సాగర్‌ కాల్వలో కొనసాగుతున్న గాలింపు | - | Sakshi
Sakshi News home page

సాగర్‌ కాల్వలో కొనసాగుతున్న గాలింపు

Mar 5 2026 8:55 AM | Updated on Mar 5 2026 8:55 AM

హాలియా : హాలియా వద్ద నాగార్జున సాగర్‌ ఎడమ కాల్వలో మంగళవారం గల్లంతైన పెద్దవూర మండలంలోని సిరసనగండ్ల గ్రామానికి చెందిన కన్నకుంట్ల బబ్లూచారి(17), నిడమనూరు మండలంలోని సూరేపల్లి గ్రామానికి చెందిన ఆలేటి కార్తీక్‌ల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. బుధవారం కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, హాలియా పోలీసులు సాగర్‌ ఎడమ కాల్వ తూములు, త్రిపురారం మండలంలోని పెద్దదేవులపల్లి రిజర్వాయర్‌ వరకు గాలింపు చర్యలు కొనసాగించారు. హాలియా పోలీస్‌స్టేషన్‌లో నమోదైన అయిన ఇద్దరి బాలుర మిస్సింగ్‌ కేసు నేపథ్యంలో బుధవారం మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖరరాజు నాగార్జున సాగర్‌ ఎడమ కాల్వ ప్రమాదకర ప్రాంతాలను పరిశీలించారు. కేసు విచారణను వేగవంతం చేయాలని సంబంధింత అధికారులను ఆదేశించారు. ఆయన వెంట సీఐ సతీష్‌రెడ్డి, ఎస్‌ఐ సాయి ప్రశాంత్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement