బుద్ధవనంలో బోధి మొక్క నాటిన బౌద్ధ భిక్షువులు | - | Sakshi
Sakshi News home page

బుద్ధవనంలో బోధి మొక్క నాటిన బౌద్ధ భిక్షువులు

Mar 5 2026 8:55 AM | Updated on Mar 5 2026 8:55 AM

నాగార్జునసాగర్‌ : దమ్మయాత్రలో పాల్గొన్న థాయిలాండ్‌ బౌద్ధభిక్షువులు బుధవారం బుద్ధవనంలో బోధి (రావి) మొక్క నాటారు. దమ్మయాత్ర ముగింపు కార్యక్రమంలో భాగంగా థాయిలాండ్‌ ప్రధాన బౌద్ధభిక్షవు సంఘ సక్‌ కోవిడో (అజాన్‌తున్‌) ఆధ్వర్యంలో స్థూప వనంలోని థాయిలాండ్‌ స్థూపం వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు. దమ్మయాత్ర విజయవంతం కావడానికి సహకరించిన బుద్ధవనం ఆర్ట్స్‌ అండ్‌ ప్రమోషన్స్‌ మేనేజర్‌ శ్యాంసుందర్‌రావును బౌద్ధభిక్షవులు ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ శాసన, ఎస్టేట్‌ మేనేజర్‌ రవిచంద్ర, సీనియర్‌ అసిస్టెంట్‌ రాంకుమార్‌, బుద్ధవనం ప్రాజెక్టు సిబ్బంది నర్సింహారావు, ప్రజ్ఞానంద్‌, గగన్‌మాలిక్‌ ఫౌండేషన్‌ మేనేజర్‌ వికాస్‌టైడే తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement