breaking news
Yadadri District Latest News
-
బందోబస్తును పర్యవేక్షించిన డీసీపీ
సాక్షి, యాదాద్రి: మొదటి దశ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు డీసీపీ అక్షాంశ్‌యాదవ్ తెలిపారు. పలు గ్రామ పంచాయతీల్లో పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించి బందోబస్తును పర్యవేక్షించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడంలో పోలీస్ యంత్రాంగం సక్సెస్ అయిందని, వారికి స్థానికులు సహకరించారని అభినందనలు తెలిపారు. రెండు, మూడో విడతలో ఆంక్షలు 2వ విడత ఎన్నికలు జరిగే భువనగిరి, బీబీనగర్, భూదాన్‌పోచంపల్లి, రామన్నపేట, వలిగొండ, 3 విడత గుండాల, మోటకొండూరు, చౌటుప్పల్, నారాయణపూర్ మో త్కూర్, అడ్డగూడూరు, కందుకూరు, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచా రం, మాడ్గుల్, గ్రీన్ ఫార్మా, మాడ్గుల్ పోలింగ్ స్టేషన్ల పనరిధిలో ఆంక్షలు విధించినట్లు సీపీ సుధీర్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో 144 సెక్షన్ విధించినట్లు వెల్లడించారు. పోలింగ్ స్టేషన్ల వద్ద గుమిగూడరాదని స్పష్టం చేశారు. 14,17 తేదీల్లో సెలవుభువనగిరిటౌన్ : ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలింగ్ జరిగే మండలాల్లో ఆ రోజు సెలవులు ఇవ్వనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.14,17 తేదీల్లో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు, పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య సముదాయలు, ఇతర సంస్థలు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని ఆదేశించారు. సెలవు ఇవ్వడం సాధ్యంకాని పక్షంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు టైమ్ ఆఫ్ కల్పించాలని పేర్కొన్నారు. ఉత్తర్వులను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
పల్లెవించిన చైతన్యం
పలు గ్రామాల్లో ఉద్రిక్తత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓటేసేందుకు కదిలిన గ్రామాలు ఒక్క ఓటుతో విజయం మర్రికుంటతండా, చిన్ననారాయణపురంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఒక్క ఓటుతో గెలుపొందారు. శుక్రవారం శ్రీ 12 శ్రీ డిసెంబర్ శ్రీ 2025- 10లోతొలి విడతలో 92.88 శాతం పోలింగ్ 137 పంచాయతీల్లో ఎన్నికలు ప్రశాంతం సాక్షి యాదాద్రి: ఓటు హక్కు వినియోగించుకోవడంలో పల్లె ప్రజలు స్ఫూర్తిని చాటారు. పోలింగ్ కేంద్రాలకు భారీగా కదిలి ఆదర్శంగా నిలిచారు. శుక్రవారం జరిగిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 92.88 శాతం పోలింగ్ నమోదైంది.ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులుదీరారు. ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారు సైతం స్వగ్రామాలకు వచ్చి ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. మందకొడిగా మొదలై.. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. ప్రారంభంలో ఓటింగ్ మందకొడిగా కొనసాగగా 11 గంటల తర్వాత పుంజుకుంది. చివరి గంటలో గణనీయంగా పెరిగింది. మేజర్ గ్రామ పంచాయతీల్లో పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులుదీరారు. ఎన్నికల సందర్భంగా పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది.ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు భారీగా తరలివచ్చారు. ఈసారి కొత్త ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. బొమ్మలరామారంలో అత్యధికంగా.. అత్యధికంగా బొమ్మలరామారం మండలంలో 94.53 శాతం, అత్యల్పంగా ఆలేరు మండలంలో 90.07 శాతం ఓటింగ్ నమోదైంది. తొలి విడత ఎన్నికలు జరిగిన ఆరు మండలాల్లో 1,55,552 మంది ఓటర్లు ఉండగా, ఇందులో 1,44,483 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 72,026, మహిళలు 72,456, ఇతరులు ఒకరు ఉన్నారు. 137 పంచాయతీలకు ఎన్నికలు ఆలేరు నియోజకవర్గంలోని 6 మండలాల్లో 153 గ్రామ పంచాయతీలు, వార్డులు 1,284 వార్డులకు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో 16 పంచాయతీలు, 243 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 137 పంచాయతీలు, 1,040 వార్డులకు ఎన్నికలు జరిగాయి. సర్పంచ్ స్థానాలకు 411 అభ్యర్థులు, వార్డులకు 2,652 మంది పోటీ పడ్డారు. తొలిసారిగా ఓటర్లు నోటాకు ఓట్లు వేశారు. అఽధికారుల పర్యవేక్షణ బొమ్మలరామారం మండలం ఫక్కీర్‌గూడెం మోడల్ పోలింగ్ కేంద్రాన్ని ఎన్నికల సాధారణ పరిశీలకురాలు గౌతమి సందర్శించారు. అదే విధంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, డీసీపీ అక్షాంశ్‌యాదవ్, భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి పలు పోలింగ్‌కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని తెలుసుకున్నారు.–జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పర్యావరణ హితంగా అలంకరించిన గ్రీన్ మోడల్ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగిసింది. 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించాం. ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా పూర్తయింది. 137 గ్రామ పంచాయతీల్లో తొలి విడుత ఎన్నికలు పూర్తి చేశాం. -
రెండేళ్లకు దారికొచ్చిన పనులు
భువనగిరి : జిల్లా కేంద్రం భువనగిరిలో ఫుట్‌పాత్ పనులు ఎట్టకేలకు మొదలయ్యాయి. సమీకృత మార్కెట్ సముదాయం నుంచి పాత బస్టాండ్ వరకు ఫుట్‌పాత్ నిర్మించనున్నారు. ప్రధాన రహదారి విస్తరణలో భాగంగా గత ప్రభుత్వం హయాంలోనే ఫుట్‌పాత్ నిర్మించాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో పనులు నిలిచిపోయాయి. దాదాపు రెండేళ్ల తర్వాత తిరిగి పనులు ప్రారంభించారు. దుకాణదారులకు నష్టం వాటిల్లకుండా పనులు టీచర్స్ కాలనీకి వెళ్లే అండర్‌పాస్ నుంచి రైల్వేస్టేషన్ వరకు సుమారు 2 కిలో మీటర్ల మేర ప్రధాన రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. ఈ క్రమంలో దుకాణాల ముందు భాగాలను తొలగించారు. కానీ, పనుల్లో జాప్యం వల్ల చాలా మంది వ్యాపారులు మళ్లీ ఫుట్‌పాత్ మీదకు మెట్లు, షెడ్లు ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం పనులు ప్రారంభించినప్పటికీ వాటిని తొలగించకుండా ఫుట్‌పాత్ నిర్మిస్తున్నారు.ఫ భువనగిరిలో ఫుట్‌పాత్ పనులు ప్రారంభం ఫ సమీకృత మార్కెట్ నుంచి పాతబస్టాండ్ వరకు నిర్మాణం -
కాంగ్రెస్ మద్దతుదారుల హవా
సాక్షి, యాదాద్రి : తొలి విడుత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు హవా కొనసాగింది. 87 మంది విజయం సాధించారు. తరువాత స్థానంలో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందారు. ఆలేరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 137 పంచాయతీలు, 1,040 వార్డులకు గురువారం ఎన్నికలు జరిగాయి. సర్పంచ్ స్థానాలకు 411 అభ్యర్థులు, వార్డులకు 2,652 మంది పోటీ పడ్డారు. ఇందులో 87 పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందారు. బీఆర్ఎస్ 50, బీజేపీ 3, సీపీఐ 2, సీపీఎం 1, ఇండిపెండెంట్లు 10 మంది సర్పంచ్ పీఠం దక్కించుకున్నారు. పలుచోట్ల కాంగ్రెస్‌ను దెబ్బతీసిన రెబల్స్ పలు గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు అధిక వార్డులు గెలుపొందగా సర్పంచ్ అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. రెబల్‌గా పోటీ చేసిన పలువురు కాంగ్రెస్ అభ్యర్థుల విజయాలను తారుమారు చేశారు. బీఆర్ఎస్ 50 స్థానాలు కై వసం చేసుకోగా.. ఓటమిపాలైన పంచాయతీల్లో ఆ పార్టీ మద్దతుదారులు కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇచ్చారు. మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ మద్దతుదారులు కై వసం చేసుకోవడంతో పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. వివిధ పార్టీలు బలపరిచిన అభ్యర్థులకు వచ్చిన స్థానాలు మండలం జీపీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ సీపీఐ సీపీఎం ఇతరులు ఆలేరు 16 09 06 –– –– 01 –– ఆత్మకూర్ 23 13 09 01 –– –– –– రాజాపేట 23 11 10 01 –– –– 01 బి.రామారం 35 14 14 01 –– –– 06 తుర్కపల్లి 33 27 05 –– –– –– 01 యాదగిరిగుట్ట 23 13 06 –– 02 –– 02 మొత్తం 153 87 50 03 02 01 10ఫ తొలి విడతలో 87 స్థానాల్లో విజయం ఫ గట్టి పోటీ ఇచ్చిన బీఆర్ఎస్ మద్దతుదారులుఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య స్వగ్రామం సైదాపురంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి విజయం సాఽధించారు. అదే విధంగా మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత స్వగ్రామం వంగపల్లిలోనూ బీఆర్ఎస్పై కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. -
పోచంపల్లి ఇక్కత్‌ను ఆదుకోవాలి
సాక్షి, యాదాద్రి : పోచంపల్లి చేనేత ఇక్కత్ డిజైన్ల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి కోరారు. గురువారం ఢిల్లీలో టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హ్యాండ్లూమ్ సెక్టార్ అంశంపై జరిగిన సమావేశంలో ఎంపీ పాల్గొన్నారు. పోచంపల్లి ఇక్కత్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. తెలంగాణలో సుమారు 30 వేల మగ్గాలు ఉంటే అందులో పోచంపల్లిలోనే 15 వేల మగ్గాలు ఉన్నాయన్నారు. వీటిపై ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇక్కత్ వస్త్రాలు తయారు చేస్తున్నారని పేర్కొన్నారు. పోచంపల్లి ఇక్కత్‌ను డుప్లికేట్ డిజైన్లు ఆక్రమించాయని, దీని వల్ల మార్కెట్ తీవ్రంగా దెబ్బతింటుందన్నారు.డూప్లికేట్ డిజైన్లను అరికట్టాలని, రూ.100 కోట్లతో ప్రత్యేక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలని కోరారు. ఫ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి -
పడిపోతున్న ఉష్ణోగ్రతలు
చలి తీవ్రత దష్ట్యా వృద్ధులు, పిల్లలు అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వెచ్చని దుస్తులు ధరించడం, వేడి పానీయాలు తీసుకోవడం వంటివి చేయాలి. అత్యవసరమైతే తప్ప ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు రాకుండా ఉండాలని హెచ్చరిస్తున్నారు. భువనగిరి, భువనగిరి టౌన్ : జిల్లాలో చలితీవ్రత మరింత పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలకు పడిపోయాయి. అత్యల్పంగా చౌటుప్పల్ మండలం తూప్రాన్‌పేటలో9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చలితీవ్రత వల్ల ఉదయాన్నే పనులకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడు భారీ వర్షాల కారణంగా చలితీవ్రత అధికంగా ఉన్నట్లు వాతావరణ శాఖ నిపుణులు పేర్కొంటున్నారు. చల్లటి గాలులతో ఇబ్బందులు వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోవడం ప్రారంభమైంది. దీంతో చలి తీవ్రత పెరిగింది. దీనికి తోడు చలిగాలులు వీస్తుండటం ప్రజలను మరింత ఇబ్బందులకు గురి చేస్తోంది. సాయంత్రం త్వరగా పనులు ముగించుకుని ఇంటికే పరిమితం అవుతున్నారు. ఉదయం 9 గంటల వరకు జనం బయటకు వచ్చే పరిస్థితి లేదు. ప్రధానంగా కార్మికులు, రైతులు, పాల వ్యాపారులు తెల్లవారుజామున పనిచేయాల్సి వస్తుండడంతో చలికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంలో చలికి వీధులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. రానున్న రోజుల్లో చలిప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని, వృద్ధులు, పిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. నివారణ చర్యలు చలి నుంచి రక్షణ పొందడానికి ఉన్ని దుస్తులు, శాలువాలు, మంకీ క్యాప్‌లు, స్వెటర్లు తప్పక ధరించాలి. ఇంట్లో హీటర్లు వాడుతున్నప్పుడు తగిన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. చలికాలంలో త్వరగా వచ్చే జలుబు, ఫ్లూ వంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. అధిక చలికి గురైతే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఉష్ణోగ్రతలు తేదీ గరిష్టం కనిష్టం 06 32.1 15 07 31.7 13.5 08 32.3 10.4 09 32.2 10.3 10 32.1 9 11 31.1 9.1తూప్రాన్‌పేటలో 9 డిగ్రీలు ఫ మిగతా ప్రాంతాల్లోనూ తగ్గుదల ఫ మున్ముందు మరింత పడిపోయే అవకాశం -
ఓటుకు రూ.5వేలు, మద్యం!
సర్పంచ్ పీటం కోసం అభ్యర్థులు రూ.కోట్లు కుమ్మరిస్తున్నారు. యాదగిరిగుట్ట, రాజాపేట, ఆత్మకూర్(ఎం) మండలాల్లోని మేజర్ గ్రామ పంచాయతీల్లో ఒక్కో ఓటరుకు రూ.4 వేల నుంచి రూ.5వేల వరకు ఇచ్చినట్లు సమాచారం. యాదగిరిగుట్ట మండలంలోని ఓ గ్రామ పంచాయతీలో ఫుట్‌బాల్ గుర్తు వచ్చిన అభ్యర్థి గురిగింజసైజ్లో బంగారు పూతతో తయారు చేయించిన బాల్స్‌ను పంపిణీ చేశాడని, ఒక్కో బాల్ విలువ రూ.1500 వరకు ఉంటుందని తెలిసింది. రాజాపేట మండలంలోని రెండు పంచాయతీల్లో మహిళా ఓటర్లందరికీ చీరలు, వెండి కుంకుమ బరిణెలు, చికెన్, బిర్యాని, మందుతో పాటు రూ. వెయ్యి నుంచి రూ.5 వేల వరకు పంపిణీ చేశారని సమాచారం. సాక్షి, యాదాద్రి : పల్లెపోరులో నోట్ల వర్షం కురుస్తోంది. ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఓటుకు ఇంత అని రేటు కట్టి పంపిణీ చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగిసిన మరుక్షణం నుంచే మొదలైన ప్రలోభపర్వం.. గురువారం అర్ధరాత్రి వరకు పెద్ద ఎత్తున డబ్బు, మద్యంతో పాటు చీరలు పంపిణీ కొనసాగించినట్లు తెలుస్తోంది. తాయిలాలకు ప్రభావితమయ్యే వర్గాలకు, తమకే ఓటు వేస్తారని భావించిన ఓటర్లకు ముట్టజెప్పారు. సర్పంచ్ అభ్యర్థులతో పాటు ఉప సర్పంచ్ పదవులకు పోటీ పడుతున్న అభ్యర్థులు సైతం ఖర్చుకు ఏమాత్రం వెనుకాడ లేదు. గుర్తులతో కూడిన వస్తువులు పంపిణీ విచ్చల విడిగా మద్యం, డబ్బుతో పాటు పలు రకాల గిఫ్ట్‌లను కూడా పంపిణీ చేశారు. అభ్యర్థులకు కేటాయించిన ఉంగరం, బ్యాట్, కత్తెర, స్టూల్, ఫుట్‌బాల్ గుర్తులను పోలిన వస్తువులను పంపిణీ చేసి ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద పంపిణీకి ప్లాన్ అభ్యర్థులు ఆఖరి అస్త్రంగా పోలింగ్ కేంద్రాల వద్ద సైతం ఓటర్లకు నగదు పంపిణీకి ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో నోట్ల వర్షం ఫ ఓటర్లను ఆకర్షించేందుకు భారీగా తాయిలాలిస్తున్న అభ్యర్థులు ఫ మద్యం, నగదుతో పాటు కానుకలు ఫ మేజర్ గ్రామ పంచాయతీల్లో లెక్కకు మించి వ్యయం -
పరిమితికి మించి ఖర్చు చేయొద్దు
మోత్కూరు: సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల నిబంధనల మేరకు ఖర్చు చేయాలని, పరిమితికి మించితే అనర్హత వేటు పడుతుందని ఎంపీడీఓ బాలాజీనాయక్ తెలిపారు. బుధవారం మోత్కూరు మండల పరిషత్ కార్యాలయంలో అభ్యర్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారికి ఎన్నికల వ్యయంపై సూచనలు చేశారు. సర్పంచ్‌కు రూ.1.50 లక్షలు, వార్డు స్థానాల్లో రూ.50వేలకు మించి ఖర్చు చేయరాదన్నారు. ప్రచారానికి వినియోగంచే వాహనాలు, మైక్‌లు, ర్యాలీలు, సభల నిర్వహణకు ముందస్తుగా అనుమతి పొందాలన్నారు. కొత్తగా తెరిచిన బ్యాంక్ ఖాతా నుంచి మాత్రమే ఖర్చు చేయాలని పేర్కొన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎన్నికల వ్యయ పరిశీలకుడు వెంకట్‌రెడ్డి, ట్రైనర్ సుధాకర్, తహసీల్దార్ జ్యోతి, సీఐ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఏపీలోనూ యాదగిరీశుడి కల్యాణోత్సవాలు
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణోత్సవాలను తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ నిర్వహించనున్నామని ఆలయ ఈవో వెంకట్రావ్ వెల్లడించారు. బుధవారం తన కార్యాలయంలో వివిధ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. వచ్చే ఏడాది (2026) జనవరి 3న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జగ్గయ్యపేటలో, 5వ తేదీన పిడుగురాళ్లలో శ్రీ స్వామివారి కల్యాణోత్సవాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి జగ్గయ్యపేటకు నోడల్ ఆఫీసర్‌గా ఏఈవో కృష్ణ, పిడుగురాళ్లలో జరిగే కళ్యాణానికి నోడల్ ఆఫీసర్‌గా ఏఈవో మహేష్‌ను నియమించినట్లు తెలిపారు. శ్రీ స్వామి వారి ప్రచార రథం ద్వారా శ్రీ స్వామివారి ఆలయ చరిత్ర, మహిమలు, దేవస్థానం అభివృద్ధి, రాబోయే కార్యక్రమాలను విస్తరిస్తూ ఈ వేడుకలను జరిపించనున్నట్లు పేర్కోన్నారు. ఇటీవలనే కొత్తగా ప్రారంభించిన అన్నదాన కేంద్రంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన సేవలు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భక్తుల రద్దీ, పండుగ రోజుల్లో ప్రత్యేక ఏర్పాట్లు, ఆహార నాణ్యత, పరిశుభ్రత, సేవకుల నియామకాల వంటి అంశాలపై దృష్టిసారించాలని సూచించారు. కొండ కింది అన్నదాన ప్రాంగణం, లక్ష్మీ పుష్కరిణి, కళ్యాణ కట్టతో పాటు భక్తులు అధికంగా ఉండే ప్రాంతాలలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయాలన్నారు. ఈ సమావేశంలో అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, డిప్యూటీ ఈవో భాస్కర్ శర్మ, ఆలయాధికారులు, అర్చకులున్నారు. జనవరి 3న జగ్గయ్యపేట, 5న పిడుగురాళ్లలో స్వామివారి కల్యాణం యాదగిరిగుట్ట ఆలయ ఈవో వెంకట్రావ్ వెల్లడి -
స్వేచ్ఛగా ఓటు వేయండి
సాక్షి, యాదాద్రి : ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు జరిగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నాం. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేశాం.. అని డీసీపీ అక్షాంశ్‌యాదవ్ తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం చేపట్టిన ఏర్పాట్ల గురించి ఆయన బుధవారం ‘సాక్షి’ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 4 వేల మంది పోలీసులు జిల్లాల్లోని 17 మండలాల్లో 427 గ్రామ పంచాయతీలు, 3,704 వార్డులు ఉన్నాయి. ఇక్కడ మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి, రెండో విడతలో 1,500 మంది, మూడో విడతలో 1,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో సివిల్ పోలీసులతో పాటు ఏఆర్, ఆర్మ్‌డు, ప్రత్యేక బలగాలు పాల్గొంటున్నాయి. ఐదుగురు ఏసీపీలు, 15మంది సీఐలు, 35మంది ఎస్ఐలు బందోబస్తును పర్యవేక్షించనున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధిలో ఆంక్షలు ఉంటాయి. జనం గుమిగూడటం, పోలింగ్ కేంద్రంలోకి గుంపులుగా వెళ్లటం నేరం. 138 మొబైల్ పార్టీలు మొదటి విడత ఎన్నికలు జరుగుతున్న ఆరు మండలాల్లో 49 , రెండో విడత 51, మూడో విడత మండలాల్లో 138 రూట్ మొబైల్ పార్టీలు ఏర్పాటు చేశాం. ప్రత్యేక పోలీసు బలగాలు, స్థానిక పోలీసు అధికారులు ఆయా మండలాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలుగకుండా బందోబస్తుఉంటుంది. 219 సమస్యాత్మక గ్రామాలు జిల్లా వ్యాప్తంగా 219 సమస్మాత్మక గ్రామాలను గుర్తించాం. ఆయా గ్రామాల్లో ఎన్నికలు ముగిసే వరకు నిరంతర నిఘా ఉంటుంది. విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా పోలీసులు అక్కడ నిత్యం సంచరిస్తూ ఓటర్లకు భరోసా కల్పిస్తారు. చెక్‌పోస్ట్‌ల వద్ద నిరంతర నిఘా.. బొమ్మలరామారం, ఆలేరు, పంతంగి, బీబీనగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నాలుగు చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశాం. ఆరు స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, ఆరు స్ట్రైకింగ్ పోర్స్ టీంలను ఏర్పాటు చేసి నిరంతర నిఘా ఉంచాం. మద్యం, నగదు అక్రమ రవాణాతో పాటు గిఫ్ట్‌లు తరలించకుండా అడ్డుకునేందుకు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాం. ఫ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు ఫ మూడు విడతల్లో 4వేల మంది పోలీసులతో బందోబస్తు ఫ సమస్యాత్మక గ్రామాల్లో సాయుధ బలగాల మొహరింపు ‘సాక్షి’తో డీసీపీ అక్షాంశ్‌యాదవ్ ఎన్నికల ఫలితాల ప్రకటన అనంతరం బాణాసంచాలు కాల్చడం నిషేథం. ర్యాలీలు, ఊరేగింపులకు పోలీసుల అనుమతి తప్పనిసరి తీసుకోవాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. గత ఎన్నికల్లో గొడవలకు దిగిన, నేర చరిత్ర కలిగిన వ్యక్తులను గుర్తించాం. వారిలో 485 మందిని బైండోవర్ చేశాం. ఎన్నికల నిబంధనలు అతిక్రమించి లిక్కర్ కలిగిన 142 మంది పైన కేసులు నమోదు చేశాం. 1000 లీటర్ల అక్రమ మద్యాన్ని సీజ్ చేశాం. 19 మంది నుంచి గన్లు డిపాజిట్ చేసుకున్నాం. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అలజడి సృష్టించినా వెంటనే చర్యలు తీసుకుంటాం. శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దు. ఓటర్లు నిర్భయంగా స్వేచ్ఛగా తమకు నచ్చిన వారికి ఓటు వేయాలి. ఓటర్లను ఎవరైనా అడ్డుకున్నా, ప్రలోభ పెట్టిన కేసులు నమోదు చేస్తాం. అలజడులు సృష్టించి యువత కేసుల పాలు కావద్దు. -
కృష్ణా తీరంలో వ్యర్థ రసాయనాలు
మఠంపల్లి : రసాయనాలు కలవడంతో మఠంపల్లి మండలం మట్టపల్లి వద్ద కృష్ణా నది తీరం కలుషితమవుతోంది. గత 15 రోజుల నుంచి గుర్తుతెలియని వ్యక్తులు రసాయనాలు తెచ్చి నదిలో పోయడంతో కృష్ణా నది తీరంలోని నీరు ఆకుపచ్చ, నీలం రంగులోకి మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మట్టపల్లి గ్రామం వద్ద కృష్ణా నది రేవు సమీపంలోనే కృష్ణా నది జలాలు సరఫరా చేసే టేక్‌వెల్ ఉండటంతో సంబంధిత అధికారులు గమనించి నీటి సరఫరాను నిలిపివేశారు. 15రోజుల క్రితం వరకు నది అవతలి భాగంలో పల్నాడు జిల్లా వైపు నీరు కలుషితమై కనిపించిందని, ఇప్పుడు మట్టపల్లి వైపు నది కలుషితమైందని స్థానికులు చెబుతున్నారు. సంబంధిత అధికారులు కలుషిత నీటిని పరిశీలనకు తీసుకెళ్లారు. నదీలో స్నానం చేయడాన్ని నిలిపివేశారు. నీరు కలుషితం కావడంతో మత్స్యకారులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు విచారణ జరిపి కృష్ణా నదిలో రసాయనాలు వదిలే వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మట్టపల్లి వద్ద నదిలోకి వదులుతున్న గుర్తుతెలియని వ్యక్తులు -
యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. బుధవారం వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర కై ంకర్యాలు గావించారు. ఆల య ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు జరిపించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు. -
137 పంచాయతీలు, 1,040 వార్డు స్థానాలకు ఎన్నికలు
గురువారం శ్రీ 11 శ్రీ డిసెంబర్ శ్రీ 2025సాక్షి,యాదాద్రి : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గురువారం మొదటి విడత పోలింగ్ జరగనుంది. ఆలేరు నియోజకర్గంలోని ఆరు మండలాల్లో 137 పంచాయతీలు, 1,040 వార్డు స్థానాల్లో అధికారులు సర్వం సిద్ధం చేశారు. మండల పరిషత్ కార్యాలయాల ఆవరణల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో సిబ్బంది పోలింగ్ సామగ్రి తీసుకొని పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 7గంటలకు పోలింగ్ మొదలై మధ్యాహ్నం ఒంటి గంటకు ముగియనుంది. 137 పంచాయతీలు, 1,040 వార్డులు ఆలేరు, ఆత్మకూర్(ఎం), బొమ్మలరామారం, తుర్కపల్లి, యాదగిరిగుట్ట, రాజాపేట మండలాల్లో 153 పంచాయతీలు, 1,284 వార్డులున్నాయి. ఇందులో 16 పంచాయతీలు, 243 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 137 పంచాయతీలు, 1,040 వార్డులకు నేడు పోలింగ్ జరగనుంది. సర్పంచ్‌కు 411, వార్డు సభ్యుల స్థానాల్లో 2,652 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు. మొదటి దశలో 1,57,817 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీందరికీ ఎన్నికల అధికారులు ఓటరు స్లిప్‌లు పంపిణీ చేశారు. ప్రతి వార్డుకు ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో 1,177 బ్యాలెట్ బాక్స్‌లు అందుబాటులో ఉంచారు. ఈ మూడు వార్డులకు ఎన్నికల్లేవు తొలివిడత ఎన్నికలు జరుగుతున్న పంచాయతీల్లో మూడు వార్డులకు ఎన్నికలు జరగడం లేదు. రాజా పేట మండలం పుట్టగూడెం పంచాయతీలో 8వ వార్డులో నామినేషన్ దాఖలు చేసిన ఇద్దరు అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. సర్పంచ్ పదవి ఏకగ్రీవం సందర్భంగా కుదిరిన ఒప్పందం ప్రకారం సర్పంచ్ అభ్యర్థిగా రంగంలో దిగిన రవీందర్‌నాయక్‌ను ఉపసర్పంచ్ చేయడానికి నామినేషన్ల ఉపసంహరణ జరిగింది. అదే విధంగా తుర్కపల్లి మండలం మల్కాపురంలో 8వ వార్డు ఎస్టీ రిజర్వ్డు కాగా ఇక్కడ ఓటర్లు లేనందున ఎవ్వరూ నామినేషన్ వేయలేదు. బొమ్మలరామారం మండలం పిల్లిగుండ్ల తండాలో ఒక వార్డుకు తక్కువ వయసున్న అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నికల అధికారులు తిర్కస్కరించారు. ఈ మూడు చోట్ల ఎన్నికల నిర్వహణకు త్వరలో తేదీలు ప్రకటించనున్నారు. వెంటనే ఉపసర్పంచ్ ఎన్నిక ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు పోలింగ్ జరగనుంది. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటిస్తారు. వెంటనే ఉపసర్పంచ్ ఎన్నిక ఉంటుంది. మొదటి దశలో.. మండలాలు 06పోలింగ్ కేంద్రాలు 1,040పోలింగ్ సిబ్బంది 3,100పీఓలు 1,040ఓపీఓలు 1,396స్టేజ్ –2 అధికారులు 137జోనల్ అధికారులు 29బ్యాలెట్ బాక్స్‌లు 1,177ఫ ఉదయం 7గంటల నుంచి పోలింగ్ ఫ సర్వం సిద్ధం చేసిన అధికారులు ఫ 1,040 పోలింగ్ కేంద్రాలు, 1,57,817 మంది ఓటర్లు గ్రామ పంచాయతీలు, వార్డులు, ఓటర్లు మండలం జీపీలు వార్డులు పోలింగ్ మొత్తం పురుషులు మహిళలు స్టేషన్లు ఓటర్లు ఆలేరు 16 140 140 20,998 10,242 10,755 ఆత్మకూర్(ఎం) 23 192 192 249,48 12,610 12,338 బి.రామారం 35 284 284 27,605 13,672 13,932 రాజాపేట 23 206 206 29,904 14,807 15,097 తుర్కపల్లి 33 266 266 26,747 13,236 13,511 యాదగిరిగుట్ట 23 198 198 27,615 13,657 13,958 -
మిరప కోతలో మెళకువలు
కోత విధానం ఇలా..మిరపకాయలు కోతకు వచ్చిన వెంటనే కూలీలతో కోయిస్తే చెట్టు విరిగిపోయి పంటకు నష్టం కలుగుతుందని రైతులు భావిస్తున్నారు. చాలా కాయలు పండిన తర్వాత ఒకేసారి కోయవచ్చునని మరికొంత మంది రైతులు భావించి కోతను ఆలస్యం చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో వర్షాలు కురిస్తే పండిన కాయలు రాలిపోతాయి. మంచు వల్ల కూడా కాయలు రాలిపోయే అవకాశం ఉంది. ఒక్కోసారి తెల్లకాయలు ఎక్కువగా వస్తుంటాయి. మొక్కల ఎదుగుదల తగ్గుతుంది. అందువల్ల రైతులు కోతకు వచ్చిన మిరపకాయల్ని విడతల వారీగా కోసి నాణ్యత గల కాయల్ని మార్కెట్‌కు పంపాలి. పండిన కాయల్ని వెంటనే కోస్తే తెల్లకాయలు ఎక్కువగా రావు. కాయ కోత తర్వాత ఎరువులు వేసి, నీటి తడి పెడితే అదనంగా మొక్కకు కాయ వచ్చి దిగుబడి పెరుగుతుంది. రైతులు కనీసం కాయలను ఆరు, ఏడు దఫాలుగా కోయాలి.పెద్దవూర: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు మిరప పంటను విస్తారంగా సాగు చేస్తున్నారు. మిరప పంట ఇప్పుడిప్పుడే కోత దశకు వస్తుండడంతో రైతులు మిరపకాయలు కోసేందుకు సిద్ధమవుతున్నారు. మిరప కోత, ఆరబెట్టే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే రైతులు నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని పెద్దవూర మండల వ్యవసాయ అధికారి కె. సందీప్‌కుమార్ పేర్కొన్నారు. మిరప కోత సమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆయన మాటల్లోనే.. ● గత నెలలో ఇరవై రోజుల పాటు కురిసిన వర్షాలకు చాలా మిరప చేలు జాలు పట్టి గడ్డిలో కలిసిపోయాయి. సరిగ్గా ఎదుగుదల లేక, చీడపీడలు, తెగుళ్లతో ఎక్కువ దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. ● మిరప రైతులు ఎకరానికి 20 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నా.. నాణ్యత లేక నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ● సరైన సమయంలో కోతలు కోయక, కల్లాల్లో వర్షానికి, మంచుకు కాయలు తడిస్తే నాణ్యత తగ్గుతుంది. ● మార్కెట్లో ధరలు లేక ఎగుమతులకు పనికిరాక, వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేయడం వంటి కారణాలతో రైతులు నష్టపోతున్నారు. ● పంట మార్పిడి చేయకపోవడం, విచక్షణారహితంగా పురుగు మందులు పిచికారీ చేయడం, పండిన మిరపకాయలు ఎప్పటికప్పుడు తెంచకపోవడం వంటి కారణాలతో కాయ నాణ్యత లోపిస్తుంది. ఆరబెట్టడం ఇలా..కొన్నిసార్లు కోతల సమయంలో వర్షాలు కురిస్తే సకాలంలో కోతలు జరగక కోసిన వాటిని సరైన సమయంలో ఎండబెట్టక నాణ్యత లేని మిర్చిగా మారిపోతుంది. ఫలితంగా మార్కెట్లో సరైన ధర రాక నష్టపోవాల్సి వస్తుంది. మిరపకాయల్ని ఎండబెట్టే కల్లాల్ని గట్టి భూమి ఉండే ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవాలి. దుమ్ము ఎక్కువగా లేని, కొద్దిగా ఏటవాలు ఉండే ప్రదేశాన్ని ఎంచుకోవాలి. నీళ్లు వెళ్లే వైపు కల్లం పొడవుగా ఉండాలి. వర్షం పడినప్పుడు పైనీళ్లు కల్లం పైకి రాకుండా కల్లం చుట్టూ అడుగున్నర ఎత్తు కట్ట ఏర్పాటు చేసుకోవాలి. తోట విస్తీర్ణం, దిగుబడిని బట్టి కల్లం పొడవు, వెడల్పులను తయారు చేసుకోవాలి. వర్షాలు పడ్డప్పుడు పరదాలు కప్పుతాం కాబట్టి నీరు తీసివేయడానికి అనుకూలంగా ఉంటుంది. దాదాపు 10 క్వింటాళ్ల మిరప 30 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు గల కల్లం తయారు చేసుకోవాలి. కల్లం సైజును బట్టి టార్ఫాలిన్ కవరు తెచ్చుకోవాలి. ప్రతిరోజు కోసే కాయల్ని కుప్పలుగా పోసి మరుసటి రోజు ఉదయం మంచు తగ్గగానే పలుచగా పోసి ఆరబెట్టాలి. ప్రతిరోజు సాయంత్రం ఆరబెట్టిన మిరపకాయల్ని కుప్పగా పోసి టార్ఫాలిన్ కవర్ కప్పి కాయలపై మంచు పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఇలా చేస్తే గాలి, వెలుతురు బాగా ప్రసరించి కాయలు త్వరగా ఎండుతాయి. కాయలు బాగా ఎండకముందే తెల్లకాయలు వేరుచేయాలి. కాయల్లో 5 శాతం తేమ ఉన్నప్పుడే వాటిని మండె పోసి గోనె సంచులతో కప్పాలి. మార్కెట్‌కు తీసుకెళ్లే రోజు ఉదయం శుభ్రమైన ఖాళీ సంచుల్లో వాటిని నింపాలి. ఒక్కో సంచిలో 40కిలోల కాయల కన్నా ఎక్కువ నింపకూడదు. ఎక్కువ కాయల్ని సంచిలో తొక్కితే కాయ నాణ్యత చెడిపోయి మార్కెట్లో సరైన ధర రాదు. కోత సమయంలో ఈ విధమైన చర్యలు చేపడితే నాణ్యమైన పంటతో పాటు మార్కెట్లో అధిక ధర పలుకుతుంది. పెద్దవూర మండల వ్యవసాయాధికారి సందీప్‌కుమార్ సూచనలు -
నూతనకల్ మండలంలో టెన్షన్.. టెన్షన్..
సూర్యాపేట : నూతనకల్ మండలం లింగంపల్లిలో మంగళవారం రాత్రి బీఆర్ఎస్ నాయకుడు ఉప్పుల మల్లయ్య హత్యకు గురికావడంతో మండలంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్‌కు ముందు రాజకీయ హత్య జరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఏడాదే మార్చి 17న నూతనకల్ మండలం మిర్యాలలో రాజకీయ ఆధిపత్య నేపథ్యంలో చక్రయ్య అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. గత 15 సంత్సరాల నుంచి మండలంలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోలేదని, గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొన్న సమయంలో ఇలాంటి ఘటనలు జరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వృద్ధురాలిపై దాడి చేసి పుస్తెలతాడు అపహరణచౌటుప్పల్ : ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధురాలిపై దుండగుడు దాడి చేసి ఆమె బంగారు పుస్తెలతాడును అపహరించుకెళ్లాడు. ఈ ఘటన చౌటుప్పల్ మండలం కాట్రేవు గ్రామంలో బుధవారం జరిగింది. కాట్రేవు గ్రామానికి చెందిన గున్రెడ్డి రంగారెడ్డి, సత్తమ్మ దంపతుల కుమారులు జీవనోపాధి నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్లి అక్కడే ఉంటున్నారు. ఈ దంపతులిద్దరే ఇంటి వద్ద ఉంటున్నారు. రోజుమాదిరిగానే బుధవారం తెల్లవారుజామున 5గంటలకు రంగారెడ్డి పాలు తీసుకొచ్చేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. సత్తమ్మ ఇంట్లోనే నిద్రించింది. రంగారెడ్డి బయటకు వెళ్లేటప్పుడు తలుపులు పెట్టకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి సత్తమ్మ తలకు దుప్పటి చుట్టి ఆమెను కొట్టాడు. ఆమె తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా.. దిండు కింద దాచి ఉంచిన నాలుగున్నర తులాల బంగారు పుస్తెలతాడును దుండగుడు గుర్తించి దానిని తీసుకొని పారిపోయాడు. చోరీకి పాల్పడిన వ్యక్తి ముందుగానే వీధి లైట్లను ఆపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితురాలి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రికి రూ. 3లక్షల జరిమానారామగిరి(నల్లగొండ) : నల్లగొండలోని టీఎన్ఆర్ ఆస్పత్రికి రూ.3లక్షల జరిమానా విధిస్తూ నల్లగొండ వినియోగదారుల కమిషన్ బుధవారం తీర్పు వెలువరించింది. కనగల్‌కు చెందిన ఐతరాజు శోభ గర్భకోశ సంబంధిత సమస్యతో టీఎన్ఆర్ హాస్పిటల్లో డాక్టర్ నాగేశ్వరావును సంప్రదించగా.. 2023 జనవరి 6న ఆమెకు సర్జరీ చేసి గర్భసంచి తొలగించారు. అయినా సమస్య తీరకపోవడంతో హైదరాబాద్‌లో చూపించగా.. ఆమెకు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. టీఎన్ఆర్ ఆస్పత్రి వైద్యుడి నిర్లక్ష్యంగా సర్జరీ చేయడంతోనే క్యాన్సర్‌కు దారితీసిందని శోభ కుటుంబ సభ్యులు వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించగా.. విచారణ చేపట్టి బాధితురాలికి ఆస్పత్రి ఖర్చులకు గాను రూ.1,22,000 9శాతం వడ్డీతో, పరిహారం కింద రూ.2,20,000 చెల్లించాలని ఆదేశించారు. -
ఘనంగా సాగర్ డ్యాం శంకుస్థాపన దినోత్సవం
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన చేసి బుధవారం నాటికి 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా డ్యాం సూపరింటెండెంట్ మల్లికార్జునరావు ఆధ్వర్యంలో పైలాన్ వద్ద శంకుస్థాపన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అప్పటి చీఫ్ ఇంజనీర్ మీర్ జాఫర్ అలీ విగ్రహానికి, ప్రాజెక్టు నిర్మాణంలో అసువులు బాసిన కార్మికులకు గుర్తుగా పైలాన్ వద్ద పూలమాలలు ఉంచి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎస్ఈ నాగేశ్వర్రావు, డ్యాం భద్రతాధికారి శ్రీనివాసరావు, ఎస్ఐ రఘు, డ్యాం ఇంజనీర్లు రమేష్, చంద్రమౌళి, జనార్దన్, ముజీబ్, డ్యాం సిబ్బంది పాల్గొన్నారు. -
పోలింగ్ రోజు సెలవు
భువనగిరిటౌన్ : ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలింగ్ జరిగే మండలాల్లో ఆ రోజు సెలవులు ఇవ్వనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 11,14,17 తేదీల్లో మూడు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయని, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు, పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య సముదాయలు, ఇతర సంస్థలు పోలింగ్ రోజు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని ఆదేశించారు. సెలవు ఇవ్వడం సాధ్యంకాని పక్షంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు టైమ్ ఆఫ్ కల్పించాలని పేర్కొన్నారు. ఉత్తర్వులను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మూడో విడత ఎన్నికలు ముగిసే వరకు ఆంక్షలుభువనగిరిటౌన్ : ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు మూడో విడత ఎన్నికలు ముగిసే వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిఘా, తనిఖీ బందాలు, వ్యవయ పరిశీలకులు, పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈనెల 14న రెండో విడత ఎన్నికలు జరిగే మండలాల్లో 12వ తేదీ సాయంత్రం 5 గంటలకు ప్రచార గడువు ముగుస్తుందన్నారు. ఆయా ప్రాంతాల్లో మద్యం షాపులు, కల్లు దుకాణాలు మూసివేయాలన్నారు. ‘ఓటు చోరీ’పై సంతకాల సేకరణ మోత్కూరు: బీజేపీ ఓటరు జాబితా గోల్‌మాల్‌కు వ్యతిరేకంగా బుధవారం మోత్కూరులోని అంబేద్కర్ చౌరస్తాలో పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ మోదీ సర్కార్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. బీజేపీ ఓటు చోరుకు పాల్పడుతూ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుందని, దీనిపై గడపగడపకూ ప్రచారం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండగోని రామచంద్రుగౌడ్, జిల్లా నాయకులు కంచర్ల యాదగిరిరెడ్డి, గుర్రం లక్ష్మినర్సింహారెడ్డి, అవిశెట్టి అవిలుమల్లు, గడ్డం నర్సింహ, మండల నాయకులు బయ్యని రాజు, మందుల సురేష్, పల్లపు సమ్మయ్య, పోలినేని స్వామిరాయుడు, పురుగుల నర్సింహ, శేఖరాచారి, మున్నీర్, కోమటి మచ్చగిరి, మెంట భిక్షం, బందెల రవి పాల్గొన్నారు. డీఎఫ్ఓగా సుధాకర్‌రెడ్డి భువనగిరి : జిల్లా అటవీశాఖ అధికారి(డీఎఫ్ఓ)గా సుధాకర్‌రెడ్డి నియామకం అయ్యారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు అటవీ శాఖ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. దీంట్లో భాగంగా రంగారెడ్డి జిల్లా డీఎఫ్ఓగా ఉన్న సుధాకర్‌రెడ్డి ఇక్కడికి వచ్చారు. ప్రస్తుతం డీఎఫ్ఓగా ఉన్న పద్మజారాణి సిద్ధిపేట జిల్లాకు బదిలీ అయ్యారు. కొనుగోలు కేంద్రాల్లో తనిఖీలు రామన్నపేట: మండలంలోని నీర్నెముల, మునిపంపుల, దుబ్బాక గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో బుధవారం తూనికలు కొలతలు, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నీర్నెముల గ్రామంలో తూనికల కొలతలశాఖ సర్టిఫై చేయని వేయింగ్ మిషన్ వాడుతున్నట్లు గుర్తించి సీజ్ చేశారు. నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. రికార్డు ల నిర్వహణ సక్రమంగా లేనట్లు గుర్తించారు. దుబ్బాక, మునిపంపులసెంటర్ల నిర్వాహకులు అందుబాటులో లేకపోవడంతో రికార్డులను పరిశీలించలేకపోయారు. ధాన్యం కొనుగోళ్లలో పారదర్శకత పాటించాలని, అక్రమాలకు పా ల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు. వే బ్రిడ్జి తూకాల్లో వ్యత్యాసం లేకుండా చూసుకోవాలని నిర్వాహకులకు స్పష్టం చేశారు. తనిఖీల్లో జిల్లా తూనికల కొలతల అధికారి వెంకటేశ్వర్లు, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ ఎస్కే గౌస్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
ఓట్ల లెక్కింపు ఇలా..
బ్యాలెట్ బాక్స్‌లో నుంచి బ్యాలెట్ పేపర్లను బయటికి తీసి వాటిని వేరు వేస్తారు. ఆ తరువాత లెక్కిస్తారు. - 8లోపొరపాట్లకు అవకాశం ఇవ్వొదు యాదగిరిగుట్ట: పొరపాట్లకు తావివ్వకుండా పోలింగ్ నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు సిబ్బందికి సూచించారు. యాదగిరిగుట్ట పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను ఆయన సందర్శించి పోలింగ్ సామగ్రి పంపిణీని పరిశీలించారు. పోలింగ్ నిర్వహణ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రానికి చేరుకున్న తరువాత ఫారం–9 ప్రకారంగా బ్యాలెట్ బాక్స్‌లు, బ్యాలెట్ పేపర్లు, స్వస్తిక్ మార్క్ తదితర సామగ్రిని చెక్‌చేసుకోవాలని స్పష్టం చేశారు. ఓటరు బ్యాలెట్ బాక్స్‌లో రెండు బ్యాలెట్ పేపర్లు వేస్తున్నారా లేదా పరిశీలిస్తుండాలన్నారు. విధులకు గైర్హాజరైన సిబ్బందికి వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పోలింగ్ అధికారులు, సిబ్బందికి కలెక్టర్ స్వయంగా భోజనం వడ్డించారు. -
ఎన్హెచ్వీఆర్లో రాష్ట్రస్థాయికి 8 పాఠశాలలు
ఫ విజయ్ దివస్రామన్నపేట ఆర్ఐ సస్పెన్షన్ రామన్నపేట: రామన్నపేట ఆర్ఐ రాజేశ్వర్ సస్పెండ్ అయ్యారు. ఈమేరకు కలెక్టర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. కక్కిరేణి గ్రామంలో 98, 106, 107, 109, 110 సర్వే నంబర్లలోని 4.03 ఎకరాల భూమి 1964 నుంచి శ్రీ భక్తమార్కేండేయ దేవస్థానం ఆధీనంలో ఉందని 2024లో ఉన్నతాధికారులకు ఆర్ఐ రాజేశ్వర్ నివేదిక సమర్పించారు. ఈఏడాది ఫిబ్రవరిలో అవే సర్వే నంబర్లలోని రెండు ఎకరాలు ఓ వ్యక్తి ఆధీనంలో ఉందని మరో నివేదికను ఇచ్చారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్‌రెడ్డి ఇటీవల విచారణ నిర్వహించారు. నివేదిక ఆధారంగా కలెక్టర్ హనుమంతరావు ఆర్ఐను సస్పెండ్ చేశారు. భువనగిరి: స్వచ్ఛ ఏవమ్ హరిత విద్యాలయ రేటింగ్ (ఎన్హెచ్వీఆర్)లో జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి 8 పాఠశాలలు ఎంపికయ్యాయి. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛతలో మెరుగ్గా ఉండే పాఠశాలలకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. అందులో భాగంగా స్వచ్ఛతలో ఆరు అంశాలకు సంబంధించి గత అక్టోబర్‌లో ప్రధానోపాధ్యాయులు జిల్లాలోని 819 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను ఆన్లైన్లో నమోదు చేశారు. వీటి ఆధారంగా రేటింగ్ ప్రకటించారు. ఇందులో జిల్లాలో 28పాఠశాలలు 5 స్టార్ రేటింగ్ దక్కించుకున్నాయి. సీనియర్ ప్రధానోపాధ్యాయులు, జీహెచ్ఎంసీలు ఆయా పాఠశాలలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వీటిలో 8 పాఠశాలలను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. జాతీయ స్థాయిలో ఎంపికై తే పాఠశాలలకు ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా రూ.లక్ష ప్రోత్సాహక బహుమతి అందుకోవచ్చని జిల్లా విద్యాశాఖాధికారి నారాయణ తెలిపారు. ఎంపికై న పాఠశాలలు ఇవే.. రూరల్– 1 కేటగిరీ : మక్తాఅనంతారం ప్రాథమికోన్నత పాఠశాల (బీబీనగర్ మండలం), నందనం ప్రాథమికోన్నత పాఠశాల (భువనగిరి మండలం), వాయిలపల్లి ప్రాథమికోన్నత పాఠశాల (నారాయణపురం మండలం). రూరల్– 2కేటగిరి : జనగామ జెడ్పీ ఉన్నత పాఠశాల (నారాయణపురం మండలం), వీరారెడ్డిపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల (తుర్కపల్లి మండలం), చీకటిమామిడి జెడ్పీ ఉన్నత పాఠశాల (బొమ్మలరామారం మండలం). అర్బన్– 1కేటగిరీ : బంగారిగడ్డ ప్రాథమికోన్నత పాఠశాల (చౌటుప్పల్ మండలం) అర్బన్– 2 కేటగిరీ: ఆలేరులోని బాలికల రెసిడెన్షియల్ పాఠశాల ఎంపికై ంది. -
తొలివిడత పంచాయతీ ఎన్నికల ప్రచారం సమాప్తం
రెండవ విడత ఎన్నికలు జరుగుతున్న భువనగిరి, వలిగొండ, బీబీనగర్, పోచంపల్లి, రామన్నపేట మండలాల్లో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అభ్యర్థులు ఇంటింటికి తిరిగి తమను గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని హామీల వర్షం కురిపిస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు తమ మద్దతు దారుల కోసం రోడ్‌షోలు, గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఈనెల 14న రెండో విడత ఎన్నికల్లో మెజార్టీ స్థానాల విజయంపై ప్రధాన పార్టీలు కన్నేశాయి. సాక్షి, యాదాద్రి : మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది. గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం ఫలితాలు వెల్లడికానున్నాయి. తమ ప్రధాన మద్దతుదారులను గెలిపించేందుకు ప్రధాన పార్టీల నేతలు జోరుగా ప్రచారం నిర్వహించారు. ఆలేరు, యాదగిరిగుట్ట, తుర్కపల్లి, బొమ్మలరామారం, రాజాపేట, ఆత్మకూర్ (ఎం) మండలాల్లో సర్పంచ్, వార్డు అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. చివరి రోజు మంగళవారం సైతం ప్రచారంతో హోరెత్తించారు. బహిరంగ ప్రచారం ముగిసిన వెంటనే అభ్యర్థులు ప్రలోభాలకు తెరలేపారు. మరోవైపు రెండవ విడత ఎన్నికలు జరగనున్న మండలాల్లో ప్రచారం జోరందుకుంది. జనరల్, బీసీ స్థానాల్లో తీవ్ర పోటీ జనరల్, బీసీ స్థానాల్లో పోటీ తీవ్రంగా ఉంది. ప్రచారం ముగియగానే అభ్యర్థులు తమ ప్రత్యర్థులు ఓటుకు ఎంత ఇస్తున్నారో తెలుసుకుని అంతకంటే కొంత ఎక్కువ ఇచ్చేలా ప్రణాళికలు చేసుకుంటున్నారు. ఎలాగైనా గెలిచితీరాలని డబ్బు, మద్యంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక్కో ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.3వేల వరకు పంచేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పటికే ఓటర్ల జాబితా ఆధారంగా తమకు పడే ఓట్ల కోసం గుట్టుచప్పుడు కాకుండా డబ్బుల పంపిణీకి రంగం సిద్ధం చేశారు. ఇదిలా ఉండగా.. ఏ దారిలో ఓటరుకు డబ్బులు చేరవేయాలని అభ్యర్థులు చూస్తుంటే.. డబ్బులు ఎవరు పంచుతున్నారంటూ ఓటర్లు ఇప్పటికే ఆరా తీస్తున్నారు. వలస వెళ్లిన వారి ఓట్లు కీలకం కావడంతో.. జీవనోపాధి కోసం పట్టణాలకు వలస వెళ్లిన ఓటర్లకు ముందు నుంచే టచ్‌లో ఉన్న అభ్యర్థులు వారిని గ్రామాలకు రప్పిస్తున్నారు. వలస వెళ్లిన వారి ఓట్లు కీలకం కావడంతో వాటిని తమ ఖాతాలో వేసుకునేందుకు అభ్యర్థులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారు గ్రామాలకు వచ్చేందుకు వాహన సదుపాయాలు కల్పిస్తున్నారు. ప్రత్యేకంగా వచ్చి తమకు ఓటు వేసినందుకు ఫోన్‌పే లేదా ఇతరత్రా ఆన్లైన్ పేమెంట్ ద్వారా నగదును ముందస్తుగా ముట్టజెప్పే ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఒకరిని మించి మరొకరు ఖర్చు నామినేషన్ల ఉపసంహరణ రోజు నుంచి కొందరు నాయకులు, ఓటర్లు సానుభూతిపరులను మద్యం మత్తులో ముంచేశారు. ఇప్పుడు ఓటర్లు చేజారకుండా ఉండేందుకు అభ్యర్థులు ఏ వాడ ఓటర్లను ఆ వాడలో ప్రత్యేక సిట్టింగులు ఏర్పాటు చేశారు. ఇందుకోసం మద్యం డంప్ చేసి వారికి తాగినంత అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇదే వాతావరణం నేడు, రేపు రెండు రోజుల పాటు అభ్యర్థులకు తప్పేలా లేదు. ముందు ఖర్చు పెట్టేందుకే ఆలోచించిన అభ్యర్థులు పోలింగ్ సమయం దగ్గర పడటంతో ఒకరిని మించి మరొకరు ఖర్చు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. పలువురు అభ్యర్థులు తమకు వచ్చిన ఎన్నికల గుర్తులను ఓటర్లకు పంచుతున్నారు. ప్రధానంగా ఉంగరం గుర్తు వచ్చిన అభ్యర్థులు సిల్వర్, రాగి ఉంగరాలు అందజేస్తున్నారు. స్టూలు గుర్తు వచ్చిన వారు వాటిని పంచుతున్నారు. ఇంకా మిక్సీలు, చీరలు, సెల్ఫోన్లు, క్రికెట్ బ్యాట్లు పంపిణీ చేస్తున్నారు. మొదటి విడత పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశాం : కలెక్టర్భువనగిరిటౌన్ : పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మంగళవారం హైదరాబాద్ నుంచి ఎన్నికల సంఘం కమిషన్ సభ్యులతో కలిసి ఆయా జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ నుంచి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత రావు మాట్లాడుతూ.. జిల్లాలో మొదటి విడత ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తి అయిందని, పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద బందోబస్తు, వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపు, ఉప సర్పంచ్ ఎన్నిక సజావుగా జరిగేలా పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, ఎక్స్పెండీచర్ పరిశీలకుడు శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఫ రేపు పోలింగ్, ఫలితాల వెల్లడి ఫ చివరి రోజు హోరెత్తించిన అభ్యర్థులు ఫ ఎలాగైనా గెలిచి తీరాలని డబ్బు, మద్యంతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం -
ఊరు మారలేదు
యాదగిరిగుట్ట రూరల్: మమ్మల్ని గెలిపించండి.. మీ కష్టాలు తీరుస్తాను. అండగా ఉంటాను. సమస్యలు పరిష్కరిస్తామని ఐదేళ్ల క్రితం గ్రామాల్లో పోటీచేసిన నాయకులు చెప్పిన మాటలు ఇవి. ప్రజలు వారికి అధికారం కట్టబెట్టారు. ఐదేళ్లు గడిచిపోయాయి కానీ గ్రామాల్లో సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. తిరిగి గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. నేతలు మళ్లీ జనం ముందుకు వచ్చి ఓట్లు అడుగుతున్నారు. పాలకులు మారుతున్నారు తప్ప.. సమస్యలు మాత్రం పరిష్కరించడం లేదని నాయకులను నిలదీస్తున్నారు. గ్రామాల్లో ప్రధాన సమస్యలు ● జిల్లా వ్యాప్తంగా చాలా గ్రామాల్లో డ్రెయినేజీ వ్యవస్థ సరిగ్గా లేదు. గతంలో ఏర్పాటు చేసిన డ్రెయినేజీలే చాలా చోట్ల దర్శనమిస్తున్నాయి. మురుగు నీరంతా వీధుల వెంట, జనావాసాల మధ్య ప్రవహిస్తోంది. అక్కడక్కడ నూతన డ్రెయినేజీలు నిర్మించినప్పటికీ పూర్తిస్థాయిలో సమస్యలు పరిష్కారం కాలేదు.. ● పలు గ్రామాల్లో అంతర్గత రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. వర్షాలు కురిసన సమయంలో లింక్ రోడ్ల ద్వారా గ్రామాల నుంచి, ఇంకో గ్రామానికి వెళ్లడానికి జనాలు నానా అవస్థలు పడుతున్నారు. వాహనాలు రాకపోకలు సాగించలేని పరిస్థితి నెలకొంటుంది. కొన్ని గ్రామాల్లో అక్కడక్కడ సీసీ రోడ్లు మంజూరైనప్పటికీ, మెజార్టీ గ్రామాల్లో మట్టి రోడ్లే దర్శనమిస్తున్నాయి. ● చాలా గ్రామాల్లో వీధి దీపాలు వెలగడం లేదు. గ్రామ పంచాయతీకి నిధుల కొరత ఉండడం, నిర్వహణ లోపంతో చాల చోట్ల వీధులన్నీ అంధకారంలో ఉంటున్నాయి. రాత్రి సమయంలో ప్రజలు బయటకు వెళ్లే పరిస్థితి లేకుండా ఉంది. ● పలు గ్రామాల్లో ప్రజలను పారిశుద్ధ్య సమస్యలు వెంటాడుతున్నాయి. వీధుల్లో కంప చెట్లు, పిచ్చి మొక్కలు పెరిగి సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. గత ప్రభుత్వంలో స్వచ్ఛత కార్యక్రమాలు చేపట్టినప్పటికీ గ్రామాల్లో పరిస్థితి యథావిధిగా మారింది. ● చాలా గ్రామాల్లో రోడ్లు పాడై, కంకర తేలి ఉన్నాయి. రాకపోకలు సాగించలేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. రాత్రి సమయంలో ప్రయాణాలు చేస్తున్న వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ● పంచాయతీ భవనాలు సరిగా్గా లేక పాలన కష్టమవుతోంది. నూతన గ్రామ పంచాయతీలు ఏర్పడిన గ్రామాల్లో ఐదేళ్లు గడిచినా గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయలేదు. కమ్యూనిటీ హాల్లు కూడా లేకపోవడంతో ప్రజలు నాయకులను నిలదీస్తున్నారు. ఫ గ్రామాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఫ నాటి హామీలను గుర్తుచేస్తున్న ఓటర్లు -
డబ్బుకు, మద్యానికి ఓటు అమ్ముకోవద్దు
వలిగొండ : పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకులోనై ఓట్లు అమ్ముకోవద్దని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్న వలిగొండలో మంగళవారం ఓటుహక్కుపై స్వయం సహాయ సంఘాల మహిళలతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం వెంకటేశ్వర ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో డీఆర్డీఓ నాగిరెడ్డి, ఎంపీడీఓ జలంధర్ రెడ్డి, తహసీల్దార్ దశరథ, ఎంఈఓ భాస్కర్, ఎస్సై యుగంధర్, ఎంపీఓ అర్జుమన్ భాను, ఏపీఎం అంజయ్య, ఏపీఓ పరుశురాం పాల్గొన్నారు. అన్ని ఏర్పాట్లు చేయాలి ఆత్మకూరు(ఎం): మండలంలోని సర్వేపల్లిలో ఏర్పాటు చేస్తున్న మోడల్ పోలింగ్ కేంద్రంలో అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు అధికారులకు సూచించారు. మంగళవారం ఆత్మకూరు మండలంలోని సర్వేపల్లిలో ఏర్పాటు చేస్తున్న మోడల్ పోలింగ్ కేంద్రాన్ని ఆయన పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. కేంద్రాన్ని ప్లాస్టిక్ రహిత పోలింగ్ బూత్‌గా ఏర్పాటు చేయాలన్నారు. వృద్ధులకు, దివ్యాంగులకు వీల్ సౌకర్యం కల్పించాలని, పిల్లల తల్లుల కోసం ప్రత్యేకంగా గది ఏర్పాటు చేయాలన్నారు. తాగునీరు, టెంట్ సదుపాయం కల్పించాలన్నారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో బ్యాలెట్ బాక్స్‌లను పరిశీలించారు. కలెక్టర్ వెంట ఎంపీడీఓ రాములు నాయక్, తహసీల్దార్ లావణ్య తదితరులున్నారు. ఫ కలెక్టర్ హనుమంతరావు -
పనులు నాణ్యతతో చేయాలి
యాదగిరిగుట్ట: యాదగిరీశుడి అనుబంధ ఆలయమైన శ్రీపాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ మెట్ల మార్గం నుంచి ఆంజనేయస్వామి ఆలయం వరకు నూతనంగా చేపడుతున్న షెడ్డు నిర్మాణం పనులను నాణ్యతతో చేయాలని ఆలయ ఈఓ వెంకట్రావ్ సూచించారు. మంగళవారం పాతగుట్ట ఆలయాన్ని అధికారులతో కలిసి సందర్శించారు. షెడ్డు నిర్మాణం పనులతో పాటు దేవస్థానానికి చెందిన చౌల్ట్రీలను పరిశీలించారు. ఈఓ వెంకట్రావ్ మాట్లాడుతూ.. దేవస్థానానికి చెందిన గదుల్లో భక్తుల సౌకర్యం, శానిటేషన్, పరిశుభ్రతపై సంబంధిత అధికారులు దృష్టి పెట్టాలన్నారు. దృష్ట్యా బస్‌స్టాండ్ వద్ద ఎంకై ్వరీ కౌంటర్ ఏర్పాటు చేయాలని, రాత్రి సమయంలో ఎంకై ్వరీ ఆఫీసర్‌ను నియమించాలన్నారు. గదుల ఎంకై ్వరీ కౌంటర్లో ఫిర్యాదు రిజిస్ట్రార్‌ను అందుబాటులోకి తీసుకువచ్చి, సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చూడాలన్నారు. పాతగుట్ట ఆలయంలో సైతం వైకుంఠ ఏకాదశిని వైభవంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట షెడ్డు దాత జ్ఞానేశ్వర్, ఆలయాధికారులు ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వార్డు అభ్యర్థి దుర్మరణం
గరిడేపల్లి : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యుడిగా పోటీలో ఉన్న వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలోని పొనుగోడు గ్రామ శివారులో మంగళవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గరిడేపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన జలగం సిద్ధయ్య(45) ప్రస్తుతం జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆ గ్రామ 7వ వార్డు సభ్యుడిగా పోటీ చేస్తున్నాడు. మంగళవారం రాత్రి బైక్‌పై గడ్డిపల్లి నుంచి గరిడేపల్లి వైపు వెళ్తున్నాడు. పొనుగోడు గ్రామ శివారులోకి వెళ్లగానే ముందు వెళ్తున్న ట్రాక్టర్‌కు ఉన్న కల్టీవేటర్ బైక్‌కు తగలడంతో సిద్ధయ్య కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు సిద్ధయ్యను 108 వాహనంలో సూర్యాపేటకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. తొలి దశ తెలంగాణ ఉద్యమకారుడు మృతి ఫ రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి.. ఫ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన నరసయ్యకోదాడ : విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండ వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కోదాడ పట్టణానికి చెందిన తొలి దశ తెలంగాణ ఉద్యమకారుడు చలిగంటి నరసయ్య(80) తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతిచెందాడు. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో నరసయ్య చురుగ్గా పొల్గొన్నారు. మలిదశ ఉద్యమంలోనూ ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారు. ఇటీవలే ఆయన సతీమణి కూడా మృతిచెందారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. నరసయ్య మృతదేహాన్ని పలువురు తెలంగాణ ఉద్యమకారులు సందర్శించి నివాళులర్పించారు. -
71వ వసంతంలోకి నాగార్జునసాగర్
ఈ ఏడాది సాగర్ ప్రాజెక్టుకు వరద ఎక్కువగా రావడంతో జలాశయంలో నీరు సమృద్ధిగా ఉంది. రెండు కార్లకు నీరు సరిపోతుంది. యాసంగి సీజన్‌కు గాను ఈ నెల 7వ తేదీ నుంచే నీటిని విడుదల చేస్తున్నాం. రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటాం. జలాశయంలో నీరు ఉంటే వచ్చే ఏడాది ముందస్తుగా పంటకు నీటిని విడుదల చేసే వీలుంటుంది. – మల్లికార్జున్, సాగర్ డ్యాం ఈఈ● 1955 డిసెంబర్ 10న ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన ● 1967లో కుడి, ఎడమ కాలువలకు నీటి విడుదల ● రెండు తెలుగు రాష్ట్రాలకు వరప్రదాయినిగా ఆధునిక దేవాలయంనాగార్జునసాగర్ : ఆధునిక దేవాలయంగా పేరుగాంచిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన జరిగి బుధవారానికి 70 ఏళ్లు నిండాయి. 1955 డిసెంబర్ 10న భారతదేశ మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నందికొండ ప్రాంతంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో, మానవశక్తితో నిర్మితమైంది. సాగు నీటి కొరకు కుడి, ఎడమ కాలువలను నిర్మించారు. కుడి కాలువను జవహర్ కాలువగా, ఎడమ కాలువను లాల్‌బహుదూర్ కాలువగా పిలుస్తారు. కుడి కాలువ పనులను 1956 అక్టోబర్ 10న అప్పటి ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ప్రారంభించారు. ఈ కాలువ 392 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ కాలువ ద్వారా గుంటూరు, ప్రకాశం జిల్లాలలో 11,74, 874 ఎకరాల సాగుకు స్థిరీకరించారు. 132 టీఎంసీల నీటిని కేటాయించారు. ఎడమ కాలువ నిర్మాణ పనులను 1959లో అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ భీమ్సేన్ సచార్ ప్రారంభించారు. ఈ కాలువ పొడవు 349 కిలోమీటర్లు. ఈ కాలువ కింద 10,37, 796 ఎకరాలు సాగవుతుందని స్థిరీకరించారు. 132 టీఎంసీల నీటిని కేటాయించారు. రిజర్వాయర్ నీటిమట్టం 489అడుగుల పైన ఉన్నప్పుడు రెండు కాలువల ద్వారా నీటిని విడుదల చేయవచ్చు. 1967న ఆగస్టు 4న నాటి ప్రధాని ఇందిరాగాంధీ కుడి, ఎడమ కాలువలకు మొదటిసారి నీటిని వదిలారు. నెరవేరని లక్ష్యం.. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణ లక్ష్యం నేటికీ నెరవేరలేదు. ఆనాడు తవ్విన కుడి, ఎడమ కాల్వలు కాలక్రమేణా దెబ్బతిని చివరి భూములకు నీరందే పరిస్థితి లేకుండాపోయింది. అయితే ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సాగర్ ప్రాజెక్టు కింద చివరి భూములకు కూడా నీరందించాలని సంకల్పించి ప్రపంచ బ్యాంకు రుణంతో సాగర్ ప్రాజెక్టు ఆధునికీకరణకు శ్రీకారం చుట్టారు. ఆ పనులు 2017లో పూర్తయ్యాయి. కానీ పనుల్లో నాణ్యత లేని కారణంగా గతేడాది రెండుసార్లు కాల్వకు గండ్లు పడ్డాయి. నేటికీ చివరి భూములకు నీరందడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూడిక నిండి.. సాగుకు చాలని నీరు నాగార్జునసాగర్ జలాశయంలో పూడిక చేరడంతో ఒకసారి నిండితే రెండు పంటలకు నీరు సరిపోవడం లేదు. దీనికి తోడు జలాశయంలోని నీటి విడుదల ప్రణాళికను తయారు చేసేందుకు సాగునీటి శాఖ అధికారులు రాజకీయ నాయకుల ఆదేశాల కోసం ఎదురుచూడడంతో నీటి విడుదల ఆలస్యమై ప్రాజెక్టులోకి వచ్చిన వృథాగాపోతోంది. ఇప్పటికీ ఏ తూము ద్వారా ఎంత నీటిని విడుదల చేస్తే ఎన్ని ఎకరాలు పారుతుందనేది అధికారుల వద్ద నిక్కచ్చి సమాచారం లేదు. మెయిన్ కాల్వకు ఉన్న మేజర్ల దగ్గరి నుంచి ప్రతి పంట కాల్వకు షట్టర్లు బిగించాలి. నారుమళ్ల సమయంలో తక్కువ నీరు, పొలం తడిపే సమయంలో, పొట్ట దశలో నీటిని సరిపోను వాడుకునేలా డిజైన్ చేసి తూములు ఏర్పాటు చేయాలి. ఆ తూములకు షట్టర్లు బిగించాలని రైతులు కోరుతున్నారు. మేజర్ల దగ్గరి నుంచి పంటకాల్వల వరకు ఏ తూముకు ఏ నెల ఎంత నీటిని విడుదల చేయాలి, ఎంత భూమి పారుతుందనే బోర్డులు పెట్టి వాటిపై నమోదు చేయాలి. నీటిని పొదుపుగా వాడుకునేలా సంబంధిత అధికారులు సీజన్‌కు ముందే రైతులతో సమావేశమై పొలాలు ఎప్పుడు తడపాలి, నాట్లు ఏ సమయంలో వేసుకోవాలనే దానిపై ప్లాన్ తయారు చేసుకోవాలి. అదేవిధంగా భూమి రకాన్ని బట్టి నీటిని వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలి. ఇసుక నేలలకు ఎక్కువ నీరు, ఒండ్రు నేలలకు తక్కువ నీరు సరిపోతుంది. జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన పైలాన్సాగర్ జలాశయం విస్తీర్ణం 110 చదరపు మైళ్లు గరిష్ట నీటిమట్టం 590 అడుగులు డెడ్ స్టోరేజీ లెవల్ 490 అడుగులు నీటి నిల్వ సామర్థ్యం 408.24 టీఎంసీలు (ప్రస్తుతం పూడిక నిండటంతో 312 టీఎంసీలు ) డెడ్ స్టోరేజీ సామర్థ్యం 179.16 టీఎంసీలు (ప్రస్తుతం పూడిక నిండటంతో 168 టీఎంసీలు) నీటి విడుదలకు ఉండాల్సిన కనీస నీటిమట్టం 510 అడుగులు -
సిమెంటు ఇటుకల ఫ్యాక్టరీలో పేలుడు
సూర్యాపేట, చివ్వెంల : చివ్వెంల మండలం బీబీగూడెం గ్రామ శివారులోని బాలాజీ లైట్‌వెయిట్ సిమెంటు ఇటుకల ఫ్యాక్టరీలో మంగళవారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. ఫ్యాక్టరీలోని పీడన ఫోమ్ తయారీ ట్యాంక్ ఒక్కసారిగా పేలడంతో పెద్ద శబ్ధం వచ్చింది. దీంతో ఫ్యాక్టరీ సమీపంలోని మున్యానాయక్ తండా, కొండల్రాయునిగూడెం, బీబీగూడెం గ్రామాల ప్రజలు ఒక్కసారిగా భూకంపం వచ్చిందేమోనని భయపడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ట్యాంక్ శకలాలు సుమారు కిలోమీటరు మేర ఎరిగిపడ్డాయి. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఘటనా స్థలాన్ని తహసీల్దార్ పి. చంద్రశేఖర్, ఎస్ఐ మహేశ్వర్ పరిశీలించారు. సాంకేతిక లోపంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు వహించాలని ఫ్యాక్టరీ యాజమానిని ఆదేశించారు. ఫ ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రాణ నష్టం ఫ భయాందోళనకు గురైన సమీప ప్రాంత ప్రజలు -
రీజినల్ రింగ్ రైల్వేలైన్ పనులు చేపట్టాలి
సాక్షి,యాదాద్రి : ఔటర్ రీజినల్ రింగ్ రైల్వే లైన్ ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిలో లోక్‌సభలో ప్రస్తవించారు. ఈ ప్రాజెక్ట్‌తో హైదరాబాద్ చుట్టూ దాదాపు 400 కిలోమీటర్లు విస్తరించి, సుమారు 8 జిల్లాలను కవర్ చేస్తుందని తెలిపారు. 14 మండలాల్లో కనెక్టివిటీ ఉంటుందన్నారు. దాదాపు 5 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, రైల్వే ఫ్లై ఓవర్లు ఉన్నాయన్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ.12,000 కోట్లు ఉంటుందన్నారు. ఇది రాబోయే ఔటర్ రీజినల్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా హైదరాబాద్ నగరాన్ని విస్తరిస్తుందని పేర్కొన్నారు. ఉత్తర భాగం, దక్షిణ భాగం సర్వే పూర్తయినట్లు వివరించారు. ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారన్నారు. ఈ రింగ్ రైల్వే లైన్ ప్రాజెక్టు ఆర్థిక కార్యకలాపాలు, ఐటీ హబ్‌లు, ఫార్మాస్యూటికల్ క్లస్టర్లు, లాజిస్టిక్ పార్కులను సృష్టిస్తుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కారిడార్లను ఏర్పాటు చేయడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఫ లోక్‌సభలో ప్రస్తావించిన ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి -
స్మార్ట్ ఫోన్‌కు అనుమతిలేదు
భువనగిరిటౌన్ : గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రంలోకి స్మార్ట్ ఫోన్లను తీసుకెళ్లకూడదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌ను పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లడంపై నిషేధం ఉంది. ఒకవేళ ఎవరైనా స్మార్ట్ ఫోన్ తీసుకొస్తే స్విచ్ఆఫ్ చేసి భద్రతా సిబ్బంది లేదా పోలింగ్ సిబ్బంది లేదా బీఎల్ఓ వద్ద ఉంచాలి. ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం పోలింగ్ బూత్‌లోకి స్మార్ట్ ఫోన్‌తో పాటు కెమెరాలను కూడా అనుమతించరు. దివ్యాంగుల ఓటింగ్ ఇలా..భువనగిరి : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగులకు సహాయం చేసేందుకు 18 ఏళ్లు నిండిన సహాయకుడిని ఎంపిక చేసుకోవచ్చని ఎన్నికల నిబంధనల్లో ఉంది. ఇదే విషయాన్ని పోలింగ్ కేంద్రంలోని రిటర్నింగ్ అధికారికి తెలిపితే ఆయన అనుమతి ఇస్తారు. దివ్యాంగులు సహాయకుడితో లోపలికి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఎవరికి ఓటు వేశారనే విషయాన్ని సహాయకుడు గోప్యంగా ఉంచడంతో పాటు మరోమారు ఇతరులకు సహాయకుడిగా రానంటూ అతను డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సాధారణంగా ఓటు వేసే వ్యక్తి ఎడమచేతి చూపుడు వేలికి సిరా గుర్తు వేస్తారు. సహాయకుడిగా వచ్చిన వ్యక్తికి మాత్రం కుడి చేతి చూపుడు వేలికి గుర్తు వేస్తారు. -
నా ఖర్చు 25 రూపాయలే..
