట్రోల్ రూం మానిటరింగ్ చేస్తుంది. సంఘటనా స్థలానికి వెళ్లిన సిబ్బంది తమ ట్యాబ్ ద్వారా తిరిగి క్లియరెన్స్ సమాచారం ఇచ్చే వరకు కంట్రోల్‌రూం సిబ్బంది పర్యవేక్షణ చేస్తుంది. ఫ జీపీఎస్ ద్వారా బాధితుల లొకేషన్ గుర్తింపు ఫ ఏహెచ్‌టీయూ, పోలీసుల ఆధ్వర్యంలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు112 నంబర్ 24గంటలు పని చేస్తోంది. బాధితులకు వివిధ భాషల్లో మద్ధతు లభిస్తుంది. తమ సెల్‌ఫోన్‌తోపాటు ల్యాండ్ ఫోన్ నుంచి 112కు డయల్ చేయొచ్చు. ఫోన్ చేయలేని పరిస్థితిలో ఉంటే తమ సెల్ఫోన్లో పవర్ బటన్‌ను మూడుసార్లు నొక్కితే ఆటోమేటిక్‌గా 112కు కాల్ వెళ్లి, కావాల్సిన సహాయం బాధితులకు అందుతుందని ఏహెచ్‌టీయూ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ ‘సాక్షి’తో చెప్పారు. సీపీ సుధీర్‌బాబు ఆదేశాల మేరకు ఏహెచ్‌టీయూ సిబ్బంది, స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో 112 నంబర్‌ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. రోడ్డు ప్రమాదాలు, వైద్య, పోలీసు,అగ్నిమాపక తదితర అత్యవసర సహాయం కోసం ప్రజలు ఇకపై కొత్త నంబర్‌కే ఫోన్ చేయాలి. –యాలాద్రి, ఆలేరు సీఐ -
రూ.కోట్లు ఖర్చు.. వినియోగిస్తే ఒట్టు
మోటకొండూర్: రైతులు పండించే వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలా, దళారీల నుంచి వారిని కాపాడాలన్న ఉద్దేశంతో మోటకొండూరులో ఏర్పాటు చేసిన వ్యవసాయ సబ్ మార్కెట్ యార్డు రైతులకు ఏమాత్రం ఉపయోగపడటం లేదు. కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించినా ఫలితం లేకుండాపోయింది. ఏడేళ్లయినా అక్కడ క్రయవిక్రయాలు జరగడం లేదు. వినియోగంలోకి తీసుకురాకపోవడంతో వ్యాపారులు, దళారుల చేతిలో రైతులు మోసపోతున్నారు. ఇదీ పరిస్థితి ● మోటకొండూరు మండల కేంద్రంలోని వ్యవసాయ సబ్ మార్కెట్ యార్డుల్లో క్రయవిక్రయాలు జరగడం లేదు. ఇక్కడ 10 ఎకరాల విస్తీర్ణంలో 2018లో నాబార్డు నిధులు రూ.3 కోట్లతో సబ్ మార్కెట్ యార్డు నిర్మించారు. యార్డులో 5,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గిడ్డంగిని కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను వ్యాపారులు మార్కెట్లోనే కొనుగోలు చేయాల్సి ఉన్నా నిబంధనలు అమలు కావడం లేదు. ● పాత ఆలేరు, యాదగిరిగుట్ట, ఆత్మకూర్(ఎం), గుండాల మండలాల పరిధిలోని పలు గ్రామాలను విడదీసి మోటకొండూర్ నూతన మండలం ఏర్పాటు చేశారు. కానీ, సగం గ్రామాలు ఆలేరు, మోత్కూరు మార్కెట్ల పరిధిలో కొనసాగుతున్నాయి. దీంతో చాలా మంది రైతులు మోటకొండూరుకు కాకుండా పూర్వపు మార్కెట్లకు వెళ్తున్నారు. గ్రామాలన్నింటినీ మోటకొండూరు సబ్ మార్కెట్ పరిధిలోకి తీసుకువచ్చి ఇక్కడే క్రయవిక్రయాలు ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. అధికంగా సాగు విస్తీర్ణం ఇక్కడే.. జిల్లాలో అత్యధిక సాగు విస్తీర్ణం మోటకొండూర్ మండంలంలోనే ఉంది. ఇక్కడ 22,670 ఎకరాల సాగు భూమి, 11,617 మంది రైతులు ఉన్నారు. వా నాకాలం సీజన్లో పత్తి 10,800, వరి 10,500, ఇతర పంటలు 1,370 ఎకరాల్లో సాగయ్యాయి. స్థానికంగా మార్కెట్ యార్డు ఉన్నా కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రైతులు ఇతర మండలాల మార్కెట్లకు వెళ్తున్నారు. మరికొందరు ప్రైవేట్ వ్యాపారులు, దళారులకు తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. వృథాగా మోటకొండూరు వ్యవసాయ సబ్ మార్కెట్ ఫ నిర్మించి ఏడేళ్లు గడిచినా మొదలుకాని క్రయవిక్రయాలు ఫ దళారులను ఆశ్రయిస్తున్న రైతులు ఫ కొనుగోళ్లు ఇక్కడే చేయాలని వేడుకోలు మోటకొండూర్, ఆత్మకూర్(ఎం), యాదగిరిగుట్ట మండలాలను ఒకే గొడుగు కిందకి తీసుకువచ్చి మోటకొండూర్ సబ్ మార్కెట్ యార్డును అప్‌గ్రేడ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పటి ఎమ్మెల్యే 2022లో సిఫారస్ చేశారు. అనుమతులు ఇచ్చే వేళ మునుగోడు ఉప ఎన్నిక రావడం, అనంతరం జనరల్ ఎలక్షన్లు కారణంగా అప్‌గ్రెడేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం ప్రభుత్వం ప్రతిపాదనకు కార్యరూపం తేవాలని రైతులు కోరుతున్నారు. మార్కెట్ యార్డ్‌ను అప్‌గ్రేడ్ చేయడానికి గత ప్రభుత్వంలో ప్రతిపాదించారు. ప్రస్తుత సర్కార్ పరిశీలించాలి.అప్‌గేడ్ర్ చేయడం వల్ల మోటకొండూరుతో పాటు ఆలేరు, మోత్కుర్ మండలాల రైతులకు మేలు జరుగుతుంది. కొనుగోళ్లు జరగక పండించిన పంట దళారులకు చెందుతుంది. –ఎగ్గిడి బాలయ్య, వంగపల్లి పీఏసీఎస్ వైస్ చైర్మన్ సబ్‌మార్కెట్ యార్డులో గిడ్డంగులు నిర్మించినా ప్ర యోజనం లేదు. ధాన్యం, పత్తిని ఇంట్లో నిల్వ చేసుకునే పరిస్థితి లేక దళారులకు అమ్ముకుంటున్నారు. దీని ఆసరాగా తీసుకొని తక్కువ రేటుకు కొనుగోలు చే స్తున్నారు. సబ్మార్కెట్ను మార్కెట్ యార్డ్‌గా మార్చాలి. –గాదెగాని మాణిక్యం, సీపీఐ మండల కార్యదర్శి -
నివేదికలు ఇవ్వండి
సాక్షి, యాదాద్రి : గనులు, క్వారీల మంజూరీకి పర్యావరణ అనుమతులు మంజూరు చేయడానికి రాష్ట్రస్థాయి పర్యావరణ ప్రభావ అధ్యయన సంస్థ (సియా)కు సంబంధించిన జిల్లా సర్వే నివేదిక సంకలన కమిటీ సమావేశం బుధవారం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. కమిటీ సభ్యులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. నిర్దేశించిన గడువులోపు నివేదికలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. పంటల సర్వే రాజాపేట: మండలంలోని బొందుగుల గ్రామంలో బుధవారం జాతీయ గణాంక అధికారులు పంటల సర్వే నిర్వహించారు. వర్షాధార పంటలు, బోరుబావుల ద్వారా సేద్యం చేసే పంటల వివరాలు నమోదు చేసుకున్నారు. సర్వే ద్వారా దేశంలో పంటల విస్తీర్ణం, సాగు ఎగుమతి, దిగుమతుల వివరాలు తెలుస్తుందన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి అంజయ్య, రైతులు పాల్గొన్నారు. బిల్ కలెక్టర్ సస్పెన్షన్‌కు ఆదేశం ఆలేరు: మున్సిపల్ సిబ్బంది కొందరు విధులకు గైర్హాజరు కావడంతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు ఆగ్రహం వేశారు. బిల్ కలెక్టర్ సస్పెన్షన్‌కు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం ఆయన ఆలేరు మున్సిపల్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. కొన్ని రోజులుగా బిల్‌కలెక్టర్ నాగేందర్ అనధికారికంగా సెలవులో ఉన్నట్టు అదనపు కలెక్టర్ గుర్తించారు. ఈ విషయమై ము న్సిపల్ మేనేజర్‌ను ప్రశ్నించగా అనారోగ్యం వల్ల విధులకు రావడం లేదని వివరణ ఇచ్చారు. అనుమతి తీసుకోకపోవడంతో సస్పెన్షన్‌కు ఆదేశించారని, ఈ మేరకు నివేదిక అందజేయనున్నట్టు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. నేత్రపర్వంగా యాదగిరీశుడి నిత్యకల్యాణం యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో నిత్యారాధనలో భాగంగా స్వామి, అమ్మవారి నిత్యకల్యాణాన్ని అర్చకులు ఆగమశాస్త్రానుసారం నేత్రపర్వంగా చేపట్టారు. బుధవారం వేకువజామున ఆలయాన్ని తెరచిన అర్చకులు స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాతం సేవ చేపట్టి, గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీదళాలతో అర్చన చేశారు. అనంతరం ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణం వేడుక జరిపించారు. ఆ తరువాత బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు నిర్వహించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చు కున్నారు. రాత్రి శ్రీస్వామివారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం గావించారు. -
పొలం గట్లపై కూరగాయల సాగు
నడిగూడెం: నడిగూడెం మండల పరిధిలోని బృందావనపురం గ్రామానికి చెందిన రైతు పుట్ట కనకయ్య వినూత్నంగా వరి పొలం గట్లపై పలు రకాల కూరగాయలు సాగుచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. సాధారణంగా వరి పొలం గట్లపై గడ్డి పెరుగుతుండడంతో దానిపై కలుపు మందుల పిచికారీ చేయడం లేదా గడ్డిని కోయడం జరుగుతుంది. కానీ అందుకు భిన్నంగా పచ్చని పొలాల మధ్య ఉన్న పొలం గట్లు ఖాళీగా ఉండడంతో తన కుటుంబ అవసరాల కోసం బెండ, గోంగూర, దోస, కాకర సాగు చేస్తున్నాడు. గట్లపై కూరగాయలు సాగు చేస్తుండడంతో వరికి చీడపీడల బెడద కూడా తగ్గిందని రైతు కనకయ్య చెబుతున్నాడు. అలాగే గట్లపై సాగు చేసిన కూరగాయలకు ఎలాంటి రసాయన మందులు వాడకుండానే సాగు చేస్తున్నాడు. దీంతో రహదారి మీదుగా వెళ్తున్న ప్రయాణికులు గట్లపై కూరగాయల సాగును ఆసక్తిగా గమనిస్తున్నారు. -
సత్తా చాటిన యువ దర్శకుడు
యాదగిరిగుట్ట: బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్–2025 సెలక్షన్ లిస్టులో యాదగిరిగుట్ట మండలం చిన్నకందుకూర్ గ్రామానికి చెందిన యువ దర్శకుడు నమిలే శివకుమార్ రూపొందించిన ప్రజాపాలన అనే షార్ట్ ఫిల్మ్‌కు చోటు దక్కింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గ్రామీణ నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్ర ప్రజల జీవితాల్లో ప్రభుత్వ పాలనా విధానాలు ఎలా ప్రతిబింబిస్తున్నాయనే అంశాన్ని వాస్తవికంగా చూపించేలా షార్ట్ ఫిల్మ్ చేయడంతో తనకు ‘బతుకమ్మ యంగ్ ఫిలిమ్స్ మేకర్స్ ఛాలెంజ్–2025’ సెలక్షన్ లిస్టులో చోటు దక్కినట్లు యువ దర్శకుడు నమిలే శివకుమార్ తెలిపారు. తెలంగాణ ప్రజాపాలనపై 2 నిమిషాల 58 సెకన్ల పాటు రూపొందించిన వీడియోను బతుకమ్మ యంగ్ మేకర్స్ ఛాలెంజ్–2025కు ఈ నెల 4న పంపించినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఈ నెల 9న హైదరాబాద్‌లోని శిల్పారామంలో అవార్డు ఫంక్షన్ నిర్వహించాల్సి ఉండగా.. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ఉండటంతో వాయిదా పడిందని, త్వరలోనే ప్రభుత్వం అవార్డు ఫంక్షన్ నిర్వహిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 500కు పైగా షార్ట్ ఫిల్మ్‌లు, పాటలు వచ్చాయని, వీటిని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, ఫెస్టివల్ టీమ్ ఆధ్వర్యంలో పరిశీలించి సెలక్షన్ లిస్టు తయారు చేశారన్నారు. తెలంగాణ ప్రజాపాలనపై షార్ట్ ఫిల్మ్ రూపొందించిన చిన్నకందుకూర్ వాసి బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్–2025లో సెలక్షన్ లిస్టులో చోటు -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
యాదగిరిగుట్ట రూరల్: రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో వాటిపై ప్రయాణిస్తున్న వారు రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో అటుగా అతివేగంగా వస్తున్న గూడ్స్ వాహనం కిందపడిన బైక్ పైనుంచి వెళ్లడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన యాదగిరిగుట్ట మండలం కాచారం గ్రామ పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజపేట మండలం బేగంపేట గ్రామానికి చెందిన నీలం నరసింహులు(40) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడు మంగళవారం పని నిమిత్తం సడల నర్సింహులు అనే వ్యక్తితో కలిసి ద్విచక్ర వాహనంపై రాజపేట నుంచి ఆలేరు వైపు వెళ్తున్నాడు. అదే సమయంలో యాదగిరిగుట్ట మండలం కాచారం గ్రామానికి దడిగె రాములు, మరో ఇద్దరు కలిసి ద్విచక్ర వాహనంపై ఆలేరు నుంచి రాజపేట వైపు వెళ్తున్నారు. ఈ రెండు ద్విచక్ర వాహనాలు కాచారం గ్రామ పరిధిలోని పౌల్ట్రీఫాం వద్ద ఎదురెదురుగా ఢీకొనడంతో వారు రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో ఆలేరు వైపు వెళ్తున్న గూడ్స్ వాహనం అతివేగంతో నీలం నరసింహులు ద్విచక్ర వాహనం పైనుంచి వెళ్లింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. మరో వ్యక్తి సడల నరసింహులు కాలు విరిగింది. మరో బైక్‌పై ఉన్న రాములుకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆలేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడు నీలం నరసింహులు భార్య నీల సిద్ధమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు యాదగిరిగుట్ట సీఐ భాస్కర్ తెలియజేశారు. -
స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీలు
వేములపల్లి: స్కూల్ బస్సును రెండు లారీలు ఢీకొట్టాయి. ఈ ఘటన నార్కట్‌పల్లి– అద్దంకి రహదారిపై వేములపల్లి మండలం శెట్టిపాలెం క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని ఆదిత్య పాఠశాలకు చెందిన బస్సులో విద్యార్థులను తీసుకొచ్చేందుకు రోజుమాదిరిగానే మంగళవారం ఉదయం డ్రైవర్ పెదమాం గిరిబాబు వేములపల్లి మండలం శెట్టిపాలెంకు బయల్దేరాడు. ఈ క్రమంలో నార్కట్‌పల్లి–అద్దంకి రహదారిపై శెట్టిపాలెం క్రాస్ రోడ్డు వద్ద యూటర్న్ తీసుకుంటుండగా.. వేములపల్లి నుంచి మిర్యాలగూడ వైపు లారీ వస్తుండడం గమనించి డ్రైవర్ బస్సును నిలిపివేశాడు. అదే సమయంలో మిర్యాలగూడ వైపు నుంచి వస్తున్న కంటెయినర్ ఒక్కసారిగా వెనుక నుంచి బస్సును ఢీకొట్టడంతో బస్సు ముందుకు వెళ్లగా.. మిర్యాలగూడ వైపు వస్తున్న లారీ బస్సును ముందు వైపు నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ గిరిబాబు క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. లారీ డ్రైవర్ ఆనంద్ నామ్‌దేవ్ మొలేకర్కు గాయాలయ్యాయి. స్థానికులు బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం 108 వాహనంలో మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం రహదారిపై స్కూల్ బస్సును, లారీలను పోలీసులు క్రేన్ల సహాయంతో పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఘటన జరిగిన సమయంలో స్కూల్ బస్సులో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు డ్రైవర్ గిరిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ డి. వెంకటేశ్వర్లు తెలిపారు. డ్రైవర్‌కు స్వల్ప గాయాలు -
అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి
చివ్వెంల(సూర్యాపేట): చివ్వెంల మండల పరిధిలోని ఖాసీంపేట గ్రామ శివారులో అనుమానాస్పద ిస్థితిలో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చివ్వెంల మండల పరిధిలోని ఉండ్రుగొండ గ్రామానికి చెందిన మేడబోయిన శివశంకర్(31) సూర్యాపేటలోని సుధాకర్ పీవీసీ కంపెనీలో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 11న ఇంట్లోంచి బయటకు వెళ్లిన శివ తిరిగి ఇంటికి చేరుకోలేదు. తల్లిదండ్రులు ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో చివ్వెంల మండల పరిధిలోని ఖాసీంపేట గ్రామ శివారులోని ఎస్సారెస్పీ కాలువ పక్కన కుళ్లిపోయి ఉన్న మృతదేహాన్ని మంగళవారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ కనకరత్నం తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మృతుడి వద్ద లభించిన ఆధార్ కార్డు సహాయంతో తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మృతుడి తండ్రి యల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట జనరల్ హాస్పిటల్‌కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడు అవివాహితుడు. -
టెక్స్టైల్ పార్కులో దేవాలయాల కండువాల తయారీ
చౌటుప్పల్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాలకు సరఫరా చేసేందుకు గాను చౌటుప్పల్ మండలం మల్కాపురం గ్రామంలోని అపెరల్ టెక్స్టైల్ పార్కులో మర మగ్గాలపై టీజీఎస్కో ద్వారా కండువాలు తయారు చేయిస్తున్నామని చేనేత, జౌళి శాఖ జాయింట్ డైరెక్టర్ ఎన్వీ రావు తెలిపారు. మంగళవారం ఆయన టెక్స్టైల్ పార్కుని సందర్శించి అక్కడ తయారవుతున్న వివిధ రకాల ఉత్పత్తులను పరిశీలించారు. కళాకారిణి రిజిమ కళాకండాలతో పాటు కళాకారుడు శ్రావణ్ వెదురుతో తయారుచేసిన ఉత్పత్తులు, హస్త కళాకారుడు కె. కృష్ణమూర్తి ప్రాచీణ బాతిక్, స్క్రీన్, బ్లాక్, టై అండ్ డై పద్ధతులను నవీకరించి తయారుచేసిన వస్త్రాలను పరీశీలించారు. అపెరల్ టెక్స్టైల్ పార్కు నిర్వహణ బాధ్యతలను టీజీఐఐసీకి అప్పగించాలని కోరుతూ పార్కు కమిటీ అధ్యక్షుడు ఎంకెడీ ప్రసాద్ ఆయనకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, ఐఐహెచ్‌టీ సహాయ ప్రిన్సిపాల్ కుమార్, సలహాదారు కోప్రసాచారి, చేనేత ఏడీ శ్రీనివాసరావు, అభివృద్ధి అధికారి బాలమోహన్‌రెడ్డి పాల్గొన్నారు. చేనేత, జౌళి శాఖ జాయింట్ డైరెక్టర్ ఎన్వీ రావు -
బైక్ అదుపుతప్పి మృతి
అడ్డగూడూరు: బైక్‌పై వెళ్తున్న యువకుడు అదుపుతప్పి కిందపడి మృతిచెందాడు. ఈ ఘటన అడ్డగూడూరు మండలం చిర్రగూడూరు గ్రామ శివారులో సోమవారం రాత్రి జరిగింది. మంగళవారం ఎస్ఐ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన కుంభం రాజు(29) హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం తన బావమరిది పెళ్లి ఉండటంతో స్వగ్రామానికి వచ్చాడు. సోమవారం బైక్‌పై యాదాద్రి భువనగిరి జిల్లా పగిడిపల్లి గ్రామంలో తన స్నేహితుడి అంత్యక్రియల్లో పాల్గొని తిరిగి సాయంత్రం స్వగ్రామానికి వెళ్తుండగా.. అడ్డగూడూరు మండలం చిర్రగూడూరు గ్రామ శివారులోని ఇండియన్ ఆయిల్ పెట్రోలబంక్ సమీపంలోకి రాగానే బైక్ అదుపుతప్పడంతో కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. వరి ధాన్యం దొంగిలిస్తున్న ఇద్దరి అరెస్ట్కేతేపల్లి: రైతులు రోడ్డు వెంట ఆరబోసిన వరి ధాన్యాన్ని అపహరించిన ఇద్దరు దొంగలను మంగళవారం కేతేపల్లి పోలీసులు పట్టుకుని రిమాండ్ చేశారు. ఎస్ఐ సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూర్(ఎస్) మండలం గట్టికల్లు గ్రామానికి చెందిన ఆటో డైవర్ బచ్చలకూరి మహేష్, పెయింటర్‌గా పనిచేస్తున్న గుర్రాల రమేష్ ముఠాగా ఏర్పడి పలు ప్రాంతాల్లో వరి ధాన్యాన్ని దొంగిలించి విక్రయించగా వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవారు. ఈ క్రమంలో కేతేపల్లి మండలంలోని చీకటిగూడెం, ఉప్పలపహాడ్ గ్రామాల్లో రోడ్డు వెంట రైతులు ఆరబోసిన వానాకాలం వరి ధాన్యాన్ని గత కొన్నిరోజుల నుంచి చోరీ చేస్తూ మహేష్‌కి చెందిన ఆటోలో తరలించి అమ్ముకుంటున్నారు. రైతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కేతేపల్లి పోలీసులు రాత్రి వేళ రోడ్లపై నిఘా పెంచారు. మంగళవారం ఎస్ఐ సతీష్ తన సిబ్బందితో కలసి చీకటిగూడెం శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా రమేష్, మహేష్ ఆటోలో వెళ్తూ అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా వరి ధాన్యం దొంగతనం చేస్తున్నట్లు నిజం ఒప్పుకున్నారు. నిందితులను నకిరేకల్ కోర్టులో రిమాండ్ చేశామని ఎస్ఐ తెలిపారు. నాలుగు గేట్ల ద్వారా మూసీ నీటి విడుదల కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద ఉధృతి కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రం వరకు ప్రాజెక్టుకు 8,598 క్యూసెక్కుల వరద వస్తుండగా.. ప్రాజెక్టు అధికారులు నాలుగు క్రస్ట్ గేట్లను రెండు అడుగుల మేర పైకెత్తి 8,579 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కుడి, ఎడమ కాల్వలకు 340 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు గరిష్ట స్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా.. ప్రస్తుతం 644 అడుగుల వద్ద నీటిమట్టం నిలకడగా ఉంచి ఎగువ నుంచి వచ్చే వరదను దిగువకు విడుదల చేస్తున్నామని ప్రాజెక్ట అధికారులు పేర్కొన్నారు. 4.46 టీఎంసీ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్ధ్యం గల మూసీ ప్రాజెక్టులో ప్రస్తుతం 4.27 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. -
బౌద్ధం.. జీవన విధానాన్ని తెలిపే మార్గం
నాగార్జునసాగర్: బౌద్ధం ఒక మతం కాదని.. అది జీవన విధానం తెలిపే దమ్మ మార్గమని మహారాష్ట్రలోని సావిత్రిబాయి ఫూలే పూణే విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ మహేష్ దియోకర్ అన్నారు. మంగళవారం నాగార్జునసాగర్‌లోని బుద్ధవనంలో ధమ్మ విజయ వేడుకలను బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రొఫెసర్ మహేష్ దియోకర్ హాజరై బుద్ధవనంలోని బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతర మహాస్థూపం అంతర్భాగంలోని ధ్యాన మందిరంలో బుద్ధ జ్ఞాన జ్యోతిని వెలిగించారు. అనంతరం సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. బుద్ధుని ధమ్మ చక్ర ప్రవర్తన సారాంశాన్ని విస్తరిస్తూ అశోకుడు బౌద్ధాన్ని స్వీకరించిన రోజును ధమ్మ విజయంగా చెప్పబడుతందన్నారు. ఇదే రోజున డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించారని తెలిపారు. బౌద్ధ దమ్మంతో సహోదరతత్వం విరాజిల్లిందన్నారు. ఆనాడు పాలీ భాషలో అనేక ధర్మశాసనాలను ప్రపంచ నలుమూలలకు అశోక చక్రవర్తి విస్తరింపజేసి ప్రపంచమంతటా బుద్ధ ధమ్మ సారాంశాన్ని వ్యాప్తి చేశారని పేర్కొన్నారు. సమాజంలో అసమానతలను రూపుమాపి సమానత్వాన్ని కల్గించడం కోసం బుద్ధ దమ్మమే మార్గమని బీఆర్ అంబేడ్కర్ చాటాడని తెలిపారు. ఇలాంటి మహాత్ములు స్వీకరించిన సద్ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరముందన్నారు. వీటన్నింటికి బుద్ధవనం కేంద్రంగా నిలుస్తుందని ఆకాంక్షించారు. బుద్ధవనంలో బుద్ధుని బోధనలు తెలియజేసేలా ఒక విద్యా కేంద్రం ఏర్పాటు చేయాలని బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్యకు ఆయన సూచించారు. అనంతరం మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ.. బుద్ధవనం తెలంగాణకు లాండ్‌మార్క్‌గా నిలుస్తుందన్నారు. ప్రశాంతతకు, ధమ్మానికి, జ్ఞానానికి ప్రేరణకు మారుపేరుగా బుద్ధవనం నిలుస్తుందని పేర్కొన్నారు. ఎంజీయూలో బుద్ధిష్ట్ స్టడీస్‌లో సర్టిఫికేషన్ కోర్సు అందించేలా కృషిచేస్తామన్నారు. రాబోయే 15 ఏళ్లో బుద్ధవనం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాలని ఆకాక్షించారు. బుద్ధవనంలో విద్యా కేంద్రానికి తన వంతు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం హైదరాబాద్ రెడ్డి మహిళా కళాశాల కార్యదర్శి ముత్యంరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ సహకారంతో బుద్ధవనంలో బౌద్ధ అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశ భవిష్యత్తుకు యువతే ప్రధానమని, బౌద్ధ ధమ్మ ఆవశ్యకతను యువత తెలుసుకోవాలన్నారు. అనంతరం బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ.. బుద్ధఽ దమ్మం తెలంగాణలో ఎలా ప్రవేశించిందో వివరించారు. బుద్ధవనాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు కృషి జరుగుతుందని, ఇప్పటికే డిజిటల్ మ్యూజియం ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహాత్మా జ్యోతిబా పూలే బీసీగురుకుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మాధవీలత, బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర, నల్ల గొండ జిల్లా టూరిజం అధికారి శివాజీ, బుద్ధవనం ఆర్ట్స్ ప్రమోషన్స్ మేనేజర్ శ్యామసుందర్రావు తదితరులు పాల్గొన్నారు. పూణే విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ మహేష్ దియోకర్ బుద్ధవనంలో ఘనంగా ధమ్మ విజయ వేడుకలు -
జూబ్లీహిల్స్‌లో లాల్‌సింగ్ నాయక్ నామినేషన్
త్రిపురారం: త్రిపురారం మండలంలోని లచ్యతండా గ్రామ పంచాయతీకి చెందిన పానుగోతు లాల్‌సింగ్‌నాయక్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు గాను మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. లాల్‌సింగ్‌నాయక్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తుండగా.. గతంలో నాగార్జునసాగర్ నియోజకవర్గంలోనూ పలుమార్లు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు.షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధంనేరేడుచర్ల: షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధమైన ఘటన నేరేడుచర్ల పట్టణంలో మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు రామాపురంలో నివాసముంటున్న శ్రీరాముల వెంకటేష్ తన భార్యతో కలిసి మంగళవారం కూలీ పనులకు వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత అతడి ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు వ్యాపించాయి. ఇల్లు మొత్తం దగ్ధం కావడంతో సుమారు రూ.1.50 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితుడు పేర్కొన్నాడు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ నరసయ్య ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ద్విచక్ర వాహనంలో మంటలుహుజూర్నగర్: పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటన హుజూర్నగర్ పట్టణంలో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్నగర్ పట్టణంలోని పబ్లిక్ క్లబ్ వద్ద మూసి ఉంచిన దుకాణం వద్ద పార్కింగ్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దీంతో బైక్ సీటు, ట్యాంక్ భాగం కొంత వరకు కాలిపోయింది. స్థానికులు గమనించి మంటలను ఆర్పారు. మట్టపల్లిలో నాఖాబందీ˘మఠంపల్లి: మఠంపల్లి మండలం మట్టపల్లి వద్ద గల అంతర్ రాష్ట్ర చెక్‌పోస్ట్‌లో మంగళవారం రాత్రి స్థానిక పోలీసులు నాఖాబందీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ పి. బాబు మాట్లాడుతూ.. సరిహద్దు నుంచి గంజాయి అక్రమంగా తరలకుండా, నేరాలను అదుపు చేయడంలో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నాఖాబందీ నిర్వహించినట్లు తెలిపారు. సాగర్ వెనుక జలాల్లో యువకుడి గల్లంతుచందంపేట: నేరెడుగొమ్ము మండలం వైజాక్ కాలనీ వద్ద సాగర్ వెనుక జలాల్లో మంగళవారం ఓ యవకుడు గల్లంతయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపురం గ్రామానికి చెందిన తిన్నారపు పృథ్వీరాజ్(26) హైదరాబాద్‌లో ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. మంగళవారం తన నలుగురు స్నేహితులతో కలిసి వైజాక్ కాలనీకి వచ్చాడు. ఈ క్రమంలో పృథ్వీరాజ్ ఈత కొట్టేందుకు సాగర్ వెనుక జలాల్లోకి దిగి గల్లంతయ్యాడు. అతడి స్నేహితులు గమనించి స్థానికులకు విషయం చెప్పగా గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి వరకు గాలించినా పృథ్వీరాజ్ ఆచూకీ తెలియరాలేదని ఎస్ఐ నాగేంద్రబాబు తెలిపారు. -
హోరాహోరీగా ఉమ్మడి జిల్లా ఎస్జీఎఫ్ పోటీలు
