పెద్దవూర : దేవాలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలని లోకాయుక్త జస్టిస్ యడవెల్లి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. బుధవారం పెద్దవూర మండలం పెద్దగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని చిన్నగూడెం గ్రామ సమీపంలో ఉన్న ప్రతాపగిరి లక్ష్మీనర్సింహాస్వామి (గుండ్లకాడి) కల్యాణ మహోత్సవానికి జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి దంపతులు హాజరయ్యారు. స్వామివారికి నూతన పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవ విగ్రహాల ఊరేగింపులో పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్త, ఆలయ ప్రధాన అర్చకులు ఆశీర్వచనం చేశారు. అనంతరం సమీప గ్రామాల ప్రజలతో కొద్దిసేపు ముచ్చటించారు. తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. లోకాయుక్త జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి–కళ్యాణి దంపతులను దేవాదాయ శాఖ ఉమ్మడి జిల్లా సహాయ కమిషనర్ భాస్కర్ సన్మానించారు. ఉత్సవాల్లో ఆలయ చైర్మన్ యడవెల్లి మనోహర్‌రెడ్డి, ఆలయ పూజారులు కందాళ అజయ్‌కుమార్, లోకాచార్యులు, విజయ్‌కుమార్, సర్పంచ్ పోశం రమణమ్మకోటిరెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
లోకాయుక్త జస్టిస్ యడవెల్లి రాజశేఖర్‌రెడ్డి