ఫ గట్టుప్పల్ మాజీ సర్పంచ్ ముత్తారెడ్డి గట్టుప్పల్ : 1970లో సర్పంచ్ ఎన్నికకు రూ.25 మాత్రమే ఖర్చు పెట్టినట్లు గట్టుప్పల్ మాజీ సర్పంచ్ పోరెడ్డి ముత్తారెడ్డి తెలిపారు. ఆనాడు గ్రామంలో 2,900 ఓటర్లు ఉండగా.. 9 వార్డులు ఉండేవి. గ్రామపంచాయతీకి జరిగిన ఎన్నికల్లో ముత్తారెడ్డితో పాటు మరో ముగ్గురు సీసీఐ మద్దతుతో వార్డు సభ్యులుగా గెలిచారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో మరో నలుగురు గెలువగా, ఒకరు ఇండిపెండెంట్‌గా విజయం సాధించారు. అప్పట్లో సర్పంచ్ ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరుగగా ముత్తారెడ్డిని సర్పంచ్ అభ్యర్థిగా ప్రతిపాదించగా ఇండిపెండెంట్‌గా గెలిచిన అభ్యర్థి మద్దతు తెలుపడంతో మొత్తం ఐదుగురి మద్దతుతో సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. సర్పంచ్ ఎన్నిక సందర్భంగా వార్డు సభ్యులకు టిఫిన్స్, టీ, పేపర్ ఖర్చులకు రూ.25 ఖర్చు చేసినట్లు ఆయన తెలిపారు. వార్డు సభ్యులకు, ఓటర్లకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, ఆనాడు ఓటర్లు నిజాయితీగా ఓటు వేసే వారని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం వార్డు సభ్యుడిగా ఎన్నిక కావడానికే లక్షల్లో ఖర్చు వస్తుందని పేర్కొన్నారు. -
జాతీయ స్థాయి చెస్ పోటీలకు ఎంపిక
సూర్యాపేటటౌన్, కోదాడ : తెలంగాణ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లాలో నిర్వహించిన రాష్ట్రస్థాయి చెస్(అండర్–14) పోటీల్లో సూర్యాపేట పట్టణంలోని రాడికల్ చెస్ అకాడమీకి చెందిన అఖిలేష్ పాల్గొని జాతీయస్థాయికి ఎంపికై నట్లు కోచ్ ఎడవెల్లి అనిల్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అదేవిధంగా కోదాడ పట్టణ పరిధిలోని తేజ విద్యాలయంలో 6వ తరగతి చదువుతున్న భుక్యా యోగిత కూడా బాలికల విభాగంలో విజేతగా నిలిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై ంది. 2026 జనవరి 13 నుంచి 17 వరకు జార్ఖండ్ రాజధాని రాంచీలో జరగనున్న జాతీయస్థాయి చెస్ పోటీల్లో(అండర్–14) వారు పాల్గొననున్నారు. యోగిత జాతీయస్థాయికి ఎంపిక కావడం పట్ల పాఠశాల ప్రిన్సిపాల్ రమాదేవి, డైరెక్టర్ సోమిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. బొమ్మలరామారం : మర్యాల జెడ్పీహెచ్ఎస్ విద్యార్థిని డి. నిహారిక అండర్–17 జాతీయ స్థాయి బాలికల అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పగిడిపల్లి నిర్మలజ్యోతి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్‌లో గత నెల నిర్వహించిన అండర్–17 రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో నిహారిక పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ందన్నారు. ఈ నెల 13 నుంచి 17వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో ఆమె పాల్గొననున్నట్లు ప్రధానోపాధ్యాయురాలు తెలిపారు. నిహారికను డీఈఓ సత్యనారయణ, ఎంఈఓ రోజారాణి, జిల్లా పాఠశాల క్రీడల కార్యదర్శి కందాడి దశరధ రెడ్డి, ఉపాధ్యాయ బృందం అభినందించారు. -
ఆస్పత్రి భవనంపై నుంచి దూకి ఆత్మహత్మ
యాదగిరిగుట్ట రూరల్ : ఆస్పత్రి భవనంపై నుంచి దూకి యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామానికి చెందిన పప్పుల నరేందర్(37) ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పప్పుల నరేందర్ వెల్డింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 1వ తేదీన భువనగిరి మండలం ముస్తాన్పల్లికి వెళ్లిన నరేందర్ అక్కడ పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు అతడిని సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. నరేందర్ ఆదివారం ఉదయం ఆస్పత్రి మూడో అంతస్తులోని బాత్రూమ్ కిటికీ నుంచి కిందకు దూకాడు. ఈ మేరకు చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆర్థిక సమస్యలతోనే నరేందర్ పురుగుల మందు తాగాడని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కడుపునొప్పి భరించలేక ఆస్పత్రి భవనంపై నుంచి దూకినట్లు సమాచారం. మృతుడికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు ఎంపికసూర్యాపేటటౌన్ : జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీవెంకటసాయి ఒకేషనల్ జూనియర్ కళాశాలకు చెందిన ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎఫ్) ద్వితీయ సంవత్సరం విద్యార్థిని ఆర్. గాయత్రి రాష్ట్రస్థాయి అండర్–19 బాస్కెట్‌బాల్ పోటీలకు ఎంపికై నట్లు కళాశాల కరస్పాండెంట్ బాలగౌడ్, చైర్మన్ విజయలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని అభినందించారు. వ్యక్తి అదృశ్యం నల్లగొండ : నల్లగొండ పట్టణంలోని బొట్టుగూడకి చెందిన పులిగిల్ల శంకర్ ఆదివారం నుంచి అదృశ్యమైనట్లు అతడి కుటుంబ సభ్యులు సోమవారం నల్లగొండ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భార్యతో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన శంకర్ తిరిగి రాలేదని పోలీసులు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 8712667670, 8712577232 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. -
ఎర్ర బంగారానికి నల్ల తామర
మద్దిరాల : మిరప పంటకు నల్లతామర తెగులు ఆశిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ తెగులు కారణంగా పంట దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. ఈ ఏడాది వానకాలం సీజన్లో మండలంలోని చాలా మంది రైతులు మిరపను సాగు చేశారు. ఆ తరువాత పరిస్థితి అనుకూలించడంతో పంటచేలు ఏపుగా పెరిగాయి. ఆ తరువాత వరుస తుపాన్ కారణంగా అధికంగా వర్షాలు కురిశాయి. దాంతో మిరప చేలపై నల్లతామర తెగులు ఆశిస్తోంది. వారం రోజులుగా మిరప చేలో పువ్వులపై నల్లతామర ఉధృతి మొదలైంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో తామర పురుగు ఉధృతి అధికంగా ఉంటోంది. నల్ల తామర పురుగులు లేత ఇగుర్లు, మొగ్గలు, పువ్వులు, కాయలను ఆశించి వాటిని నాశం చేస్తాయి. దాంతో దిగుబడి తగ్గుతోంది. ఈ పురుగులు పగలు పువ్వులలో దాక్కొని సాయంత్రం పంటపై దాడి చేస్తాయి. దీని నివారణకు సరైన మందులు లేక కట్టడి చేయలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు. గతంలోనూ ఎక్కువగానే.. 2021, 2022లోనూనల్లతామర తెగులు మిరపకు ఆశించింది. అప్పట్లో ఎన్ని పురుగుల మందు వాడినా దానిని నియంత్రించలేక రైతులు నష్టపోయారు. ఆ తర్వాత రెండేళ్లు చీడపీడలు లేవు. మళ్లీ ఈసారి నల్లతామర ఆశించడం, ఇది విదేశీ వలస పురుగు కావడంతో పురుగు మందులు పనిచేయడం లేదని రైతులు చెబుతున్నారు. మందులు పిచికారీ చేస్తున్నాంనల్లతామర నివారణకు వారానికి మూడుసార్లు పురుగుల నివారణ మందులను పిచికారీ చేస్తున్నాం. అయినప్పటికీ పురుగులను కట్టడి చేయలేకపోతున్నాం. ఎకరానికి రూ.60వేల పైనే పెట్టుబడి పెట్టాం. ఇప్పుడు తెగులు కారణంగా పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. – జాటోతు రవి, రైతు, భగవాన్తండాసస్యరక్షణ చర్యలు చేపట్టాలి నల్లతామర నివాణకు ఎప్పటికప్పుడు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. వీటి నివారణకు డైకోఫోల్ 5ఎంఎల్ లేదా ఎసిటామిఫ్రైడ్ 0.2 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వేప నూనె 5ఎంఎల్ లీటరు నీటికి కలిపి మొక్క పూర్తిగా తడిసేలా పిచికారీ చేయాలి. – అనిషారూహి, ఏఓ, మద్దిరాల మిరప పంటను ఆశిస్తున్న తెగులు దిగుబడి తగ్గే అవకాశం ఉందని రైతుల ఆందోళన -
అన్నదమ్ముల సవాల్..
నకిరేకల్ : నకిరేకల్ మండలం మండలాపురం గ్రామంలో సొంత అన్నదమ్ములు సర్పంచ్ పదవికి పోటీ పడుతున్నారు. ఈ గ్రామం ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ కాగా.. తీగల జానయ్య కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థిగా సర్పంచ్ బరిలో ఉన్నాడు. జానయ్య అన్న తీగల వెంకటయ్య కూడా కొంతకాలంగా కాంగ్రెస్‌లో ఉన్నప్పటికీ.. సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి తమ్ముడితో పోటీ పడుతున్నాడు. వీరితో పాటు బీఆర్ఎస్ నుంచి బలపర్చిన అభ్యర్థిగా జంగయ్య, మరో స్వతంత్ర అభ్యర్థి నర్సింహ కూడా బరిలో ఉన్నారు. అయితే అన్నదమ్ముల మధ్య పోటీతో పోరు రసవత్తరంగా మారింది. -
ఇటలీ దంపతులకు చిన్నారి దత్తత
భువనగిరిటౌన్ : భువనగిరి జిల్లా కేంద్రంలోని బాలసదనంలో ఆశ్రయం పొందుతున్న అనాథ బాలిక రేణుకను ఇటలీకి చెందిన దంపతులు దత్తత తీసుకున్నారు. బాలిక వివరాలను కేంద్ర దత్తత వనరుల విభాగంలో ఆన్లైన్ చేయగా.. ఇటలీ దంపతులు సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్లో దరఖాస్తు పెట్టుకున్నారు. ఆ దరఖాస్తును పరిశీలించిన కేంద్ర దత్తత వనరుల విభాగం.. సీనియార్టీ ప్రకారం ఇంటర్ కంట్రీ అడాప్షన్‌కు అంగీకరించింది. దీంతో సోమవారం అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు ఆధ్వర్యంలో బాలికను ఇటలీ దంపతులకు అప్పగించారు. బాలిక సంరక్షణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి నరసింహరావు, బీఆర్బీ కో–ఆర్డినేటర్, అనంతలక్ష్మి, డీసీపీయూ యూనిట్ సిబ్బంది, జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
ఉపాధి బాట
పంచాయతీ పోరులోతిరుమలగిరి (తుంగతుర్తి) : గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు తమ ప్రచా రాన్ని ముమ్మరం చేశారు. తమకు కేటాయించిన గుర్తులతో కూడిన కరప్రతాలను ఇంటింటికీ వెళ్లి అందిస్తూ తమకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. పంచాయతీ పోరు కొన్ని రంగాల వారికి ఉపాధిని కల్పిస్తున్నది. ప్రింటింగ్ ప్రెస్‌ల వారికి..ఎన్నికల ప్రచారంలో భాగంగా తమకు కేటాయించిన గుర్తులు, తాము గెలిస్తే చేయబోయే పనులను ప్రజలకు వివరించేందుకు అభ్యర్థులు కర పత్రాల పంపిణీ, డోర్ పోస్టర్లు అతికించడం చేస్తున్నారు. అభ్యర్థులు తమ గుర్తులను ముద్రించి ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారు. వీటి ముద్రణకు ప్రింటింగ్ ప్రెస్‌లకు పరుగులు తీస్తున్నారు. ఒక్కో అభ్యర్థి వందల సంఖ్యలో ఆర్డర్లు ఇస్తుండటంతో ప్రెస్‌ల యజమానులు, అందులో పని చేసే వారికి ఉపాధి లభిస్తోంది. ఫొటోగ్రాఫర్లు బిజీ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితం కావడంతో వ్యక్తులకే ప్రాధాన్యం ఉంటుంది. అభ్యర్థులు తమ ఫొటోలతో ప్రచారం చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. అందుకే ఫొటో స్టూడియోల బాట పట్టారు. కొందరు ఫొటోగ్రాఫర్లను ఇంటికి పిలిపించుకొని మరీ కొత్త ఫోజుల్లో ఫొటోలు దిగుతున్నారు. ఫ్లెక్సీలు, బ్యానర్లు, కరపత్రాలపై ముద్రించేందుకు అవసరమైన స్టిల్స్ ఫొటోలు దిగే పనిలో ఉండగా ఫొటోగ్రాఫర్లకు చేతినిండా పని లభిస్తోంది. ఆటపాటలతో హల్చల్అభ్యర్థులు ప్రచారంలో ఆటా, పాటలతో హల్చల్ చేస్తున్నారు. గాయకులతో పాటలు పాడించుకొని ఆటోలు, ఇతర వాహనాలకు మైకులు ఏర్పాటు చేసి గ్రామాల్లో హల్చల్ చేస్తున్నారు. మరి కొందరు కళాకారుల ప్రదర్శనలతో అదర గొడుతున్నారు. కోలాటాలు, డప్పులు, నృత్యాలు చేసే వారికి సైతం డిమాండ్ పెరిగింది.ఫ ప్రచారంలో పాలుపంచుకుంటున్న కళాకారులు ఫ కరపత్రాలు, ఫ్లెక్సీ ప్రింటింగ్‌కు గిరాకీఅడిగినంత ఇస్తేనే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఫ్లెక్సీలకు డిమాండ్ పెరిగింది. అభ్యర్థులు ప్రచారం కోసం ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండడంతో మండల కేంద్రంతో పాటు, పట్టణాలలో ఉన్న ఫ్లెక్సీ దుకాణాల నిర్వాహకులు బిజీగా ఉన్నారు. అభ్యర్థులు దూర ప్రాంతాలకు వెళ్లలేక మండల కేంద్రాల్లోనే అడిగినంత డబ్బు ఇచ్చి మరీ ప్రింట్ చేయించుకుంటున్నారు. -
రేడియో రూమే... పంచాయతీ కార్యాలయం
నడిగూడెం : మండలంలోని బృందావనపురం గ్రామ పంచాయతీ నేటికీ సొంత భవనానికి నోచలేదు. 1971లో బృందావనపురం, వేణుగోపాలపురం గ్రామాలను కలిపి పంచాయతీగా ఏర్పాటు చేశారు. 54 ఏళ్లుగా గ్రామంలోని రేడియో రూమ్‌లోనే పంచాయతీ కార్యాలయం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం గది పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ఇరుకై న గది సరిపోక వరండాలోనే పంచాయతీ కార్యదర్శి, పాలకవర్గం విధులు నిర్వహిస్తున్నారు. ఎప్పుడు కూలుతుందో తెలియక నిత్యం భయాందోళనతోనే విధులు నిర్వహించాల్సి వస్తున్నదని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేడియో రూమ్ అంటే..బృందావనపురం గ్రామ పంచాయతీగా ఏర్పడిన కొత్తలో గ్రామంలో రేడియోలు ఎక్కడో ఒకటి ఉండేవి. గ్రామస్తులు రేడియోలో వచ్చే వార్తలు, పాటలు, వినోద కార్యక్రమాలు వినేందుకు వారి వద్దకు వెళ్లాల్సి వచ్చేది. ఈ సమస్యను పరిష్కరించేందుకు, ప్రజలందరికీ రేడియో కార్యక్రమాలు వినిపించేందుకు అప్పటి ప్రభుత్వం గ్రామంలో ఒక గదిని నిర్మించింది.ఇందులో మైక్ సెట్ ఏర్పాటు చేసి రేడియోలో వచ్చే వార్తలు, వివిధ కార్యక్రమాలు ఉదయం, సాయంత్రం వేళ్లల్లో గ్రామస్తులందరికీ వినిపించే వారు. అలా ఈ గదికి రేడియో రూమ్‌గా పేరు పడిపోయింది. అసంపూర్తిగా భవన నిర్మాణంఏడేళ్ల కిందట గ్రామ పంచాయతీకి కొత్త భవన నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం రూ.12 లక్షలు మంజూరు చేసింది. పనులు కూడా ప్రారంభించారు. అయితే నిధులు సరిపోక పోవడంతో పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ప్రస్తుతం గ్రామపంచాయతీ ఎన్నికల అనంతరం కొత్గగా వచ్చే పాలక వర్గం విధులు నిర్వహించడం కష్టంగా మారనుంది. -
జర.. యాదిమర్వకే..
