భూదాన్‌పోచంపల్లి: సర్పంచ్‌లు సుపరిపాలన అందించి ప్రజల మన్ననలు పొందాలని జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్‌రెడ్డి సూచించారు. సోమవారం భూదాన్‌పోచంపల్లి మండలం జలాల్‌పురంలోని స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చౌటుప్పల్, సంస్థాన్‌నారాయణపురం, బీబీనగర్ మండలాలకు చెందిన నూతన సర్పంచ్‌లకు శిక్షణ తరగతులను ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో భువనగిరి డీఎల్పీఓ, ట్రైనింగ్ కోఆర్డినేటర్లు బి. శ్రీకాంత్‌రెడ్డి, రాములు, టీఓటీలు రాపర్తి భాస్కర్, నవీన్‌కుమార్, ఎం.డీ. మాజిద్, దినకర్, వెంకటేశ్వర్లు, రాజశేఖర్ పాల్గొన్నారు.