భువనగిరి: భువనగిరి పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మైదానంలో మంగళవారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(ఎస్జీఎఫ్) వాలీబాల్ పోటీలు(అండర్–17 బాలబాలికలు)ను యాదాద్రి భువనగిరి జిల్లా డీఈఓ సత్యనారాయణ ప్రారంభించారు. ఈ పోటీల్లో బాలుర విభాగంలో యాదాద్రి భువనగిరి జిల్లా మొదటి స్థానంలో, నల్లగొండ జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచాయి. బాలికల విభాగంలో ప్రథమ స్థానంలో సూర్యాపేట జిల్లా, ద్వితీయ స్థానంలో యాదాద్రి భువనగిరి జిల్లా జట్లు నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాయి. అనంతరం పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి దశరథరెడ్డి, టీజీపీఈటీఏ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఏ. మల్లేశం, టి. చంద్రశేఖర్, రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ కార్యదర్శి నాతి కృష్ణమూర్తి, జిల్లా పీఆర్టీయూ కార్యదర్శి మధుసూదన్, వెంకట్‌రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. హుజూర్‌నగర్‌లో కబడ్డీ పోటీలు..హుజూర్నగర్: హుజూర్‌నగర్‌లోని క్యాంప్ హైస్కూల్లో మంగళవారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి ఎస్జీఎఫ్ కబడ్డీ పోటీలను(అండర్–14, 17 బాలబాలికలు) సీఐ చరమంద రాజు, ఎస్జీఎఫ్ సూర్యాపేట జిల్లా కార్యదర్శి ఎం. కిరణ్‌కుమార్ ప్రారంభించారు. ఈ పోటీల్లో అండర్–17 బాలుర విభాగంలో ప్రథమ బహుమతి నల్లగొండ జిల్లా, ద్వితీయ బహుమతి సూర్యాపేట జిల్లా, బాలికల విభాగంలో ప్రథమ బహుమతి నల్లగొండ జిల్లా, ద్వితీయ బహుమతి సూర్యాపేట జిల్లా జట్లు గెలుపొందాయి. అండర్–14 బాలుర విభాగంలో ప్రథమ బహుమతి నల్లగొండ జిల్లా, ద్వితీయ బహుమతి సూర్యాపేట జిల్లా, బాలికల విభాగంలో ప్రథమ బహుమతి నల్లగొండ జిల్లా, ద్వితీయ బహుమతి సూర్యాపేట జిల్లా జట్లు గెలుపొందినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. అండర్– 14 బాలబాలికల జిల్లా జట్లు ఈ నెల 16 నుంచి 18 వరకు సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. అదేవిధంగా అండర్–17 బాలబాలికల జట్లకు రాష్ట్రస్థాయిలో జరిగే క్రీడా పోటీల తేదీలు ప్రకటించాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సైదానాయక్, ఇన్చార్జి హెచ్ఎం జాని, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు దొంతగాని శ్రీనివాస్ గౌడ్, కోతి సంపత్‌రెడ్డి, క్రీడాకారులు సుధాకర్‌రెడ్డి, పోతురాజు రమేష్, వెంకటరత్నం, నియోజకవర్గ ఎస్జీఎఫ్ ఇన్చార్జి దేవిశెట్టి రవి, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు. -
కూడళ్ల వద్ద హైమాస్ట్ లైట్ల ఏర్పాటు
చౌటుప్పల్ రూరల్: హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారిపై నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించడానికి హైవే అథారిటీ, రోడ్డు భధ్రత అధికారులు, ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా దండుమల్కాపురం గ్రామంలోకి వెళ్లే కూడలి, బొర్రోల్లగూడెం వద్ద ఉన్న కూడలి విస్తరించేందుకు ఇప్పటికే అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. జాతీయ రహదారిపై ఉన్న కై తాపురం, పంతంగి గ్రామాల కూడళ్ల వద్ద తాజాగా హైమాస్ట్ లైట్ల ఏర్పాటు పనులు ప్రారంభించారు. హైవేపై ఉన్న బ్లాక్స్పాట్లలో ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టారు. అందులో భాగంగా మండలంలోని ధర్మాజిగూడెం స్టేజి వద్ద బ్రిడ్జి నిర్మాణ పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. -
విద్యాబోధనలో ఇబ్బంది కలగకుండా చూడాలి
భువనగిరిటౌన్ : బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో కలిసి మంగళవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, విద్యాబోధనలో ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ హనుమంత రావు, అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ పాల్గొన్నారు. ఉద్యోగులందరూ సర్వేలో పాల్గొనాలి భువనగిరిటౌన్ : రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ విజన్ – 2047 డాక్యుమెంట్ రూపొందిస్తోందని ఈ సర్వేలో ఉద్యోగులందరూ పాల్గొనాలని కలెక్టర్ హనుమంత రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందిస్తున్న ఈ విజన్–2047 డాక్యుమెంట్ తయారీలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం పొందేలా సిటిజన్ సర్వే చేపట్టారని పేర్కొన్నారు. ఈనెల 25 వరకు జరిగే సర్వేలో ఉద్యోగులు పాల్గొనడంతోపాటు ఈ సర్వే లింక్ ను, క్యూర్‌ఆర్‌కోడ్ ను తమ కార్యాలయాల్లో ప్రదర్శించి విస్తృత ప్రచారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సర్క్యూలర్ జారీ చేశారని తెలిపారు. సర్వేలో http://www.telangana.gov.in/telanganarising/ లింక్ ద్వారా పాల్గొనాలని పేర్కొన్నారు. అవగాహన కల్పించాలి బీబీనగర్: రెవెన్యూ చట్టంలోని నూతన విధానాలు, భూ సంస్కరణలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. మంగళవారం బీబీనగర్ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. భూ సమస్యలను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ శ్యాంసుందర్‌రెడ్డి, డీటీ భగత్ తదితరులున్నారు. షోకాజ్ నోటీసులు జారీ బీబీనగర్: భూ సర్వేలకు ఎక్కువ సమయం తీసుకోవడం, సర్వే చేసిన వాటిని కావాలనే తిరస్కరించడంపై ఫిర్యాదులు రావడంతో మండల సర్వేయర్ అనితకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గూడూరు గ్రామంలోని పల్లె దవాఖానాను పరిశీలించేందుకు వెళ్లగా ఆస్పత్రి మూసి ఉండడంతో ఎంఎల్‌హెచ్‌పీకి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా బీబీనగర్ ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన పోషణ మాస కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. గురుకుల పాఠశాలల్లో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తులుభువనగిరి: 2025–26 విద్యా సంవత్సరానికిగాను తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5 నుంచి 9వ తరగతిలో మిగిలిపోయిన సీట్ల భర్తీకి విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల జిల్లా సమన్వయ అధికారి వెంకన్న మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు గత ఫిబ్రవరిలో నిర్వహించిన ప్రవేశ పరీక్షకు హాజరై ఉండాలని పేర్కొన్నారు. అర్హత కలిగిన విద్యార్థులు ఈనెల 15, 16, 17వ తేదీల్లో భువనగిరి పట్టణంలోని బైపాస్ రోడ్డు పక్కన గల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో దరఖాస్తులను సమర్పించాలని కోరారు. గాలికుంటు నివారణకు నేటి నుంచి టీకాలుభువనగిరిటౌన్ : పశువులకు గాలికుంటు నివారణ టీకాల పంపిణీ కార్యక్రమానికి పశుసంవర్ధక శాఖ సిద్ధమైంది. బుధవారం నుంచి నవంబర్ 15 వరకు నెల రోజుల పాటు 70శాతం టీకాలు అంటే 1,37,200 డోసులు పశువులకు వేయనున్నారు. 47 ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి 74 పశు వైద్య శాలల పరిధిలో టీకాలు వేయనున్నారు. పశు వైద్యశాఖ డాక్టర్లతో సమావేశం భువనగిరిలోని పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో పశు సంవర్ధక శాఖ జిల్లా అధికారి డాక్టర్ జానయ్య ప్రాంతీయ పశు వైద్యశాఖ డాక్టర్లతో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాదగిరిగుట్ట మండలం చొల్లేరు గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్‌తో కలిసి అధికారికంగా ప్రారంభించేందుకు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో టీకాల పంపిణీ ప్రక్రియను స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ప్రారంభించాలని పేర్కొన్నారు. -
పాటిమట్లలో బునాదిగాని కాల్వ భూసేకరణ సర్వే
మోత్కూరు : బునాదిగాని కాల్వ భూ సేకరణకుగాను మోత్కూరు మండలం పాటిమట్ల గ్రామ రెవెన్యూ పరిధిలో మంగళవారం భూసేకరణ విభాగం ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ జగన్నాథరావు సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాటిమట్ల గ్రామంలో 92, 95 తదితర సర్వే నంబర్ల పరిధిలో 17.24 ఎకరాల్లో భూ సేకరణ కోసం ప్రాథమిక నివేదిక, కబ్జా, టైటిల్ డీడ్ నిర్దారణ, పట్టాదారుడి నిర్దారణ చేసినట్లు ఆయన తెలిపారు. దీని పరిధిలో 50 మందికి పైగా రైతుల వివరాలు అడిగి తెలుసుకున్నామని పేర్కొన్నారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే దరఖాస్తులు ఇవ్వాలని, వాటిని జిల్లా ఉన్నతాధికారులు, కలెక్టర్ పరిశీలిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా కొంత మంది రైతులు గతంలో బృందావన్ కాల్వ కోసం తమ భూములు పోయాయని, తిరిగి బునాదిగాని కాల్వ కోసం తమ భూములు కోల్పోతున్నామని డిప్యూటీ కలెక్టర్‌తో వాదనకు దిగారు. పాత అలైన్మెంట్ మేరకే సర్వే చేయాలని పట్టుబట్టారు. ఈమేరకు సుకన్య, మారుపాక భిక్షం, మారుపాక మంగమ్మ, చల్లా రామయ్య, చల్లా యాదయ్య, గొలుసుల ముత్తయ్య, గొలుసుల సోమయ్య, రాణిలతో పాటు 20 మంది రైతులు వినతిపత్రం అందజేశారు. భూసేకరణ విభాగం ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ వెంట తహసీల్దార్ జ్యోతి, భూసేకరణ డిప్యూటీ తహసీల్దార్ జయపాల్‌రెడ్డి, ఐబీ ఏఈ తరుణ్, ఆర్ఐ సుమన్, సర్వేయర్ ఖాజాఫరిదోద్దిన్, జీపీఓ నర్సింహ, హెచ్ఈఓ అరూరు నర్సింహ, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎల్లేష్ ఉన్నారు. -
జీఎస్టీ తగ్గినా..
కొనుగోళ్లు పెరగలే!సాక్షి ప్రతినిధి, నల్లగొండ : కేంద్ర ప్రభుత్వం వాహనాలపై జీఎస్టీ తగ్గించినా వాహన కొనుగోలుదారుల్లో పెద్దగా ఉత్సాహం కనిపించలేదు. జీఎస్టీ తగ్గింపు అమల్లోకి వచ్చి 25 రోజులు గడిచినా వాహన కొనుగోళ్లలో పెద్దగా తేడా లేదు. ఉమ్మడి జిల్లాలో జీఎస్టీ తగ్గక ముందు 20 రోజుల్లో కొనుగోలు చేసిన వాహనాల సంఖ్య, జీఎస్టీ తగ్గింపు అమల్లోకి వచ్చిన తరువాత 20 రోజుల్లో జరిగిన వాహన కొనుగోళ్లను పోల్చితే కాస్త తగ్గాయి 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గిన జీఎస్టీ కేంద్ర ప్రభుత్వం వాహనాలపై ఉన్న జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. దీంతో దసరాకు పెద్ద ఎత్తున వాహనాలు కొనుగోలు చేస్తారని అంతా భావించారు. కార్ల కేటగిరీని బట్టి రూ.50 వేల నుంచి రూ.లక్షన్నర వరకు ధరలు తగ్గాయి. ఇక బైక్‌లపైనా రూ.4 వేల నుంచి మొదలుకొని బైక్‌ను బట్టి రూ.15 వేల వరకు ధర తగ్గింది. అయినా కూడా వాహన కొనుగోళ్లపై ప్రజలు ధర తగ్గింపు విషయంలో ఆసక్తి కనబరచలేదు. జీఎస్టీ తగ్గడానికి ముందే అధికంగా కొనుగోళ్లు చాలా మంది దసరాకు ముందే వాహనాల కొనుగోలు కోసం అడ్వాన్స్‌లు కట్టి తెప్పించుకున్నారు. దసరా పండుగకు వాహనాలు దొరక్కపోతే ఇబ్బంది అవుతుందని, చాలా మంది రెండు నెలల ముందుగానే బుకింగ్ చేసుకున్నారు. ఈలోగా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గించింది. అది కూడా బుక్ చేసుకున్న వాహనాలకు వర్తించింది. అయితే జీఎస్టీ తగ్గించిన తరువాత ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు పుంజుకోలేదు. జీఎస్టీ కంటే ముందు 20 రోజుల్లో కొనుగోలు చేసిన వాహనాల కంటే జీఎస్టీ తగ్గింపు అమల్లోకి వచ్చిన తరువాత కొనుగోలు చేసిన వాహనాల సంఖ్య తక్కువగానే ఉంది.ఉమ్మడి జిల్లాలో పుంజుకోని వాహనాల కొనుగోలు ఫ జీఎస్టీ తగ్గుదలకు ముందు, తరువాత విక్రయాల్లో కనిపించని తేడా ఫ దసరాకు ముందే బుక్ చేసుకున్న వినియోగదారులు ఫ ధరలు తగ్గినా కనిపించని ఉత్సాహం ఉమ్మడి జిల్లాలో వాహన రిజిస్ట్రేషన్లు ఇలా..జీఎస్టీ తగ్గింపునకు ముందు.. జిల్లా కార్లు బైకులు మిగతావి యాదాద్రి 81 546 218 నల్లగొండ 64 505 473 సూర్యాపేట 45 386 316 జీఎస్టీ తగ్గింపు తరువాత..జిల్లా కార్లు బైకులు మిగతావి యాదాద్రి 54 451 181 నల్లగొండ 60 528 450 సూర్యాపేట 37 345 285 సాధారణంగా ఎక్కువ మంది వాహనాలను దసరాకు కొనుగోలు చేస్తారు. దసరా సమయంలో కొనుగోలు చేసే ప్లాన్లేని వారు దీపావళికై నా కొనుగోలు చేయాలన్న ఆలోచనతో ఉంటారు. అయితే జీఎస్టీ తగ్గి వాహనాల ధరలు తగ్గినందున ఈ దీపావళికి ఎక్కువ వాహనాలు కొనుగోలు చేయవచ్చు. అయితే వాహన కంపెనీలు ఆశించిన మేర కొనుగోళ్లు ఉంటాయా? లేదా? అన్నది ఇప్పుడే చెప్పలేం. – వాణి, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, నల్లగొండ -
రోడ్డు ప్రమాదాలు నివారించేలా..
ఆలేరు: హైదరాబాద్ – వరంగల్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నియంత్రణపై నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) దృష్టి సారించింది. ముఖ్యంగా హైవేలోని జంక్షన్ల వద్ద రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టింది. ఈమేరకు ఎన్హెచ్ఏఐ అధికారులు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశారు. గడిచిన మూడు నెలల్లో 15 ప్రమాదాలు.. ముగ్గురు మృతి ఆలేరులో 11 కి.మీ. హైవే ఉంది. గడిచిన మూడు నెలల్లో ఈ హైవేపై సుమారు 15 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఇందులో ముగ్గురు మృతి చెందగా దాదాపు 20మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఎన్హెచ్ఏఐ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఇవి కారణాలు రోడ్డు ప్రమాదాలకు పలు కారణాలను పోలీసులు, ఎన్హెచ్ఏఐ అధికారులు సంయుక్తంగా గుర్తించారు. రహదారికి మధ్యలో వివిధ రకాల చెట్లు ఎత్తుగా పెరగటంతో జంక్షన్ వద్ద రోడ్డు దాటే సమయంలో వాహనాలు కనిపించక, లేదా వాహనదారులకు రోడ్డు క్రాసింగ్ చేసే వారు సడన్‌గా రావడం వల్ల రోడ్డు ప్రమాదాలకు దారితీస్తున్నట్లు విచారణలో గుర్తించారు. అదేవిధంగా జంక్షన్ల వద్ద విద్యుత్ దీపాలు లేకపోవడం మరో కారణమని అఽధికారుల దృష్టికి వచ్చింది. నివారణ చర్యలు హైవే జంక్షన్ల వద్ద రహదారి మధ్యలో చెట్ల ఎత్తును తగ్గించాలని ఎన్హెచ్ఏఐ నిర్ణయించింది. తద్వారా జంక్షన్ల నుంచి వంద మీటర్ల దూరం వరకు రహదారిపై వాహనాల రాకపోకలను గమనించి, రోడ్డు క్రాస్ చేసే వీలు కలగనుంది. దీంతో ప్రమాదాల నియంత్రణకు ఆస్కారం ఉంది. ఈ ప్రక్రియను అధికారులు మొదలు పెట్టారు. అదేవిధంగా హైవే జంక్షన్ల వద్ద విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసే దిశగా ఎన్హెచ్ఏఐ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రాత్రి వేళ జంక్షన్ల వద్ద రోడ్డు క్రాస్ చేసే సమయంలో రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా వాహనాల రాకపోకలను నిశితంగా గమనించే అవకాశం కలుగుతుంది. వాహనదారులను అప్రమత్తం చేసే విధంగా రోడ్డు హద్దులు తెలియడానికి రేడియంతో కూడిన రోడ్ స్టడ్స్, వైట్ రోడ్ మార్కింగ్ పనులు ఎన్హెచ్ఏఐ చేస్తోంది. ఆలేరులోని నేషనల్ హైవే జంక్షన్లో ఏర్పాటు చేసిన రేడియంతో కూడిన రోడ్ స్టడ్స్ ఆలేరులో రహదారి మధ్యలో మొక్కలను కట్ చేస్తున్న సిబ్బంది హైవేలోని జంక్షన్ల వద్ద ప్రమాదాల నియంత్రణపై ఎన్హెచ్ఏఐ దృష్టి రహదారి మధ్యలో చెట్ల ఎత్తును తగ్గిస్తున్న సిబ్బంది రోడ్డు హద్దులు తెలిసేలా రేడియంతో కూడిన రోడ్ స్టడ్స్, వైట్ రోడ్ మార్కింగ్ అధికారులతో చర్చిస్తున్నాం హైవేపై రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఎన్హెచ్ఏఐ అధికారులతో మాట్లాడాం. వారితో కలిసి ప్రమాదాలకు కొన్ని కారణాలను గుర్తించాం. ఎన్హెచ్ఏఐ అధికారులు రోడ్డు ప్రమాద నివారణ పనులపై దృష్టి పెట్టారు. – వినయ్, ఆలేరు ఎస్ఐ -
గమనించకపోతే ప్రమాదమే..
భూదాన్‌పోచంపల్లి : మండలంలోని జూలూరు–రుద్రవెల్లి గ్రామాల మధ్య ఉన్న లోలెవల్ బ్రిడ్జి రాళ్లుతేలి ప్రమాదకరంగా మారింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మూసీ ఉప్పొంగి ప్రవహించడంతో బ్రిడ్జిలోని కొంత భాగం ధ్వంసమైంది. భూదాన్‌పోచంపల్లి, బీబీనగర్ మండలాల వారు ఈ దారిలో రాకపోకలు సాగిస్తుంటారు. వాహనదారులను అప్రమత్తం చేసేందుకు అధికారులు అక్కడ రాళ్లను అడ్డంగా పెట్టారు. రాత్రి వేళ్లల్లో రాళ్లను గమనించకపోతే వాహనదారులు మూసీలో పడిపోయే ప్రమాదం ఉంది. అధికారులు వంతెనకు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ధ్వంసమైన జూలూరు, రుద్రవెల్లి బ్రిడ్జి -
నిధుల విడుదల చేయాలని సీఎంను కోరిన ఎమ్మెల్యేలు
సాక్షి, యాదాద్రి: ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయాలని కోరుతూ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లోని సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. గంధమల్ల రిజర్వాయర్ భూసేకరణకు రూ.50 కోట్లు కావాలని కోరినట్లు బీర్ల ఐలయ్య తెలిపారు. ఈమేరకు నిధులు విడుదల చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. మూసీ నదిపై రుద్రవెల్లి– జూలూరు మధ్యన బ్రిడ్జి నిర్మాణానికి హెచ్ఎండీఏ నిధులు రూ. 27.50 కోట్లు విడుదల చేస్తానని సీఎం చెప్పారని కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. -
దత్తన్నా.. సమస్య తీర్చన్నా
ఎయిమ్స్ వైద్య కళాశాల సందర్శనకు వచ్చిన హర్యానా మాజీ గవర్నర్ దత్తాత్రేయను చూసిన ఓ గర్భిణి ఆయన వద్దకు వచ్చి ఆస్పత్రిలోని సమస్యలు చెప్పి ఆవేదన వ్యక్తం చేసింది. క్యూలైన్లలో వేచి వుండలేక అవస్థలు పడుతున్నాం, మా సమస్య తీరేలా చొరవ చూపండి అంటూ మొరపెట్టుకుంది. అందరితో పాటు గర్భిణులు కూడా లైన్లలో గంటల తరబడి వేచి వుండాల్సి వస్తుంది, రోజులు తరబడి రిపోర్టుల కోసం ఎదురు చూడాల్సి వస్తుందని వాపోయింది. గర్భిణుల కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయించి సమస్యను తీర్చాలని వేడుకుంది. అక్కడే ఉన్న డిప్యూటీ డైరెక్టర్ బిపిన్ వర్గీస్, మెడికల్ సూపరింటెండెంట్ మహేశ్వర్‌రెడ్డికి దతాత్రేతయ సూచించగా గర్భి ణుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. -
ఓపీ కోసం టోకెన్ విధానం తేవాలి
బీబీనగర్: రోగులు గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడకుండా టోకెన్ సిస్టం తీసుకురావాలని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఎయిమ్స్ అధికారులకు సూచించారు. సోమవారం బీబీనగర్ ఎయిమ్స్‌ను ఆయన సందర్శించారు. ఓపీ విభాగం వద్ద క్యూలైన్లలో నిల్చున్న రోగులతో మాట్లాడగా పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. గంటల తరబడి లైన్లో నిలబడవలసి వస్తుందని మొరపెట్టుకున్నారు. దత్తాత్రేయ స్పందించి తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామి వారి దర్శనం కోసం భక్తులకు టోకెన్లు జారీ చేస్తున్న విధంగా ఎయిమ్స్‌కు వచ్చే రోగులకు ఆ తరహా విధానం అమల్లోకి తీసుకువస్తే బాగుంటుందన్నారు. టోకెన్ ఇవ్వడం వల్ల రోగులు ముందే వచ్చి గంటల తరబడి వేచివుండే పనిలేకుండా సమయానుకూలంగా క్యూలెన్కు వెళ్తారని పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఎయిమ్స్‌కు ఎలక్ట్రిక్ బస్సుల ఏర్పాటుకు స్వచ్ఛంద సంస్థల ద్వారా కృషి చేస్తానన్నారు. అంతకుముందు ఎయిమ్స్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ శాంతాసింగ్తో సమావేశమై ఎయిమ్స్‌లో జరుగుతున్న పనులు, వైద్యసేవల గురించి తెలుసుకున్నారు. ఫైర్‌స్టేషన్, ఉప్పల్‌నుంచి ప్రత్యేక బస్సుల సౌకర్యం కల్పించేలా చూడాలని దత్తాత్రేయకు వైద్యులు విన్నవించారు. అనంతరం ఎంబీబీఎస్ వి ద్యార్థులతో సమావేశం అయ్యారు. అంకితభావంతో పనిచేయాలని, రోగుల పట్ల బాధ్యతాయుతంగా మెలగాలని.. అప్పుడే జాతీయస్థాయిలో బెస్ట్ వైద్య కళాశాలగా బీబీనగర్ ఎయిమ్స్ నిలుస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం అవసరం పేద ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహకారం ఎంతో అవసరమని దత్తాత్రేయ అన్నారు. ఎయిమ్స్‌లో వైద్య సేవలు పొందే రోగుల సంఖ్య వేలల్లో పెరుగుతున్నందున సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఎయిమ్స్ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ తీసుకొని.. ఇక్కడ కావాల్సిన ఫైర్ స్టేషన్, బస్సుడిపో సౌకర్యం కల్పించాల్సిన అ వసరం ఉందన్నారు. దివంగత సీఎం రాజశేఖరరెడ్డి 2009లో నిమ్స్‌కు భీజం వేయడంతో ఇప్పుడు ఎయిమ్స్‌గా మారిందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఏపీకి మాత్రమే ఎయిమ్స్ మంజూరైందని, కానీ ప్రధాని మోదీ తెలంగాణకు కూడా ఎయిమ్స్‌ను బహుమతిగా ఇచ్చారని అన్నారు. ఎయిమ్స్‌లోని ఎమర్జెన్సీ సేవలు, పెండింగ్‌లో ఉన్న ఇతర విషయాలు, కావాల్సిన సౌకర్యాల విషయాలను ప్రధాన మంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎయిమ్స్ డీన్ నితిన్అశోక్జాన్, డిప్యూటీ డైరెక్టర్ బిపిన్ వర్గీస్, మెడికల్ కళాశాల సూపరింటెండెంట్ మహేశ్వర్‌రెడ్డి, ఓఎస్డీ ప్రశాంత్, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ విశాక్జైన్, గోవర్దన్ తదితరులు పాల్గొన్నారు. ఫ హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఫ ఎయిమ్స్ వరకు ఎలక్ట్రిక్ బస్సులు ఏర్పాటు చేయిస్తా -
గంజాయి, డ్రగ్స్ కట్టడికి చర్యలు
సాక్షి,యాదాద్రి: గంజాయి, డ్రగ్స్ కట్టడికి పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీస్, ఎకై ్సజ్, డ్రగ్స్ ఇన్స్పెక్టర్, వైద్య, విద్య, అటవీ, ఆర్టీసీ అధికారులు సమన్వయం చేసుకొని గంజాయిరహిత జిల్లాగా మార్చాలని కోరారు. చెక్‌పోస్ట్‌ల్లో నిఘా పెంచాలని, గంజాయి సాగును గుర్తించాలని సూచించారు. యువత, విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వాటివల్ల కలిగే అనర్థాలపై ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని సూచించారు. ము ఖ్యంగా కళాశాలల వద్ద ఎక్కువ ఫోకస్ పెట్టాలని పేర్కొన్నారు. పోలీస్, ఎక్సైజ్ అధికారులు నిరంతర తనిఖీలు నిర్వహిస్తుండాలని స్పష్టం చేశారు. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు కన్నేసి ఉంచాలని, చెడు అలవాట్లకు లోనవకుండా గమనిస్తుండాలన్నారు. డీసీపీ అక్షాంశ్‌యాదవ్ మాట్లాడుతూ.. డ్రగ్స్ నియంత్రణలో పోలీస్ శాఖ సహకారం ఎల్లవేళలా ఉంటుందన్నారు. ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్‌ల వద్ద పటిష్ట నిఘా ఉంచామని తెలిపారు. సెప్టెంబర్‌లో రెండు గంజాయి కేసులను గుర్తించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీఓలు కృష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డి, ఎకై ్స జ్ సూపరింటెండెంట్ విష్ణుమూర్తి, డీఎఫ్ఓ పద్మజ తదితరులు పాల్గొన్నారు. భువనగిరిటౌన్ : ధాన్యం పక్వానికి రాకముందే వరి కోతలు చేపట్టవద్దని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వరికోత యంత్రాల యజమానులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ అధికారులు సూచన మేరకు వరి కోతలు చేపట్టాన్నారు. హార్వెస్టర్ యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు. వ్యవసాయ అధికారుల పనితీరు బాగుందని, రాష్ట్రంలో అంతటా యూరియా కొరత ఉన్నా మన జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో పని చేయాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లలో దళారుల ప్రమేయం లేకుండా చూడాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, అదనపు డీసీపీ లక్ష్మీనారా యణ, ఏసీపీలు మధుసూదన్‌రెడ్డి, శ్రీనివాసనాయుడు, ప్రభాకర్‌రెడ్డి, డీఆర్ఓ జయమ్మ, ఆర్డీఓ కృష్ణారెడ్డి, డీఆర్డీఓ నాగిరెడ్డి, సివిల్ సప్లై అధికారి రోజారాణి, జిల్లా వ్యవసాయ అధికారి వెంకట రమణారెడ్డి పాల్గొన్నారు.ఫ కలెక్టర్ హనుమంతరావు -
పాముకుంట సీఎస్పీ తొలగింపు
రాజాపేట : మండలంలోని పాముకుంట గ్రామానికి చెందిన సీఎస్పీ(కస్టమర్ సర్వీస్ పాయింట్) నిర్వాహకుడు భద్రారెడ్డిని బాధ్యతల నుండి తొలగిస్తున్నట్లు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ నాగలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మరో గ్రామానికి చెందిన సీఎస్పీ విధులు నిర్వహిస్తాడని పేర్కొన్నారు. ఇక ముందు తెలంగాణ గ్రామీణ బ్యాంకు నిర్వహించే లావాదేవీలతో భద్రారెడ్డికి సంబంధం ఉండదని, ఖాతాదారులు గమనించాలని కోరారు. 508 దరఖాస్తులు భువనగిరి: మద్యం టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. సోమవారం సాయంత్రం వరకు మొత్తం 508 దరఖాస్తులు వచ్చినట్లు ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. దరఖాస్తు గడువు ఈనెల 18తో ముగియనుందన్నారు. కాగా మద్యం టెండర్లు పిలిచి 18 రోజులు గడుస్తున్నా ఆశించినస్థాయిలో దరఖాస్తులు రావడం లేదు. టెండర్ ఫీజు రూ.3 లక్షలకు పెంచడం కారణంగా చెప్పుకుంటున్నారు. శివాలయంలో సంప్రదాయ పూజలు యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి అనుబంధంగా ఉన్న శ్రీపర్వత వర్థిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం సంప్రదాయ పూజలు నిర్వహించారు. రుద్రాభిషేకం, బిల్వార్చన, ఆలయ ముఖ మండపంలోని స్పటిక లింగానికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఇక ప్ర ధానాలయంలో నిత్యారాధనలు కొనసాగాయి. వేవకుజామున సుప్రభాతసేవ, గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, అర్చన చేశారు. అనంతరం ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజవాహన, నిత్యకల్యాణం,జోడు సేవోత్సవం పూజలు నిర్వహించారు. 15 నుంచి గాలికుంటు నివారణ టీకాల పంపిణీ భువనగిరిటౌన్ : పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణకు ఈనెల 15నుంచి నవంబర్ 14వ తేదీ వరకు క్యాంప్‌లు నిర్వహించి టీకాలు వేయనున్నట్లు జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ జానయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 47 బృందాలు క్యాంపుల్లో పాల్గొంటాయన్నారు. ఈ శిబిరాలను పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గాంధీ విగ్రహాల సేకరణ చండూరు : గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ స్వర్ణోత్సవాల్లో భాగంగా గాంధీజీ లక్ష విగ్రహాల సేకరణ కార్యక్రమాన్ని చండూరులోని గాంధీజీ విద్యాసంస్థల నుంచి ప్రారంభిస్తున్నట్లు గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థ వైస్ చైర్మన్ యానాల ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. సోమవారం పాఠశాలలో లక్ష విగ్రహాల సేకరణ కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో స్థానం దక్కేలా ఈ లక్ష విగ్రహాల సేకరణ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ట్రస్మా నల్ల గొండ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు 10 విగ్రహాలకు గాను రూ.15వేల విరాళంప్రభాకర్రెడ్డికి అందజేశారు. -
దీపావళి డెడ్‌లైన్..
ఆలేరు: పెండింగ్ పాల బిల్లుల సాధన ఐక్య ఉద్యమానికి పాడి రైతులు సిద్ధం అయ్యారు. పెండింగ్ పాలబిల్లుల చెల్లింపునకు మదర్ డెయిరీకి దీపావళి డెడ్‌లైన్ విధించారు. అప్పటికీ స్పందన రానిపక్షంలో ప్రభుత్వంతో పాటు మదర్ డెయిరీపై ఒత్తిడి పెంచేందుకు సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే, మంత్రుల ఇళ్లతో పాటు కలెక్టరేట్, సచివాలయం ముట్టడి కార్యక్రమాలను దశలవారీగా చేపట్టాలని నిర్ణయించారు. సోమవారం ఆలేరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని రైతులు, అఖిలపక్ష నాయకులు, పాలసంఘాల చైర్మన్లు ము ట్టడించారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌కు వినతిపత్రం అంటించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆలేరులోని పాలశీతలీకరణ కేంద్రంలో పాడి రైతులు, పాల సంఘాల చైర్మన్లు అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. హామీలను విస్మరించారు మదర్ డెయిరీలో అవినీతి పెరిగిపోవడమే రైతులకు పాల బిల్లులు రూ.కోట్లలో పేరుకుపోయాయని రౌండ్ టేబల్ సమావేశంలో పాడి రైతులు, పాల సంఘాల చైర్మన్లు విమర్శించారు. ఉమ్మడి జిల్లా మంత్రులు, ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మదర్ డెయిరీ ఎన్నికల సమయంలో పాల బిల్లలు పెండింగ్ లేకుండా చూస్తామని, అన్నివిధాలా సహకారం అందిస్తామని ఇచ్చిన హామీని విస్మరించారని మండిపడ్డారు. ఏడు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రభుత్వం ప్రకటించిన రూ.5 ఇన్సెంటివ్ కూడా చెల్లించలేదన్నారు. రైతుల సమస్యల పరిష్కరించడమంలో విఫలమైన మదర్‌డెయిరీ చైర్మన్ పదవికి మధుసూదన్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పాడి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం గ్రాంట్ విడుదల చేయాలన్నారు. విజయడెయిరీని ప్రోత్సహించాలనే ఆలోచనతో మదర్‌డెయిరీని నిర్వీ ర్యం చేసే కుట్రలు జరుగుతున్నట్టు రైతులు ఆరోపించారు. మదర్‌డెయిరీని విక్రయించాలనే ప్రయత్నాలను అడ్డుకుంటామన్నారు.మదర్ డెయిరీ మాజీ చైర్మన్ శ్రీకర్‌రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని 12మంది ఎమ్మెల్యేలు పాడి రైతుల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని గ్రాంట్ అడగాలన్నారు. నష్టాలతో సంస్థ మూసివేసే పరిస్థితిలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్లూరి రాంచంద్రారెడ్డి మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా పాడి రైతులు సంఘటితంగా పోరాటం చేయాలని, ఇందులో కాంగ్రెస్ కూడా పాల్గొనవచ్చన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, మదర్‌డెయిరీ డైరెక్టర్ భాస్కర్‌గౌడ్, ఆలేరు,యాదగిరిగుట్ట పీఏసీఎస్ చైర్మన్లు మల్లేష్‌గౌడ్,రామ్‌రెడ్డి, మాజీ డైరెక్టర్ దొంతిరి సోమిరెడ్డి, అఖిలపక్ష నాయకులు మంగ నర్సింహులు,పుట్ట మల్లేష్,గంగుల శ్రీనివాస్‌యాదవ్,ఆర్.జనార్థన్,నందగంగేష్, తునికి దశరథ,చెక్క వెంకటయ్య,మామిడాల సోమయ్య,జంగస్వామి, లక్ష్మీప్రసాద్‌రెడ్డి, సూదగాని సత్యరాజయ్య,చాడ సురేందర్‌రెడ్డి, రాంగోపాల్‌రెడ్డి, పాల సంఘాల చైర్మన్లు, పాడి రైతులు పాల్గొన్నారు.ఫ కన్వీనర్‌గా కొండల్‌రెడ్డి మదర్ డెయిరీ పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ కన్వీనర్‌గా బొళ్ల కొండల్‌రెడ్డి, కో–కన్వీనర్లుగా లింగాల శ్రీకర్‌రెడ్డి, రంగారెడ్డి, సందిల్ల భాస్కర్, దొంతిరి సోమిరెడ్డి, చింతపురి వెంకట్రామిరెడ్డి, కస్తూరి పాండు, ఒగ్గు బిక్షపతి, మంగనర్సింహులు, కళ్లెపు అడవయ్య, చెక్క వెంకటేష్, గంగుల శ్రీనివాస్, రాంగోపాల్‌రెడ్డి, కాదూరి అచ్చయ్య, గడ్డం నాగరాజు, మటూరి బాల్‌రాజు, బబ్బూరి పోశెట్టి,కొల్లూరి రాజయ్య, ఇమ్మడి రామిరెడ్డి, కామిటికారి కృష్ణ ఎన్నియ్యారు.పాలబిల్లుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు కార్యాచరణ ఫ ఐక్య ఉద్యమానికి పాడి రైతులు సిద్ధం ఫ దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు మదర్‌డెయిరీ పరిక్షణతోపాటు పాడి రైతులను ఆదుకునేందుకు మంత్రి కిషన్‌రెడ్డి ద్వారా కేంద్రం దృష్టికి తీసుకువెళతానని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు తెలిపారు. ఉమ్మడి జిల్లా మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి,ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పేరుకే ఉన్నత హోదాలో ఉన్నారని, పాడి రైతులకు ఏం చేయలేనప్పుడు రైతుల గురించి మాట్లాడే హక్కు వారికి లేదన్నారు. -
గుంతలో పడిన లారీ.. డ్రైవర్‌కు గాయాలు
పెద్దవూర: జడ్చర్ల–కోదాడ జాతీయ రహదారిపై పెద్దవూర మండల కేంద్రంలోని వై జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు మూడేళ్లుగా కొనసాగుతున్నాయి. వాహనాలు రాకపోకలు కొనసాగించేందుకు వీలుగా రోడ్డుకు రెండు వైపులా సర్వీస్ రోడ్డు నిర్మించి మధ్యలో పెద్ద గుంతను తీశారు. ఆదివారం రాత్రి ఓ లారీ నేరుగా వచ్చి ఈ గుంతలో పడిపోయింది. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సంబంధిత కాంట్రాక్టర్ గుంత సమీపంలో కేవలం చిన్నపాటి హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేయడంతో మిర్యాలగూడ వైపు నుంచి వచ్చే వాహనదారులకు దగ్గరకు వచ్చే దాకా గుంత కనిపించడం లేదు. గతంలోనూ ద్విచక్ర వాహనాలు, లారీలు, కార్లు సైతం నేరుగా వచ్చి గుంతలో పడిపోయిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇద్దరు ద్విచక్ర వాహనదారులు సైతం మృతిచెందారు. సర్వీస్ రోడ్డు ప్రారంభమయ్యే ప్రదేశంలో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు. -
ఉద్యోగాల కల్పనే లక్ష్యం
హుజూర్నగర్: తెలంగాణలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఈ నెల 25న హుజూర్‌నగర్‌లో నిర్వహించనున్న మెగా జాబ్‌మేళా ఏర్పాట్లను సోమవారం ఆయన పరిశీలించారు. అనంతరం తన క్యాంపు కార్యాలయంలో అధికారులు, వివిధ కంపెనీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో హుజూర్‌నగర్‌లోని పెర్ల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ జాబ్ మేళాకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ముఖ్యఅతిథిగా హాజరవుతున్నట్లు చెప్పారు. సింగరేణి కంపెనీ, పరిశ్రమల శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాలో ఐటీ, సేవా, నిర్మాణ, వాణిజ్య, ఫార్మా రంగాలకు చెందిన 150 కంపెనీలు పాల్గొంటాయని, సుమారు 3వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వివరించారు. 2018 నుంచి పది, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏలో ఉత్తీర్ణులైనవారు, అలాగే 2026లో ఉత్తీర్ణత సాధించబోయే వారు జాబ్ మేళాలో పాల్గొనేందుకు అర్హత ఉంటుందని తెలిపారు. డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ (డీఈఈటీ) ప్రతినిధి వంశీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. జాబ్ మేళా పోస్టర్‌ను మంగళవారం మంత్రి చేతులమీదుగా ఆవిష్కరించి క్యూఆర్ కోడ్ ద్వారా నిరుద్యోగ యువత రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. అభ్యర్థులకు ముందుగానే ఏ కంపెనీకి అర్హత ఉందో తెలిపే విధంగా హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తామన్నారు. నిరుద్యోగులు 3 నుంచి 5 కంపెనీల ఇంటర్వ్యూలకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. అభ్యర్థులు తమ రెజ్యూమే 5 జిరాక్స్ కాపీలను తీసుకొని జాబ్ మేళాకు రావాలని స్పష్టం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్డీఓ శ్రీనివాసులు, డీఈటీ అడిషనల్ ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ చంద్రశేఖర్, డీఐసీ జీఎం సీతారాంనాయక్, సింగరేణి కంపెనీ ప్రతినిధులు శ్రీకాంత్, చందర్, జిల్లా ఉపాధి కల్పన అధికారి శంకర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
కారును వెనుక నుంచి ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు
● ఒకరికి గాయాలు చౌటుప్పల్ రూరల్: హైదరాబాద్ వైపు వెళ్తున్న కారును ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటన విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామ శివారులో సోమవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వలిగొండ మండలం జంగారెడ్డిపల్లికి గ్రామానికి చెందిన బొంత నర్సింహ, పల్లపు రాజు కారులో ఏపీలోని నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా.. మార్గమధ్యలో చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామ శివారులోకి రాగానే కారును వెనక నుంచి ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పల్లపు రాజు గాయపడ్డారు. బొంత నర్సింహ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కుసుమ ఉపేందర్‌రెడ్డి తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి కొండ దిగువన కల్యాణకట్ట వద్ద సోమవారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. యాదగిరిగుట్ట పట్టణ సీఐ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. కల్యాణకట్ట వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానిక పోలీసులు అక్కడకు వెళ్లి పరిశీలించి మృతుడి ఎడమ చేతికి బొటన వేలు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. మృతుడి సుమారు 40 నుంచి 45 ఏళ్లు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. కల్యాణకట్ట శానిటరీ సూపర్వైజర్ పాండురాజు శేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ భాస్కర్ వెల్లడించారు. -
బుద్ధవనాన్ని సందర్శించిన సీడబ్ల్యూసీ డైరెక్టర్
నాగార్జునసాగర్ : సెంట్రల్ వాటర్ కమిషన్(సీడబ్ల్యూసీ) డైరెక్టర్ ఆశిష్ కుమార్, డిప్యూటీ డైరెక్టర్ రోహిత్‌సింగ్ సోమవారం నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని సందర్శించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిశీలనకై వచ్చిన వారు బుద్ధవనాన్ని సందర్శించి బుద్ధుని పాదుకల వద్ద పుష్పాంజలి ఘటించారు. మహాస్థూపంలోని ధ్యాన మందిరంలో గల ధ్యానం చేశారు. వీరికి బుద్ధవనం అధికారులు శాసన, రవిచంద్ర బుద్ధవనానికి సంబంధించి బ్రోచర్లను అందజేశారు. సమావేశ మందిరంలో బుద్ధవనం వీడియోను వీక్షించారు. వీరి వెంట సాగర్ డ్యాం ఏఈలు కృష్ణయ్య, స్వర్ణ తదితరులు ఉన్నారు. -
‘జూబ్లీహిల్స్’లో మంచ్యాతండా వాసి నామినేషన్
మఠంపల్లి: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగనున్న ఉపఎన్నికలో పోటీ చేసేందుకు సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మంచ్యాతండాకు చెందిన ఓయూ జేఏసీ ఉపాధ్యక్షుడు, స్థానిక గుర్రంబోడు భూపరిరక్షణ సమితి అద్యక్షుడు సపావట్ సుమన్‌నాయక్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర కేబినేట్లో లంబాడీలకు చోటు కల్పించాలని, గుర్రంబోడు భూముల్లో గిరిజనులకు పట్టాలివ్వాలని కోరారు. అదే విధంగా లంబాడీలకు, ఆదివాసీలకు నడుమ నెలకొన్న సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. -
బాలాజీపై ఒక్కరోజే 112 ఫిర్యాదులు
పెద్దఅడిశర్లపల్లి : అధిక వడ్డీ ఆశ చూపి అమాయక ప్రజలను మోసం చేసిన వడ్డీ వ్యాపారి బాలాజీనాయక్‌పై సోమవారం ఒక్కరోజూ 112 ఫిర్యాదులు అందాయి.ఇ సోమవారం గుడిపల్లి పోలీస్‌స్టేషన్‌కు బాధితులు అప్పు పత్రాలు, ఖాళీ చెక్కులతో తరలివచ్చారు. దీంతో గుడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 185 మంది బాధితులు బాలాజీపై ఫిర్యాదు చేసినట్లు గుడిపల్లి పోలీసులు తెలిపారు. ఈ క్యాంపును ఏఎస్పీ మౌనిక పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించి కోర్టు ద్వారా న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేసిన గుడిపల్లి పోలీసులు -
ఉమ్మడి జిల్లాలో ఒక రాజకీయ శకం ముగిసింది
భానుపురి (సూర్యాపేట): మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి మృతితో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక రాజకీయ శకం ముగిసిందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించి మాట్లాడారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సన్నబియ్యం, రేషన్ కార్డుల పంపిణీ, ఉచిత బస్సు, ధాన్యం కొనుగోళ్లు.. ఇలా అన్నింట్లోనూ ముందుందని తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలంగా నిలబెడతామని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి పేరును ముఖ్యమంత్రి ఖరారు చేశారని, రెండు రోజుల్లో జీఓ వస్తుందని తెలిపారు. ఎస్సారెస్పీ నీళ్ల కోసం రాంరెడ్డి దామోదర్‌రెడ్డి రక్త దర్పణం చేశారని, దాంతోనే ఆ నీళ్లు ఈ ఉమ్మడి నల్లగొండ జిల్లాకు వస్తున్నాయని పేర్కొన్నారు. సూర్యాపేటకు ఆరు లేన్ల రోడ్డును, రైల్వే స్టేషన్‌ను తీసుకొస్తామని తెలిపారు. అదేవిధంగా హుజూర్‌నగర్‌లో ఈ నెల 25న పెద్దఎత్తున నిరుద్యోగులకు జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పోతు భాస్కర్, పీసీసీ జనరల్ సెక్రటరీ చకిలం రాజేశ్వరరావు, ఓబీసీ నాయకుడు తండు శ్రీనివాస్‌యాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మార్కెట్ చైర్మన్లు అరుణ్ కుమార్, నరేష్ సుమతి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అనురాధ, పట్టణ పార్టీ అధ్యక్షుడు అంజద్ అలి, మండల పార్టీ అధ్యక్షులు వీరన్ననాయక్, తూముల సురేష్ రావు, కోతి గోపాల్‌రెడ్డి, కందాల వెంకట్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వేములపల్లి వాసుదేవరావు, దండి రమేష్, జిల్లా వాణిజ్య సెల్ అధ్యక్షుడు కక్కిరెని శ్రీనివాస్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అభినయ్, కోదాడ, హుజుర్నగర్ మండల, బ్లాక్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ జెండా నిలబడిందంటే రాంరెడ్డి దామోదర్రెడ్డితోనే స్థానిక సంస్ధల ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేస్తాం రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి -
బెంచ్ దిగివచ్చి.. గోడు విని..
నకిరేకల్ : ఓ కేసులో నిందితురాలుగా ఉన్న 80 ఏళ్ల వృద్ధురాలు కోర్టు మెట్లు ఎక్కలేని స్థితిలో ఉండగా.. జడ్జి స్వయంగా ఆమె వద్దకు వచ్చి స్టేట్మెంట్ తీసుకున్నారు. నల్లగొండ జిల్లా నకిరేల్ మండలం కడపర్తి గ్రామానికి చెందిన యాతాకుల రామనర్సమ్మ (80) ఓ కేసులో నిందితురాలిగా ఉంది. కేసు సోమవారం నకిరేకల్ జూనియర్ సివిల్ కోర్టులో బెంచ్‌పైకి వచ్చింది. నడవలేని స్థితిలో ఉన్న రామనర్సమ్మ.. కోర్టుకు ఆటోలో వచ్చింది. కానీ కోర్టులోకి వెళ్లలేకపోయింది. దీంతో జడ్జి షేక్ ఆరీఫ్.. ఆటోలో ఉన్న రామనర్సమ్మ దగ్గరుకు వచ్చి ఎగ్జామినేషన్ చేశారు. ఆమె చెప్పిన సమాధానాన్ని రికార్డు చేశారు. ఎఫ్‌సీఐ బీకేఎన్కే ఉమ్మడి జిల్లా కార్యవర్గం ఎన్నిక నల్లగొండ: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సీఐ) ఉద్యోగుల అనుబంధ సంఘమైన భారతీయ ఖాద్య నిగమ్ కర్మచారి (బీకేఎన్కే) సంఘం ఉమ్మడి జిల్లా కార్యవర్గాన్ని ఆ యూనియన్ తెలంగాణ ప్రాంత సీనియర్ ఉపాధ్యక్షుడు సతీష్‌రెడ్డి, సీనియర్ అదనపు కార్యదర్శి రాహుల్ ఆధ్వర్యంలో సోమవారం నల్లగొండలోని ఎఫ్‌సీఐ కార్యాలయంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గోపయ్య, కార్యదర్శిగా శ్రీకాంత్‌రెడ్డి, మరికొందరు సభ్యులుగా ఎన్నికయ్యారు. నూతన అధ్యక్ష, కార్యవర్శులు మాట్లాడుతూ.. సంస్థలోని ఉద్యోగుల సంక్షేమానికి యూనియన్ జాతీయ, ప్రాంతీయ స్థాయిల్లో అనేక పోరాటాలు నిర్వహిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో రాంబాబు, అరుణ్, దివ్య, రూప, కిరణ్, మధు, అజయ్, గోపి తదితరులు పాల్గొన్నారు. రెండు గేట్ల ద్వారా సాగర్ నీటి విడుదల నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గింది. సోమవారం 68,090 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టుకు వచ్చి చేరుతుండగా.. రెండు క్రస్ట్ గేట్ల ద్వారా 16,158 క్యూసెక్కులు, విద్యుదుత్పాదనతో 33,008 క్యూసెక్కులు, ఏఎమ్మార్పీ, కుడి, ఎడమ కాల్వలకు 18,924 క్యూసెక్కులు మొత్తం 68,090 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం గరిష్ట స్థాయి నీటిమట్టం 590అడుగులు(312.0450 టీఎంసీలు)కాగా ప్రస్తుతం 589.80అడుగులు(311.4474 టీఎంసీలు)గా నీటి మట్టం ఉంది. మూసీ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. సోమవారం ప్రాజెక్టులోకి 1,711 క్యూసెక్కుల వరద వస్తుండగా.. ప్రాజెక్టు అధికారులు ఒక క్రస్టు గేటును పైకెత్తి 1,321 క్యూసెక్కుల నీటిని దిగువ వదులుతున్నారు. ప్రాజెక్టు గరిష్ట స్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతం 644.50 అడుగుల మేర నీటి మట్టం ఉంది. కుడి, ఎడమ కాల్వలకు 341 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సీపేజీ, లీకేజీ, ఆవిరి రూపలో 50 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టు నుంచి విడుదలవుతోంది. మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్ధ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.30 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. -
బీసీ రిజర్వేషన్లకు అడ్డుకునేందుకు బీజేపీ కుట్ర
భువనగిరిటౌన్ : బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు బీజేపీ మొదటి నుంచి కుట్రలు చేస్తుందని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర నాయకుడు రాయబండి పాండురంగాచారి అన్నారు. సోమవారం సీపీఐ, బీసీ హక్కుల సాధన సమితి సంయుక్తంగా యాదాద్రి కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించాలని కోరుతున్నా బీజేపీకి చీమకుట్టినట్టు లేదని అన్నారు. బీజేపీ బీసీల వ్యతిరేక పార్టీ అని బీసీలు గుర్తించాలన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ.. బీజీపీ కుట్రలను తిప్పికొట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించుకుంటామని స్పష్టం చేశారు. ఈ నెల 15న నిర్వహించే రాస్తారోకోలో బీసీలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. బీసీ హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షుడు కళ్లెం కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బోలగాని సత్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు గోద శ్రీరాములు, కొల్లూరి రాజయ్య, బండి జంగమ్మ, ఎండీ ఇమ్రాన్, చెక్క వెంకటేష్, ఉప్పల ముత్యాలు, ఏశాల అశోక్, పల్లె శేఖర్‌రెడ్డి, చిగుర్ల లింగం, పెరబోయిన మహేందర్, వివిధ మండలాల కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. -
చెరువు కట్టపై అదుపుతప్పిన స్కూల్ బస్సు
మునగాల: చెరువు కట్ట మీదుగా వెళ్తున్న స్కూల్ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొని ఆగిపోయింది. ఈ ఘటన మునగాల మండలం నేలమర్రి గ్రామ శివారులో సోమవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చివ్వెంల మండలం వల్లభాపురం గ్రామంలోని సెయింట్ ఆన్స్ పాఠశాలకు చెందిన బస్సు సోమవారం ఉదయం అదే మండలం గుంజలూరు గ్రామంలో 15మంది విద్యార్థులను ఎక్కించుకొని మునగాల మండలం నేలమర్రి గ్రామంలో విద్యార్థులను ఎక్కించుకునేందుకు వస్తోంది. ఈ క్రమంలో నేలమర్రి గ్రామ శివారులో చెరువు కట్టపై స్కూల్ బస్సు ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. ఆ చెట్టు లేకపోతే బస్సు నేరుగా చెరువులోకి దూసుకెళ్లేది. సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని జేసీబీ సాయంతో బస్సును పక్కకు తీశారు. బస్సులోని విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తమ గ్రామానికి వాహనాలు చెరువు కట్ట మీదుగా రావాల్సి ఉందని, కట్ట ఇరుకుగా ఉండడంతో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని, కట్టను వెడల్పు చేసేలా అధికారులు, స్థానిక ఎమ్మెల్యే పద్మావతి చర్యలు తీసుకోవాలని కోరారు. చెట్టును ఢీకొని ఆగిపోవడంతో తప్పిన పెను ప్రమాదం -
చీఫ్ జస్టిస్‌పై దాడి.. ప్రజాస్వామ్యం పైనే దాడి
నల్లగొండ: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ మీద జరిగిన దాడి.. దేశ ప్రజాస్వామ్య విలువలపై దాడి అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ తీవ్రంగా ఖండించారు. జస్టిస్ గవాయ్‌పై జరిగిన దాడికి నిరసనగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం నల్లగొండలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట మహా ధర్నా చేశారు. ఈ ధర్నాలో మంద కృష్ణమాదిగ పాల్గొని మాట్లాడుతూ.. దళితుడైన చీఫ్ జస్టిస్‌పై జరిగిన దాడి ప్రజాస్వామ్య వ్యవస్థను, రాజ్యాంగాన్ని అవమానించే ప్రయత్నమని అన్నారు. ఈ దాడి వెనుక ఉన్న ఆధిపత్య శక్తులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామిక దృక్పథం కలిగిన సీనియర్, రిటైర్డు న్యాయమూర్తులతో స్వతంత్ర విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని కోరారు. కొన్ని శక్తులు దళితుల ఎదుగుదలను చూసి ఓర్వలేక దాడులకు పాల్పడ్డాయని ఆయన ఆరోపించారు. దేశ ప్రజలంతా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారన్నారు. ధర్నా అనంతరం కలెక్టర్‌ను కలిసి మంద కృష్ణమాదిగ వినతి పత్రం అందజేశారు. ధర్నాలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద నరేష్, మహాజన సోషలిస్టు పార్టీ నాయకులు జానకిరామయ్య, మాదిగ ఉద్యోగుల సంఘం జాతీయ నాయకుడు దైద సత్యంమాదిగ, ఎంజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గాదె రమేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. దాడి వెనుక ఉన్న శక్తులను గుర్తించి కఠినంగా శిక్షించాలి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ నల్లగొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా -
మద్యం షాపులకు ఎమ్మెల్యే నిబంధనలు
ఫ గతంలో మాదిరిగా దుకాణాలునడుపుతామంటే కుదరదిక ఫ జనం మేలుకోరి నిర్ణయం : రాజగోపాల్‌రెడ్డి చౌటుప్పల్ : మునుగోడు నియోజకవర్గంలో మద్యం దుకాణాలకు టెండర్లు వేసే వ్యక్తులకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కొత్త రూల్ పెట్టారు. గతంలో మాదిరిగా వైన్స్‌లు నడుపుతామంటే కుదరదని స్పష్టం చేశారు. షాపులు దక్కించుకున్నవారు ఊరి బయటనే ఏర్పాటు చేసుకోవాలని, సిట్టింగ్ రూంలు ఉండవద్దన్నారు. బెల్టు దుకాణాలకు మద్యం సరఫరా చేయొద్దన్నారు. సాయంత్రం 4నుంచి రాత్రి 9గంటల వరకు మాత్రమే మద్యం అమ్మకాలు చేయాలన్నారు. షరతులు ఎవరినీ ఇబ్బంది పెట్టేందుకు కాదని, జనం మేలుకోరి నిర్ణయం తీసుకున్నానని, ప్రజలు సహకరించాలని కోరారు. ఎమ్మెల్యే సూచనలకు సంబంధించి నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు సోమవారం నల్లగొండలోని ఎకై ్సజ్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కాగా ఇప్పటికే గ్రామాల్లో బెల్టు షాపులు నివారణకు కృషి చేస్తుండగా.. తాజాగా ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
ప్రజావాణి దరఖాస్తులను నిర్లక్ష్యం చేయొద్దు
భువనగిరిటౌన్ : ప్రజావాణి దరఖాస్తులను నిర్లక్ష్యం చేయకుండా సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలనుంచి వినతులు స్వీకరించారు. అర్జీదారులు పదేపదే కలెక్టరేట్‌కు రాకుండా.. తక్షణమే పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. మొత్తం 45 అర్జీలు రాగా అత్యధికంగా రెవెన్యూ సమస్యలకు సంబంధించినవే ఉన్నాయి. రెవెన్యూకు సంబంధించిన వినతులు అధికంగా వస్తుండటంతో ఇకనుంచి తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు ప్రజావాణిలో పాల్గొనాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్‌రావు, డీఆర్ఓ తదితరులు పాల్గొన్నారు. -
కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి
వలిగొండ మార్కెట్లోని కొనుగోలు కేంద్రానికి పది రోజుల క్రితం ధాన్యం తీసుకువచ్చాను. కేంద్రాన్ని ప్రారంభించకపోవడంతో రోజూ ధాన్యం వద్ద కాపలా కాస్తున్నాం. ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం తడిసి మద్దయింది. సుమారు 25 బస్తాల ధాన్యం వరద నీటిలో కొట్టుకుపోయింది. అధికారులు వెంటనే కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి ధాన్యం కాంటా వేయాలి. –బంగమట్ల శ్రీశైలం, మల్లేపల్లి, వలిగొండ మండలం 11 ఎకరాలు నల్లరేగడి రూ.2లక్షలకు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశా. వర్షాల వల్ల గూడ, కాత రాలిపోవడంతో దిగుబడి తగ్గింది. ఎకరాకు 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే చేలు.. సగం కూడా వస్తలేవు. కూలీలతో ఐదు ఎకరాల్లో పత్తి తీయించగా 11 క్వింటాల దిగుబడి వచ్చింది. చేనుపై మరో 25 క్వింటాళ్ల పత్తి ఉంది. ఈ ఏడు కూడా నష్టాలు తప్పేలా లేవు. –బచ్చ శ్రీశైలం, సికిందర్‌నగర్, మోటకొండూరు మండలం -
సూర్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు
అర్వపల్లి: జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఉషాపద్మిని ఛాయా సమేత సూర్యనారాయణస్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపించారు. అనంతరం యజ్ఞశాలలో మహాసౌరహోమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితాజనార్దన్, గణపురం నరేష్, సత్యనారాయణ, ఇంద్రారెడ్డి, గిరి, బెలిదె లక్ష్మయ్య, అర్చకులు భీంపాండే, శ్రీరాంపాండే, అంకిత్‌పాండే, భక్తులు పాల్గొన్నారు. ట్రాక్టర్ ఢీకొని వృద్ధుడు మృతిగరిడేపల్లి: బైక్‌పై వెళ్తున్న వృద్ధుడిని ట్రాక్టర్ ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన గరిడేపల్లి మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గరిడేపల్లి మండల కేంద్రానికి చెందిన బొంత సైదిరెడ్డి(75) బంధువుల శుభకార్యానికి హాజరయ్యేందుకు బైక్‌పై పొనుగోడు రోడ్డులోని ఫంక్షన్ హాల్‌కి వెళ్తున్నాడు. ఈ క్రమంలో స్థానిక గుండాలమ్మ దేవాలయం సమీపంలో యూటర్న్ వద్ద సైదిరెడ్డి బైక్‌ను ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సైదిరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు గరిడేపల్లి ఎస్ఐ చలికంటి నరేష్ తెలిపారు. లిఫ్టు గుంతలో పడి.. నల్లగొండ: అపార్ట్మెంట్లో నివాసముంటున్న వ్యక్తిపై లిఫ్టు గుంతలో పడి మృతిచెందాడు. ఈ ఘటన నల్లగొండ పట్టణంలోని అబ్బాసియా కాలనీలో శనివారం రాత్రి జరిగింది. ఆదివారం నల్లగొండ వన్ టౌన్ పోలీసులు తెలిపిన ప్రకారం.. అబ్బాసియా కాలనీకి చెందిన ఖాజా మొయినొద్దీన్ అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటున్నాడు. అతడు వేములపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి మొయినొద్దీన్ తాను నివాసముంటున్న అపార్ట్మెంట్లో రెండో అంతస్తు నుంచి కిందకు దిగేందుకు లిఫ్లు వద్దకు వచ్చాడు. ఈ క్రమంలో లిప్టు డోర్లు ఓపెన్ కావడంతో అతడు రెండో అంతస్తు నుంచి లిఫ్టు గుంతలో పడిపోయాడు. అనంతరం అతడిపై నుంచి లిప్టు పడటంతో తీవ్ర గాయాలపాలై మృతిచెందాడు. ప్రమాదం జరిగిన రెండు గంటల తర్వాత అపార్ట్మెంట్ వాసులు గుర్తించి కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వన్ టౌన్ సీఐ రాజశేఖర్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కృష్ణమ్మ పరవళ్లునాగార్జునసాగర్: ఎగువ ప్రాంతాల నుంచి సాగర్‌కు ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ఆదివారం 85,118 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా అధికారులు నాలుగు గేట్లను ఎత్తి 32,316 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా 33,454 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ కాల్వలు, ఏఎమ్మార్పీకి 19,348 క్యూసెక్కులు వదులుతున్నారు. సాగర్ జలాశయ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.80 అడుగులుగా ఉంది. -
ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకుని ఆత్మహత్య
హాలియా: ఆర్ధిక ఇబ్బందులతో ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అనుముల మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ఆదివారం జరిగింది. ఎస్ఐ సాయిప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపల్లి గ్రామానికి చెందిన పాతనబోయిన నాగయ్య, పెద్ద మొగులమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు పాతనబోయిన నవీన్(30) స్థానికంగా ఓ రైస్ మిల్లులో డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం రాత్రి నవీన్ తన ఇంట్లోని ఓ గదిలో నిద్రించగా తల్లిదండ్రులు, సోదరుడు మరో గదిలో నిద్రించారు. ఈ క్రమంలో నవీన్ తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం వరకు గదిలో నుంచి నవీన్ బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యలు తలుపులు తీసి చూడగా అప్పటికే అతడు మృతిచెందాడు. గృహ నిర్మాణం కోసం చేసిన అప్పులతో నవీన్ గత కొంతకాలంగా మానసిక ఇబ్బందులు పడుతున్నాడు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేకనే నవీన్ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నాగార్జునసాగర్‌లోని కమలా నెహ్రూ ఆస్పత్రికి తరలించారు. మృతుడి సోదరుడు కిరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఎలక్ట్రికల్ షాపు గోదాంలో అగ్ని ప్రమాదం
మిర్యాలగూడ అర్బన్: మిర్యాలగూడ పట్టణంలోని హనుమాన్‌పేటలో ఎలక్ట్రికల్ షాపు గోదాంలో ఆదివారం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమాన్‌పేటలో ఫ్లైవర్ సర్వీస్ రోడ్డు వెంట ఉన్న శ్రీలక్ష్మి పవన్ ఎలక్ట్రికల్స్, విజయలక్ష్మి ఆటోమోటివ్స్‌కు సంబంధించిన గోదాం నుంచి ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పొగలు రావడంతో పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ నిర్వాహకులు గోదాం యజమానులకు సమాచారం అందించారు. వారు వచ్చి తాళాలు తీసి చూడగా అప్పటికే షాపు మొత్తం మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. ఐదు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నామని అగ్నిమాపక సిబ్బంది పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.30 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయారు. -
నీటి సంఘాలకు ఎన్నికలు ఎప్పుడో..?