ఊర్లె పెసిడెండ్గ పోటీ జేత్తున్న కొమురయ్య పొద్దుపొద్దుగాల లేసి కాసింత చాయ్తాగి పెచారాన్కి బయలెళ్లిండు. ముందుగాల నర్సన్న ఇంటికాడకి పోయిండు. కొమురయ్య: నర్సన్నా ఇంట్ల ఉన్నావే.. నర్సన్న: ఎవరూ.. కొమురయ్య: నేనే.. కొమురయ్యను.. నర్సన్న: రా.. ఇంట్లకి రావే.. పొద్దుగాల తీర్బాటం చేస్కొని వచ్చినవేందే.. కొమురయ్య: దండాలే నర్సన్నా.. వదినా నమస్తే.. అంతాబాగేనానే.. ఏంలేదే. నేను ఎలచ్చన్ల పెసిడెండ్గ పోటీ జేత్తన్న. నా మీద కొంచెం దయ ఉంచాలే. ఏదన్నా ఉంటే నేనర్సుకుంట. నర్సన్న: సరేనే.. అక్కడ్నుంచి పక్క నున్న రాజన్న ఇంటికెళ్లిండు కొమురయ్య కొమురయ్య: రాజన్న బావ మంచిగున్నవానే. అక్కా ఎట్లున్నవే.. పిల్లలేరి? రాజన్న: అంతామంచిగనే ఉన్నం. పిల్లలు పనిమీద పట్నం పోయిండ్రే. కొమురయ్య: నేను పోటీజేత్తన్న.. బావ, అక్క నన్ను మరవొద్దు.. మీకు పనుల్ జేసి పెడ్త.. జర గుర్తుంచుకోండి.. కొమురయ్య ఓ గుడిసెలో ఒంటరిగా కుక్కిమంచంలో పడుకున్న పుల్లవ్వ కాడికిపోయిండు కొమురయ్య: దండాలు పుల్లవ్వా అంటూ కాళ్లుమీదబడ్డడు.. ఎట్లున్నవవ్వా.. బువ్వతిన్నవానే.. పుల్లవ్వ: పాణంబాలేదు.. జర సుస్తుగుంది మనవడా.. గిప్పుడే బుక్కెడు బువ్వదిని అడ్డం ఒరిగిన.. మర్సిపోయి గీపేద దానింటి కొచ్చినవ్ మనవడా.. కొమురయ్య: అదేంలేదవ్వ.. ఎలచ్చన్లొచ్చినయ్గదా.. నేను పెసిడెండ్గ పోటీ జేత్తన్న.. గిది నాగుర్తు.. జర యాదిమర్వకు.. అక్కడి నుంచి నిమ్మలంగా నడ్చుకుంటూ బజారెంట పోతుంటె జానిమియా కలిసిండు కొమురయ్య: సలామలైకుం జానిభాయ్ అంటూ అలయ్‌బలయ్ తీసుకున్నడు జానిమియా: వాలైకుమస్సలాం.. కొమురయ్యభాయ్.. కొమురయ్య: జర మేరెకు ఓట్ దాలో భాయ్.. జానిమియా: అచ్ఛా.. జరూర్ అక్కడి నుంచి బోతుంటే రాజేష్ కలిసిండు.. కొమురయ్య: ఏం తమ్మీ ఎట్లున్నవ్.. పట్నం నుంచి ఎప్పుడొచ్చినవ్.. సదువయిపోయిందా.. ఈసారి నేను పోటీ జేత్తన్న నీ ఓటు నాకే ఎయ్యాలే.. జర మరవకు.. రాజేష్: బాగున్ననే.. పట్నం నుంచి నిన్నవచ్చిన్నే.. ఫైనల్ ఇయర్ చదువుతున్న.. ఈసారి అయిపోతదే.. సరే.. నీకే ఏస్తనే.. తొవ్వెంటబోతుంటే రజిని కలిసింది కొమ్మురయ్య: చెల్లీ ఎటుబోతున్నవ్రా.. ఇంట్ల నాయినున్నాడ్రా.. చెల్లీ నీఓటు నాకే ఎయ్ రజిని: దుక్నం పోతున్న.. ఇంట్ల డాడీ ఉన్నడు. తప్పకుండా ఏస్తలే. అమ్మటాళ్లైంది.. ఇంటికిబోదం అంటూ కొమురయ్య పెచారం ముగించాడు. – నల్లగొండ డెస్క్ -
టెండర్ ఓటు అంటే..
చిట్యాల : కొన్ని సందర్భాల్లో ఓటరు పోలింగ్ కేంద్రానికి వెళ్లేటప్పటికే అతడి పేరిట ఉన్న ఓటును వేసినట్లు అధికారులు చెబితే ‘టెండర్ ఓటు’ను కోరవచ్చు. ఓటరు తన గుర్తింపు, ధ్రువీకరణ కార్డును ఎన్నికల అధికారులకు చూపించి మళ్లీ ఓటు వేయవచ్చు. దీనినే టెండర్ ఓటు అంటారు. ఇలా వేసిన ఓటుతో పాటు వేలి ముద్రలు, గుర్తింపు వివరాలను ప్రత్యేక డబ్బాలో భద్ర పరుస్తారు. అయితే టెండర్ ఓటును ఫలితాల్లో మాత్రం లెక్కింపులోకి తీసుకోరు. కానీ ఎన్నికల అధికారులు రిజిస్టర్లో నమో దు చేస్తారు. దాంతో ఆ పోలీంగ్ కేంద్రంలో తప్పుడు ఓటు వేసినట్లు రికార్డు అవుతుంది. ఎన్నికల ఫలితాలకు సంబంధించి కేసు కోర్టుకు వెళితే ఆ పోలీంగ్ కేంద్రంలో తప్పుడు ఓటింగ్ జరిగినట్లు నిర్ధారణకు ఉపయోగపడుతుంది. -
నకిలీ బంగారం విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు
సూర్యాపేటటౌన్ : అమాయక ప్రజలకు నకిలీ బంగారు బిస్కెట్లు అంటగడుతున్న ముఠా గుట్టురట్టు చేశారు సూర్యాపేట జిల్లా పోలీసులు. ఈ కేసు వివరాలను సోమవారం సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ విలేకరులకు వెల్లడించారు. ఏపీలోని పల్నాడు జిల్లా నరసారావుపేటకు చెందిన నాగేశ్వరరావు అలియాస్ రాజారావు, బాల, మేడి ఆదినారాయణ, ప్రకాశం జిల్లా పెద్దఆరవీడు మండలానికి చెందిన కుండూరు యోగిరెడ్డి, పిట్ట నాగిరెడ్డి, ఇదే జిల్లా రాజులపాడుకు చెందిన చంద్ర, గుంటూరుకు చెందిన శ్రీనివాసరావు, సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన ఇర్రి నరేశ్, ఖమ్మం జిల్లా వైరాకు చెందిన సుధాకర్ ముఠాగా ఏర్పడి అమాయక ప్రజలకు మాయమాటలు చెప్పి నకిలీ బంగారాన్ని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వీరి వద్ద హనుమకొండకు చెందిన వెంకటేశ్వరరావు, లీలా అనే ఇద్దరు రూ.18 లక్షలకు పది బంగారు బిస్కెట్లు(ఒక్కోటి 20 గ్రాములు) కొనుగోలు చేసేందుకు అంగీకరించారు. ఈ మేరకు వారు ఈ నెల 6న సూర్యాపేట మండలం బాలెంల గ్రామ శివారులో నాగేశ్వరరావు అద్దెకు ఉంటున్న ఇంటి వద్ద అతడికి రూ.12 లక్షలు చెల్లించగా.. వారికి ఐదు నకిలీ బంగారు బిస్కెట్లను నాగేశ్వరరావు అంటగట్టాడు. మిగతా డబ్బు చెల్లించిన తర్వాతే మరో ఐదు బంగారు బిస్కెట్లు ఇచ్చేలా అంగీకారం కుదుర్చుకున్నారు. కాగా గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో వారిచ్చిన డబ్బును నాగేశ్వరరావు తాత్కాలికంగా ఇర్రి నరేశ్ వద్ద ఉంచాడు. అయితే నరేశ్ వద్ద ఉన్న డబ్బును సోమవారం బాలెంల సమీపంలోని ఖమ్మం జాతీయ రహదారి ఫ్లైఓవర్ వద్దకు తీసుకురావాలని నాగేశ్వర్రావు సూచించాడు. అదేవిధంగా వెంకటేశ్వరరావు, లీలాను కూడా మిగతా డబ్బు తీసుకొచ్చి మిగిలిన ఐదు బంగారు బిస్కెట్లు తీసుకెళ్లాలని కోరాడు. వీరంతా బాలెంల సమీపంలోని ఫ్లైఓవర్ వద్దకు చేరుకోగా.. విశ్వసనీయ సమాచారం మేరకు సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్, ఎస్ఐ బాలునాయక్ పోలీస్ సిబ్బందితో కలిసి దాడి చేసి ఇర్రి నరేశ్, మేడి ఆదినారాయణ, కుండూరు యోగిరెడ్డి, పిట్ట నాగిరెడ్డిని అరెస్ట్ చేశారు. మిగతా ఐదుగురు పరారయ్యారు. పట్టుబడిన వారి నుంచి ఐదు నకిలీ బంగారు బిస్కెట్లు, రూ.12 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఫ నలుగురి అరెస్టు ఫ మరో ఐదుగురు పరారీ -
సేవకులకే మా ఓట్లు
నార్కట్‌పల్లి : ‘మా ఓటు డబ్బలు ఇచ్చే వారికి కాదు.. గ్రామం కోసం పని చేసే సేవకులకు మాత్రమే’ అంటూ నార్కట్‌పల్లి మేజర్ గ్రామ పంచాయతీకి చెందిన మాజీ వార్డు సభ్యురాలు దేవరశెట్టి రుక్మిణి తన ఇంటిపై ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఓటు ఎంతో విలువైందని, అభివృద్ధి చేసేవారికి ఓటు వేసి ఎన్నుకుంటే గ్రామం అభివృద్ధి చెందుతుందని, ప్రజలకు సంక్షేమ ఫలాలు లభిస్తాయని ఆమె పేర్కొన్నారు. తమ ఇంటికి వచ్చే నాయకులు, స్థానికులకు అవగాహన కల్పించేందుకే తాము బోర్డు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు ఓటును అమ్ముకోకుండా ఉంటే సమస్యలపై ప్రజాప్రతినిధులను నిలదీసే అధికారం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. -
దళితుల ప్రాణాలకు విలువ లేదా
కోదాడ : పోలీసులు చిత్రహింసలు పెట్టడం వలనే రిమాండ్ ఖైదీగా ఉన్న కర్ల రాజేష్ మృతిచెందాడని, ఈ ఘటనపై అతడి తల్లి రెండుసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడం ఏమిటని, దళితుల ప్రాణాలకు విలువ లేదా..? అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ప్రశ్నించారు. సోమవారం కోదాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చిలుకూరు ఎస్ఐ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవాడు కాకపోతే అతడి చర్యలు తీసుకునేవారని, రెడ్డి కావడం వల్లే అతడిని రక్షిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాజేష్ మృతిపై అతని తల్లి నవంబర్ 18 ఒక డీఎస్పీకి, నవంబర్ 30న మరో డీఎస్పీకి ఫిర్యాదు చేసినా నేటికీ కేసు నమోదు చేయకపోవడం చూస్తుంటే తప్పుచేసిన పోలీసులను ఉన్నతాధికారులు రక్షిస్తున్నారని అర్థమవుతుందన్నారు. 5వ తేదీన రాజేష్‌ను అదుపులోకి తీసుకున్నారని అప్పటి నుంచి అతడు మృతిచెందే వరకు వివిధ ప్రాంతాల్లో తిప్పారని, దీనికి సంబంధించిన సీసీ ఫుటేజీని బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే దానిని అతిక్రమిస్తున్నారని ఆరోపించారు. రాజేష్ మృతిపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే స్పందించి పూర్తిస్థాయి విచారణకు ఆదేశించడంతో పాటు డీజీపీకి, గవర్నర్‌కు లేఖ రాయాలని కోరారు. బాధితులకు న్యాయం జరగకపోతే ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాజేష్ తల్లి మంగళవారం జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేస్తుందని దీనిపై ఎస్పీ తగు విధంగా స్పందించకపోతే తమ కార్యాచరణ వేరే విధంగా ఉంటుందన్నారు. ఈ సమావేశంలో ఏపూరి రాజు, కొండపల్లి అంజనేయులు, కోటేష్, సత్యరాజు, కృష్ణ, నాగరాజు పాల్గొన్నారు.ఫ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ -
పవర్ఫుల్ పదవి.. ఉపసర్పంచ్
తిరుమలగిరి (తుంగతుర్తి) : గ్రామానికి సుప్రీం సర్పంచే అయినా ఉప సర్పంచ్ పదవి కూడా కొన్నిసార్లు కీలకం కానుంది. సర్పంచ్‌తో కలిసి అతడికి జాయింట్ చెక్ పవర్ ఉండడం, సర్పంచ్‌ను ఏదో కారణంగా తొలగిస్తే ఆ బాధ్యతలు ఉప సర్పంచ్‌కే అప్పగిస్తారు. నిధుల వినియోగంలో కీలకంగ్రామ పాలనలో ఉప సర్పంచ్ కీలక భూమిక పోషించనున్నారు. 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఉపసర్పంచ్‌కు కూడా కొన్ని అధికారాలు కల్పించారు. పంచాయతీ పరిధిలో నిధుల వినియోగంపై సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్‌కు కూడా ఉమ్మడి చెక్ పవర్ కట్టబెట్టారు. పాటు ప్రభుత్వ పథకాల అమలులో సర్పంచ్ విఫలమైతే.. అతను అవినీతికి పాల్పడినట్లు రుజువైతే కలెక్టర్ సర్పంచ్‌ను విధుల నుంచి తొలగిస్తారు. ఆ సమయంలో తిరిగి ఎన్నికలు జరిగే వరకు ఉపసర్పంచే గ్రామ పాలన బాధ్యతలు చేపడతాడు. ఎక్కువ మంది ఆశావహులుప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల మూలంగా సర్పంచ్ స్థానానికి పోటీ చేయలేని వారు కనీసం ఉపసర్పంచ్‌గా నైనా ఎన్నికవ్వాలనే పట్టుదలతో ఉన్నారు. రిజర్వుడు స్థానాల్లో ఈ పోటీ తీవ్రంగా ఉంది. ఈ పోస్టు ఆశిస్తున్న వారు ముందుగా వార్డు మెంబర్‌గా ఎన్నికవడంతో పాటు తమ వర్గానికి చెందిన వారు ఎక్కువ మంది వార్డు సభ్యులు విజయం సాధించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. వార్డుల్లో గెలుపు అవకాశాలు ఉన్న అభ్యర్థులకు ఆర్థిక చేయూతనందిస్తూ తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పరోక్ష పద్ధతిలో ఎన్నిక ఉపసర్పంచ్ ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరుగుతుంది. ఎన్నికలు పూర్తయిన తర్వాత వార్డు సభ్యులందరూ కలిసి ఉపసర్పంచ్‌ను ఎన్నుకుంటారు. అయితే ఈ పదవికి పోటీ నెలకొంటే అధికారులు పంచాయతీ పాలకవర్గ సమావేశం ఏర్పాటు చేసి వార్డు సభ్యులు చేతులెత్తే పద్ధతిలో ఓటింగ్ నిర్వహించి ఎవరికి ఎక్కువ మంది సభ్యుల మద్దతు ఉంటే వారినే ఉపసర్పంచ్‌గా నిర్ణయిస్తారు. -
చెల్లని ఓట్లను గుర్తించడంలో జాగ్రత్త
యాదగిరిగుట్ట రూరల్: చెల్లని ఓట్లను గుర్తించడంలో అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు ఎన్నికల అధికారులకు సూచించారు.యాదగిరిగుట్ట మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌ను ఆదివారం ఆయన పరిశీలించారు. పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రం ఏర్పాటు, వసతులపై సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటర్లను గుర్తించి వారికి బ్యాలెట్ పేపర్ ఇవ్వాలని, తిరిగి బ్యాలెట్ పేపర్‌ను బ్యాలెట్ బాక్సులో వేసే వరకు పీఓలు గమనించాలన్నారు. పోలింగ్ కేంద్రాలను అందంగా అలంకరించి మోడల్ పోలింగ్ కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. నిర్దేశిత సమయానికి పోలింగ్ పూర్తయ్యేలా చూసి, మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ చేపట్టాలని పేర్కొన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీఓ నవీన్‌కుమార్, తహసీల్దార్ గణేష్‌నాయక్ ఉన్నారు. కలెక్టర్ హనుమంతరావు -
జర్మన్, జపనీస్ భాషల్లో పాఠాలు
ఫ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల్లో అమలు ఫ వర్చువల్ విధానంలో విద్యార్థులకు బోధన భువనగిరి : ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల్లో విద్యార్థులకు జర్మన్, జపనీస్ భాషల్లో పాఠాలు చెబుతున్నారు. విదేశాల్లో నర్సులకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో వారి ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా భువనగిరిలోని నర్సింగ్ కళాశాలలోనూ ఆ రెండు భాషలపై బోధన చేస్తున్నారు. ప్రారంభమైన తరగతులునర్సింగ్ విద్యార్థులకు జర్మన్, జపనీస్ భాషలు నేర్పించేందుకు ఈ నెల 3నుంచి వర్చుల్ విధానం ద్వారా తరగుతులు ప్రారంభించారు. ఈ కోర్సు వ్యవధి 16 నెలలు కాగా.. ప్రతి సెమిస్టర్ నాలుగు నెలల పాటు ఉంటుంది. ప్రస్తుతం జపాన్‌లో నర్సులకు డిమాండ్ ఉంది. ప్రావీణ్యం కలిగిన వారికి నెలకు రూ.1.50 లక్షల నుంచి రూ.1.75 లక్షల వేతనం అందుతుంది. జర్మనీలో అయితే రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వేతనం ఉంటుంది. ప్రస్తుతం ఆయా భాషలను నేర్పించడంతో పాటు అక్కడి సంస్కృతి, సంప్రదాయలు గురించి కూడా విద్యార్థులకు వివరిస్తున్నారు. భువనగిరిలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో 58 మంది విద్యార్థులు ఉండగా.. ప్రస్తుతం 40 మంది జర్మన్, జపనీస్ భాషలు నేర్చుకుంటున్నారు. జపనీస్ 20, జర్మన్ భాష తరగతులకు 20 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ప్రస్తుతం ఓరియంటేషన్ తరగతులు నడుస్తున్నాయి. త్వరలో పూర్తిస్థాయి తరగతులు ప్రారంభంకానున్నాయి.ఇప్లూ యూనివర్సిటీ ఆధ్వర్యంలో.. నర్సింగ్ విద్యార్థులు జర్మన్, జపనీస్ భాషలను నేర్పించేందుకు రాష్ట్ర ఆరోగ్యశాఖ ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజేస్ యూనివర్సిటీ (ఇప్లూ)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ యూనివర్సిటీ ద్వారా త్వరలో ఆన్లైన్ ద్వారా పూర్తిస్థాయి తరగతులు నిర్వహించనున్నారు. తరగతుల నిర్వహణకు సంబందించి టైంటేబుల్ కూడా ఏర్పాటు చేశారు.ఉజ్వల భవిష్యత్, మంచి వేతనం జర్మన్, జపాన్ దేశాల్లో నర్సుల కొరత ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం ఆయా దేశాల భాషలను నర్సింగ్ విద్యార్థులకు నేర్పించాలని నిర్ణయించింది. ఈ భాషలపై పట్టు సాధించిన వారికి అక్కడ విరివిగా ఉద్యోగ అవకాశాలు లభిస్థాయి. మంచి భవిష్యత్, భారీ వేతనం ఉంటుంది. త్వరలోనే పూర్తిస్థాయిలో తరగతులు ప్రారంభంకానున్నాయి. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. – డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, భువనగిరి ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ -
ఖర్చుల లెక్క.. చూపాలి పక్కా
భూదాన్‌పోచంపల్లి: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న పత్రి అభ్యర్థి ప్రచారానికి సంబంధించిన లెక్కలను పక్కాగా అధికారులకు సమర్పించాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకుడు శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులతో ఆదివారం భూదాన్‌పోచంపల్లి మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. వారికి ఎన్నికల వ్యయంపై అవగాహన కల్పించారు. అభ్యర్థులు తమ ఖర్చుల లెక్కలను ఈ నెల 9, 12వ తేదీల్లో రెండు విడతలుగా చూపాలన్నారు. అంతేకాక ఎన్నికల్లో గెలిచినా, ఓడినా ఫలితాలు వెలువడిన రోజు నుంచి 45 రోజుల్లోగా ఖర్చుల పూర్తి వివరాలను తప్పనిసరిగా సమర్పించాలని సూచించారు. చూపనిపక్షంలో గెలిచిన వారి అభ్యర్థితత్వం రద్దు అవుతుందని, ఓడినవారు మూడు టర్మ్‌లు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధిస్తారని స్పష్టం చేశారు. సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. కరపత్రాల్లో సదరు ప్రింటింగ్ ప్రెస్ అడ్రస్, ఎన్ని ప్రతులు ప్రచురించారనే వివరాలు ఉండేలా జాగ్రత్తపడాలని పేర్కొన్నారు. డబ్బు, మద్యం, కానుకలతో ఓటర్లను ప్రలోభపెడితే వారిపై ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు చర్యలు ఉంటాయన్నారు. సమావేశంలో మండల వ్యయ పరిశీలకుడు సురేశ్, ఎంపీడీఓ రాపర్తి భాస్కర్, తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. ఎన్నికల వ్యయ పరిశీలకుడు శ్రీనివాస్ -
వైద్యానికి వస్తే ఒక్కరూ లేరు!