పెద్దవూర: గత పదిహేడేళ్లుగా ప్రభుత్వాలు నీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం లేదు. దీంతో చెరువులు అధ్వాన్నంగా మారాయి. మరోవైపు మిషన్ కాకతీయ పథకంలో భాగంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెరువులు, కుంటలకు మరమ్మతులు చేసినా.. వాటిపై అజమాయిషీ లేక నీటి విడుదల, మరమ్మతులపై దృష్టి పెట్టేవారు కరువయ్యారు. ఒకప్పుడు చెరువుల అభివృద్ధి, నిర్వహణ, ఆయకట్టుకు నీటి విడుదల పర్యవేక్షణ పనులను నీటి సంఘాల పాలకవర్గాలు చేపట్టేవి. నీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో ఈ పర్యవేక్షణ కరువైంది. దీంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేపడుతున్నారు. కొన్ని గ్రామాల్లో పనులు చేపట్టకముందే నిధులు కాజేశారన్న ఆరోపణలు వచ్చాయి. గతంలో ఇలా.. గత ప్రభుత్వాలు 100 ఎకరాల ఆయకట్టు ఉన్న ప్రధాన చెరువులకు సాగునీటి సంఘాలకు ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించేవి. రైతులు నీటి సంఘం చైర్మన్‌తో పాటు డైరెక్టర్లను ఎన్నుకునేవారు. పాలకవర్గ సభ్యులు చెరువుల నిర్వహణతో సాగు నీటిని పంట పొలాలకు విడుదల చేసుకుని పొదుపుగా వాడుకునేలా చర్యలు తీసుకునేవారు. అంతేకాకుండా రైతులను సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి పనులు సైతం చేపట్టేవారు. గత 17 ఏళ్ల నుంచి నీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో చెరువుల నిర్వహణ అధ్వాన్నంగా మారింది. కొన్ని చెరువుల తూములు, పంట కాలువలు, అలుగులు శిథిలావస్థకు చేరుకున్నాయి. తూములు పనిచేయక సాగునీరు రాక నిరుపయోగంగా మారాయి. చెరువులపై ఎవరి అజమాయిషీ లేకపోవడంతో రైతులకు సాగునీరు అవసరమయ్యే సమయంలో(వానాకాలం సీజన్ ప్రారంభంలో) చేపలు పట్టుకోవడం కోసం రాత్రికి రాత్రే చెరువుల నుంచి నీటిని అక్రమంగా వదిలి ఖాళీ చేస్తున్నారు. 2008 నుంచి ఎన్నికలు బంద్ 2006వ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా వంద ఎకరాల ఆయకట్టుకు పైగా ఉన్న ప్రధాన చెరువులకు రెండు సంవత్సరాల కాలానికి గాను సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహించారు. వాటి పదవీకాలం 2008లో ముగిసింది. అప్పటినుంచి తిరిగి ఎన్నికలు నిర్వహించిన దాఖలాలు లేవు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వమైనా నీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించి చెరువులను మరింత అభివృద్ధి చేయాలని రైతులు కోరుతున్నారు. ఫ చివరిసారిగా 2006లో ఎన్నికల నిర్వహణ ఫ పట్టించుకోని ప్రభుత్వాలు ఫ అధ్వాన్నంగా మారుతున్న చెరువులు -
నీటి సంఘాలతోనే చెరువుల అభివృద్ధి
నీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించి పాలకవర్గాలను ఎన్నుకుంటేనే చెరువులు అభివృద్ధి చెందుతాయి. గతంలో నీటి సంఘాల పాలకవర్గాలు ఉండటం వలన నీటిని పొదుపుగా వాడుకోవడమే కాకుండా వాటి పర్యవేక్షణ కూడా పకడ్బందీగా ఉండేది. గత ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం పేరుతో చెరువులను అభివృద్ధి చేసినా అజమాయిషీ లేకపోవడంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేపట్టారు. ప్రభుత్వం నీటి సంఘాల ఎన్నికలపై దృష్టి సారించాలి. – చెన్ను వెంకట్‌రెడ్డి, రైతు, బట్టుగూడెం, పెద్దవూర మండలం -
రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి కేంద్రం కుట్ర
మిర్యాలగూడ : రెండు రాష్ట్రాల మధ్య వివాదాన్ని సృష్టించి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఆరోపించారు. ఆదివారం మిర్యాలగూడ పట్టణంలోని బృందావన్ గార్డెన్లో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బికార్ మల్లేష్ సతీమణి సుమిత్రిబాయి సంతాప సభలో ఆయన పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, ఎండీ అబ్బాస్, సీనియర్ నాయకులు డీజే. నర్సింగ్‌రావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. బనకచర్ల విషయంలో ఏపీ ప్రభుత్వానికి సహకరించాలని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం లేఖ రాయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచి, బనకచర్ల నిర్మించడం వల్ల తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లాలో మహిళపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. హన్మకొండలో నకిలీ రైతులు, భూమి లేకుండా ధాన్యం అమ్మకపోయినా ప్రభుత్వ సొమ్ము రూ.1.86 కోట్లు కాజేశారని ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చిందని వాటిలో ఏ ఒక్కటి సక్రమంగా అమలు కావడం లేదన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. బీసీ రిజర్వేషన్ చట్టబద్ధత కోసం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేయబోతుందని, అది సరిపోదని అన్ని పార్టీలను కలుపుకొని కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. ట్రంప్ భారతదేశంపై అనేక సుంకాలు విధిస్తున్నా మోదీ మెతక వైఖరి వహించడం సరికాదన్నారు. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై సోయాబీన్, పత్తి, మాంసం, పాల వంటి వ్యవసాయ ఉత్పత్తులను భారతదేశానికి దిగుమతి చేసేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నాడని, అలా చేస్తే దేశంలో వ్యవసాయం కుంటుపడుతుందన్నారు. సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, డబ్బికార్ మల్లేష్, కందాల ప్రమీల, సయ్యద్ హాషం, వీరేపల్లి వెంకటేశ్వర్లు, మల్లు గౌతంరెడ్డి, బావండ్ల పాండు, రవినాయక్, వినోద్‌నాయక్, శశిధర్‌రెడ్డి, పరుశురాములు, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఫ బనకచర్లకు సహకరించాలని కేంద్రం లేఖ రాయడం సరికాదు ఫ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ -
రైతుల ఆశలు.. అడియాసలు
చందంపేట: దేవరకొండ నియోజకవర్గంలోని సుమారు మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఉద్దేశంతో 2008లో పురుడు పోసుకున్న నక్కలగండి ప్రాజెక్టు పనులు చిన్న చిన్న అవాంతరాలతో ఆగిపోయాయి. దీంతో ప్రాజెక్టు పూర్తయితే సాగునీటి కష్టాలు తీరుతాయని ఆశపడుతున్న రైతులకు నిరాశే ఎదురవుతోంది. 2008లో మొదలైన పనులు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివంగత ముఖ్యమంతి వైఎస్ రాజశేఖరరెడ్డి సానుకూల నిర్ణయంతో 2008లో నక్కలగండి ప్రాజెక్టు నిర్మాణానికి పునాదులు పడ్డాయి. అడుగడుగునా అవాంతరాలను అధిగమిస్తూ వస్తున్నప్పటికీ ప్రాజెక్టు మాత్రం పూర్తి కావడం లేదు. శ్రీశైలం సొరంగం నుంచి వచ్చే నీటితో పాటు డిండి ప్రాజెక్టు మిగులు జలాలు నిల్వ చేసి దేవరకొండ నియోజకవర్గంలోని సుమారు మూడు లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడంతో పాటు అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నీటిని సరఫరా చేసేలా ఈ ప్రాజెక్టును రూపకల్పన చేశారు. సుమారు 7.64 టీఎంసిల సామర్థ్యమున్న ఈ ప్రాజెక్టుకు మొత్తం 17 గేట్లు ఉండనున్నాయి. ప్రాజెక్టు పూర్తికాకపోవడంతో ప్రతి ఏడాది సుమారు 3 టీఎంసీల నీరు వృథా అవుతోందని అధికారులు అంచనా వేస్తున్నారు. నెరవేరని రైతుల కల.. గత 17 ఏళ్లలో నక్కలగండి కట్ట నిర్మాణ పనులు 90 శాతం వరకు పూర్తయినప్పటికీ మిగతా 10 శాతం పనుల్లో మాత్రం తీవ్ర జాప్యం జరుగుతోంది. నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, రోడ్డు మార్గం ఏర్పాటుకు అటవీ శాఖ అనుమతులు మినహా పెద్దగా చెప్పుకోదగ్గ అవాంతరాలంటూ ఏమీ లేకున్నప్పటికీ ప్రాజెక్టును పూర్తి చేయడంలో ప్రభుత్వాలు చొరవ తీసుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం శ్రీశైలం సొరంగ ప్రమాదం కారణంగా ఈ నక్కలగండి కట్టకు నీటి ప్రవాహం లేకున్నప్పటికీ డిండి ప్రాజెక్టు మిగులు జలాలు, ఎగువ ప్రాంతంలో కురిసే వర్షాల ద్వారా ఈ ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉందని, కానీ ప్రభుత్వాధికారులు, అధికారుల ఉదాసీనత కారణంగా ప్రతి ఏడాది నీరు వృథా అవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు చాలా వరకు పూర్తి చేశారు. కొన్ని పనులు చేస్తే మొత్తం పూర్తయ్యేది. ప్రతి సంవత్సరం వర్షాల వల్ల చాలా నీరు వృథాగాపోతోంది. అధికారులు, ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ ప్రాజెక్టును పూర్తిచేస్తే మాకు సాగునీటి కొరత ఉండదు. – ఆంగోతు నరేష్, రైతు ఫ 90 శాతం పూర్తయిన నక్కలగండి కట్ట నిర్మాణం ఫ చివరి నిమిషంలో చిన్నచిన్న సమస్యలతో నిలిచిన పనులు ఫ ఏడాదికి 3 టీఎంసీల నీరు వృథా -
ఊరి బాగు కోసం ఏకమైన యువత
రామన్నపేట: కన్నతల్లి వంటి ఊరును ఆదర్శంగా నిలపాలనే లక్ష్యంతో రామన్నపేట మండలం కొమ్మాయిగూడెం గ్రామానికి చెందిన యువత ఏకమయ్యారు. పలు ఎజెండాలతో సుమారు 30 మంది యువకులు ఆదివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గ్రామంలోకి డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలు దరిచేరనీయకూడదని, వాటి జోలికి వెళ్లకుండా ఉండేందుకు ప్రజలను చైతన్యం చేయాలని తీర్మానించారు. అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు, మద్యం వంటి ప్రలోభాలకు లొంగకుండా గ్రామాభివృద్ధికి కృషి చేసేవారిని ఎన్నుకునే విధంగా ప్రజలను చైతన్యం చేయాలని నిర్ణయించారు. -
ధాన్యం దళారుల పాలు
సాక్షి, యాదాద్రి: రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంట దళారుల పాలవుతోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ఏర్పాటు చేస్తారో తెలియని పరిస్థితి ఉండటంతో అప్పటి వరకు ఎదురుచూడలేక రైతులు అవసరాల కోసం ధాన్యాన్ని ప్రైవేట్‌కు అమ్ముకుంటున్నారు. దీనిని ఆసరాగా తీసుకుంటున్న దళారులు, వ్యాపారులు మద్దతు ధర కంటే రూ.600 వరకు తక్కువ చెల్లిస్తున్నారు. పలు గ్రామాల్లో ఉదయాన్నే కల్లాల వద్ద కాంటాలు పెట్టి రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. 2.82 లక్షల ఎకరాల్లో వరి సాగు వానాకాలం సీజన్లో జిల్లాలో 282,897 ఎకరాల్లో వరి సాగైంది. సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఇందులో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్దేశించారు. ఇందుకోసం 325 కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాకు రూ.2389, సాధారణ రకం రూ.2369 ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించింది. ఓ వైపు వరి కోతలు ఊపందుకొని ధాన్యం వెల్లువలా వస్తోంది. అయినా కొనుగోలు కేంద్రాలను ఎప్పుడు ప్రారంభిస్తారో స్పష్టత లేదు. వెంటనే డబ్బులు చెల్లిస్తే 2 శాతం కమీషన్ కల్లాల వద్దకే వెళ్లి ధాన్యం కొనుగోలు చేస్తున్న దళారులు, వ్యాపారులు రైతుల అవసరాలను ఆసరా చేసుకొని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. అంతేకాకుండా రకరకాల కొర్రీలు పెడుతున్నారు. వెంటనే డబ్బులు చెల్లించాలంటే 2 శాతం కమీషన్ కట్ చేస్తున్నారు. లేదంటే 15 రోజుల వరకు వాయిదా పెడుతున్నారు. కొనుగోళ్లపై అప్రమత్తం చేసిన కమిషనర్ జిల్లాలో ధాన్యం కొనుగోలుపై యంత్రాంగాన్ని సివిల్ సప్లయ్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అప్రమత్తం చేశారు. గురువారం ఆయన జిల్లాలో పర్యటించారు. ధాన్యం కొనుగోలుకు తీసుకుంటున్న చర్యలపై స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోళ్లు సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫ కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం ఫ గత అనుభవాల దృష్ట్యా ప్రైవేట్‌కు అమ్ముకుంటున్న రైతులు ఫ ఇదే అదనుగా భావించి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న దళారులు పది శాతం బ్యాంక్ గ్యారంటీ విషయంలో జిల్లాలోని రైస్ మిల్లర్లు, అధికారుల మధ్య వివాదం కొనసాగుతోంది. తమకు రావాల్సిన సీఎంఆర్ చార్జీలు ఇప్పించే వరకు ధాన్యం కొనుగోలు చేయబోమని మిల్లర్లు ఇటీవల కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అయితే జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రారంభించడంతోపాటు మిల్లులకు ధాన్యం కేటాయింపులు కొనసాగుతున్నాయి. మిల్లులకు కేటాయించే ధాన్యంలో పదిశాతం విలువ ను మిల్లర్లు ప్రభుత్వానికి గ్యారంటీ ఇవ్వాల్సి ఉంది. ఒక వేళ మిల్లర్లు పేచి పెడితే ప్రభుత్వ గోదాముల్లో వడ్లు దించుకోవడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో అధికారులు ఉన్నారు. ఫ ఆత్మకూరు(ఎం) మండలంలో రెండు వారాల క్రితమే వరి కోతలు మొదలయ్యాయి. దళారులు, వ్యాపారులు రోడ్ల పక్కన, కల్లాల వద్ద కాంటాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. క్వింటా రూ.1800 చెల్లిస్తున్నారు. ఫ ఆలేరు, మోత్కూరు, అడ్డగూడూరు మండలాల్లోనూ రూ.1800కు మించి ఎక్కువ చెల్లించడం లేదు. అడ్డగూడూరు మండలంలో రూ.1600లే చెల్లిస్తున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. ఫ భూదాన్‌పోచంపల్లి మండలంలోని రేవనపల్లి, గౌస్‌కొండ, పెద్దరావులపల్లి తదితర గ్రామాల్లో గత నాలుగు రోజులుగా వరి కోతలు ప్రారంభమయ్యాయి. రైతులు టాక్టర్లలో తీసుకువచ్చి ఆయా సెంటర్లో పోసి ఆరబెడుతున్నారు. -
తొమ్మిదేళ్లయినా అద్దెభవనాల్లోనే..
ఫ అడ్డగూడూరు మండలంలో తహసీల్దార్ కార్యాలయం అద్దె భవనంలో కొనసాగుతోంది. ఫ వ్యవసాయ శాఖ కార్యాలయం రైతువేదికలో, ఎంపీడీఓ కార్యాలయం మండల విద్యావనరుల కేంద్రంలో కొనసాగిస్తున్నారు. ఫ పోలీస్ స్టేషన్ భవనం పశుసంవర్ధక శాఖ ఆస్పత్రిలో నిర్వహిస్తున్నారు. దీని నిర్మాణం కోసం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పక్కనే ప్రభుత్వం భూమిలో స్థలం కేటాయించారు. నిర్మాణం కోసం నిధులు కేటాయించకపోవడంతో స్థలం చుట్టూ కంచె వేసి వదివేశారు. ఫ విద్యుత్ శాఖ కార్యాలయం మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్‌లోని ఒక గదిలో నిర్వహిస్తున్నారు. ఫ 26 అంగన్వాడీ కేంద్రాలకు 8 అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. మోటకొండూర్, అడ్డగూడూరు : జిల్లాలో అడ్డగూడూరు, మోటకొండూర్ మండలాలు ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు పూర్తయ్యాయి. అయినా ఈ రెండు మండల కేంద్రాల్లో ప్రభుత్వ కార్యాలయాలు శాశ్వత భవనాలకు నోచుకోవడం లేదు. ఇటీవల కొన్ని కార్యాలయాల ఏర్పాటుకు స్థల సేకరణ జరిగినా టెండర్ ప్రక్రియ వద్ద నిలిచిపోయింది. పక్కా భవనాలు లేక అధికారులు, సిబ్బంది, వివిధ పనుల నిమిత్తం కార్యాలయాలకు వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మోటకొండూర్ మండలంలో.. మోటకొండూర్ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయాన్ని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో నిర్వహిస్తున్నారు ఎంపీడీఓ కార్యాలయం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనంలో కొనసాగిస్తున్నారు. పోలీస్ స్టేషన్ కార్యాలయం ప్రైవేట్ భవనంలో నిర్వహిస్తున్నారు. పశువైద్య కేంద్రానికి భవనం లేక సబ్సెంటర్లో, వ్యవసాయ కార్యాలయాన్ని రైతు వేదికలో కేటాయించారు. మండల విద్యుత్ కార్యాలయం మోటకొండూర్ సబ్‌స్టేషన్‌లోని కంట్రోల్ రూమ్‌కు మరమ్మతులు చేసి ఒక గదిని ఏఈ కార్యాలయానికి, మరో గదిని ఆపరేటింగ్ రూమ్‌కు కేటాయించారు. మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాల 2017 ఏర్పాటు కాగా ప్రైవేట్ భవనంలో నెలకు రూ.లక్ష రెంట్ చెల్లిస్తున్నారు. ఇప్పటి వరకు స్థల సేకరణ కూడా చేయలేదు. మండలంలో 27 అంగన్వాడీ సెంటర్లు ఉండగా 13 సొంత భవనాలు కలిగి ఉన్నాయి. 3 విద్యుత్ సబ్‌స్టేషన్ కంట్రోల్ రూమ్‌లు ఉండగా ముత్తిరెడ్డిగూడెంలోని కంట్రోల్ రూమ్ ఎప్పుడు కూలిపోతుందోనని భయం గుప్పెట్లో ఆపరేటర్లు విధులు నిర్వహిస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో నాలుగు సబ్‌సెంటర్లు ఉండగా అందులో ఒక్క ప్రభుత్వ భవనం లేదు. చాడ, నాంచారిపేట గ్రామాల్లో భవనాల నిర్మాణం ప్రారంభమైనా మాటూర్, మోటకొండూర్‌కు భవనాలు లేవు. మోటకొండూరు మండలంలో 20 గ్రామపంచాయతీలు ఉండగా 7 పంచాయతీలకు పక్కా భవనాలు లేవు. ఫ మోటకొండూర్, అడ్డగూడూరులో పక్కా భవనాలకు నోచుకోని ప్రభుత్వ కార్యాలయాలు ఫ పాలనంతా అద్దె భవనాల్లోనే ఫ ఇరుకు గదులతో తప్పని తిప్పలు -
పక్కా భవనాలు నిర్మించాలి
తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్నా మోటకొండూర్ మండలంలో ప్రభుత్వ కార్యాలయాలకు పక్కా భవనాలు ఏర్పాటు చేయలేదు. అప్పుడు అధికారం ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం నూతన మండలాలను ఇచ్చి చేతులు దులుపుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైనా పనులు సాగడం లేదు. పక్కా భవనాలు నిర్మించి చిత్తశుద్ధిని చాటుకోవాలి. – పీసరి తిరుమలరెడ్డి, బీజేపీ జిల్లా నాయకుడు, మోటకొండూర్ అడ్డగూడూరు మండలంలో ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించలేదు. అద్దె భవనాల్లో ఇరుకై న గదుల్లో కార్యాలయాలు నిర్వహిస్తుండంతో వసతులు లేక ఎండలో నిరీక్షించాల్సి వస్తోంది. వాహనాలు రోడ్డుపై పార్కింగ్ చేయాల్సి వస్తోంది. – బుర్రు అనిల్ కుమార్, గోవిందాపురం, అడ్డగూడూరు మండలం -
గోదావరి జలాలు.. దామన్న చలవే
తుంగతుర్తి, తిరుమలగిరి, నాగారం : ఆనాడు కరువు, కాటకాలతో ఎడారిగా ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పచ్చని పంటలు పండాలని 40 ఏళ్ల క్రితమే ఎమ్మెల్యేగా ఎన్నికై న రాంరెడ్డి దామోదర్‌రెడ్డి గోదావరి జలాలను తీసుకురావడానికి పెద్ద ఎత్తున ఉద్యమించారని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. తుంగతుర్తిలో ఆదివారం మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి సంతాప సభకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి హాజరయ్యారు. ముందుగా దామోదర్‌రెడ్డి కుమారుడు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డితో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ శ్రీరాంసాగర్ ద్వారా గోదావరి జలాలను తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి ఆర్డీఆర్ కృషి ఎనలేదిఅని అన్నారు. దామన్న.. ఐదు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా పనిచేసి వేలాది ఎకరాల భూములు, ఆస్తులను ప్రజలు, కార్యకర్తల కోసం త్యాగం చేశారని పేర్కొన్నారు. ఈ జిల్లాలో రాజకీయ కక్షలు, హత్యయత్నాలు, వివాదాలు, దాడులు, విపత్కర పరిస్థితులను ఎదుర్కొని కార్యకర్తలను కాపాడి కాంగ్రెస్ జెండాను నిలబెట్టిన ఘనత ఆర్డీఆర్ది అని అన్నారు. సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించి ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటూ టైగర్ దామన్నగా గుర్తింపు పొందారని కొనియాడారు. తుంగతుర్తిలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మందుల సామేల్‌కు చేతిలో రూ.50 వేలు లేకున్నా 50వేల మెజార్టీతో గెలవడానికి కారణం దామన్న వేసిన పునాదులేని పేర్కొన్నారు. ఆర్డీఆర్ కృషితోనే ఎస్సారెస్పీ స్టేజ్–2.. రాష్ట్ర భారీ నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు శ్రీరాం సాగర్ జలాల కోసం రక్తతర్పణం చేసిన ఘనత ఆర్డీఆర్దే అని కొనియాడారు. దామోదర్‌రెడ్డి కృషి ఫలితంగానే ఎస్సారెస్పీ స్టేజ్–2 పూర్తయ్యిందన్నారు. ప్రస్తుతం ఎస్సారెస్పీ కాల్వల మరమ్మతుకు నిధులు కేటాయించాలన్నారు. రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సొంత ఆస్తులను త్యాగం చేసి పార్టీని బతికించిన ఘనత దివంగత నేత ఆర్డీఆర్ది అని అన్నారు. దామన్న కుమారుడు సర్వోత్తంరెడ్డికి అండగా ఉంటామని తెలిపారు. రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ నల్లగొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్ జెండాను కాపాడిన ఘనత రాంరెడ్డి సోదరులకే దక్కిందన్నారు. మాజీ మంత్రి జానారెడ్డి మాట్లాడుతూ రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సీపీఐ రాష్ట్రకార్యదర్శి, ఆ పార్టీ శాసనసభా పక్షనేత కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లాల్లో కమ్యూనిస్టు పార్టీలను ఢీకొన్నది రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఇద్దరు అన్నదమ్ములే అని గుర్తు చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ వీప్ బీర్ల ఐలయ్య, ఎంపీ రఘువీర్‌రెడ్డి, మాజీ ఎంపీ హన్మంతరావు, ఎమ్మెల్యేలు మందుల సామేలు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పద్మావతి, వేముల వీరేశం, బాలునాయక్, జైవీర్‌రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, మట్టా రాఘమయి, ఎమ్మెల్సీలు శంకర్‌నాయక్, అద్దంకి దయాకర్, నెల్లికంటి సత్యం, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులు సంకేపల్లి సుధీర్‌రెడ్డి, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న, మహిళా అధ్యక్షురావు తిరుమలప్రగడ అనురాధకిషన్రావు, కొప్పున వేణారెడ్డి, పోతు భాస్కర్, చకిలం రాజేశ్వర్‌రావు, సంకెపల్లి కొండల్‌రెడ్డి, గుడిపాటి నర్సయ్య, తొడుసు లింగయ్య, ఆకుల బుచ్చిబాబు, ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఫ ఎస్సారెస్పీ స్టేజ్–2 కోసం 40 ఏళ్ల క్రితమే దామోదర్ రెడ్డి పోరాటం ఫ ప్రజా జీవితంలో ఉండి ఆస్తులు త్యాగం చేశారు ఫ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి ఫ ఆర్డీఆర్ సంతాప సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫ హాజరైన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు -
స్వర్ణగిరి క్షేత్రంలో ఆత్మదర్శన్
భువనగిరి: పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆవరణంలో అదివారం రాత్రి సికింద్రాబాద్‌లోని ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో ఆత్మ దర్శన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక చైర్మన్ మానేపల్లి రామారావు మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని ముందు తరాలకు అందించే ప్రయత్నంలో భాగంగానే ఆత్మ దర్శన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం రాధా కన్నయ్య మానేపల్లి రామారావును సన్మానించారు. అంతకుముందు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, సంకీర్తనలు, ప్రవచనాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో భక్తులు తదితరలు పాల్గొన్నారు. -
యాదగిరీశుడికి విశేష పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో విశేష పూజలు కొనసాగాయి. ఆదివారం ఉదయం సుప్రఽభాత సేవ, ఆరాధన నిర్వహించారు. అనంతరం నిజాభిషేకం, అర్చన జరిపించారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం నిర్వహించి, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం చేపట్టారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర, సువర్ణ పుష్పార్చన పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆలయంలో జోడు సేవను ఊరేగించారు. రాత్రి సమయంలో శ్రీస్వామి అమ్మవార్లకు శయనోత్సవం నిర్వహించి, ఆలయ ద్వార బంధనం చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 16న మత్స్యగిరి ఆలయ హుండీల లెక్కింపు వలిగొండ : మండలంలోని వెంకటాపురంలో గల శ్రీమత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని హుండీలను ఈనెల 16న లెక్కించనున్నారు. ఈమేరకు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ నరేష్ రెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి మోహన బాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రేపు బుద్ధవనంలో ధమ్మవిజయం వేడుకలునాగార్జునసాగర్: ఈ నెల 14న ఉదయం 11 గంటలకు బుద్ధవనంలోని సమావేశ మందిరంలో ధమ్మవిజయం వేడుకలు నిర్వహిస్తున్నట్లుగా బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బుద్ధుడి ధమ్మంపట్ల ఆకర్షితుడైన సామ్రాట్ అశోకుడు ఇకపై దిగ్విజయం స్థానంలో, దమ్మ విజయం చేకూరేలా చేస్తానని శాసనాల ద్వారా ప్రకటించిన సందర్భానికి గుర్తుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పూణే యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ మహేశ్ దియోకర్ దమ్మవిజయ విశిష్టతను వివరిస్తారని తెలిపారు. ఎంజీయూ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, హైద్రాబాద్ రెడ్డి మహిళా కళాశాల ప్రొఫెసర్ కె.ముత్యంరెడ్డి, ఎంజేపీఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మాధవీలత హాజరు కానున్నట్లు తెలిపారు. స్థానికులు, విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. -
జిల్లా కోర్టు భవనాలకు శంకుస్థాపన
సాక్షి యాదాద్రి, యాదగిరిగుట్ట : తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్‌కుమార్‌సింగ్ శనివారం జిల్లాలో పర్యటించారు. ఉదయం రాజ్‌భవన్ నుంచి బయలుదేరి 10 గంటల 10 నిమిషాలకు యాదగిరి కొండపై వీఐపీ వసతిగృహానికి చేరుకున్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి బ్యాటరీ వాహనంలో ఆలయ తూర్పు మాడ వీధికి వచ్చారు. తూర్పు ద్వారం గుండా ప్రధానాలయంలో వెళ్లారు. ఆంజనేయస్వామిని, ఆ తరువాత ధ్వజస్తంభానికి మొక్కారు. గర్భాలయంలోని స్వయంభూలకు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వీఐపీ వసతిగృహానికి వెళ్లి, అక్కడినుంచి భువనగిరి శివారు మాసుకుంటకు చేరుకొని జిల్లా కోర్టు భవన సముదాయ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి, భువనగిరి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ కె.శరత్, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ కె.సుజన, జస్టిస్ వి.రామకృష్ణారెడ్డి, భువనగిరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.జయరాజు, మొదటి అదనపు జిల్లా జడ్జి ముక్తిదా, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మాధవిలత, ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి ఉషశ్రీ, అదనపు సీనియర్ సివిల్ జడ్జి శ్యాంసుందర్, భువనగిరి ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి స్వాతి, భువనగిరి జూనియర్ సివిల్ జడ్జి చండీశ్వరి, రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి సబిత, రామన్నపేట ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి శిరీష, చౌటుప్పల్ జూనియర్ సివిల్ జడ్జి మహతి వైష్ణవి, ఆలేరు జూనియర్ సివిల్ జడ్జి అజయ్‌కుమార్, కలెక్టర్ హనుమంతరావు, రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు, డీసీపీ అక్షాంశ్‌యాదవ్, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీఓ కృష్ణారెడ్డి, రామన్నపేట, చౌటుప్పల్, ఆలేరు, భువనగిరి న్యాయవాదుల సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు. ఫ ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్‌కుమార్‌సింగ్ -