తుర్కపల్లి: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అత్యవసర సేవల కోసం వచ్చిన బాధితులకు ఇక్కట్లు తప్పడం లేదు. లక్ష్మాపురంలోని ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన ఓ మహిళ ఆదివారం సాయంత్రం పురుడు పోసుకొని వైద్యంకోసం 108 అంబులెన్స్‌లో పీహెచ్‌సీకి వచ్చింది. ఆ సమయంలో ఆస్పత్రిలో ఎవ్వరూ లేరు. 24 గంటలు వైద్యసేవలందించాల్సిన ఈ వైద్యశాలలో ఒక్కరూ లేకపోవడంతో వచ్చిన ఆంబులెన్స్‌లో భువనగిరిలోని ఏరియా ఆస్పత్రికి వెనుదిరిగారు. ఈ విషయమై వైద్యాధికారి రుచిరారెడ్డిని వివరణ కోరగా సిబ్బంది కొరత ఉందని తెలిపారు. ఇద్దరు నర్సులు ఉండగా ఉదయం ఒకరు, నైట్ షిఫ్ట్‌లో ఒకరు విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. సరిపడా సిబ్బంది లేకపోవడం వల్ల అందుబాటులో ఉన్న ఇద్దరు.. అదనపు గంటలు డ్యూటీ చేయాల్సి వస్తుందని వివరణ ఇచ్చారు. -
కోడ్ వేళ.. తప్పని నిరీక్షణ!
భూదాన్‌పోచంపల్లి : చేనేత రుణమాఫీ వచ్చినట్లే వచ్చి ఆగిపోవడంతో నేతన్నలు ఆయోమయంలో పడిపోయారు. ఈనెల 20న కార్మికులు హైదరాబా ద్‌లోని హ్యాండ్లూమ్ కమిషనర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టడంతో దిగొచ్చిన ప్రభుత్వం.. వెంటనే రుణమాఫీకి రూ.33కోట్లు విడుదల చేస్తున్నామని ప్రకటించింది. కోడ్ వచ్చిన రోజే.. ప్రభుత్వం డిసెంబర్ 25న రుణమాఫీ నిధులను ఆయా జిల్లాల చేనేత, జౌళిశాఖ అధికారుల ఖాతాల్లో జమ చేసింది. అదే రోజు గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రుణ మాఫి ప్రక్రియ అర్ధాతరంగా ఆగిపోయింది. దీంతో చేనేత కార్మికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. నిధులొచ్చినా ఎన్నికల కోడ్‌తో కార్మికులకు అందని పరి స్థితి నెలకొంది. 17 వరకు కోడ్ అమల్లో ఉండటంతో కార్మికులు అప్పటి వరకు నిరీక్షించక తప్పని పరిస్థితి ఏర్పడింది. 2,803 మందికి లబ్ధి 2017 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు చేనేత కార్మికులు బ్యాంకుల్లో తీసుకున్న లక్ష లోపు వ్యక్తిగత రుణాలకు మాత్రమే మాఫీ వర్తిస్తుంది. ఉమ్మడి జిల్లాలో 2,803 మందికి రూ.23.25 కోట్లు రుణమాఫీ చేయాల్సి ఉంది. ఇందులో అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 2,380 మంది రూ.19.25 కోట్లు రుణమాఫీకి అర్హులని తేల్చారు. ఇదిలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా రూ.48 కోట్లు రుణమాఫికి అర్హత సాధించారని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. కానీ, ప్రభుత్వం రూ.33 కోట్లు మాత్రమే విడుదల చేసింది. యాదాద్రి జిల్లాకు 19.25 కోట్లు రుణమాఫీ జరగాల్సి ఉండగా, నిధులు పూర్తిస్థాయిలో రాలేదని తెలుస్తుంది. నేతన్నకు నిలిచిపోయిన రుణమాఫీ డబ్బులు ఫ యాదాద్రి జిల్లాకు రూ.19.25 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం ఫ అదే రోజు అమల్లోకి గ్రామ పంచాయతీ ఎన్నికల నియమావళి ఫ 17 వరకు ఎదురుచూడాల్సిందే.. -
కోతుల ‘పంచాయితీ’
కోతులను పట్టి తరలించిన అభ్యర్థులకే ఓటు వేస్తామని ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాల ప్రజలు తేల్చి చెబుతున్నారు.● పోస్టల్ బ్యాలెట్ ఆరంభం- 8లోభువనగిరిటౌన్ : ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులంతా తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. మెదటి విడత పోలింగ్ జరిగే ఆలేరు, బొమ్మలరామారం, యాదగిరిగుట్ట, రాజాపేట, తుర్కపల్లి, ఆత్మకూరు(ఎం) మండలాల్లో పోలింగ్ విధుల్లో పాల్గొనే ఆర్వోలు, ఏఆర్వోలు, పీఓలు, ఓపీఓలు, జోనల్ అధికారులు, పోలీస్, ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బంది మండల పరిషత్ కార్యాలయాల్లో ఫారం–14 ఫారం నింపి ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలిపారు. ఎంపీడీఓలు నమూనా పోలింగ్ కేంద్రాన్ని తయారు చేసుకొని సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. -
మల్లాపురంలో పోలీసుల కవాతు
యాదగిరిగుట్ట రూరల్: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో యాదగిరిగుట్ట మండలంలోని మల్లాపురంలో ఆదివారం యాదగిరిగుట్ట పోలీసులు కవాతు నిర్వహించారు. సీఐ భాస్కర్ ఆధ్వర్యంలో పోలీసు బృందం గ్రామ వీధుల్లో తిరిగారు. భయబ్రాంతులకు లోనుకాకుండా, స్వచ్ఛందంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటర్లక ఉసీఐ భాస్కర్ సూచించారు. పోచంపల్లి అర్బన్బ్యాంక్కు అవార్డులు భూదాన్‌పోచంపల్లి : పోచంపల్లి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకును అవార్డులు వరించాయి. కర్నాటక రాష్ట్ర అర్బన్ బ్యాంకుల ఫెడరేషన్, బ్యాంకర్స్ మీడియా అసోషియేషన్ ఆధ్వర్యంలో భారత్ నెట్వర్క్ గ్రూప్, దక్షిణ భారత కోఆపరేటివ్ బ్యాంక్‌లకు 2025 సంవత్సరానికి గాను అవార్డులు ప్రకటించింది. వినియోగదారులకు ఉత్తమ సేవలందించినందుకు గాను పోచంపల్లి అర్బన్ బ్యాంకుకు ఉత్తమ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు, ఉత్తమ సీఈఓ, ఉత్తమ ఎన్పీఏ మేనేజ్మెంట్ మూడు అవార్డులు దక్కాయి. బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో బ్యాంకు చైర్మన్ తడక రమేశ్, వైస్ చైర్మన్ భారత రాజేంద్రప్రసాద్, సీఈఓ సీత శ్రీనివాస్ అవార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు కర్నాటి వెంకట బాలసుబ్రహ్మణ్యం, ఏలే హరిశంకర్, సూరెపల్లి రమేశ్, రాపోలు వేణు, గుండు కావ్య, కర్నాటి భార్గవి, కొండమడుగు ఎల్లస్వామి, మక్తాల నర్సింహ, బిట్టు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలుయాదగిరిగుట్ట: నిత్యపూజలు, భక్తుల రద్దీతో పంచనారసింహుడి క్షేత్రంలో కోలాహలం నెలకొంది. ఆదివారం వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు.. సుప్రఽభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి ఆరాధనలు చేశారు. అనంతరం గర్భాలయంలో కొలువైన స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను అభిషేకం, తులసీదళ సహస్రనామార్చనతో కొలిచారు. ఇక ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమాన్ని ఆగమశాస్త్రం ప్రకారం పూర్తి చేసి, గజవాహనసేవ.. స్వామి, అమ్మవారికి నిత్య తిరుకల్యాణం వైభవోపేతంగా నిర్వహించారు. అనంతరం బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు, సువర్ణ పుష్పార్చన , సాయంత్రం వెండిజోడు సేవను ఊరేగించారు. వివిధ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శ్రీస్వామి, అమ్మవార్లకు శయనోత్సవం నిర్వహించి ఆలయ ద్వార బంధనం చేశారు. -
● ‘మూడో విడత’ వరకు మోడల్ కోడ్
భువనగిరిటౌన్ : గ్రామ పంచాయతీ ఎన్నికలు చివరి దశ పూర్తయ్యే వరకు మోడల్ కోడ్ అమల్లో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. ఏకగ్రీవ పంచాయతీల్లోనూ కోడ్ యథాతదంగా అమల్లో ఉంటుందన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు ఉంటాయన్నారు. ఈనెల 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని, మూడో విడత ఫలితాలు వెలువడే వరకు పక్కాగా కోడ్ అమలయ్యేలా నిరంతరం నిఘా ఉంచాలని ఎన్నికల సిబ్బందికి సూచించారు. -
ఇంటి నుంచి ఓటు.. లేనట్లే!
ఫ అసెంబ్లీ ఎన్నికల్లో ఇంటి నుంచే ఓటేసిన వృద్ధులు ఫ పంచాయతీ ఎన్నికల్లో అవకాశం ఇవ్వని అధికారులుతిరుమలగిరి (తుంగతుర్తి) : రెండేళ్ల క్రితం జరిగిన శాసనసభ, లోక్ సభ ఎన్నికల్లో వృద్ధులు, దివ్యాంగులు ఇంటివద్ద నుంచే ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. నడవలేని, చేతగాని, మంచానికే పరిమితమైన వృద్ధులు పోలింగ్ కేంద్రానికి వెళ్లలేక పోవడంతో వారు తమ ఓటుహక్కును వినియోగించుకోలేక పోతున్నారు. ఫలితంగా ఓటింగ్‌శాతం తగ్గుతోంది. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం అటువంటి వారికి ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించింది. కానీ ప్రస్తుతం జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం అలాంటి అవకాశం ఇవ్వలేదు. సర్పంచ్, వార్డు సభ్యులకు ఓటు వేసేందుకు దివ్యాంగులు, వృద్ధులు ఇంటి వద్ద నుంచి ఓటు వేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నా ఎన్నికల సంఘం నుంచి అలాంటి ప్రకటన ఏదీ నేటికీ రాలేదు. గత ఎన్నికల్లో ఇలా.. గతంలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటరు జాబితాలో పేరుండి 85 ఏళ్లకు పైబడిన వృద్ధులు, 45 శాతానికి పైగా వైకల్యం ఉన్న వారు ఇంటి నుంచే ఓటు హక్కును వినియోగించుకునే వెసులుబాటు కల్పించారు. ఇందుకు ప్రత్యేకంగా 12–డీ ఫారాన్ని ముందస్తుగానే నింపి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. అధికారులు వారు ఇచ్చిన అడ్రస్‌కు పూర్తిస్థాయి భద్రతతో పోలింగ్ సామాగ్రితో వెళ్లి ఓటు వేయించారు. ఇబ్బందులు పడే అవకాశం ప్రస్తుత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వృద్ధులు, దివ్వాంగులు ఇంటి వద్ద నుంచి ఓటు వేసే అవకాశం లేక పోవడంతో వారు కచ్చితంగా పోలింగ్ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. పోలింగ్ సమయం కూడా ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే ఉంటుంది. నిర్ణీత సమయం లోపు కుటుంబ సభ్యులు వారిని పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లి ఓటు వేయించాల్సి ఉంటుంది. కాదూ అని వారిని వదిలేస్తే ఓటింగ్‌శాతం తగ్గి గెలుపు, ఓటములపై ప్రభావం పడే అవకాశం లేకపోలేదు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో పాటు ఓటర్లు సైతం ఇబ్బందులు పడే అవకాశం ఉంది. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇంటి వద్ద నుంచే ఓటు వేసేలా అధికారులు అవకాశం కల్పించాలి. వృద్ధులు, దివ్యాంగులు పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అలాంటి వారిని అధికారులు గుర్తించి అవకాశం కల్పించాలి. –చెవిటి చంద్రమ్మ, వృద్ధురాలుపంచాయతీ ఎన్నికల్లో ఓటేసేందుకు మేము పోలింగ్ కేంద్రానికి వెళ్లి గంటల తరబడి అక్కడ నిలబడలేము. అంతదూరం నడుచుకుంటూ వెళ్లాలన్నా ఇబ్బందే. అధికారులు వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దనే ఓటు వేసుకునేలా అవకాశం కల్పించాలి. – బాకి అయిలయ్య, వృద్ధుడు. -
ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్
చండూరు : భూమికి సంబంధించి మ్యూటేషన్ ప్రొసీడింగ్స్ సమాచారం ఇచ్చేందుకుగాను నల్లగొండ జిల్లా చండూరు డిప్యూటీ తహసీల్దార్ రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. గట్టుప్పలకు చెందిన ఉస్మాన్ షరీఫ్ తండ్రి జమాల్ షరీఫ్ 2017లో మృతిచెందాడు. ఆయనకు వంశపారపర్యంగా వచ్చిన 58 ఎకరాల 31 గుంటల భూమి ఉండగా.. అందులో నుంచి జమాల్ వదిన అయిన ఇక్బాల్ బేగం 2008లో 21 ఎకరాల 13 గుంటలను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుందని తండ్రి మృతి అనంతరం ఉస్మాన్‌కు తెలిసింది. అప్పటి నుంచి మ్యూటేషన్ ప్రొసీడింగ్స్ కావాలని తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అధికారులు స్పందించకపోవడంతో ఉస్మాన్ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్‌ను కలిశాడు. గత అక్టోబర్‌లో అప్పుడు తహసీల్దార్‌గా ఉన్న చంద్రశేఖర్‌ను పూర్తి సమాచారంతో హాజరుకావాలని ఆదేశించారు. కానీ, జూనియర్ అసిస్టెంట్ హాజరవ్వడంతో కమిషనర్ ఆగ్రహించి చంద్రశేఖర్‌ను నేరుగా హాజరవ్వాలని సూచించారు. ఈ క్రమంలో ఈనెల 2న ప్రస్తుత డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ స్వయంగా ఉస్మాన్‌కు ఫోన్ చేసి ఫైల్ దొరికిందని, కొంత డబ్బు ఇవ్వాలని కోరాడు. ఈమేరకు హైదరాబాద్‌లోని బాలాపూర్‌లో ఉన్న తన నివాసానికి రావాలని సూచించాడు. ఉస్మాన్ అదేరోజు ఏసీబీ అధికారులకు ఫోన్ చేసి విషయాన్ని వివరించాడు. గురువారం రాత్రి 9.30 గంటలకు చంద్రశేఖర్ తన నివాసం వద్ద కారులో ఉస్మాన్ నుంచి రూ.20వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అదేవిధంగా ఆయన ఇంటిలో సోదాలు నిర్వహించారు. అదేరోజు రాత్రి 12.30 గంటలకు చంద్రశేఖర్‌ను చండూరు తహసీల్దార్ కార్యాలయానికి తీసుకువచ్చి సోదాలు చేశారు. విచారణ అనంతరం ఆయనను శుక్రవారం నాంపల్లి కోర్టులో హాజరుపరచగా.. కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. రూ.20వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు -
దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి
తిప్పర్తి : మండలంలోని ఎల్లమ్మగూడెం గ్రామంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన సర్పంచ్ అభ్యర్థి భర్తను కిడ్నాప్ చేసిన వారిని కఠినంగా శిక్షించడంతోపాటు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని భర్తరఫ్ చేయాలని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం డిమాండ్ చేశారు. శుక్రవారం ఎల్లమ్మగూడెం గ్రామంలో మామిడి నాగలక్ష్మి, యాదగిరిలను మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌తో కలిసి పరామర్శించారు. రాజారాం మాట్లాడుతూ.. కిడ్నాప్ ఘటనపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈనెల 10న హైదరాబాద్‌లోని గన్‌పార్క్‌లో గల అమరవీరుల స్థూపం వద్ద నిర్వహించనున్న ధర్నాకు పార్టీలు, సంఘాలకతీతంగా తరలిరావాలని పిలుపునిచ్చారు. మాజీ ఎంపీ బడుగుల లింగయ్య మాట్లాడుతూ.. ఎల్లమ్మగూడెంలో జరిగిన ఘటన దారుణమన్నారు. బీసీలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. కార్యక్రమంలో దూదిమెట్ల బాలరాజు, కేయూడీఏ చైర్మన్ సుందర్‌రాజ్‌యాదవ్, గొర్లకాపర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు సోమనబోయిన సుధాకర్, జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల కృష్ణ, జిల్లా యాదవ సంఘం మహిళా అధ్యక్షురాలు మామిడి నాగలక్ష్మి యాదవ్, ప్రజాఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు వాసుకే యాదవ్, యాదవ మహాసభ రాష్ట ప్రధాన కార్యదర్శి లొడంగి గోవర్ధన్ పాల్గొన్నారు. -
అభ్యర్థులపై అధికారుల నిఘా
రాజాపేట : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగిసింది. మొదటి విడుతలో పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రచారం మొదలు పెట్టారు. మిగతా చోట్ల కూడా ప్రచారానికి సిద్ధమవుతున్నారు. సర్పంచ్, వార్డు సభ్యడి స్థానానికి పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే వేటు పడుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అభ్యర్థుల కదలికలను ఫ్లైయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వేలెన్స్ టీం (ఎస్ఎస్టీ), వీడియో సర్వే లెన్స్ టీం, వీడియో వ్యూయింగ్ టీం (వీవీటీ), వీడియో సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీ, అకౌంటింగ్ టీం (ఏటీ), అసిస్టెంట్ ఎక్స్పెండీచర్ అబ్జర్వర్ (ఏఈఓ) ఎప్పటికప్పుడు పరిశీలించనున్నారు. ఖర్చులు.. చెల్లింపులు అభ్యర్థులు నామినేషన్ సమయంలో ఇచ్చిన బ్యాంక్ ఖాతా ద్వారానే చట్టబద్ధమైన ఖర్చులు చేయాల్సి ఉంటుంది. ప్రతి ఖర్చుకు బిల్లులుండాలి. రూ.5వేల లోపు ఖర్చు నగదుగా అంతకంటే ఎక్కువైతే చెక్కు లేదా అన్లైన్ పేమెంట్‌తో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఓటర్లను ప్రలోభ పెట్టొద్దు మద్యం, మాంసం, డబ్బుతో పాటు ఏ ఇతర వస్తువులను ఓటర్లకు ఇచ్చి వారిని ప్రలోభ పెట్టొద్దు. ప్రచార సమయంలో అభ్యర్థి వద్ద లేదా అతడికి సంబంధించిన వ్యక్తి వద్ద రూ.10వేలకు మించి డబ్బలు ఉండొద్దు. పోలింగ్‌కు 48 గంటల ముందే ప్రచారం ముగించాల్సి ఉంటుంది. పోలింగ్ రోజు కేంద్రాల నుంచి 100 మీటర్ల పరిధిలో ఎలాంటి ప్రచారం చేయవద్దు. -
30 ఏళ్ల తర్వాత మళ్లీ బరిలో..