రిజర్వేషన్ల గందరగోళానికి కాంగ్రెస్సే కారణం
చౌటుప్పల్ : బీసీ రిజర్వేషన్ల గందరగోళానికి కాంగ్రెస్సే కారణమని బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి ఆరోపించారు. 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే చట్టపరంగా ముందుకు వెళ్లాల్సి ఉండేదని, బిల్లు ఆగిపోతుందని తెలిసే రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు నాటకాలాడారని ధ్వజమెత్తారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెంలో శనివారం మున్సిపాలిటీ బూత్ అధ్యక్ష, కార్యదర్శుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీల పేరిట ముస్లింలకు రిజర్వేషన్లు కట్టబెట్టే దుర్మార్గాన్ని బీసీలు గుర్తించారని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు స్టే విధిస్తే బీజేపీకి ఏమి సంబంధమో కాంగ్రెస్ నాయకులు చెప్పాలన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో తనకు, తన కుటుంబసభ్యులకు ఎలాంటి వాటాలు లేవని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి రుజువు చేసుకోవాలని, లేకుంటే తక్షణమే తన పదవికి రాజీనామా చేసి తిరిగి పోటీ చేయాలని సవాల్ విసిరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఎవరితో పొత్తు లేకుండానే మున్సిపాలిటీ, మండలంలో పోటీ చేస్తుందన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు రమనగోని శంకర్, మున్సిపల్ అధ్యక్షురాలు కడారి కల్పన, నాయకులు ముత్యాల భూపాల్‌రెడ్డి, పోలోజు శ్రీధర్‌బాబు, రమనగోని దీపిక, ఆలె చిరంజీవి, బత్తుల జంగయ్య,ఊడుగు వెంకటేశం, కడవేరు పాండు, చీకూరు ప్రభాకర్, ఊదరి రంగయ్య, భానుప్రకాష్, నాగరాజు, జి.వేణు, సాయికుమార్, సురేష్, రాజశేఖర్, రవి, దామోదర్‌రెడ్డి, భరత్, శేఖర్, సత్తిరెడ్డి, ఆనంద్, సంపత్, తదితరులు పాల్గొన్నారు. ఫ బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి -
323 దరఖాస్తులు
భువనగిరి: జిల్లాలో మద్యం టెండర్లకు భారీగా స్పందన వస్తోంది. టెండర్లు వేసేందుకు వ్యాపారులు పోటీ పడుతున్నారు. శనివారం ఒక్క రోజే 96 దరఖాస్తులు దాఖలయ్యాయి. దరఖాస్తు గడువు ఈనెల 18న ముగియనుంది. ఇప్పటి వరకు మొత్తం 323 దరఖాస్తులు వచ్చినట్లు ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. మరో వారం రోజులు సమయం ఉన్నందున భారీగా టెండర్లు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నారసింహుడికి సంప్రదాయ పూజలు యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శనివారం సంప్రదాయ పూజలు ఆగమశాస్త్రం ప్రకారం ఘనంగా నిర్వహించారు. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు.. స్వామి, అమ్మవారికి సుప్రభాత సేవ చేపట్టారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం చేసి తులసీదళాలతో అర్చించారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర పూజలు గావించారు. సాయంత్రం ఉత్సవమూర్తుల వెండి జోడు సేవలను ఊరేగించారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు. ప్రవక్త జీవిత చరిత్రపై విద్యార్థులకు పోటీ పరీక్ష భువనగిరిటౌన్ : మహ్మద్ ప్రవక్త జీవిత చరిత్రపై శనివారం భువనగిరి పట్టణంలోని ఖదీం జామియా ఇస్లామియా అరేబియా పాఠశాలలో జలీల్‌పుర మసీద్ కమిటీ ఆధ్వర్యంలో రాత పోటీ పరీక్ష నిర్వహించారు. పరీక్షకు 120 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మసీద్ కమిటీ కోశాధికారి రహీముద్దీన్, సభ్యుడు సుజావుద్దీన్ మాట్లాడుతూ.. విద్యార్థులకు మహ్మద్ ప్రవక్త జీవిత చరిత్రపై అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రధాన సలహాదారుడు ఉస్మాన్ చౌదరి, డాక్టర్ షేక్ హమీద్ పాష, ఇషాక్, ఫుర్ఖాన్, మాస్, సైఫుల్లా, షాహిద్ పాల్గొన్నారు. రంజి ట్రోఫీ ఫీల్డింగ్ కోచ్‌గా ఎంపిక బీబీనగర్: రంజి ట్రోఫీ క్రికెట్ ఫీల్డింగ్ కోచ్‌గా బీబీనగర్ మండలంలో ని కొండమడుగు గ్రామానికి చెందిన చంద్రగౌని బాలగణేష్గౌడ్ ఎంపికయ్యారు. జాతీయ స్థాయిలో గల బరోడా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సెలక్షన్లలో గణేష్ ఉత్తమ ప్రతిభ కనబరచడంతో కోచ్‌గా ఎంపిక చేశారు. ఈనెల 15వ తేదీ నుంచి వివిధ రాష్ట్రాల్లో జరగనున్న రంజి క్రికెట్ పోటీల్లో కోచ్‌గా వ్యవహరించనున్నాడు. 13న క్రీడాకారుల ఎంపిక పోటీలు నల్లగొండ టూటౌన్ : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 13న నల్లగొండలోని మేకల అభినవ్ స్టేడియంలో అండర్–14, 17 బాల బాలికలకు కబడ్డీ, వాలీబాల్, క్రికెట్ సెలక్షన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్జీఎఫ్ కార్యదర్శి విమల తెలిపారు. బాల, బాలికలు సంబంధిత పాఠశాలల నుంచి బోనఫైడ్ సర్టిఫికెట్లతో పోటీలకు హాజరు కావాలని సూచించారు. వివరాలకు 9948987026, 7997416876 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు. -
లింగ వివక్ష లేని సమాజాన్ని నిర్మిద్దాం
భువనగిరి: బాలికలపై వివక్ష చూపొద్దని, వారికి అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలని న్యాయవాది నాగేంద్రమ్మ అన్నారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం భువనగిరిలోని కేజీబీవీలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడారు. సమాజంలో లింగ వివక్ష ఇంకా కొనసాగుతోందని, ఇది ఎంతమాత్రం సరైంది కాదన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయడానికి ప్రయత్నించే ఆస్పత్రులపైనా నిఘా ఏర్పాటు చేయాలన్నారు. రాజ్యాంగం మహిళలకు సమాన అవకాశాలు కల్పించిందని వాటిని వినియోగించుకోవాలని పేర్కొన్నారు. హెల్త్ కోచ్, న్యూట్రిషనిస్ట్ జెస్పీ రోజీ బాలికల హక్కులు, సంరక్షణ గురించి అవగాహన కల్పించారు. అదే విధంగా భువనగిరిలోని గిరిజన అశ్రమ బాలికల పాఠశాలలో యాక్షన్ ఎయిడ్ కర్నాటక ప్రాజెక్టు ఆధ్వర్యంలో బాలికా దినోత్సవం నిర్వహించారు.లింగ వివక్షత లేని సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలని యాక్షన్ ఎయిడ్ కమ్యూనిటీ ట్రైనర్ సురుపంగ శివలింగం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నారాయణరెడ్డి, సామాజిక సంఘాల ప్రతినిధులు దేవేందర్, మంద శివ, దాసరి స్వామి, ఉపాధ్యాయులు రాంబాయి పాల్గొన్నారు. -
ఎయిమ్స్‌లో మానసిక ఆరోగ్య దినోత్సవం
బీబీనగర్: మానసిక ఆరోగ్యంపై అవగాహన కీలకమని డాక్టర్ కల్నల్ శశికుమార్ పేర్కొన్నారు. బీబీనగర్ ఎయిమ్స్ వైద్య కళాశాలలో మనోరోగ చికిత్స విభాగం ఆధ్వర్యంలో శనివారం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం నిర్వహించారు. మానసిక ఇబ్బందులున్న వ్యక్తులు అత్యవసర, సంక్షోభ సమయాల్లో సమస్యను అధిగమించడం, ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకునే అంశాలపై వైద్య విద్యార్థులకు అవగాహన కల్పించారు. మత్తు పదార్థాల వినియోగం, నేరప్రవృత్తి, పేదరికం, కుటుంబంలో గొడవల వంటివి మానసిక సమస్యలు దారి తీస్తాయన్నారు. వీటికి దూరంగా ఉండటం వల్ల మానసిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చన్నారు. అనంతరం విద్యార్థులకు రంగోళి, పేయింటింగ్, క్విజ్ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎయిమ్స్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ అహంత శాంతా సింగ్, డీన్ అశోక్ జాన్, మెడికల్ సూపరింటెండెంట్ మహేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన తైక్వాండో పోటీలు
ఫ జాతీయ స్థాయికి ఎంపికై న వారిలో నల్లగొండ బాలిక నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి అండర్–14 ఎస్జీఎఫ్ తైక్వాండో టోర్నీ శనివారం ముగిసింది. బాలబాలికలకు వివిధ కేటగిరీల్లో తైక్వాండో పోటీలు నిర్వహించారు. ప్రతిభ చూపిన క్రీడాకారులకు బంగారు, రజత, కాంస్య పతకాలు అందించారు. పోటీల్లో మనస్విని(నిజామాబాద్), జువేరియా కుల్సుమ్(నల్లగొండ), సమన్విత(రంగారెడ్డి), కతిజాఫాతిమా(నిజామాబాద్), మగేశ్ మెహరిన్(రంగారెడ్డి), హారిక(రంగారెడ్డి), సమీక్ష(రంగారెడ్డి), టి.వైష్ణవి(హైదరాబాద్) బంగారు పతకాలు సాధించి జాతీయస్థాయికి ఎంపికయ్యారు. వీరు ఈ నెల 28 నుంచి నాగాలాండ్‌లో నిర్వహించే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు ఎస్జీఎఫ్ కార్యదర్శి నాగమణి పేర్కొన్నారు. అనారోగ్య సమస్యలతో ఏఎస్సై బలవన్మరణం సూర్యాపేటటౌన్ : అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఏఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన శనివారం సూర్యాపేట పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగారం పోలీస్‌స్టేషన్‌లో స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న గోపగాని సత్యనారాయణగౌడ్(53) సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వివి ఎన్క్లేవ్ టౌన్షిప్లో నివాసముంటున్నారు. ఆయన కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన బెడ్రూంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొన్నారు. ఆత్మహత్య వార్తతో సహచరుల్లో విషాదం నెలకొంది. ఈ సంఘటనపై సత్యనారాయణగౌడ్ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సూర్యాపేట రూరల్ ఎస్ఐ బాలునాయక్ తెలిపారు. మృతుడికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు. పురుగుల మందు తాగి.. గుండాల: కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుండాల మండల కేంద్రానికి చెందిన శ్రీరాముల ఉప్పలయ్య(57) హైదరాబాద్‌లో నివాసముంటూ కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 8న ఇంట్లో గొడవ పడి స్వగ్రామానికి వచ్చి పురుగుల మందు తాగి.. కుటుంబ సభ్యులకు ఫోన్లో సమాచారం ఇచ్చాడు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వారి సహాయంతో 108 వాహనంలో జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి చిన్న కుమారుడు ప్రశాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎం. తేజంరెడ్డి తెలిపారు. బైక్‌ను ఢీకొట్టిన కారు.. ఒకరికి గాయాలుభువనగిరిటౌన్ : బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన భువనగిరి పట్టణంలో శనివారం జరిగింది. వివరాలు.. యాకూబ్ అనే వ్యక్తి బైక్‌పై భువనగిరి పట్టణంలోని పహాడీనగర్ నుంచి జగదేవ్‌పూర్ చౌరస్తాకు వస్తుండగా.. ఆర్కే ఆస్పత్రి వద్దకు రాగానే వెనుక నుంచి కారు వచ్చి ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన యాకూబ్‌ను స్థానికులు స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వ్యభిచార గృహంపై పోలీసుల దాడి
మిర్యాలగూడ అర్బన్: వ్యభిచార గృహంపై శనివారం రాత్రి పోలీసులు దాడి చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మిర్యాలగూడ వన్‌టౌన్ ఎస్ఐ సైదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని హౌజింగ్‌బోర్డు కాలనీలో నివాసముంటున్న రమావత్ విజయ, ఆమె కుమారుడు రమావత్ వినోద్‌రాథోడ్ కలిసి వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి మహిళను, విటుడిని పట్టుకున్నారు. వారి నుంచి రూ.1500 నగదు, రెండు సెల్ఫోన్లు, ఒక యాక్టీవా వాహనం, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ప్రతిభ చాటితే భవిష్యత్తుకు ఉపకారం
తిరుమలగిరి( తుంగతుర్తి): చురుకుదనం, తెలివితేటలు, చదువుపై మంచి పట్టున్న విద్యార్థులు ఆర్థిక కారణాలతో చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2008 నుంచి నేషనల్ మీన్స్‌కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీం(ఎన్ఎంఎంఎస్) అమలు చేస్తోంది. 2025–26 విద్యాసంవత్సరానికి గాను ఈ స్కాలర్షిప్ స్కీంకు దరఖాస్తు చేసుకునేందుకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులంతా ఈ నెల 14 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో ఈ స్కీం కింద ఎంపికై న విద్యార్థులకు ఏటా రూ.6వేల చొప్పున 9, 10, ఇంటర్ మొదటి, రెండో సంవత్సరాల్లో కలిపి రూ.24వేలు అందించేది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ ఉపకార వేతనానని రెండింతలు చేసింది. ఏటా ఇచ్చే మొత్తాన్ని రూ.12వేలకు పెంచింది. అంటే నాలుగేళ్లకు కలిపి విద్యార్థులు రూ.48వేలు అందుకోనున్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు నవంబర్ 23న అర్హత పరీక్ష నిర్వహిస్తారు. చొరవ చూపితే ఎంతో లబ్ధి ఈ స్కీం గురించి సరైన ప్రచారం లేకపోవడం ఫలితంగా విద్యార్థులు ఎక్కువగా లబ్ధి పొందడం లేదు. 7వ తరగతిలో ఓసీ, బీసీ విద్యార్థులు 55 శాతం, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 50 శాతం మార్కులు పొంది, తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.3.50లక్షల లోపు కలిగి ఉన్న వారంతా అర్హులు. 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలతో పాటు ఆధార్, ఆదాయ, కుల, నివాసం ధ్రువీకరణ పత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన లేకపోవడంతో ఈ పరీక్ష రాసేందుకు ముందుకు రావడం లేదని, ఉపాధ్యాయులు చొరవ చూపడం లేదనే విమర్శలున్నాయి. ఉపకార వేతనం రెట్టింపు కావడం, నోటిఫికేషన్ విడుదల కావడంతో విద్యాశాఖ అధికారులు విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరముంది. రాత పరీక్ష ఇలా.. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు 3 గంటల పాటు రెండు విభాగాలుగా పరీక్ష నిర్వహిస్తారు. మొదటి విభాగంలో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ 90 ప్రశ్నలు(90 మార్కులు) ఇస్తారు. ఇందులో వెర్బల్, రీజనింగ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. రెండో విభాగంలో స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 90 ప్రశ్నలు(90 మార్కులు) ఇస్తారు. ఇందులో గణితం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రంపై ప్రశ్నలు ఉంటాయి. 7వ తరగతిలోని పూర్తి సిలబస్, 8వ తరగతిలోని సగం సిలబస్‌పై ప్రశ్నలు అడుగుతారు. ఫ ఈ నెల 14వ తేదీ వరకు ఎన్ఎంఎంఎస్ దరఖాస్తునకు గడువు ఫ ఏడాదికి రూ.12వేల చొప్పున నాలుగేళ్ల పాటు స్కాలర్షిప్ -
తాను చనిపోతూ ఆరుగురికి ప్రాణదానం
మోటకొండూర్: ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి పడడంతో యువకుడి బ్రెయిన్ డెడ్ కాగా.. అతడి అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. వివరాలు.. మోటకొండూర్ మండలం చాడ గ్రామానికి చెందిన గంధమల్ల సైదులు(27) ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 2న దసరా పండుగ రోజు సాయంత్రం గ్రామంలో జమ్మికి వెళ్లి తిరిగి తన బైక్‌పై ఇంటికి వస్తుండగా.. అదుపుతప్పి కంకర రాళ్లపై పడ్డాడు. దీంతో అతడి తల వెనుక భాగంలో బలమైన గాయమైంది. కుటుంబ సభ్యులు భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి సైదులు మృతి చెందాడు. సైదులు తల్లిదండ్రులు లక్ష్మి, రాములుకు జీవన్‌దాన్ సంస్థ ప్రతినిధులు అవయవదానంపై అవగాహన కల్పించటంతో వారు అతడి అవయవాలు దానం చేసేందుకు అంగీకరించారు. ఈ మేరకు సైదులు శరీరం నుంచి 2 కిడ్నీలు, 2 కార్నియాస్, కాలేయం, గుండెను సేకరించి మరో ఆరుగురికి అమర్చినట్లు జీవన్‌దాన్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. సైదులు భౌతికకాయాన్ని శనివారం గ్రామానికి తీసుకురాగా ఆయన స్నేహితులు, బంధువులు, గ్రామస్తులు పెద్దఎత్తున ర్యాలీ తీసి అంత్యక్రియలు నిర్వహించారు. ఫ బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి అవయవాలు దానం చేసిన తల్లిదండ్రులు -
నేడు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి సంతాప సభ
తుంగతుర్తి : మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి సంతాప సభను తుంగతుర్తి మండల కేంద్రంలోని మినీ స్టేడియంలో ఆదివారం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంతర్‌రెడ్డి హాజరవుతున్నట్లు సూర్యాపేట ఎస్పీ నరసింహ తెలిపారు. మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ స్థలాన్ని శనివారం ఎస్పీ పరిశీలించారు. అనంతరం దామోదర్‌రెడ్డి తనయుడు సర్వోత్తంరెడ్డితో కలిసి సంతాప సభ ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, ఆర్డీఓ వేణుమాధవ్, రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు చెవిటి వెంకన్నయాదవ్, సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, పోతు భాస్కర్, సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.ఫ తుంగతుర్తికి రానున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి -
యాదగిరీశుడి సేవలో టీజీపీఎస్సీ చైర్మన్
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తన కుటుంబ సభ్యులతో కలిసి శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి సంప్రదాయంగా స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలో స్వయంభూమూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ అర్చకులు ముఖ మండపంలో వేద ఆశీర్వచనం చేయగా, ఇన్చార్జి ఈఓ రవినాయక్ లడ్డూ ప్రసాదం, స్వామివారి చిత్రపటం అందజేశారు. తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి చౌటుప్పల్ రూరల్: తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు మృతిచెందాడు. ఈ ఘటన చౌటుప్పల్ మండలం పీపల్‌పహాడ్ గ్రామంలో శని వారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీపల్‌పహాడ్ గ్రామానికి చెందిన గీత కార్మికుడు పులనగారి వెంకటేశం(55) రోజుమాదిరిగానే శనివారం కూడా కల్లు గీసేందుకు గ్రామ పరిధిలోని తాటిచెట్టు ఎక్కుతుండగా.. కాలు జారి చెట్టుపై నుంచి కిందపడ్డాడు. తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. గ్రామస్తులు గమనించి పోస్టుమార్టం నిమిత్తం వెంకటేశం మృతదేహాన్ని చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. వెంకటేశం కుటుంబానికి ప్రభుత్వం రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా అందించి ఆదుకోవాలని గీత కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు రాగీరు కిష్టయ్య కోరారు. చికిత్స పొందుతూ.. తుంగతుర్తి : తాటిచెట్టుపై నుంచి కిందపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గీత కార్మికుడు శనివారం మృతిచెందాడు. తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామానికి చెందిన గీత కార్మికుడు గూడ వెంకన్న(48) ఈ ఏడాది మే నెలలో ప్రమాదవశాత్తు తాటిచెట్టుపై నుంచి జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి మంచానికే పరిమితమైన వెంకన్న.. శనివారం మృతిచెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. -
సాగర్ బీసీ గురుకులంలో మెడికల్ క్యాంపు
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్‌లోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో శనివారం 25వ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పాఠశాల పూర్వ విద్యార్థి, గురుకుల విద్యాలయాల సెక్రటరీ బి. సైదులు హాజరై మెడికల్ క్యాంపును ప్రారంభించారు. తాను చదువుకున్న పాఠశాల కావడంతో సైదులు తన గురువులను, స్నేహితులను, జూనియర్లను కలుసుకుని ఆప్యాయంగా పలకరించారు. మెడికల్ క్యాంపులో పాల్గొన్న వైద్యుల సేవలను అభినందించారు. అనంతరం పాఠశాల తరగతి గదులను సందర్శించి విద్యార్థుల అభ్యాస స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. బోధనానోపకరణాలు ఉండేలా చూసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. 10వ తరగతి విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించేలా కృషి చేయాలని ఆర్సీఓ స్వప్న, ప్రిన్సిపాల్ రవికుమార్‌కు సూచించారు. సాగర్‌లో డిగ్రీ కళాశాల కొత్త భవనం నిర్మాణం పూర్తయ్యే వరకు నిడమనూరులో తాత్కాలికంగా తరగతులు కొనసాగించి, అనంతరం ఇక్కడకు మారస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాస్కర్‌రెడ్డి, చిట్ల చక్రపాణి, శివాజీ, సైదులు, కొత్తపల్లి నితీష్, సరిత, హెల్త్ సూపర్వైజర్ రజిని, పీఈటీ నర్సింహ, పీడీ అరుణజ్యోతి, అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఫ హాజరైన పూర్వ విద్యార్థి, గురుకుల విద్యాలయాల సెక్రటరీ సైదులు -
ఆహార భద్రతపై కేంద్రం ప్రత్యేక దృష్టి
ఫ నాబార్డ్ డీడీఎం రవీందర్‌నాయక్ గరిడేపల్లి: ఆహార భద్రతపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందని, ఇందు కోసం రైతులకు ఉపయోగపడేలా అనేక పథకాలను, సబ్సిడీలను అందిస్తుందని నాబార్డ్ డీడీఎం డి. రవీందర్‌నాయక్ అన్నారు. వ్యవసాయ ఉత్పాదకత పెంపు, నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపర్చడం, రైతులకు సులభతర రుణాల కల్పన మొదలైన అంశాలతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకాన్ని తీసుకొచ్చింది. దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన 100 జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేసేందుకు గాను ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకంతో పాటు పప్పుధాన్యాల స్వావలంబన మిషన్‌ను శనివారం ప్రారంభించారు. గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారానికి నాబార్డ్ డీడీఎం రవీందర్‌నాయక్ ముఖ్యఅతిథిగా హాజరై వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులు కూడా ఒకే పంటపై ఆధారపకుండా కూరగాయలు, పండ్ల మొక్కలు, పెరటి కోళ్లు, పశువులు, చేపల పెంపకం చేపట్టి అధిక లాభాలు పొందవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి డివిజన్ ఏడీఏ రమేష్‌బాబు, హుజూర్నగర్ ఏడీఏ రవినాయక్, కేవీకే సీనియర్ శాస్త్రవేత్త డి. నరేష్, కేవీకే శాస్త్రవేత్తలు డి. నరేష్, సీహెచ్. నరేష్, ఎ. కిరణ్, ఎన్. సుగంధి, కంప్యూటర్ ప్రోగ్రామర్ ఎ. నరేష్, వెటర్నరీ ఆఫీసర్ ఈ. కిరణ్, మండల వ్యవసాయ అధికారి ప్రీతమ్‌కుమార్, సందీప్, అనిల్, మండల వ్యవసాయ విస్తరణ అధికారులు, ఇప్కో కంపెనీ ఏరియా మేనేజర్ వెంకటేశ్వర్లు, రైతులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
పెరుగుతున్న బాలాజీనాయక్ బాధితులు
ఫ ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు నల్లగొండకు వచ్చిన కొందరు నల్లగొండ: వడ్డీ వ్యాపారి బాలాజీ నాయక్ బాధితులు పెరుగుతున్నారు. అధిక వడ్డీ ఆశచూపి అమాయక ప్రజల నుంచి రూ.వందల కోట్లు వసూలు చేసిన పీఏపల్లి మండలం పలుగుతండాకు చెందిన బాలాజీనాయక్‌పై ఇప్పటికే పోలీస్ శాఖ కేసులు నమోదు చేసింది. బాధితుల ఆందోళనపై ‘సాక్షి’ శుక్రవారం ప్రత్యేక కథనం ప్రచురించింది. దీంతో శుక్రవారం పుట్టంగండి గ్రామానికి చెందిన కొందరు బాధితులు లంబాడ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు పుట్టంగండి వాసి ముడావత్ శ్రీనునాయక్ ఆధ్వర్యంలో ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు నల్లగొండకు వచ్చారు. సాయంత్రం వరకు వేచి చూశారు. ఎస్పీ అందుబాటులో లేకపోవడంతో శనివారం కలవనున్నట్లు శ్రీనునాయక్ పేర్కొన్నారు. నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ కండక్టర్ కోదాడ: కోదాడ– ఖమ్మం రూట్లోని ఆర్టీసీ బస్సులో శుక్రవారం ప్రయాణించిన ఓ ప్రయాణికురాలు ఆభరణాలు, నగదుతో కూడిన బ్యాగ్‌ను మరిచిపోయింది. దానిని గమనించిన బస్సు కండక్టర్ ప్రవీణ్‌కుమార్ కోదాడ కంట్రోలర్‌కు అందజేశాడు. బ్యాగ్ మరిచిపోయిన ప్రయాణికురాలు కోదాడ ఆర్టీసీ అధికారులను సంప్రదించడంతో సెక్యూరిటీ అధికారులు సదరు బ్యాగ్‌ను ప్రయాణికురాలికి అందజేశారు. లక్షన్నర విలువల గల వస్తువులు ఉన్న బ్యాగ్‌ను తిరిగి అప్పగించిన ఆర్టీసీ అధికారులకు, కండక్టర్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. ఈమేరకు కండక్టర్ ప్రవీణ్‌కుమార్‌ను డిపో మేనేజర్ శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందించారు. భార్య అదృశ్యంపై ఫిర్యాదు నల్లగొండ: తన భార్య కనిపించడం లేదని ఓ వ్యక్తి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నల్లగొండలోని వెంకటరమణ కాలనీకి చెందిన గుంజ రజనీకాంత్ తన భార్య దీపిక శుక్రవారం ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయిందని, ఆమె సమాచారం తెలియడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. రజనీకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు వన్‌టౌన్ పోలీసులు పేర్కొన్నారు. కాగా, వారికి పిల్లలు లేరని తెలిపారు. -
జాతీయ స్థాయికి ఎదిగేలా సాధన చేయాలి
చౌటుప్పల్ : మల్లకంబ్లో రాష్ట్రస్థాయికి ఎంపికై న విద్యార్థులు జాతీయ స్థాయికి ఎదిగేలా సాధన చేయాలని ఎస్జీఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి దశరథరెడ్డి, పీఈటీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కృష్ణమూర్తి తెలిపారు. మల్లకంబ్ రాష్ట్రస్థాయి పోటీలకు ఉమ్మడి జిల్లా జట్ల ఎంపిక కోసం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో శుక్రవారం ట్రినిటీ విద్యాసంస్థల ఆధ్వర్యంలో సెలక్షన్స్ నిర్వహించారు. అండర్–14, అండర్–17, అండర్–19విభాగాల కోసం నిర్వహించిన పోటీల్లో ఒక్కో విభాగం నుంచి 12మంది బాలురు, 12మంది బాలికలను ఎంపిక చేశారు. వీరు నవంబర్‌లో చౌటుప్పల్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో ఉమ్మడి జిల్లా జట్లకు ప్రాతినిథ్యం వహించనున్నారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో దశరథరెడ్డి, కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ఎంపికై న విద్యార్థులు తమ జిల్లాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఎంపిక పోటీలు నిర్వహించిన ట్రినిటీ విద్యాసంస్థల యాజమాన్యాన్ని అభినందించారు. ట్రినిటీ విద్యాసంస్థల చైర్మన్ కేవీబీ.కృష్ణారావు, డైరెక్టర్ డాక్టర్ ఉజ్జిని మంజుల పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంఈఓ గురువారావు, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ట్రస్ట్ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, వ్యాయామ శిక్షకులు శోభ, బిక్కునాయక్, గోపాల్, కిరణ్, వెంకటేష్, నరేష్, మంజుల పాల్గొన్నారు. ఫ ఎస్జీఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి దశరథరెడ్డి -
రోడ్డు దాటుతుండగా బైక్‌ను ఢీకొట్టిన లారీ
నకిరేకల్: హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారిపై బైక్‌పై వస్తున్న ఇద్దరు యవకులు రోడ్డు దాటుతుండగా లారీ ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన నకిరేకల్‌లోని పద్మానగర్ జంక్షన్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. నకిరేకల్‌లోని మార్కెట్ రోడ్డులోని నివాసం ఉంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి శానాల యుగేందర్‌రెడ్డికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు విక్రమ్‌రెడ్డి (26) ఇటీవల బీటెక్ పూర్తి చేసి, ఇంటి వద్ద ఉంటున్నాడు. విక్రమ్‌రెడ్డి తన ఇంటి నుంచి మార్కెట్ రోడ్డులో నివాసం ఉంటున్న తన మిత్రుడు రావుల ప్రభు(23)తో కలిసి బైక్‌పై నకిరేకల్ శివారులోని పద్మానగర్ జంక్షన్‌కు వెళ్లి తిరిగి నకిరేకల్‌కు వస్తున్నాడు. జంక్షన్ వద్ద రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లారీ ట్యాంకర్ వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈప్రమాదంలో విక్రమ్‌రెడ్డి లారీ టైర్ల కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌పై వెనుక కూర్చున్న ప్రభుకు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు విక్రమ్‌రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ప్రభు పరిస్థితి విషమంగా ఉండడంతో నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రమాదానికి కారణమైన లారీ ట్యాంకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యుగేందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటేష్ తెలిపారు. కాగా.. విక్రమ్‌రెడ్డి తండ్రి యుగేందర్‌రెడ్డి సొంత గ్రామం శాలిగౌరారం మండలంలోని పెర్కకొండారం. గత కొన్నేళ్ల క్రితం నకిరేకల్‌లోని మార్కెట్ రోడ్డులో స్థిరపడి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. తమ కుమారుడికి వివాహ సంబంధాలు కూడా చూస్తున్నామని, ఇంతలోనే ఇలా అయిందని కన్నీటిపర్యంతమయ్యారు. ఫ ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు -
నాలుగు గేట్ల ద్వారా సాగర్ నీటి విడుదల
నాగార్జునసాగర్: ఎగువ నుంచి నాగార్జునసాగర్ జలాశయానికి 83,888 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. అంతే నీటిని దిగువకు వదులుతున్నారు. 4 గేట్ల ద్వారా 32,400 క్యూసెక్కులు, విద్యుదుత్పాదన ద్వారా 33,495 క్యూసెక్కులు మొత్తం 65,895 క్యూసెక్కుల నీటిని దిగువ కృష్ణానదిలోకి విడుదల చేస్తున్నారు. కుడికాల్వ, ఎడమ కాల్వ, ఏఎమ్మారీల కాల్వలకు 17,993 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ గరిష్ట స్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.0450 టీఎంసీలు) కాగా జలాశయంలో అంతే నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. -
అవగాహనతో రోడ్డుప్రమాదాల నివారణ
నల్లగొండ టూటౌన్: రోడ్డు భద్రతపై విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో శుక్రవారం సర్వేజన ఫౌండేషన్‌తో మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ.. ప్రజలకు సరైన అవగాహన లేకపోవడంతోనే రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువతకు అవగాహన కల్పించేందుకు వారు తమ, తమ గ్రామాల్లో ప్రచారం కల్పిస్తారని పేర్కొన్నారు. ప్రముఖ వైద్యులు గురువారెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జనార్దన్‌రెడ్డి నేతృత్వంలో సాగుతున్న సేవా కార్యక్రమాలను యూనివర్సిటీ పరిధిలోని విద్యాలయాల్లో నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆన్లైన్ ద్వారా జనార్థన్‌రెడ్డి మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఏడాదికి లక్షల్లో ప్రాణాలు కోల్పోయి వారి కుటుంబాలను నిరాశ్రయులను చేయడం అత్యంత విషాదకరన్నారు. కేవలం అవగాహన ద్వారా మాత్రమే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అలువాల రవి, ఐక్యూ ఏసీ డైరెక్టర్ మిర్యాల రమేష్, ప్రిన్సిపాల్ కౌత శ్రీదేవి, సురం శ్వేత, ఫౌండేషన్ ప్రతినిధి ప్రవీణ్ పాల్గొన్నారు. -
ఆస్తి కోసం తండ్రిపై హత్యాయత్నం
పెన్‌పహాడ్: ఆస్తి కోసం ఓ వ్యక్తిపై ఇద్దరు కుమారులతోపాటు, అతడి భార్య హత్యాయత్నానికి పాల్ప డ్డారు. ఈ సంఘటన మండల పరిధిలోని మేగ్యాతండా తండాలో ఈ నెల 7న చోటు చేసుకుంది. శుక్రవారం సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్లో సీఐ రాజశేఖర్ వివరాలు వెల్లడించారు. తండాకు చెందిన ఆంగోతు కుర్వా, కోటమ్మ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు పవన్‌కళ్యాణ్, ప్రవీణ్‌కుమార్ ఉన్నారు. భార్యకు అక్రమ సంబంధం ఉందని భావించిన కుర్వా గత నాలుగేళ్లుగా వేరుగా ఉంటున్నాడు. కుర్వా పేరు మీద 6 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అయితే తన తండ్రి బతికి ఉంటే ఆ భూమి తమకు దక్కదనే ఉద్దేశంతో అతడిని హత్య చేయడానికి కుట్ర పన్నారు. ఈ నెల 7న అర్ధరాత్రి కోటమ్మతో పాటు కుమారులు ఇంటికి వెళ్లి కుర్వాపై దాడి చేశారు. అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కారు. కళ్లకు గంతలు కట్టి ఇనుపరాడ్డు, కర్రతో కాళ్లు, చేతులపై, ఎడమ దవడపై కొట్టి హత్య చేసేందుకు ప్రయత్నించారు. చుట్టుపక్కల వారు చూసే సరికి భయంతో తండ్రిని సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో పోలీసులు ముగ్గురిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. పవన్‌కళ్యాణ్, ప్రవీణ్‌కుమార్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కుర్వా భార్య కోటమ్మ పరారీలో ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో ఎస్ఐ గోపికృష్ణ, కానిస్టేబుల్స్ లింగరాజు, సైదయ్య తదితరులు పాల్గొన్నారు.ఫ ఇద్దరు కుమారుల అరెస్ట్ ఫ వివరాలు వెల్లడించిన సీఐ రాజశేఖర్ -
వరిలో చీడపీడలు.. నివారణ
త్రిపురారం : వరి పంటలో వాతావరణ మార్పులకు అనుగుణంగా వచ్చే చీడపీడలను రైతులు సరైన సమయంలో గుర్తించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలని, లేకుంటే పంట దిగుబడులు తగ్గి ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్, సేద్యపు విభాగం శాస్త్రవేత్త డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. వరి పంటలో సోకే చీడపీడల నివారణకు రైతులకు ఆయన అందిస్తున్న సూచనలు. అగ్గి తెగులు : వరి పంటలో వచ్చే అగ్గి తెగులును సరైన సమయంలో గుర్తించి తెగులు నివారణకు ట్రైసైక్లోజోల్ 1.6 గ్రాములు లేదా కాసుగామైసిన్ 2.5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. నత్రజని ఎరువులను తగ్గించుకొని, పొలం గట్లపై ఉన్న కలుపును తీసివేయాలి. మొగి పురుగు లేదా కాండతొలుచు పురుగు : వరి పంటలో వాతావరణ పరిస్థితులను బట్టి కాండం తొలుచు పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. నివారణకు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 ఎస్పీ 2గ్రాములు, లేదా 0.3 మి.లీ. క్లోరాట్రానిలిపోల్ 18.5ఎస్పీ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. కాండం కుళ్లు తెగులు : వరి పంటలో కాండం కుళ్లు తెగులు నివారణకు 2 మి.లీ. హెక్సాకోనాజోల్ లేదా 1 గ్రాము కార్బండిజమ్ లేదా 1 మి.లీ. టేబుకోనాజోల్ 15 రోజులు వ్యవధిలో రెండు సార్లు పలకల కింద వరకు తడిచే విధంగా పిచికారీ చేసుకోవాలి. ఆకు ముడత తెగులు : వరిలో ఆకు ముడత తెగులు నివారణకు కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు లేదా క్లోరిపైరిపాస్ 2.5 మి.లీ లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఉల్లికోడు తెగులు : ప్రస్తుత పరిస్థితుల్లో వరి పంటకు ఉల్లికోడు తెగులు ఎక్కువగా ఆశిస్తున్నందున దీని నివారణకు నాటిన 10 నుంచి 15 రోజుల లోపు కార్బోఫ్యూన్ గులికలు ఎకరాకు 10 కిలోలు లేదా ఫోరేట్ గులికలు 5 కిలోలు ఎకరాకు లేదా ఫిప్రోనిల్ 2.5 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. -
వరుస వర్షాలతో ‘బంతి’కి కష్టాలు
తుర్కపల్లి: వరుస వర్షాల కారణంగా బంతి సాగు చేసిన రైతులు తీవ్రనష్టాన్ని ఎదుర్కొంటున్నారు. మొగ్గ దశలోనే వర్షాలు కురవడంతో మొక్కలు ఎదగకపోవడం, పూసిన పూలు వాడిపోవడం రైతులను తీవ్రంగా కలవరపెడుతోంది. రైతులు చెబుతున్న ప్రకారం అర ఎకరానికి రూ.40 వేల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. ఎరువులు, మందులు, కలుపు తీయడం, విత్తనాలు, నారు ఖర్చులు అన్నీ కలిపి రైతుల భారం మరింత పెరిగింది. అయితే ఆశించిన దిగుబడి వచ్చే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పండుగల కోసం సాగు.. ప్రతి ఏడాది బతుకమ్మ, నవరాత్రి, దీపావళి పండుగల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని బంతి సాగు ప్రారంభించే రైతులు, ఈ సారి వరుస వర్షాల కారణంగా నష్టపోతున్నారు. తుర్కపల్లి మండలంలోని నాగాయిపల్లి, పల్లెపహాడ్, గోపాల్పురం, ధర్మారం, రామోజీనాయక్ తండా, మర్రికుంట తండా, మోతిరాంతండా, దయ్యంబండా ప్రాంతాల్లోనే 100 ఎకరాలకు పైగా బంతి సాగు చేశారు. కానీ అధిక వర్షాలతో మొక్కల పెరుగుదల ఆగిపోవడం, పూత రాకపోవడం, ఇప్పటికే పూసిన పూలు వాడిపోవడం వల్ల దిగుబడి ఆశాజనకంగా లేదని రైతులు వాపోతున్నారు. అధిక వర్షాలు, తేమ కారణంగా చీడపీడలు, పీల్చే పురుగులు, పచ్చదోమ, పేనుబంక, తామర పురుగులు వంటివి, ఎక్కువగా పెరుగుతాయి. ఇది పంటకు మరింత నష్టం కలిగిస్తుందని పేర్కొంటున్నారు. గతేడాది మంచి లాభాలు తెచ్చిన బంతి సాగు ఈసారి రైతులను అప్పల బారిన పడేలా చేస్తోందని వాపోతున్నారు. ఉపాధి హామీ పథకం కింద కూలీలను వినియోగించి రైతులకు తోడ్పాటు అందించాలని, తడి పంటల కోసం విత్తనాలు, ఎరువులు, క్రాప్ పైపులను ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. ఫ ఎదగని మొక్కలు ఫ వాడిపోతున్న పూలు ఫ ఆందోళనకు గురవుతున్న రైతులువర్షాల కారణంగా మా బంతి తోట మొత్తం నీట మునిగింది. ఉత్పిత్తి తగ్గి, ధరలు కూడా తగ్గితే మరింత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రభుత్వం సాయం అందించకపోతే రైతులు మరింత కష్టాల్లో పడతారు. – పాచ్య, రైతు, గోగూల్గుట్టతండా -
కల్తీ వరి విత్తనాలు వచ్చాయని రైతుల ఆందోళన
కోదాడరూరల్ : మండల పరిధిలోని కూచిపూడిలో చింట్లు సీడ్ రకం వరి విత్తనాల్లో కల్తీ విత్తనాలు వచ్చాయని శుక్రవారం రైతులు ఆందోళనకు దిగారు. కోదాడకు చెందిన ముగ్గురు విత్తన దుకాణాదారులకు, సంబంధిత డీలర్లకు గతం వారం రోజులుగా చెబుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వరి సాగు పొట్టదశకు రావడంతో ముందుగా బెరుకులు ఈతకు వచ్చాయని అవి దొడ్డురకంగా ఉన్నాయని తెలిపారు. ఈ విధంగా బెరుకులు రావడంతో ఎకరానికి 5బస్తాల దిగుబడిపై ప్రభావం పడుతుందన్నారు. గ్రామంలో దాదాపుగా 150 మంది రైతుల భూమికి సంబంధించి 300 ఎకరాల్లో బెరుకులు ఈవిధంగానే ఉన్నాయని పేర్కొన్నారు. ఇదిలా ఉంగా.. శుక్రవారం పంట పరిశీలనకు ఆయా కంపెనీల డీలర్లు వచ్చారు. న్యాయం చేయాలని కోరితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఆరోపిస్తూ రైతులు వారితో వాగ్వాదానికి దిగారు. వారి నుంచి కారును స్వాధీనం చేసుకున్నారు. సీడ్ డీలర్, డిస్ట్రిబ్యూటర్లు వచ్చి న్యాయం చేసిన తర్వాతే కారు ఇస్తామని రైతులు తెలిపారు. కార్యక్రమంలో శిరంశెట్టి రామారావు, శెట్టి శ్రీనివాసరావు, శిరంశెట్టి రవి, రామారావు, చాప సురేష్, కొండ, రమణ , చేతుల రామకష్ణ, తెల్లగొర్ల రామకష్ణ, తిరపతిరావు పాల్గొన్నారు. -
మూసీకి కొనసాగుతున్న వరద
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. శుక్రవారం 5,838 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుంది. దీంతో 645 అడుగుల గరిష్ట నీటిమట్టం గల మూసీ రిజర్వాయర్‌లో నీటిమట్టం 644.28 అడుగుల వద్ద ఉంది. దీంతో అధికారులు ప్రాజెక్టు రెండు క్రస్ట్ గేట్లను రెండు అడుగుల మేర పైకెత్తి 6,437 క్యూసెక్కుల నీటిని దిగవకు వదులుతున్నారు. ఆయకట్టులో పంటల సాగుకు కుడి, ఎడమ ప్రధాన కాల్వకు 340 క్యూసెక్కులు వదులుతున్నారు. గేట్ల ద్వారా, కాల్వలకు మొత్తం 6,826 క్యూసెక్కుల నీరు విడుదలవుతుంది. మూసీ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.27 టీఎంసీల నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. -
మద్యం టెండర్లకు 227 దరఖాస్తులు
భువనగిరి: జిల్లాలో మద్యం టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. నాలుగు ఎకై ్సజ్ సర్కిళ్ల పరిధిలోని 82 దుకాణాలకు గాను గత నెల 26నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మొత్తం 227 దరఖాస్తులు రాగా.. అందులో శుక్రవారం ఒక్క రోజే 36 దరఖాస్తులు ఉన్నట్లు ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. చివరి గడువు ఈనెల 18వ తేదీ వరకు ఉందన్నారు. నేడు రెండవ శనివారం (సెలవు) అయినప్పటికీ వ్యాపారుల విజ్ఞప్తి మేరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. కాగా 27 మద్యం దుకాణాలకు ఒక దరఖాస్తు కూడా రాలేదు. 13న ప్రజావాణి భువనగిరి టౌన్: స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ఎత్తివేయడంతో సోమవారం కలెక్టర్‌లో ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ హనుమంతరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలంతా గమనించాలని, సమస్యలపై ఫిర్యాదులు ఇచ్చేందుకు రావచ్చన్నారు. ఆండాళ్‌దేవికి ఊంజల్ సేవయాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శుక్రవారం నిత్యారాధనల్లో భాగంగా ఆండాళ్‌దేవికి ఊంజల్ సేవ నేత్రపర్వంగా చేపట్టారు. సాయంత్రం వేళ అమ్మవారిని పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించి ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. అమ్మవారి సేవకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అనంతరం అద్దాల మండపంలో అధిష్టింపజేసి ఆగమశాస్త్రానుసారం ఊంజల్ సేవ నిర్వహించారు. విద్యార్థి దశలోనే కంప్యూటర్ పరిజ్ఞానం పొందాలి వలిగొండ : విద్యార్థులు ప్రాథమిక దశలోనే కంప్యూటర్ పరిజ్ఞానంపై పట్టు సాధించాలని డీఈఓ సత్యనారాయణ సూచించారు. వలిగొండ మండలం లోతుకుంట గ్రామ ఆదర్శ పాఠశాలలో శుక్రవారం ‘ఏ బుక్ హన్ డిజిటల్ లెర్నింగ్’ అంశంపై జిల్లాస్థాయిలో గణిత ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. 6 నుంచి 9వ తరగతి విద్యార్థులు కంప్యూటర్ విద్యపై ఆసక్తి కనపరిచేలా వారిని తీర్చిదిద్దాలని సూచించారు. కోడింగ్ విధానంపై పట్టు సాధిస్తే భవిష్యత్‌లో ఉన్నత స్థితికి చేరుకునేందుకు దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలు పాఠశాలల ప్రిన్సిపాళ్లు, డీఆర్పీలు పాల్గొన్నారు. వాలీబాల్ పోటీలకు గురుకుల విద్యార్థి ఆలేరు: రాష్ట్రస్థాయి వాలీ బాల్ పోటీలకు ఆలేరు వి ద్యార్థి బీ.మణికాంత్ ఎంపికయ్యాడు. మణికాంత్ ఆలేరులోని మహాత్మ జ్యోతి బాపూలే గురుకుల పాఠశాల, కళాశాల(రాజాపేట) లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈనెల 9న భువనగిరిలో జరిగిన అండర్–19 కేటగిరీలో జరిగిన ఎస్జీఎఫ్ సెలక్షన్లలో ఉమ్మడి నల్లగొండ జిల్లా తరఫున పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. దీంతో నవంబర్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్టు పీడీ భాస్కర్ శుక్రవారం తెలిపారు. వన్ హెల్త్ పై వర్క్‌షాప్ బీబీనగర్: మండల కేంద్రంలోని ఎయిమ్స్ వైద్య కళాశాలలో మైక్రోబయాలజీ విభాగం ఆధ్వర్యంలో వన్ హెల్త్(ఒక ఆరోగ్యం) అనే అంశంపై శుక్రవారం వర్క్‌షాపును నిర్వహించారు. ఈ సందర్భంగా మానవ, జంతు పర్యావరణ ఆరోగ్యం మధ్య ఉండే పరస్పర సంబంధంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు రాహుల్ నారంగ్, మౌనికరెడ్డి, దీపక్రాహుల్, జోత్న్స, విశాఖజైన్, రుద్రేష్, లక్ష్మీజ్యోతి, శ్యామల పాల్గొన్నారు. -
స్వర్ణగిరీశుడికి తిరువీధి సేవ
భువనగిరి: పట్టణ పరిధిలోని స్వర్ణగిరి క్షేత్రంలో శుక్రవారం రాత్రి శ్రీవేంకటేశ్వరస్వామి వారి తిరువీధి సేవ కనులు పండువగా సాగింది. స్వామివారిని సుందరంగా అలంకరించి ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. అంతకుముందు వేకువజామున సుప్రభాత సేవ, తో మాల సేవ, సహస్రనామార్చన, నిత్యకల్యా ణం నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. సాయంత్రం పద్మావతి అమ్మవారికి సహస్ర కుంకుమార్చన వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. -
ఆర్టీఐఏపై అవగాహన తప్పనిసరి
సాక్షి,యాదాద్రి : పనితీరులో పారదర్శకత, జవాబు దారీతనాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో రూపొందించిన సమాచార హక్కు చట్టం(ఆర్టీఐఏ)–2005పై అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. సమాచార హక్కు చట్టం వారోత్సవాల్లో భాగంగా శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయిలో అన్ని శాఖల అధికారులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్‌రావుతో కలిసి కలెక్టర్ మాట్లాడారు. చట్టంపై, చట్టంలో పొందుపరిచిన ప్రతి అంశంపై అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉన్నప్పుడే దరఖాస్తుదారుడు కోరిన సమాచారాన్ని సరైన విధంగా, నిర్ణీత గడువులో ఇవ్వగలుగుతారని పేర్కొన్నారు. క్షేత్ర సిబ్బందికి సైతం చట్టంపై అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో డీఆర్ఓ జయమ్మ, ఆర్డీఓలు కృష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, డీఆర్డీఓ నాగిరెడ్డి, కలెక్టరేట్ ఏఓ జగన్మోహన్ప్రసాద్ పాల్గొన్నారు.ఫ కలెక్టర్ హనుమంతరావు -
వరద పారదు.. నీరు చేరదు
చౌటుప్పల్ : చౌటుప్పల్ పట్టణంలోని ఊరచెరువులో చుక్క నీరు లేక వెలవెలబోతోంది. గత మూడేళ్లుగా ఇదే పరిస్థితులు ఉన్నాయి. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురువడంతో మండలంలోని దాదాపు చెరువులు, కుంటులు జలకళను సంతరించుకున్నాయి. కానీ, ఊర చెరువు మాత్రం నీటికి నోచుకోలేదు. చెరువులో సమృద్ధిగా నీరుంటే దిగువ భాగంలో భూగర్భ జలా లు సమృద్ధిగా ఉంటాయి. ఒక్కసారి చెరువు నిండితే వరుసగా రెండేళ్లపాటు నీటి సమస్య తలెత్తదు. మూ డేళ్ల నుంచి చెరువులోకి నీరు చేరకపోవడంతో దిగువ భాగంలో బోర్లు ఎండిపోయి తాగునీటికి కరువు ఏర్పడింది. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసే పరిస్థితులు తలెత్తాయి. ఆనవాళ్లు కోల్పోయిన చెరువు వరుసగా మూడేళ్లుగా చెరువులోకి నీరు చేరకపోవడంతో ప్రస్తుతం కంపచెట్లతో మూసుకుపోయింది. ఆనవాళ్లు కోల్పోయి దర్శనమిస్తోంది. చెరువులో రెండు ప్రాంతాల్లో ఉన్న గుంతల్లోకి మాత్రమే కొద్దిపాటి నీరు చేరింది. ఆ నీరు సైతం మరో రెండు వారాల్లో ఇంకిపోయే అవకాశం ఉంది. పిలాయిపల్లి కాలువ ద్వారా మూసీ జలాల మళ్లింపే శరణ్యం ఊరచెరువు నీటితో కళకళలాడాలంటే వర్షం నీటితో సాధ్యమయ్యే పరిస్థితులు ఏ మాత్రం కనిపించడంలేదు. అందుకు పిలాయిపల్లి కాలువ ద్వారా మూసీ జలాలను చెరువులోకి మళ్లించడమే శాశ్వత పరిష్కారమని పట్టణవాసులు అంటున్నారు. కొద్దిపాటి నిధులు ఖర్చుచేస్తే మంచి ఫలితాలు దక్కనున్నాయని అభిప్రాయపడుతున్నారు.చౌటుప్పల్ ఊరచెరువు మూడేళ్లుగా వెలవెల ఫ సమృద్ధిగా వర్షాలు కురిసినా నీటికి కరువే ఫ మూసీ జలాలను మళ్లించాలంటున్న పట్టణవాసులు -
నిధుల్లేక.. పనులు సాగక
సాక్షి, యాదాద్రి : జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పనులు ముందడుగు పడే పరిస్థితులు కనిపించడం లేదు. ఇందుకు భూ సేకరణకు వెంటాడుతున్న కష్టాలు, ముంపుగ్రామాల నిర్వాసితులకు పరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ చెల్లింపులో జాప్యమే కారణమని తెలుస్తోంది. ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే తప్ప.. పనులు వేగం పుంజుకునే పరిస్థితి కనిపించడం లేదు. భారీ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శనివారం కలెక్టరేట్లో జిల్లా ఇంచార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షించనున్నారు. ఈ సందర్భంగా నిధుల అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రధాన సమస్యలు ఇవీ.. ● గంధమల్ల రిజర్వాయర్ పనులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జూలై 6వ తేదీన శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం భూ సేకరణ పనులు తుది దశకు చేరాయి. భూ సేకరణ పూర్తయిన చోట పరిహారం ఖరారైనా నేటికీ ఒక్క రైతుకూ చెల్లింపులు చేయలేదు. ● బునాదిగాని, పిలాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి, బొల్లేపల్లి కాలువల పనులు ఆగుతూ సాగుతున్నాయి. భూసేకరణకు అడ్డంకులు తొలగడం లేదు. ● దేవాదుల ప్రాజెక్టు ప్యాకేజీ–7, దేవాదుల ప్రాజెక్టు ఏఆర్ఎంసీ, కాళేశ్వరం ప్యాకేజీ–14, 15,16 ప్యాకేజీల కింద భూసేకరణ, బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామాలైన బీఎన్ తిమ్మాపూర్, లప్పానాయక్‌తండా, చోక్లాతండాల నిర్వాసితులకు నష్టపరిహారం, పునరావాస గ్రామాలను నిర్మించాల్సి ఉంది. నిధుల లేమితో పనుల్లో పురోగతి కనిపించడం లేదు. ధాన్యం కొనుగోళ్లపై.. వానాకాలం ధాన్యం కొనుగోళ్లు, ఏర్పాట్లపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీక్షించనున్నారు. ధాన్యం దిగుబడి, సేకరణ లక్ష్యం, కొనుగోలు కేంద్రాలు, సౌకర్యాలు తదితర అంశాలపై అధికారులతో సమీక్షించనున్నట్లు తెలిసింది. ఫ సాగునీటి కాల్వలకు భూ సేకరణ అడ్డంకులు ఫ ముంపు గ్రామాల నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో జాప్యం ఫ నిధులు విడుదల చేస్తేనే పనుల్లో వేగం ఫ నేడు కలెక్టరేట్లో మంత్రులు ఉత్తమ్, అడ్లూరి లక్ష్మణ్ సమీక్ష -
నేడు హైకోర్టు చీఫ్ జస్టిస్ రాక
సాక్షి, యాదాద్రి : రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ఏకే సింగ్, ఇతర న్యాయమూర్తులు శనివారం యాదాద్రి భువనగిరి జిల్లాకు రానున్నారు. జస్టిస్ ఏకే సింగ్ హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో యాదగిరిగుట్టకు ఉదయం పదిగంటలకు చేరుకుంటారు. శ్రీ స్వామివారి దర్శనం, ఆశీర్వచనం అనంతరం తీర్థప్రసాదాలు తీసుకుంటారు. అనంతరం కొండపైన విశ్రాంతి గృహం నుంచి మంచిర్యాల జిల్లా కోర్టు భవనాల సముదాయానికి వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారు. అనంతరం యాదగిరిగుట్ట నుంచి నేరుగా భువనగిరిలోని మాస్కుంటవద్దకు వెళ్తారు. అక్కడ జిల్లా కోర్టు భవనాల సముదాయానికి హైకోర్టు న్యాయమూర్తులతో కలిసి శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగిస్తారు. ఆయన వెంట హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శరత్, జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ సృజనా కళాశికం, జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి పాల్గొంటారు. న్యాయమూర్తుల పర్యటనకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఫ జిల్లా కోర్టు భవన నిర్మాణానికి శంకుస్థాపన ఫ లక్ష్మీనరసింహస్వామి దర్శనం -
క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదం
నల్లగొండ టూటౌన్: క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని యాదాద్రి జోనల్ సంరక్షణ అధికారి శివాల రాంబాబు అన్నారు. గురువారం నల్లగొండలోని మేకల అభినవ్ అవుట్ డోర్ స్టేడియంలో రీజనల్ ఫారెస్ట్ స్పోర్ట్స్ – 2025 క్రీడాపోటీలను ఆయన క్రీడా జ్యోతి వెలిగించి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి మహమ్మద్ అక్బర్ అలీ, ఏటీఆర్ సర్కిల్ సంరక్షణ అధికారి సునీల్ ఇరామత్, నల్లగొండ డీఎఫ్ఓ పెట్ల రాజశేఖర్, ఎఫ్డీఓ నాగభూషణం, ఎఫ్ఆర్ఓ వీరేంద్రబాబు, భువనగిరి, జోగులాంబ గద్వాల, నల్లగొండ సర్కిల్‌కు సంబంధించిన తొమ్మిది జిల్లాల ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు. -
గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
మునగాల: మండలంలోని కృష్ణానగర్ గ్రామ శివారులో గల సాగర్ ఎడమకాలువ(పాలేరు)లో బుధవారం గల్లంతైన వ్యక్తి మృతదేహం గురువారం ఖమ్మం జిల్లా పాలేరు జలాశయంలో లభ్యమైంది. నడిగూడెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణానగర్ గ్రామానికి చెందని భుక్యా బాబునాయక్(42) బుధవారం అయ్యప్ప మాల స్వీకరించాడు. అదే రోజు సాయంత్రం స్నానమాచరించేందుకు మిగతా మాలధారులతో కలిసి సాగర్ ఎడమకాలువ వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో స్నానం చేస్తుండగా భుక్యా బాబునాయక్ ప్రమాదవశాత్తు కాలు జారి కాలువలో పడిపోయి వరద ఉధృతికి కొట్టుకుపోయాడు. గురువారం పాలేరు జలాశయంలో అతడి మృతదేహం కనిపించింది. మృతుడి కుమారుడు భుక్యా భరత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నడిగూడెం పోలీసుల కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం భువనగిరిటౌన్ : భువనగిరి మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా గురువారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు పట్టణ పోలీసులు అక్కడకు వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. సుమారు 35 నుంచి 40 సంవత్సరాల వయసు ఉంటుందని, ఆకుపచ్చ–నలుపు రంగు టీ షర్ట్, నలుపు రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పత్తి తీసేందుకు వెళ్లిన మహిళా కూలీ అదృశ్యంనడిగూడెం : పత్తి తీసేందుకు వెళ్లిన మహిళా కూలీ ఈ నెల 7న అదృశ్యమైంది. స్థానిక ఎస్ఐ గందమళ్ల అజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నడిగూడెం మండలం సిరిపురం గ్రామానికి చెందిన పఠాన్ జానిబేగం (38) ఈనెల 7న తమ గ్రామానికి చెందిన తోటి కూలీలతో కలిసి ఆటోలో ఖమ్మం జిల్లా కూసుమంచి ప్రాంతంలో పత్తి తీసేందుకు వెళ్లింది. తర్వాత జానిబేగం ఇంటికి రాలేదు. బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె భర్త పఠాన్ జాఫర్ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
దుర్గాదేవి ఉత్సవాల లక్కీడ్రా విజేతకు ప్లాట్ రిజిస్ట్రేషన్
భూదాన్‌పోచంపల్లి: భూదాన్‌పోచంపల్లి మండలంలోని గౌస్‌కొండ గ్రామంలో శ్రీ శివరామ దుర్గాకమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన దేవీ శరన్నవ రాత్రోత్సవాలను పురస్కరించుకొని లక్కీ డ్రా ఏర్పాటు చేశారు. ఈ నెల 3న నిర్వహించిన డ్రాలో చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన రూపాని రాజుకు 150 గజాల ప్లాట్ వరించింది. దాంతో గురువారం ఆ విజేతకు చిట్యాల మండలంలోని చిన్నకాపర్తి గ్రామంలో 150 గజాల ప్లాటును రిజిస్ట్రేషన్ చేసి నిర్వాకులు డాక్యుమెంట్స్ అందజేశారు. ఈసందర్భంగా రాజు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ శ్రీశివరామ దుర్గాకమిటీ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గూడూరు ప్రమోద్‌రెడ్డి, వెదిరె రాజిరెడ్డి, మర్రి నితిన్‌రెడ్డి, కళ్లెం రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
కంటైనర్ ఢీకొని హోంగార్డు దుర్మరణం
రామన్నపేట: విధి నిర్వహణలో ఉన్న హోంగార్డును కంటైనర్ లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన గురువారం తెల్లవారుఝామున రామన్నపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిపురం గ్రామానికి చెందిన కూరెళ్ల ఉపేంద్రాచారి(35) రామన్నపేట పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం తెల్లవారుఝామున రామన్నపేట సుభాష్ సెంటర్లో అతడు మరో కానిస్టేబుల్‌తో కలిసి వాహనాలను తనిఖీ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఉపేంద్రాచారి భువనగిరి నుంచి చిట్యాల వైపు వెళ్తున్న కంటైనర్‌ను ఆపే ప్రయత్నం చేశాడు. డ్రైవర్ ఆపకుండా వాహనాన్ని ముందుకు పోనివ్వడంతో హోంగార్డును ఢీ కొట్టింది. దీంతో అతడి తలభాగం పూర్తిగా ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య శోభ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హోంగార్డును ఢీకొట్టి అక్కడి నుంచి పరారైన కంటైనర్ డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఉపేంద్రాచారి మృతితో ఆస్పత్రి ఆవరణలో కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల రోదనలు మిన్నంటాయి. హోంగార్డుకు ప్రముఖుల నివాళివిధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన హోంగార్డు కూరెళ్ల ఉపేంద్రాచారి మృతదేహాన్ని ఎమ్మెల్యే వేముల వీరేశం, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, అడిషనల్ ఎస్పీ వినోద్‌కుమార్, అడ్మిన్ ఆర్ఐ శ్రీనివాస్ సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యే వేముల వీరేశం రూ.20వేల ఆర్థికసాయం అందజేశారు. అదేవిధంగా హోంగార్డు సంక్షేమ నిధి నుంచి తక్షణ సాయంగా రూ.10వేలు, భువనగిరి హెడ్‌క్వార్టర్స్ తరపున రూ.లక్ష ఆర్థికసాయం అందజేశారు. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సీపీ సుధీర్‌బాబుకు ఫోన్‌చేసి ఉపేంద్రాచారి భార్యకు ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరారు. అదేవిధంగా ఉపేంద్రాచారి మృతదేహాన్ని చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్‌రెడ్డి, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ నాగరాజు సందర్శించి నివాళులర్పించారు. -
ఏసీబీకి చిక్కిన చిట్యాల తహసీల్దార్
చిట్యాల: ల్యాండ్ మ్యుటేషన్, ఇన్స్పెక్షన్ రిపోర్టు ఇచ్చేందుకుగాను నల్లగొండ జిల్లా చిట్యాల మండల తహసీల్దార్ గగులోతు కృష్ణ ఓ రియల్ ఎస్టేట్స్ సంస్థ ద్వారా లంచం తీసుకుంటుండగా గురువారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మహబూబ్‌నగర్ ఏసీబీ డీఎస్పీ, నల్లగొండ జిల్లా ఇన్చార్జ్ ఏసీబీ డీఎస్పీ సీహెచ్. బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల మండలం గుండ్రాంపల్లి రెవెన్యూ పరిధిలోని 172 సర్వే నంబర్‌కు సంబంధించి ల్యాండ్ మ్యుటేషన్, 167 సర్వే నంబర్‌పై ఇన్స్పెక్షన్ రిపోర్టు కోసం మెస్సర్స్ రత్న హౌసింగ్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఇటీవల తహసీల్దార్ గగులోతు కృష్ణను ఆశ్రయించింది. ఇందుకుగాను తహసీల్దార్ రూ.10లక్షలు డిమాండ్ చేయగా.. సంస్థ రూ.5లక్షలకు ఒప్పందం కుదుర్చుకుంది. ముందస్తుగా రూ.2లక్షలను ప్రైవేటు వ్యక్తి గట్టు రమేష్‌కు ఇవ్వాలని తహసీల్దార్ సూచించారు. ఈ విషయంపై సంస్థ ప్రతినిధులు ఫోన్ ద్వారా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. గురువారం సంస్థ ప్రతినిధులు తహసీల్దార్ కార్యాలయం బయట రమేష్‌కు రూ.2లక్షలను అందజేస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. దీంతో నగదు రికవరీ చేయడంతోపాటు, రమేష్‌ను, తహసీల్దార్ కృష్ణను అదుపులోకి తీసుకున్నారు. వీరిని నాంపల్లి ఏసీబీ కోర్టులో శుక్రవారం హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు. హైదరాబాద్‌లోని తహసీల్దార్‌కు చెందిన ఇంటిలో కూడా సోదాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మైనింగ్ విషయంలోనూ తహసీల్దార్‌పై ఆరోపణలు ఏసీబీకి చిక్కిన చిట్యాల తహసీల్దార్ కృష్ణపై మైనింగ్ విషయంలో ఆరోపణలు ఉన్నాయి. గత ఎన్నికల సమయంలో తహసీల్దార్ కృష్ణ చిట్యాల మండలానికి వచ్చారు. మండలంలోని వెలిమినేడు, పెద్దకాపర్తి పరిసర ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ జరుగుతున్నా పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా తన వ్యవసాయ క్షేత్రం వద్ద వేసిన షెడ్లు ప్రభుత్వ భూమిలో ఉన్నాయని పేర్కొంటూ వాటిని కూల్చివేయించి ఆస్తినష్టం కలిగించారని చిన్నకాపర్తికి చెందిన బోయపల్లి శ్రీనివాస్ తహసీల్దార్ కృష్ణపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. -
‘నెల్లికల్లు’ పనులు ముమ్మరం
నాగార్జునసాగర్: సాగర తీరంలోని బండలక్వారీ సమీపంలో మూడేళ్ల క్రితం మొదలైన నెల్లికల్లు ఎత్తిపోతల పనులు తిరిగి కొనసాగుతున్నాయి. ఆరునెలల్లో ఒక పంపుతోనైనా నీరు పోయించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు ఇంజనీర్లు తెలిపారు. గత రెండేళ్లుగా జూలై నుంచి సుమారుగా డిసెంబర్ వరకు జలాశయంలో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరువలోనే ఉండటంతో పనులకు కొంతమేర అంతరాయం కలిగింది. జలాశయంలో నీరు తగ్గుముఖం పట్టిన సమయంలో పనులు జోరందుకుంటున్నాయి. జలాశయంలో 510 అడుగుల నీరు ఉన్నప్పుడు జలాశయ తీరంలో ఎత్తిపోతల పథకానికి నీరు తీసుకునే ప్రాంతంలో నీరుండదు. అందుకుగాను జలాశఽయ తీరంలో ప్రత్యేకంగా బావిని 35మీటర్ల లోతు తవ్వారు. జలాశయం లోపలి నుంచి అప్రోచ్ కెనాల్స్‌ను సుమారుగా 300 మీటర్లకు పైచిలుకే తవ్వడం పూర్తయింది. జలాశయంలోని నీరు బావిలోకి రాకుండా ఉండేందుకు బావి చుట్టూ కాంటూర్ బండ్ ఏర్పాటు చేశారు. బావిలోకి నీటి ఊట రాకుండా దరులకు కాంక్రీట్ చేశారు. దానిలో పంప్‌హౌస్‌ల ఏర్పాటు కోసం స్లాబులు వేసేందుకు సెంట్రింగ్ పనులు జరుగుతున్నాయి. జలాఽశయంలో నీరుండటంతో పంప్‌హౌస్‌లోకి నీటి జాలు వచ్చి చేరుతుందని, దీంతో నిత్యం డీవాటరింగ్ చేయాల్సి ఉంటుందని ఇంజనీర్లు తెలిపారు. కొనసాగుతున్న పైప్‌లైన్ పనులుసాగర తీరం నుంచి ఎర్రచెరువు వరకు పైప్‌లైన్ పనులు జరగాల్సి ఉంది. ఇందులో భాగంగా ఎర్ర చెరువుతండా నుంచి ఇరువైపులా పైపులైన్ వేస్తున్నారు. ఒక పైప్‌లైన్ గోడుమడక వైపు వెళ్తుండగా.. మరో పైప్‌లైన్ యల్లాపురం తండా వైపు వెళ్లనుంది. కొన్ని చోట్ల ఫారెస్ట్ అంతరాయం ఉండటంతో వాటికి క్లియరెన్స్‌లు కూడా వచ్చినట్లు ఇంజనీర్లు తెలిపారు. 24వేల ఎకరాలకు నీరందించే లక్ష్యం సాగర్‌డ్యాం నిర్మాణ సమయంలోనే జలాశయ తీరప్రాంతానికి సాగు నీరు ఇవ్వాలనే డిమాండ్ వచ్చింది. 70 ఏళ్లుగా ప్రజలు ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ వచ్చారు. జలాశయం తీరప్రాంతంలో నెల్లికల్లు లిఫ్ట్ ఏరా్పాటు చేసి వేలాది ఎకరాల బీడు భూములు సాగులోకి తీసుకురావడంతోపాటు తాగునీరు ఇవ్వాలని ఈ ప్రాంత రైతులు, గిరిజనులు కోరుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోదాడలో నిర్వహించిన పార్టీ మీటింగ్‌లో నెల్లికల్లు లిఫ్ట్‌కు రూ.50కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ కార్యరూపం దాల్చలేదు. అదేవిధంగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2021 ఫిబ్రవరి 10న నెల్లికల్లు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. సాగర్ జలాశయతీరం గిరిజన తండాల్లోని 24వేల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో లిఫ్ట్ పనులు ప్రారంభమయ్యాయి. కొనసాగుతున్న పంప్‌హౌస్ స్లాబ్ సెంట్రింగ్ పనులు ఆరునెలల్లో ఒక పంపుతోనైనా నీరు పోయించాలని లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు -
‘మిరప’లో తెగులును నివారిద్దాం
పెద్దవూర: ప్రస్తుతం మిరప చేలు పక్వ దశలో ఉన్నాయి. అనేక చీడపీడలు వ్యాపించి రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. శిలీంద్రాలు, పురుగులు, సూక్ష్మధాతువు లోపాలు ఉన్నట్లు దీనికి తోడు నల్లతామర పురుగులు వ్యాప్తి ఉంది. కొమ్మ ఎండు, కాయకుళ్లు, బూడిద తెగుళ్లు, కాయతొలిచే పురుగుల వల్ల పంట నష్టపోయే ప్రమాదం ఉంది. దీంతో నాణ్యత తగ్గి తాలుకాయలు ఏర్పడి మార్కెట్లో ఆశించిన మద్దతు ధర లభించదు. అందుకు గాను మిరప పంటలో సస్యరక్షణ పద్ధతులు పాటించి కాపాడుకోవాలని ఉద్యానవన క్లస్టర్ అధికారి మురళి రైతులకు సూచిస్తున్నారు. కొమ్మ ఎండు, కాయకుళ్లు..మిరప పైరు పూత దశ నుంచి కాయ దశకు వచ్చే సమయాల్లో కొమ్మ ఎండు తెగులు, కాయ కుళ్లు, తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. వీటి కారణంగా కొమ్మ, కాయపై బూడిద రంగు మచ్చలు ఏర్పడతాయి. వీటి ప్రభావంతో కొమ్మలు పైనుంచి కింది వరకు ఎండిపోతాయి. కాయ సహజ రంగును కోల్పోతుంది. నివారణ చర్యలుఎకరానికి 200 లీటర్ల నీటిలో 200 మి.లీ ప్రొఫికానజోల్, లేదా 100 మి.లీ. డైఫెన్ కొనజోల్, లేదా 200 గ్రాముల ఫైరాక్సీ స్ట్రోబిన్ను కలిపి పిచికారీ చేయాలి. బూడిద తెగుళ్లుచలి, తేమ వంటి వాతావరణం మార్పులతో బూడిద తెగులు సోకుతుంది. ఈ తెగుళ్లను కలిగించే శిలీంధ్రంతో ఆకు కింది భాగంలో బూడిద రంగులో తెల్లటి పొడి ఏర్పడుతుంది. దీని వల్ల ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోతాయి. నివారణఎకరాకు 200 లీటర్ల నీటిలో 300 గ్రాముల గంధకం, లేదా 200 మి.లీ.ల డైనోకాప్, లేదా బెలటాన్, లేదా అజాక్సీస్ట్రోబిన్లను కలిపి పిచికారీ చేయాలి. లేదా లీటర్ నీటిలో 200 మి.లీ. ట్రైౖ డిమార్ఫ్ కలిపి పిచికారీ చేయొచ్చు. కాయ తొలిచే పురుగుకాయ తొలిచే పురుగు కాయలను రంధ్రం చేసి లోపలి భాగాన్ని తినడం వల్ల కాయ రాలిపోవడం లేదా కాయ పరిమాణం తగ్గి నాణ్యత, దిగుబడి కోల్పోతుంది. నివారణ లీటర్ నీటిలో 1.5 గ్రాముల అసిఫేట్, లేదా ఒక మి.లీ నుపులురాన్, లేదా 0.3 మి.లీ.ల రైనాక్సీఫైర్, లేదా 0.3 గ్రాముల ప్లూబెండమైడ్ను కలిపి పిచికారీ చేయాలి. జింకు లోపంభాస్వరం ఎక్కువగా వాడితే జింకులోపం కనిపిస్తుంది. ఆకుల కనుపుల మధ్య పసుపు పచ్చ రంగులోకి మారి రాలిపోతుంది. నివారణజింకులోపం నివారణకు లీటర్ నీటిలో 2 గ్రాముల చీలేటెడ్ జింక్‌ను కలిపి వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి.పక్షికన్ను మచ్చ తెగులుతేమతో కూడిన చల్లటి వాతావరణంలో మిరప ఆకులపై సర్కోస్పోరా, ఆల్టర్నేరియా మచ్చలు ఆశిస్తాయి. సర్కోస్పోరా ఆశిస్తే పక్షికన్ను ఆకారం గల మచ్చలు ఏర్పడతాయి. ఈ ప్రభావంతో పంటలో నాణ్యత, రంగు తగ్గుతాయి. నివారణ200లీటర్ల నీటిలో 200 మి.లీ.ల ప్రొపికోనజోల్ను కలిపి ఎకరం పొలంలో పిచికారీ చేసుకోవాలి. లేదా 100మి.లీ.ల డైఫెన్కొనజోల్ను కలిపి పిచికారీ చేయాలి. -
సాంకేతిక కోర్సులతో ఉద్యోగ అవకాశాలు
భువనగిరి: సాంకేతిక కోర్సుల వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందవచ్చని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. భువనగిరి పట్టణ శివారులో ఉన్న అడ్వా న్స్డ్ టెక్నాలజీ సెంటర్‌ను గురువారం ఆయన పరి శీలించారు. అడ్వాన్స్డ్ టెకాల్నజీలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు ఏర్పడే అవకాశం ఉందన్నారు. సాంకేతిక కోర్సుల్లో శిక్షణ పొందిన వారికి భవిష్యత్‌లో మంచి అవకాశాలు ఉంటా యన్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. అంతకుముందు ఏటీసీలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, అందుబాటులో ఉన్న కోర్సులు, వసతుల వివరాలు తెలుసుకున్నారు. -
బాలల చట్టాలపై అవగాహన అవసరం
రాజాపేట: విద్యార్థి దశలోనే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని రాచకొండ పోలీస్ కమిషనరేట్ యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ యూనిట్ (ఏహెచ్‌టీయూ) పోలీసు అధికారులు విద్యార్థులకు సూచించారు. ఇకనుంచి అన్ని అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112కు ఫోన్‌చేసి వేగవంతమైన సేవలు పొందవచ్చన్నారు. రాజాపేట పోలీసు స్టేషన్ పరిధిలోని రఘునాథపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు బాలల చట్టాలు, సైబర్ నేరాలు, భారతీయ న్యాయ సంహిత చట్టాలపై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏహెచ్‌టీయూ ఎస్ఐలు వెంకట్ శ్రీను, రాములునాయక్, యండీ ఖలీల్ అహ్మద్, మహిళా ఏఎస్ఐ మీనాకుమారి విద్యార్థులకు పలు విషయాలపై అవగాహన కల్పించి చట్టాలపై వారి అనుమానాలను నివృత్తి చేశారు. బాలలతో పని చేయించడం, బాలలపై లైంగిక వేధింపులు, బాల్య వివాహాలు, బాలల అక్రమ రవాణా తీవ్రమైన నేరాలని తెలిపారు. రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని, మత్తు పదార్థాలను అలవాటు చేసుకోవద్దని సూచించారు. సైబర్ బెదిరింపులు, సైబర్ మోసాలకు గురైతే గతంలో డయల్ 1930, ఉమెన్ హెల్ప్ లైన్ 1091, 181, చైల్డ్ హెల్ప్ లైన్ 1098, 112, 100 నంబర్లను ఉపయోగించేవారని, ప్రస్తుతం 112కు కాల్ చేస్తే అన్ని రకాల అత్యవసర సేవలు వేగంగా పొందవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు శివరామకృష్ణ, ఉపాధ్యాయులు అపర్ణాదేవి, శ్రీనివాసాచారి, సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, బాలక్రిష్ణ, యాదయ్య, సరిత, భవాని పాల్గొన్నారు. -
మద్యం టెండర్లకు 191 దరఖాస్తులు
భువనగిరి: నూతన మద్యం దుకాణాల కోసం టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. 82 మద్యం దుకాణాల గాను గత నెల 26నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మొత్తం 191 దరఖాస్తులు రాగా.. అందులో గురువారం 34 వచ్చినట్లు ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. దరఖాస్తు గడువు ఈనెల 18వరకు ఉన్నట్లు పేర్కొన్నారు.చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు ఆలేరు: ఆలేరు పట్టణ శివారులో బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ను గురువారం యాదగిరిగుట్ట ఏసీపీ శ్రీనివాస్‌నాయుడు సందర్శించారు. సీఐ యాలాద్రితో కలిసి ఏసీపీ వాహనాలను తనిఖీ చేశారు. వాహనాల తనిఖీల్లో ఏమరుపాటుగా ఉండొద్దని చెక్‌పోస్ట్ సిబ్బందికి ఏసీపీ సూచించారు. ఒక ఏఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుల్స్ విధుల్లో ఉండాలన్నారు. నాణ్యమైన విత్తనాలు తయారు చేసుకోవాలి భూదాన్‌పోచంపల్లి: రైతులు నాణ్యమైన విత్తనాలను తయారు చేసుకోవాలని వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు డాక్టర్ జి.శ్రీదేవి, డాక్టర్ శ్రీధర్సిద్ది, డాక్టర్ సుశీల సూచించారు. క్వాలిటీ సీడ్ ఎవ్రీ విలేజ్ కార్యక్రమం కింద భూదాన్‌పోచంపల్లి మండలంలోని జలాల్పురం, వంకమామిడి, పిలాయిపల్లి, దేశ్ముఖి గ్రామాల్లో రైతులు సాగు చేసిన కేఎన్ఎం 1638 రకం సీడ్ వరి వరిపంటను పరిశీలించారు. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వానాకాలం రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన రైతులకు ఫౌండేషన్ సీడ్స్ కిట్స్ అందజేస్తున్నట్లు తెలిపారు. యాసంగి పంటకు రైతులకు కావల్సిన నాణ్యమైన విత్తనాలను వారే సొంతంగా తయారు చేసుకోవాలన్నదే దీని ముఖ్య ఉద్దేశ్యమన్నారు. రైతు ముంగిట శాస్త్రవేత్తలు కార్యక్రమం కింద రైతులకు పలు సూచనలు కూడా చేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిణి శైలజ, ఏఈఓలు ప్రియాంక, శ్వేత, నరేశ్, రాజేశ్, క్రాంతి, పవిత్రన్, రైతులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఆలేరు విద్యార్థి ఆలేరు: ఆలేరులోని మహా త్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల, జూనియర్(రాజాపేట) కళాశాల విద్యార్థి బి.కృష్ణ (ఇంటర్ సెకండియర్) రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాడు. ఈనెల 8వ తేదీన భువనగిరిలో నిర్వహించిన ఎస్జీఎఫ్ అండర్–19 కబడ్డీ సెలక్షన్లలో ఉమ్మడి నల్గొండ జిల్లా జట్టు క్రీడాకారులతో కలిసి కృష్ణ పాల్గొని ప్రతిభను కనబరిచాడు. ఈనెల 11వ తేదీన మహబూబాబాద్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాడని వైస్ ప్రిన్సిపాల్ కె.గీతాదేవి, పీడీ గడసంతల భాస్కర్ తెలిపారు. నేత్రపర్వంగా నృసింహుడి నిత్యకల్యాణంయాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో గురువారం నిత్యారాధనలో భాగంగా నిత్యకల్యాణ వేడుక నేత్రపర్వంగా చేపట్టారు. వేకువజామున స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాత సేవ చేపట్టిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను నిజాభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ప్రాకార మండపంలో సుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. వివిధ పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. -
కాంగ్రెస్ నాయకులను నిలదీయండి
భూదాన్‌పోచంపల్లి : రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించిందని, ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను ప్రజలంతా నిలదీయాలని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం భూదాన్‌పోచంపల్లి మండలం పిలాయిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ బాకీ కార్డులను ఇంటింటా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అలవిగాని హామిలిచ్చి, మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చి 22 నెలలు అవుతున్నా మహిళలకు నెలకు రూ.2500, పింఛన్లు రూ.4వేలు, దివ్యాంగులకు రూ.6వేలు, కల్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం పథకాలను అమలు చేయలేదని విమర్శించారు. ప్రభుత్వం నుంచి ప్రజలకు రావల్సిన బాకీని వసూల్ చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి సర్కార్ రెండు పంటల రైతుబంధు ఎగ్గొట్టిందని, నిరుద్యోగులను మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ వర్గానికి ఎంత బాకీ పడ్డదో చెల్లించాలని ప్రజలను చైతన్యం చేస్తూ ఇంటింటా కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి, మాజీ వైస్‌ఎంపీపీ పాక వెంకటేశ్, పీఏసీఎస్ చైర్మన్ కందాడి భూపాల్‌రెడ్డి, కోట మల్లారెడ్డి, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పాటి సుధాకర్‌రెడ్డి, బత్తుల శ్రీశైలంగౌడ్, బందారపు లక్ష్మణ్, రంగ విశ్వనాధం, ప్యాట చంద్రశేఖర్, మధుసూధన్, కొంతం ఈశ్వరయ్య, సతీష్, మల్లేశ్, భాస్కర్, కంజర్ల గణేశ్ పాల్గొన్నారు.ఫ పైళ్ల శేఖర్‌రెడ్డి, కంచర్ల రామకృష్ణారెడ్డి -
సివిల్ సప్లై కమిషనర్ తనిఖీలు
సాక్షి,యాదాద్రి : సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర గురువారం జిల్లాలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రామన్నపేటలోని వాసవీ రైస్ మిల్, వలిగొండలోని పీఏసీఎస్ కొనుగోలు కేంద్రం, నాగిరెడ్డిపల్లిలోని ఎఫ్‌సీఐ గోదాములు, భువనగిరిలోని స్టాక్ పాయింట్ తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు, మిల్లర్లకు కేటాయించిన సీఎంఆర్, ఎంత ఇచ్చారనే విషయాలపై తెలుసుకున్నారు. అలాగే ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి బియ్యం రవాణా పంపిణీ ఎలా జరుగుతుందని ఆరా తీశారు. ఆయన వెంట అధికారులు సివిల్ సప్లై అధికారులు రోహిత్ సింగ్, హరికృష్ణ ఉన్నారు. -
చింపాంజీ, సింహం మాస్క్.. కోతులు షాక్
అడ్డగూడూరు: పాఠశాలలోకి కోతులు రాకుండా అడ్డగూడూరు మండలం కోటమర్తి స్కూల్ విద్యార్థులు వినూత్న ఆలోచన చేశారు. పాఠశాల పరిసరాల్లో కొంతకాలంగా కోతులు గుంపులుగా సంచరిస్తున్నాయి. అంతేకాకుండా మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో పాఠశాల ఆవరణలోకి వచ్చి విద్యార్థులపై దాడి చేస్తున్నాయి. కోతుల బెడదనుంచి రక్షణ పొందడానికి ఉపాధ్యాయులు వినూత్న ఆలోచన చేశారు. విద్యార్థులకు చింపాంజీ, సింహం మాస్కులు ధరింపజేసి కోతులు వచ్చిన సమయంలో వాటిని బయపెట్టసాగారు. దీంతో కోతుల బెడదకు చెక్ పెట్టినట్టు అయ్యిందని ఉపాధ్యాయులు తెలిపారు. -
కూలీల కొరత.. రైతుల వ్యథ
ఆత్మకూరు(ఎం): విత్తనాలు వేసింది మొదలుకొని పంట చేతికొచ్చే వరకు రైతులకు నిత్యం ఇబ్బందులే ఎదురవుతున్నాయి. ప్రారంభంలో వరుణుడు సహకరించకపోవడం, ఆ తరువాత ఎడతెరిపి లేని వర్షాలు, ఇవన్నీ ఒక ఎత్తయితే ఇప్పుడు కూలీల కొరత వేధిస్తోంది. కొంతకాలంగా జిల్లాలో కూలీలు దొరకడం కష్టంగా మారింది. రైతులు చేసేది లేక ఇత రాష్ట్రాల నుంచి తెప్పించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. పెరిగిన కూలి స్థానికంగా కూలీలు దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎవరైనా కూలీలు వచ్చినా ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు. గతంలో తొలి విడత పగిలిన పత్తి తీయడానికి రోజుకు రూ.300 తీసుకునేవారు. ప్రస్తుతం రూ.450 అడుగుతున్నట్లు రైతులు వాపోతున్నారు. పత్తి పగలడం, మరో వైపు మబ్బులు పడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒకేసారి పత్తి పగలడం, కూలీలు దొరక్కపోవడంతో కొందరు రైతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పత్తి ఏరుతున్నారు. స్థానికంగా కూలీలు దొరికినట్లయితే ఎక్కువ కూలి డిమాండ్ చేయడంతో పాటు ఆటో చార్జీలు అడుగుతున్నారని రైతులు వాపోతున్నారు. చేసేది లేక ఆంధ్రప్రదేశ్‌లోని మాచర్ల, బిహార్, జార్ఘండ్ రాష్ట్రాల నుంచి తీసుకువస్తున్నారు. వరి కోతలు కూడా మొదలు కావడంతో ఇతర రాష్ట్రాల కూలీలు రోజుకు రూ.450 తీసుకుంటున్నారని రైతులు చెబుతున్నారు. చేతికొచ్చిన పత్తి ఫ కూలీల కోసం వెతుకులాట ఫ పొరుగు మండలాలు, ఇతర రాష్ట్రాల నుంచి తీసుకువస్తున్న రైతులు ఫ పనుల డిమాండ్‌తో పెరిగిన ధరలు జిల్లాలో 1,13,200 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. చాలా మంది రైతులు భూమి కౌలుకు తీసుకొని పత్తి వేశారు. ఎకరానికి రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టారు. సీజన్ ప్రారంభంలో విత్తనాలు విత్తిన తరువాత సరైన వర్షాలు కురువ లేదు. దీంతో రెండు దఫాలు విత్తనాలు విత్తాల్సి వచ్చింది. జూలై నెలాఖరు నుంచి ఆగస్టు చివరి వరకు అదునుకు వర్షాలు కురవడంతో చేలు ఎదిగి ఆశాజనకంగా కనిపించాయి. కానీ, సెప్టెంబర్ నుంచి కురిసిన ఎడతెరిపి లేని వర్షాలకు తేమ ఎక్కువై, చేలల్లో నీరు నిలువడంతో పూత రాలి, కాయ నల్లబారి మురిగిపోయింది. నిలిచిన కొద్దిపాటి కాయ పగలి పత్తి చేతికొచ్చిన తరుణంలో కూలీల కొరత వెంటాడుతోంది. -
అధిక వడ్డీ బాధితుడు మృతి
పెద్దఅడిశర్లపల్లి: అధిక వడ్డీ ఆశ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. పెద్దఅడిశర్లపల్లి మండలం వద్దిపట్ల గ్రామ పంచాయతీ పరిధిలోని పలుగుతండాకు చెందిన రమావత్ సరియా(37) 20ఏళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం కుటుంబంతో కలిసి మిర్యాలగూడకు వలస వెళ్లాడు. ఈ క్రమంలో తాను సంపాదించిన డబ్బుతో పాటు తన బంధువుల వద్ద అప్పుగా తీసుకున్న సుమారు రూ.కోటి పలుగుతండాకు చెందిన బాలాజీకి అధిక వడ్డీకి అప్పు ఇచ్చాడు. ఇటీవలి కాలంలో బాలాజీ డబ్బులు ఇవ్వడంలేదని తెలుసుకున్న బంధువులు తమ డబ్బులు తమకు ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో సరియా గత మూడు నెలలుగా బాలాజీ చుట్టూ తిరుగుతున్నా డబ్బులు ఇవ్వకపోవడంతో బంధువుల వద్ద మాట పోతుందని మనస్తాపానికి గురై సోమవారం మిర్యాలగూడలోని తన ఇంట్లో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి స్థానిక ఆస్పత్రిలో తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. సరియా మృతితో పలుగుతండాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దేవరకొండ ఏఎస్పీ మౌనిక ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
వడ్డీ వ్యాపారి సోదరి ఇంటి వద్ద బాధితుల ఆందోళన
నేరేడుచర్ల : అధిక వడ్డీ ఆశ చూపి కోట్లాది రూపాయలు తీసుకుని తిరిగి ఇవ్వకుండా మోసం చేసిన రమావత్ బాలాజీనాయక్ సోదరి నేరేడుచర్లలో నివాసం ఉంటున్న విషయాన్ని తెలుసుకున్న బాధితులు బుధవారం ఆమె నివాసం వద్ద ఆందోళనకు దిగారు. నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం పలుగుతండాకు చెందిన వడ్డీ వ్యాపారీ రమావత్ బాలాజీనాయక్ రూ.10 నుంచి రూ.16 వడ్డీ ఆశ చూపి కోట్లాది రూపాయలు వసూలు చేసి తిరిగి చెల్లించలేదు. ఆ నగదుతో తన సోదరి పేరుతో నేరేడుచర్లలో ఇల్లు కొనుగోలు చేశాడని తెలుసుకున్న బాధితులు ఆమె ఇంటిపై దాడికి యత్నించి ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న నేరేడుచర్ల ఎస్ఐ రవీందర్‌నాయక్ సంఘటన స్థలానికి చేరుకొని బాధితులతో మాట్లాడారు. ఆస్తులను ధ్వంసం చేయడం సరైంది కాదని చెప్పి బాధితులను తిరిగి పంపించారు. -
ఆరు గ్యారంటీల పేరిట మోసం చేశారు
నకిరేకల్: ఆరు గ్యారంటీల పేరిట తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయని హామీలతో కూడిన బాకీ కార్డులను బుధవారం నకిరేకల్ మెయిన్ సెంటర్లో ప్రజలకు ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. కాంగ్రెస్ మర్చిపోయిన హమీలను గుర్తుచేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రజల వద్దకు బాకీ కార్డులను తీసుకొచ్చిందన్నారు. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్‌గౌడ్, మండల అధ్యక్షుడు ప్రగడపు నవీన్‌రావు, నాయకులు సోమయాదగిరి, గుర్రం గణేష్, రాచకొండ వెంకన్నగౌడ్, గోర్ల వీరయ్య, రావిరాల మల్లయ్య, సామ శ్రీనివాస్‌రెడ్డి, దైద పరమేషం, యానాల లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
చేనేత రుణమాఫీ ఏమాయే..!
భూదాన్‌పోచంపల్లి: రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు రూ.లక్ష లోపు రుణమాఫీ చేస్తామని ప్రకటించి 13 నెలలవుతున్నా నేటికీ అమలుకు నోచుకోకవడ్డీ భారం పెరుగుతుందని నేతన్నలు వాపోతున్నారు. రుణమాఫీకి జీఓ జారీ చేసినా.. రుణమాఫీ చేస్తామని గతేడాది సెప్టెంబర్ 9న హైదరాబాద్‌లో జాతీయ చేనేత సాంకేతిక సంస్థ(ఎన్ఐహెచ్టీ) ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. విధివిధానాలు ఖరారు చేయడం, ఎన్నికల కోడ్ కారణాల వల్ల జాప్యం జరిగింది. ఏడు నెలల క్రితం అసలు, వడ్డీ కలుపుకుని రూ.లక్ష లోపు ఉన్న వ్యక్తిగత చేనేత రుణాలను మాఫీ చేస్తూ జీఓ నంబర్ 56ను జారీ చేసింది. 2025–26 బడ్జెట్ నుంచి రూ.33 కోట్లు మంజూరు చేస్తూ నాలుగు నెలల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. హ్యాండ్లూమ్, టెక్స్టైల్ అపెరల్ ఎక్స్పోర్ట్ పార్కుల కమిషనర్‌కు ఈ నిధులను విడుదల చేసి లబ్ధిదారులకు చెల్లించేందుకు అధికారాలు ఇచ్చారు. నేటికీ ఆమోదించని రాష్ట్ర కమిటీ రాష్ట్రస్థాయి కమిటీ ఆమోదించకపోవడంతో రుణమాఫీ అమలులో తీవ్ర జాప్యం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఆయా జిల్లాల పరిధిలో చేనేత కార్మికులు తీసుకున్న రుణాల వివరాలను చేనేత, జౌళి శాఖ ఏడీలు బ్యాంకుల వారీగా జాబితాను తయారు చేసి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీలో సభ్యులుగా ఉన్న డీసీసీబీ సీఈఓ, చేనేత శాఖ ఆర్డీడీ, లీడ్‌బ్యాంకు మేనేజర్, నాబార్డు డీజీఎం, పరిశ్రమల శాఖ జీఎం, జిల్లా సహకార అధికారులు ఆమోదించారు. అనంతరం ఆగస్టులో రుణమాఫీ అర్హుల జాబితాను రాష్ట్ర స్థాయి కమిటీకి పంపించారు. కొన్ని జిల్లాల నుంచి జాబితాలు రాష్ట్రస్థాయి కమిటీకి అందని కారణంగా రుణమాఫీ అమలులో జాప్యం జరుగుతోందని తెలిసింది. అప్పు చేసి చెల్లించి.. రూ.లక్ష పైన రుణాలు తీసుకున్న వారు ఆ పై మొత్తాన్ని జూలై నెలాఖరులోగా చెల్లిస్తే వారందరికీ రుణమాఫీ వర్తిస్తుందని అధికారులు చెప్పడంతో చాలా మంది అప్పులు చేసి, బంగారం కుదవపెట్టి రుణాలు చెల్లించారు. రుణమాఫీ అమలు కాక కార్మికుల ఖాతాల్లోంచి మూడు నెలల వడ్డీ కట్ చేసుకున్నారు. మరోవైపు బయట తీసుకున్న అప్పులకు వడ్డీ చెల్లిస్తూ ఇబ్బందులు పడుతున్నారు.ఫ రూ.లక్ష లోపు రుణాలు మాఫీ చేస్తామని 13 నెలల క్రితం ప్రకటించిన ప్రభుత్వం ఫ నాలుగు నెలల కిత్రం జీఓ జారీ ఫ నేటికీ అమలుకు నోచుకోని పథకం ఫ ఇబ్బందుల్లో చేనేత కార్మికులు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో.. 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు చేనేత కార్మికులు తీసుకున్న రుణాలను మాఫీ చేయనుంది. యాదాద్రి జిల్లాలో వివిధ బ్యాంకుల్లో రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్న 2,380 మంది చేనేత కార్మికులకు రూ.19.25 కోట్ల రుణమాఫీ జరుగనుంది. అలాగే నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి 423 మంది చేనేత కార్మికులకు రూ.4కోట్ల రుణమాఫీ లబ్ధి చేకూరనుంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 2,803 మందికి రూ.23.25 కోట్ల మేర రుణమాఫీ కానుంది. 2015లో స్థానిక కెనరా బ్యాంకు నుంచి రూ.50 వేలు లోన్ తీసుకున్నాను. అసలు, వడ్డీ కలుపుకుని మొత్తం రూ.75వేలు బకాయి ఉంది. ఇంకా చేనేత రుణమాఫీ కాలేదు. వెంటనే నేత కార్మికులకు ప్రభుత్వం రుణమాఫీ చేయాలి. – మిర్యాల వెంకటేశం, చేనేత కార్మికుడు, భూదాన్‌పోచంపల్లి ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించి ఏడాది గడిచిపోయింది. తక్షణమే చేనేత రుణమాఫీ చేయాలి. చేనేత రుణమాఫీ, నేతన్న భరోసా, చేనేతపై జీరో జీఎస్టీ తదితర సమస్యలపై చేనేత జన సమాఖ్య ఆధ్వర్యంలో గురువారం పోచంపల్లిలో అఖిలపక్షాలతో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. – కర్నాటి పురుషోత్తం, చేనేత జన సమాఖ్య యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు చేనేత కార్మికుల రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని రూ.లక్షలోపు రుణాలు తీసుకున్న 2,380 మంది చేనేత కార్మికుల జాబితాను ఆగస్టులోనే రాష్ట్రస్థాయి కమిటీకి పంపించాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే కార్మికుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తాం. – శ్రీనివాసరావు, యాదాద్రి భువనగిరి జిల్లా చేనేత, జౌళి శాఖ ఏడీ ఈ ఫొటోలోని వ్యక్తి పోచంపల్లికి చెందిన చేనేత కార్మికుడు గుండు ప్రవీణ్. రెండేళ్ల క్రితం స్థానిక కెనరా బ్యాంకు నుంచి రూ.2లక్షల రుణం తీసుకున్నాడు. నెలానెలా కిస్తీలు చెల్లిస్తూ వస్తుండగా.. చివరగా రూ.1.23లక్షలు బకాయి పడ్డాడు. రూ.లక్ష లోపు చేనేత రుణాలు మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో బంగారం అమ్మి పై రూ.23,500 బ్యాంకులో చెల్లించాడు. కానీ ఇప్పటివరకు మిగతా రూ.లక్ష, రుణమాఫీ కాలేదు. దీంతో మూడు నెలల వడ్డీ కింద అతని ఖాతా నుంచి రూ.3వేలు కట్ చేశారు. -
హాలియా ఎస్బీఐ శాఖలో అగ్ని ప్రమాదం
హాలియా: హాలియా పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంగళవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి సుమారు 12.30 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి బ్యాంకులో ఉన్న అలారం మోగింది. దీంతో వాచ్మెన్ గమనించి బ్యాంకు అధికారులకు సమాచారం అందించారు. స్థానికులు ఫైర్ స్టేషన్‌కు, పోలీస్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది, స్థానిక ఎస్ఐ సాయిప్రశాంత్ తమ సిబ్బందితో బ్యాంకు వద్దకు చేరుకొని మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. ఈ ప్రమాదంలో బ్యాంకులోని కంప్యూటర్లు, ఏసీలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫర్నీచర్ కాలిబూడిదయ్యాయి. బ్యాంకు మేనేజర్ మోహన్ని వివరణ కోరగా.. షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగినట్లు గుర్తించామని, ఈ ఘటనపై ఎస్బీఐ ప్రధాన కార్యాలయం అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ముఖ్యమైన డాక్యూమెంట్లకు ఏమీ కాలేదని, ఒక కంప్యూటర్, రెండు ఏసీలు, కొంత ఫర్నీచర్ మాత్రం కాలిపోయిందని తెలిపారు. ప్రమాదంపై ఆరా.. బ్యాంకులో జరిగిన ప్రమాదానికి గల కారణాలు, నష్టం వివరాలు, బ్యాంకులో తాకట్టు పెట్టిన షూరిటీ పత్రాలు, బంగారం, నగదు తదితర వివరాలపై ఎస్బీఐ ప్రధాన కార్యాలయం అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. ప్రమాద వివరాలను తెలుసుకునేందుకు ఎస్బీఐ ప్రధాన కార్యాలయం అధికారులు రానున్నట్లు తెలిసింది. ఎస్ఐ సాయి ప్రశాంత్, అగ్నిమాపక అధికారులు బ్యాంకు అధికారులను అడిగి నష్టం వివరాలను తెలుసుకున్నారు. ఫ షార్ట్ సర్క్యూట్‌తో ఫర్నీచర్, కంప్యూటర్లు, ఏసీలు, ఎలక్ట్రానిక్ పరికరాలు దగ్ధం -
సైనిక లాంఛనాలతో జవాన్ అంత్యక్రియలు
బొమ్మలరామారం: బొమ్మలరామారం మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ కోమరాజు కరుణాకర్(27) అంత్యక్రియలు బుధవారం స్వగ్రామంలో సైనిక లాంఛనాలతో జరిగాయి. రాజస్తాన్ రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న కరుణాకర్ దసరా పండుగకు స్వగ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో ఈ నెల 6న పగిడిపల్లి–భువనగిరి రైలు మార్గంలో రైలు కింద పడి ఆత్యహత్యకు పాల్పడ్డాడు. బుధవారం నిర్వహించిన కరుణాకర్ అంత్యక్రియలకు సైనికాధికారులు హాజరై గౌరవ సూచికంగా గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం జాతీయపతాకాన్ని కరుణాకర్ తల్లి లక్ష్మికి అందజేశారు. కరుణాకర్ తండ్రి వెంకటేష్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో స్వీపర్‌గా పనిచేస్తూ 28ఏళ్ల క్రితమే మృతిచెందాడు. అనంతరం కరుణాకర్ తల్లి లక్ష్మి స్వీపర్‌గా పనిచేస్తూ ఏకై క కుమారుడిని కష్టపడి చదివించింది. కరుణాకర్‌కు కొంతకాలం క్రితం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం ప్రతాపసింగారం గ్రామానికి చెందిన లతతో వివాహం అయ్యింది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
కుమార్తెతో కలిసి మహిళ అదృశ్యం
మిర్యాలగూడ అర్బన్: ఏడాది వయస్సున్న కుమార్తెతో కలిసి మహిళ అదృశ్యమైంది. మిర్యాలగూడ వన్ టౌన్ ఎస్ఐ సైదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని హౌజింగ్‌బోర్డు కాలనీలో లావూరి వెన్నెల తన భర్త వినోద్‌తో కలిసి నివాసముంటోంది. వీరికి ఏడాది వయస్సున్న పాప ఉంది. ఈ నెల 4న వినోద్ పని నిమిత్తం వేరే ఊరికెళ్లగా.. అదే రోజు ఉదయం 9గంటల సమయంలో వెన్నెల తన కుమార్తెతో కలిసి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. వినోద్ ఎంత వెతికినా వెన్నెల ఆచూకీ లభించకపోవడంతో బుధవారం మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 95021 52452 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ సూచించారు. సాగర్ ఎడమ కాలువలో వ్యక్తి గల్లంతుమునగాల: అయ్యప్ప మాల ధరించిన వ్యక్తి సాగర్ ఎడమ కాలువలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు అందులో గల్లంతయ్యాడు. ఈ ఘటన మునగాల మండలం కృష్ణానగర్ గ్రామ శివారులో బుధవారం సాయంత్రం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణానగర్ గ్రామానికి చెందిన బుక్యా బాబునాయిక్(42) బుధవారం అయ్యప్ప మాల స్వీకరించాడు. సాయంత్రం స్నానం చేసేందుకు గ్రామ శివారులోని సాగర్ ఎడమ కాలువకు మరికొందరు అయ్యప్ప మాలధారులతో కలసి వెళ్లాడు. స్నానం చేసే క్రమంలో బాబునాయిక్ ప్రమాదవశాత్తు జారి ఎడమ కాలువలో మునిగిపోయాడు. అతడికి ఈత వచ్చినప్పటికీ వరద తాకిడికి కొట్టుకుపోయాడు. బాబునాయిక్కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. అయ్యప్ప మాలధారులు, బాబునాయిక్ కుటుంబ సభ్యులు నడిగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాళం వేసిన ఇంట్లో చోరీఫ ఐదు తులాల బంగారు ఆభరణాలు, నగదు అపహరణ మఠంపల్లి: తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి బంగారు ఆభరణాలు, నగదు అపహరించారు. ఈ ఘటన మఠంపల్లి మండల కేంద్రంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. మఠంపల్లి మండల కేంద్రంలో నివాసముంటున్న ఆదూరి మర్రెడ్డి అనారోగ్యం కారణంగా చికిత్స చేయించుకునేందుకు కుటుంబ సభ్యులతో కలిసి ఐదు రోజుల క్రితం హైదరాబాద్‌లో వెళ్లాడు. మంగళవారం అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు అతడి ఇంటి తాళం పగులగొట్టి లోపలికి చొరబడి ఐదు తులాల బంగారు ఆభరణాలు, నగదు అపహరించారు. చోరీ జరిగిన విషయం బంధువుల ద్వారా తెలుసుకున్న మర్రెడ్డి బుధవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు క్లూస్‌టీంను పిలిపించి ఆధారాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పి. బాబు తెలిపారు. -
ఆఫ్రికా నత్తల నివారణ ఇలా..
గుర్రంపోడు : గుర్రంపోడు మండలంలోని పిట్టలగూడెం గ్రామంలో ఉద్యానవన అధికారుల, శాస్త్రవేత్తల బృందం బుధవారం ఉద్యానవన పంటలను పరిశీలించి తోటలకు హాని కల్గిస్తున్న నత్తలను ఆఫ్రికా నత్తలుగా గుర్తించారు. జిల్లా ఉద్యానవన శాఖాధికారి కె.సుబాషిణి, మల్లేపల్లి ఉద్యాన పరిశోధనాకేంద్రం శాస్త్రవేత్త రాజాగౌడ్, ప్రాంతీయ ఉద్యానవనశాఖాధికారి కె.మురళితో కూడిన బృందం ఆఫ్రికా నత్తల ప్రభావాన్ని పరిశీలించి తగు నివారణ చర్యలను సూచించింది. ఆఫ్రికా నత్తలు వందేళ్ల క్రితమే భారతదేశానికి వలస వచ్చాయని, మూడేళ్లుగా తెలుగు రాష్ట్రాలతోపాటు కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో విజృంభిస్తున్నాయని అన్నారు. కేరళ, తమిళనాడు , కర్ణాటక రాష్ట్రాల నుంచి శ్రీగంధం, ఎర్రచందనం చెట్లను దిగుమతి చేసుకోవడం వల్ల ఈ ప్రాంతానికి ఆఫ్రికా నత్తలు వచ్చాయని గమనించామని తెలిపారు. ఆఫ్రికా నత్తలు జులై నుంచి ఫిభ్రవరి వరకు గుడ్లను ఒక్కో నత్త 400 గుడ్లు పెట్టి తమ సంతతిని వృద్ధి చేసుకుంటాయని అన్నారు. ఒక్కో ఆప్రికా నత్త తమ జీవితకాలమైన ఐదేళ్లలో 1200 వరకు పిల్లలకు జన్మనిస్తుందని అన్నారు. బొప్పాయి, అరటి, జామ, ఆయిల్ ఫామ్ తదితర పండ్లతోటలతోపాటు కూరగాయల పంటలను నాశనం చేస్తాయన్నారు. నివారణ చర్యలు చేపట్టాలి ఆఫ్రికా నత్తల నివారణకు ఒక కిలో ఉప్పును నాలుగు లీటర్ల నీటిలో కలిపి ఆ నీటిలో గోనె సంచిని తడిపి గట్లపై వేస్తే ఈ సంచులపైకి వెళ్లిన నత్తలు ద్రావణం ఘాటుకు చనిపోతాయని తెలిపారు. ఆకర్షణ ఎర ఏర్పాటులో భాగంగా 10 కిలోల వరి తవుడుకు, ఒక కిలో బెల్లం , ఒక లీటరు ఆముదం మరియు ఒక కిలో ధయోడికార్స్ గుళికలు లేదా ఎసిఫేట్ లేదా క్లోరోఫైరిఫాస్ కలిపి చిన్న ఉండలుగా చేసి ఈ ఉండలను బొప్పాయి, క్యాబేజీ ఆకుల కింద ఉంచితే ఆఫ్రికా నత్తలు తిని చనిపోతాయని శాస్త్రవేత్తలు చెప్పారు. అనంతరం వీటిని ఉప్పు ద్రావణంలో వేయాలని, వారానికి రెండు, మూడు రోజుల పాటు 15 రోజుల వరకు ఇలా చేయాలని సూచించారు. నత్తలు ఏరివేసే సమయంలో చేతికి గ్లౌజులు తప్పనిసరి ధరించాలన్నారు. 2 గ్రాముల కాపర్ సల్పేట్, 2 గ్రాముల పెర్రస్ సల్పేట్ ఒక లీటరు నీటిలో కలిపి చెట్లపై పిచికారీ చేస్తే 70 శాతం నత్తలు కింత పడిపోతాయని, వీటిని ఏరి కాల్చి వేయలన్నారు. 2 గ్రాముల మెటల్డిహైడ్ 2.5 గుళికలు భూమి పైన మరియు చెట్ల మొదళ్లలో ఎరగా చల్లాలని అన్నారు. పండ్లతోటల్లో కలుపు, చెత్త లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలని , మొక్కలను ఒత్తుగా దగ్గరగా వేసుకోకూడదని, రాత్రిళ్లు నీరు పారించవద్దని చెప్పారు. తోటల్లో కోళ్లు, బాతులు పెంచుకోవాలని సూచించారు. బీరకాయను తినేస్తున్న ఆరఫ్రికా నత్త పిట్టలగూడెంలో ఆఫ్రికా నత్తలను పరిశీలిస్తున్న ఉద్యానవన అధికారి, శాస్త్రవేత్తల బృందంఫ ఉద్యానవన అధికారులు, శాస్త్రవేత్తల సూచన -
ఒకే రోజు గుండెపోటుతో ముగ్గురు నాయకులు మృతి
కోదాడ రూరల్ : కోదాడ నియోజకవర్గంలో ఒకే రోజు ముగ్గురు రాజకీయ నాయకుల గుండెపోటు మరణాలు ప్రజలను ఆందోళనకు గురిచేశాయి. కోదాడ పట్టణానికి చెందిన యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఆళ్ల భాగ్యరాజ్(34) మంగళవారం జ్వరం బారినపడి ట్యాబ్లెట్లు వేసుకున్నాడు. రాత్రి పడుకున్న తర్వాత బుధవారం తెల్లవారుజామున భార్య లేపగా ఎలాంటి కదలికలు లేకుండా ఉన్నాడు. వైద్యుడిని పిలిపించి చూడగా గుండెపోటుతో మృతిచెందినట్లు నిర్ధారించారు. అదేవిధంగా నడిగూడెం మండలం బృందావనపురానికి చెందిన మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నాయకుడు మండవ అంతయ్య(81) బుధవారం ఉదయం పొలం వద్దకు వెళ్లి తిరిగి వస్తూ మార్గమధ్యలో వేణుగోపాలపురం వెళ్లాడు. అక్కడ ఓ నాయకుడి ఇంటి వద్ద స్థానిక సంస్థల అభ్యర్థిత్వంపై చర్చిస్తుండగా ఒక్కసారి కుప్పకూలిపోయాడు. వెంటనే స్థానికులు, కోదాడకు తీసుకురాగా పరీక్షించిన వైద్యులు మృతిచెందినట్లు నిర్ధారించారు. చిలుకూరు మండల మాజీ ఎంపీపీ, బీఆర్ఎస్ నాయకుడు దొడ్డా సురేష్‌బాబు(54) బుధవారం సాయంత్రం కోదాడ పట్టణానికి వచ్చి స్నేహితులతో మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే స్నేహితులు సీపీఆర్ చేసి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స చేసినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో మృతిచెందారు. సురేష్‌బాబు(ఫైల్)భాగ్యరాజ్ (ఫైల్) అంతయ్య (ఫైల్) ఫ కోదాడ నియోజకవర్గంలో విషాదం -
చంపుతామని బెదిరించిన ఐదుగురి అరెస్ట్
సూర్యాపేటటౌన్ : పాత కక్షలను దృష్టిలో పెట్టుకొని చంపుతామని బెదిరింపులకు పాల్పడిన ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బుధవారం సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్ విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 2వ తేదీన సూర్యాపేట మండల పరిధిలోని యర్కారం గ్రామానికి చెందిన బొర్ర సైదమ్మ తన ఇంటి ముందు నిలబడి ఉండగా.. అదే గ్రామానికి చెందిన గుండ్లపల్లి నవీన్, గుండ్లపల్లి సాయికుమార్, చందుపట్ల సందీప్‌కుమార్, బొర్ర అభిషేక్, పిల్లలమర్రి గ్రామానికి చెందిన చెరుకుపల్లి అర్జున్ కారులో ఆమె వద్దకు వచ్చారు. పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని నవీన్‌తో పాటు మిగతా వారు కారులో నుంచి తల్వార్ తిప్పుకుంటూ బయటకు దిగి సైదమ్మతో పాటు ఆమె కుమారుడు, మారపల్లి సతీష్, మోదాల నాగయ్యను బూతులు తిడుతూ చంపుతామని బెదిరించారు. దీంతో బాధితురాలు సైదమ్మ సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్లో తనను బెదిరించిన వారిపై ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. నిందితుల నుంచి కారుతో పాటు తల్వార్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్ఐ బాలునాయక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఫ రిమాండ్‌కు తరలింపు -
హత్యాచారం కేసులో ఇద్దరికి రిమాండ్
రామగిరి(నల్లగొండ): ఇంటర్ విద్యార్థినిపై హత్యాచారం కేసులో ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. బుధవారం నల్లగొండ టూటౌన్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ మండలం జీకే అన్నారం గ్రామానికి చెందిన గడ్డం కృష్ణ(21) ప్రేమ పేరుతో ఇంటర్ చదువుతున్న విద్యార్థినితో పరిచయం పెంచుకున్నాడు. గత మూడు నెలలుగా ఇన్‌స్ట్రాగాం ద్వారా ఆమెతో చాటింగ్ చేశాడు. సదరు విద్యార్థిని మంగళవారం ఇంటి నుంచి కాలేజీకి బయల్దేరి నల్లగొండకు వచ్చింది. నల్లగొండ పట్టణంలోని డీఈఓ కార్యాలయం వద్ద వేచి చూస్తున్న విద్యార్థిని వద్దకు గడ్డం కృష్ణ బైక్‌పై వచ్చి ఆమెను తన స్నేహితుడైన నల్లగొండ మండలం రసూల్‌పుర గ్రామానికి చెందిన బచ్చలకూరి మధు(19) రూమ్‌కి తీసుకెళ్లాడు. కృష్ణ, ఆ విద్యార్థిని రూమ్‌లో ఉండగా.. మధు బయటకు వెళ్లిపోయాడు. ఈ క్రమంలో కృష్ణ విద్యార్థినిపై అత్యాచారం చేశాడు. దీంతో బాలికకు తీవ్ర రక్తస్రావం జరిగి అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతిచెందింది. వెంటనే కృష్ణ రూమ్‌కి తాళం వేసి అక్కడ నుంచి పారిపోయాడు. ఈ విషయాన్ని తనకు తెలిసిన వ్యక్తుల ద్వారా కృష్ణ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అదే రోజు సాయంత్రం నల్లగొండ టూటౌన్ పోలీస్ స్టేషన్లో కృష్ణ లొంగిపోయాడు. కృష్ణ ఇచ్చిన సమాచారం ఆధారంగా అతడి స్నేహితుడు మధును కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని వారి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థిని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి.. డాక్టర్లు ఇచ్చిన రిపోర్టు ఆధారంగా కృష్ణ, మధుపై పోలీసులు అత్యాచారం, హత్య, పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్ విధించి కోర్టులో హాజరుపరిచారు. విలేకరుల సమావేశంలో టూటౌన్ సీఐ రాఘవరావు, వన్ టౌన్ సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్ఐలు సైదులు, సైదాబాబు పాల్గొన్నారు. -
వంతెనను పునర్నిర్మించాలి
ఎన్నో ఏళ్ల కిత్రం నిర్మించిన పెద్దవాగుపై వంతెనను పునర్నిర్మించాలి. శిథిలమైన ఈ వంతెనపై ప్రయాణం ప్రమాదకరమే. ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి. – పత్తి రాములు, ఆలేరు ఆలేరు పెద్దవాగు వంతెన ఎన్హెచ్ఏ పరిధిల్లోంచి ఆర్అండ్బీ పరిధిలోకి తీసుకురావాలి. అప్పటి అవసరాల మేరకు నిర్మించిన వంతెన ఇప్పుడు ఇరుకుగా మారింది. ప్రమాదాలు జరుగుతున్నాయి. కొత్త వంతెన నిర్మించాలి. – సృజన్‌కుమార్, ఆలేరు ●ఆలేరు పెద్దవాగుపై నిర్మించిన వంతెన మా పరిధిలో లేదు. ఎన్హెచ్ఏ పరిధిలో ఉంది. పునర్నిర్మాణం, మరమ్మతులు చేయాలన్నా ఎన్హెచ్ఏ అధికారుల ఆధ్వర్యంలో చేయాల్సి ఉంటుంది. – కరుణాకర్ ఆర్‌అంబీ ఏఈ ఆలేరు -
జీపీఓలు పారదర్శకంగా పనిచేయాలి
సాక్షి, యాదాద్రి : గ్రామపాలన అధికారులు (జీపీఓలు) రెవెన్యూ వ్యవస్థ పటిష్టతకు పారదర్శకంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. కొత్తగా నియామకమైన గ్రామ పాలన అధికారులకు బుధవారం భువనగిరి కలెక్టరేట్లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలిసి హాజరై మాట్లాడారు. మీపై నమ్మకంతో పరిపాలన అధికారులుగా తిరిగి పోస్టింగ్ ఇచ్చామన్నారు. ప్రజలకు అన్ని సర్వీసులు అందించేది రెవెన్యూ శాఖ మాత్రమే అన్నారు. భూభారతి చట్టంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అదనపు కలెక్టర్ వీరారెడ్డి మాట్లాడుతూ గ్రామ పరిపాలన అధికారులు తమ విధులు బాధ్యతతో నిర్వర్తించాలన్నారు. గ్రామ రెవెన్యూ రికార్డులు, లెక్కలను సక్రమంగా నిర్వహించాలన్నారు. ప్రభుత్వ భూములు, ఇతర ఆస్తులను అన్యాక్రాంతం కాకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ జయమ్మ, ఆర్డీఓలు కృష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డి, సురేష్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కృతిక, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ జగన్మోహన్ ప్రసాద్, జీపీఓలు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ హనుమంతరావు -
ప్రాదేశిక పోరుకు సై
సాక్షి, యాదాద్రి : జెడ్పీ, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ స్థానాల తొలి విడత ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. నోటిఫికేషన్ విడుదల రోజు నుంచే ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణకు ఇప్పటికే జిల్లాలోని అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. అలాగే జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయంలో జెడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్లు స్వీకరిస్తారు. జిల్లాలో మొత్తం 178 ఎంపీటీసీ స్థానాలు, 17 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇందులో తొలి విడతలో భాగంగా ఈ నెల 23న ఆలేరు నియోజకవర్గంలోని ఎనిమిది, తుంగతుర్తి నియోజకవర్గంలోని రెండు మండలాల్లో 84 ఎంపీటీసీ, 10 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే రెండో విడతలో భాగంగా భువనగిరి, మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాల్లోని 7 జెడ్పీటీసీ, 94 ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల 27న ఎన్నికలు జరుగుతాయి. నేటినుంచే నామినేషన్ల స్వీకరణ ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు గురువారం ఉదయం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ మేరకు అధికారులు ఆయా స్థానాల వారీగా రిటర్నింగ్ అధికారులు రిజర్వేషన్లు, ఓటరుజాబితాలను ప్రకటిస్తారు. నామినేషన్లను మూడు రోజుల వరకు అంటే ఈనెల 11 వరకు స్వీకరిస్తారు. 12న పరిశీలన, 15వ తేదీన ఉపసంహరణ, అదే రోజు అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. ఈనెల తొలి విడత 23 పోలింగ్ జరుగనుంది. నవంబర్ 11న ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. ఉదయం 10.30 గంటల నుంచి నామినేషన్లు అన్ని మండలాల్లోని ఎంపీడీఓ కార్యాలయాల్లో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీల కోసం ప్రత్యేకంగా కౌంటర్లు పెట్టారు. అన్ని ఎంపీడీఓ కార్యాలయాల వద్ద హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు. ఈ డెస్క్‌ల్లో పనిచేసే సిబ్బంది నామినేషన్ ఫారాలు, ఇతర సలహాలు ఇస్తారు. అష్టమి, నవమి లేదు.. ఈనెల 8 నుంచి 11 వరకు నామినేషన్లు వేయడానికి ఎన్నికల అధికారులు సమయం ఇచ్చారు. నామినేషన్లు వేసే మూడు రోజల్లో అష్టమి, నవమి లేకపోవడం అభ్యర్థులకు సెంటిమెంట్‌గా కలిసి వచ్చే అంశం. గురువారం, శనివారం దివ్యమైన రోజులుకాగా, శుక్రవారం చవితి ఉంది. కాబట్టి గురువారం, శనివారం ఎక్కువగా నామినేషన్లు వేసే అవకాశం ఉంది. కాగా బీసీ రిజర్వేషన్లపై గురువారం హైకోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అభ్యర్థుల ఖరారు పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలు కావడంతో అభ్యర్థుల ఎంపికపై ఆయా పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. తొలి విడతలో జరిగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను ప్రధాన పార్టీలు దాదాపు ఖరారు చేశాయి. మూడు రోజుల సమయం ఉన్నందున నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ, సీపీఐఎంఎల్ పార్టీలు తమ అభ్యర్థులను రంగంలోకి దించబోతున్నాయి. ఎన్నికలు జరిగే స్థానాలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఆలేరు గొలనుకొండ,కొలనుపాక–1, కొలనుపాక–2, కొల్లూరు, రాఘవాపురం, శారాజీపేట, టంగుటూరు. రాజాపేట బేగంపేట, బొందుగుల, చల్లూరు, దూదివెంకటాపూర్, నెమిల, పాముకుంట, పారుపల్లి, రఘునాథపురం, రాజాపేట, రేణికుంట, సింగారం. యాదగిరిగుట్ట చిన్నకందుకూరు, చొల్లేరు, దత్తాయపల్లి, గౌరాయపల్లి, మల్లాపూర్, మాసాయిపేట, పెద్దకందుకూరు, సాదువెల్లి, వంగపల్లి. మోటకొండూరు అమ్మనబోలు, చాడ, చందేపల్లి, కాటేపల్లి, మాటూరు, మోటకొండూరు–1, మోటకొండూరు–2. అడ్డగూడూరు అడ్డగూడూరు, చౌళ్లరామారం, డి.రేపాక, గట్టుసింగారం, జానకిపురం, కోటమర్తి, వెల్దేవి. మోత్కూరు దాచారం, దత్తప్పగూడెం, ముషిపట్ల, పాటిమట్ల, పొడిచేడు. బొమ్మలరామారం బొమ్మలరామారం, చీకటిమామిడి, చౌదర్చిపల్లి, గోవిందుతండా, జలాల్పూర్, మర్యాల, మేడిపల్లి, నాగినేనిపల్లి, ప్యారారం, రామలింగంపల్లి, తిమ్మాపూర్. తుర్కపల్లి దత్తాయపల్లి, ధర్మారం, గంధమల్ల, మాధాపూర్, ముల్కలపల్లి, నాగాయపల్లి, రుస్తాపూర్, తుర్కపల్లి, వాసాలమర్రి, వీరారెడ్డిపల్లి. ఆత్మకూర్(ఎం) ఆత్మకూర్(ఎం), కప్రాయపల్లి, కొరటికల్, కూరెల్ల, పల్లెర్ల, పారుపల్లి, రహీంఖాన్‌పేట, సింగారం. గుండాల అంబాల, అనంతారం, గుండాల, మరిపడిగ, పెద్దపడిశాల, సీతారాంపూర్, సుద్దాల, వస్తాకొండూరు, వెల్మజాల. తొలి విడత ఎన్నికలకు నేడే నోటిఫికేషన్ విడుదలఫ 10 జెడ్పీటీసీ, 84 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు ఫ నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ ఫ ఈ నెల 23వ తేదీన పోలింగ్ ఫ నవంబర్ 11న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి -
యాసంగి సన్నాలకు అందని బోనస్
రామన్నపేట: గత యాసంగి సీజన్‌కు సంబంధించి కొనుగోలు కేంద్రాల్లో సన్నధాన్యం విక్రయించిన రైతులకు క్వింటాకు రూ.500 చొప్పున ప్రభుత్వం అందించాల్సిన బోనస్ డబ్బులు నేటికీ విడుదల చేయలేదు. ప్రభుత్వం ఎన్నికల ముందు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించింది. 2024–25 వానాకాలం సీజన్‌కు సంబంధించి సన్నధాన్యం పండించిన రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం బోనస్ డబ్బులు చెల్లించింది. అయితే గత యాసంగికి సంబంధించిన బోనస్ డబ్బులు ఇప్పటికీ ఇవ్వకపోవడంతో వాటి కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. 2,75,315 ఎకరాల్లో వరి సాగు గత యాసంగిలో 2,75,315 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా రూ.849.32కోట్ల విలువైన 3,67,479మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం బోనస్ ఇస్తుందనే ఆశతో యాసంగిలో దిగుబడి తక్కువ వస్తుందని తెలిసికూడా జిల్లాలో 367 మంది రైతులు సన్నరకం ఽవరి సాగు చేశారు. ప్రభుత్వం రైతుల నుంచి 1,291.680 మెట్రిక్ టన్నుల సన్నధాన్యాన్ని కొనుగోలు చేసింది. మిగిలిన ధాన్యంతోపాటు సన్నధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన రూ.2,320 మద్దతు ధరను చెల్లించింది. క్వింటాకు రూ.500 లెక్కన బోనస్ డబ్బులు రూ.64,58,400 పెండింగ్‌లో ఉంచింది. ధాన్యం విక్రయించి నాలుగు నెలలు దాటినా ప్రభుత్వం బోనస్ డబ్బులు విడుదల చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో వారం, పది రోజుల్లో వానాకాలం సీజన్ కొనుగోళ్లు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున ప్రభుత్వం స్పందించి బోనస్ డబ్బులు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. ఫ ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయి రూ.64.58 లక్షలు ఫ సన్నధాన్యం అమ్మిన రైతులు 367 మంది ఫ కేంద్రాల్లో కొనుగోలు చేసింది 1,291.680 మెట్రిక్ టన్నులు ఫ నాలుగు నెలలు దాటినా విడుదలకాని సొమ్ము ఫ వానాకాలం పంట కూడా చేతికొచ్చిందని రైతుల ఆవేదన