చిట్యాల : గతంలో సర్పంచ్‌గా 14 ఏళ్లు పని చేసిన నాయకుడు ఇప్పుడు రిజర్వేషన్ కలిసి రావడంతో 30 ఏళ్ల తర్వాత తిరిగి అదే గ్రామపంచాయతీకి సర్పంచ్‌గా పోటీ చేస్తున్నాడు. చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన బొంతల చంద్రారెడ్డి సీపీఎం మద్దతుతో 1981లో సర్పంచ్‌గా పోటీ చేసి విజయం సాధించారు. 1988లో రెండో సారి, 1994లో మూడోసారీ సర్పంచ్‌గా పోటీ చేసి గెలుపొందారు. అయితే 14 ఏళ్లు సర్పంచ్‌గా పని చేసిన ఆయన పార్టీ బాధ్యతలు నిర్వహించేందుకు 1995లో రాజీనామా చేశారు. 2వేల సంవత్సరంలో భువనగిరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వెలిమినేడు గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి జనరల్‌గా మారడంతో బొంతల చంద్రారెడ్డి మరో మారు సీపీఎం మద్దతుతో సర్పంచ్‌గా పోటీ చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి గతంలో తాను సర్పంచ్‌గా 14 ఏళ్లపాటు పని చేసిన సందర్భంలో చేపట్టిన ఆభివృద్ధిని వివరిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. -
వాహనాల తనిఖీ ముమ్మరం
నేరేడుచర్ల : గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఫ్లైయింగ్ స్క్వాడ్ టీం (ఎఫ్ఎస్టీ) వాహనాల తనిఖీలు ముమ్మరం చేసింది. శుక్రవారం నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి టోల్‌ప్లాజా వద్ద ఎఫ్ఎస్టీ సిబ్బంది ఆధ్వర్యంలో ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎఫ్ఎస్టీ అధికారి చంద్రమ్మ మాట్లాడుతూ..ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలను చేపడుతున్నామన్నారు. సూర్యాపేట– నల్లగొండ జిల్లాలకు సరిహద్దు ప్రాంతం అయిన చిల్లేపల్లి వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టు సమీపంలో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామని తెలిపారు. పోటీ చేస్తున్న అభ్యర్థులు డబ్బులు, మద్యంతో పాటు ఇతర బహుమతులు రవాణా చేసే అవకాశం ఉన్నందున నిఘా పెంచామన్నారు. ఈ తనిఖీల్లో ఏఎస్ఐ సురేందర్, పోలీస్ సిబ్బంది సురేందర్, లింగయ్య, వెంకన్న తదితరులు ఉన్నారు. -
గంజాయి విక్రేతల అరెస్టు
పెద్దవూర : గంజాయి విక్రయిస్తున్న ఇద్దరితోపాటు, కొనుగోలు చేస్తున్న మరో ఇద్దరిని అరెస్టు చేసి, కేజీన్నర గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్‌రాజు తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్లో వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా మాచర్ల పట్టణానికి చెందిన ఇద్దరు మంజుల శ్రీను, షేక్ గాలిబ్‌లు తిరుమలగిరి సాగర్ మండలం శ్రీరాంపల్లి గ్రామానికి చెందిన దేశం విజయేందర్‌రెడ్డి, అదే గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ బరిగల మహేష్‌లకు గంజాయి విక్రయించేందుకు పొట్టిచెల్మ ఎక్స్‌రోడ్డు సమ్మక్క–సారలమ్మ గద్దెల సమీపానికి గురువారం వచ్చారు. కిలోన్నర గంజాయికి రూ.33వేలకు మాట్లాడుకున్నారు. వారి వద్ద గంజాయి అందుబాటులో లేకపోవడంతో అడ్వాన్సుగా రూ.31వేలు ఇచ్చి గంజాయి సరఫరా సమయంలో మిగతా రూ.2వేలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. ఈమేరకు శుక్రవారం గంజాయిని ఇచ్చేందుకు మంజుల శ్రీను, షేక్ గాలిబ్‌లు గంజాయిని సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్దకు వచ్చారు. విజయేందర్‌రెడ్డి, మహేష్‌లకు గంజాయిని ఇచ్చి మిగిలిన రూ.2వేలు తీసుకుంటుండగా అప్పటికే వీరిపై నిఘా పెట్టిన పోలీసులు వారిని పట్టుకుని పెద్దవూర పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిందితుల వద్ద రూ.33వేల విలువైన కిలోన్నర గంజాయి, బైక్, మూడు సెల్ఫోన్లు, రూ.2వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరిని విచారించగా విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయిని తీసుకుని వచ్చి ఈ ప్రాంత యువతకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. మంజుల శ్రీనుపై అనేక కేసులు ఉన్నాయని తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని పేర్కొన్నారు. -
మాలిలో బండసోమారం యువకుడి కిడ్నాప్
● ఆందోళనలో కుటుంబ సభ్యులుభువనగిరి : ఉపాధి కోసం ఆఫ్రికా ఖండానికి వెళ్లిన భువనగిరి మండలానికి చెందిన యువకుడు కిడ్నాప్‌కు గురయ్యాడు. బండసోమారం గ్రామానికి చెందిన నల్లమాస జంగయ్య, మహేశ్వరీల చిన్నకుమారుడు ప్రవీణ్ ఏడాది క్రితం హైదరాబాద్‌లోని బోర్వెల్ కంపెనీలో పనిలో చేరాడు. అక్కడి నుంచి కంపెనీ ద్వారా ఆఫ్రికా ఖండంలోని మాలి దేశానికి వెళ్లాడు. అక్కడే కోబ్రి సమీపంలో బోర్వెల్కు సంబంధించిన డ్రిల్లర్‌గా పనిచేస్తున్నాడు. గత నెల 23న పని ముగించుకుని వస్తుండగా జమాత్ నుస్రత్ అల్–ఇస్లామ్ వల్–ముస్లిమీన్ సంస్థకు చెందిన తీవ్రవాదులు అతడిని కిడ్నాప్ చేశారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఆలస్యంగా తెలి యడంతో ఆందోళన చెందు తున్నారు. మాలి దేశంలోని భారత రాయబార అధికారులతో సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం. నిందితుల నుంచి తమ కుమారుడిని విడిపించి, ఇండియాకు తీసుకురావాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. -
ఉదయం ఇటు.. సాయంత్రం అటు..
పెద్దవూర : పంచాయతీ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఉదయం ఒక పార్టీలో ఉన్న నాయకులు, సాయంత్రం మరో పార్టీలో చేరుతున్నారు. పెద్దవూర మండలంలోని బట్టుగూడెం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు దండెం వెంకన్న, రుద్రాక్షి రాములుతో పాటు పలువురు శుక్రవారం ఉదయం కాంగ్రెస్‌లో చేరి పార్టీ కండువాలు కప్పుకున్నారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు వారితో మాట్లాడి ఒప్పించి మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ వద్దకు తీసుకెళ్లారు. వారంతా తిరిగి బీఆర్ఎస్లో చేరగా వారికి మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. -
భార్య సర్పంచ్‌గా.. భర్త వార్డుసభ్యుడిగా పోటీ
తుర్కపల్లి: మండలంలోని ఇబ్రహీంపూర్ గ్రామంలో మన్నె రజిత కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉండగా.. ఆమె భర్త మన్నె తిరుపతిరెడ్డి 6వ వార్డు సభ్యుడిగా పోటీ చేస్తున్నాడు. ఇలా ఇద్దరూ పోటీ చేయడంపై గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. సర్పంచ్ బరిలో మాజీ సైనికుడు డిండి : ఆర్మీలో 30 సంవత్సరాల పాటు విధులు నిర్వహించి ఎన్ఎస్జీ కమాండోగా పదవీ విరమణ పొందిన మాజీ సైనికుడు గ్రామానికి సేవ చేయాలనే లక్ష్యంతో ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచారు. నల్లగొండ జిల్లా డిండి మండలం గోనబోయినపల్లి గ్రామానికి చెందిన వర్కాల బాలనారాయణ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గ్రామ సర్పంచ్ పదవికి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. తనను గెలిపిస్తే ప్రజలకు సేవకుడిగా పని చేస్తానని, గోనబోయనపల్లి నుంచి నాగర్‌కర్నూల్ జిల్లా సిద్దాపూర్ గ్రామం వరకు రోడ్డుతో పాటు చెక్‌డ్యాం నిర్మాణం పూర్తిచేయిస్తానని బాలనారాయణ చెప్పారు. -
ముగిసిన మూడో విడత
ఫ చివరి రోజు భారీగా దాఖలైన నామినేషన్లు ఫ రాత్రి వరకు కొనసాగిన ప్రక్రియ సాక్షి,యాదాద్రి : మూడవ విడత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో నామినేషన్ల దాఖలుకు గడువు శుక్రవారం ముగిసింది. చివరి రోజు కావడంత్రో అభ్యర్థులు పోటెత్తారు. సాయంత్రం 5 గంటలకు గడువు ముగియగా.. అప్పటికే వరుసలో వేచి ఉన్న అభ్యర్థులను నామినేషన్ వేసేందుకు అవకాశం కల్పించారు. అభ్యర్థులతో పాటు వారికి మద్దతు ఇచ్చేందుకు వచ్చిన వారిని లైన్లో నిలబెట్టి టోకెన్లు ఇచ్చారు. పలు చోట్ల రాత్రి వరకు ప్రక్రియ కొనసాగింది. ఈ విడతలో భువనగిరి, చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని చౌటుప్పల్, సంస్థాన్‌నారాయణపురం, మోత్కూరు, అడ్డగూడూరు, మోటకొండూరు, గుండాల మండలాల్లో 124 పంచాయతీలు, 1,086 వార్డులకు ఈనెల 17న పోలింగ్ జరగనుంది. అభ్యర్థులు ర్యాలీలతో వచ్చి నామినేషన్ వేశారు. -
పోటెత్తాలి.. మన ఓటు
బొమ్మలరామారం: తొలి విడత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో శుక్రవారం ఓట హక్కుపై స్వయం సహాయక సంఘాల మహిళలు అవగాహన ర్యాలీలు నిర్వహించారు. బొమ్మలరామారం మండల కేంద్రంలో చేపట్టిన ర్యాలీలో ఓటు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు పాల్గొని మాట్లాడారు. ఓటు హక్కు వచ్చిన ప్రతి ఒక్కరూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రలోభా లకు లోనై నోటుకు ఓటును అమ్ముకోవద్దన్నారు. ఒక్క ఓటుతోనే గెలుపోటములు నిర్ణయించబడతాయని, ఏ ఒక్కరూ నిర్లక్ష్యం చేయొద్దన్నారు. -
ఏఎస్‌డీతో బోగస్ ఓట్లకు చెక్
సాక్షి, యాదాద్రి : దొంగ, బోగస్ ఓట్లు వేసేందుకు ఆస్కారం ఉండదిక. పోలింగ్ రోజు ప్రతి బూత్‌లో ప్రతి ప్రిసైడింగ్ అధికారి వద్ద ఏఎస్డీ (ఆబ్సెన్టీ, షిఫ్టెడ్, డెత్ లేదా డుప్లికేట్) జాబితా ఉంటుంది. దాని ద్వారా దొంగ ఓట్లు వేయడానికి వచ్చే వారిని సులభంగా పట్టేయొచ్చు. ఏఎస్డీ జాబితాను ఎన్నికల అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ఓటర్ స్లిప్‌ల పంపిణీ చేసి మిగిలిన స్లిప్‌లను అబ్సెన్టీ, షిఫ్టెడ్, డెత్ లేదా డుప్లికేట్ ఓటర్లుగా నిర్ధారిస్తున్నారు. ఏఎస్డీ విధానం ద్వారా నిజమైన ఓటరు ఓటు వేయడానికి అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. పోలింగ్ సమయంలో చనిపోయిన ఓటరు పేరున మరొకరు ఓటు వేయడానికి వచ్చినా లేదా బతికుండగానే పొరపాటున డెత్ ఓటరుగా గుర్తించబడినా ఒకటికి రెండుసార్లు ఏఎస్డీ జాబితా పరిశీలించి అనుమతిస్తారు. అంతేకాకుండా ఒక వార్డులో ఓటువేసి చేతి వేలికి ఉన్న ఇంకుని చెరిపేసి మరొక వార్డులో వేయడానికి వీల్లేకుండా అడ్డుకుంటారు. రెండు గుర్తింపు కార్డులు తీసుకెళ్తేనే అనుమతి.. ఏఎస్డీ జాబితాను పోలింగ్ రోజు ప్రిసైడింగ్ అధికారులకు అందజేస్తారు. ఏఎస్డీ జాబితాలో పేరున్న ఓటరు ఎన్నికల కమిషన్ నిర్దేశించి ఏవేని రెండు గుర్తింపు కార్డులు తీసుకెళ్తేనే ఓటు వేయడానికి అనుమతిస్తారు. ఫ సిద్ధమవుతున్న జాబితా ఫ పోలింగ్ రోజు ప్రతి కేంద్రంలో అందుబాటులోకి.. ఓటర్లకు పోలింగ్ స్లిప్‌లు పంపిణీ చేసేటప్పుడు ఎవరైనా ఓటర్లు లేనట్లయితే మిగిలిపోయిన స్లిప్‌లు మూడు రకాలు ఉంటాయి. చనిపోయిన, డబుల్ ఓటు, షిఫ్టెడ్ అయినవారి స్లిప్‌లు ఉంటాయి. వీటి ఆధారంగా ఏఎస్డీ జాబితా రెడీ చేస్తారు. ఈ జాబితాలో పేరున్న వారు ఓటు వేయడానికి వస్తే ఒకటికి రెండుదఫాలు విచారణ చేసి, రెండు గుర్తింపు కార్డులు ఉంటేనే ఓటు వేయడానికి అనుమతిస్తారు. –విష్ణువర్ధన్‌రెడ్డి, డీపీఓఒక కుటుంబంలోని ఓటర్లు వివిధ కారణాలతో ఇంట్లో ఉండకుండా పోతారు. ఓటు నమోదు చేసుకున్న తర్వాత బదిలీ, ఊరు మారడం, కొడుకులు, కూతుర్ల దగ్గరికి వెళ్లిపోవడం, పెళ్లి చేసుకొని వేరే ప్రాంతాల్లో నివాసం ఉండటం జరుగుతుంది. అటువంటి వారిని షిఫ్టెడ్ ఓటు కింద గుర్తిస్తారు. ఓటరు జాబితాలో పేరు ఉండి చనిపోయిన వారిని డెత్ ఓటర్లుగా గుర్తిస్తారు. డూప్లికేట్ అంటే ఒక ఓటరు రెండు వార్డుల్లో ఓటు హక్కు కలిగి ఉండటం.. ఇలా ఉన్నప్పుడు ఒక వార్డులో స్లిప్ ఇచ్చి ఇంకో వార్డులో డూప్లికేట్ అని రాస్తారు. అధికారులు ఓటరు స్లిప్‌లు పంచడానికి వెళ్లినప్పుడు ఓటరు అందుబాటులో లేకపోవడం, లేదా ఇంటికి తాళం వేసి ఉండడం, కుటుంబ యజమాని ఒక్కరే ఉండటం, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి ఉంటే వారిని అబ్సెన్టీ ఓటరు కింద పరిగణిస్తారు. -
బోధన చేసి.. భోజనం వడ్డించి
విద్యార్థులకు భోజనం వడ్డిస్తున్న కలెక్టర్ టెన్త్ విద్యార్థులకు గణితం బోధిస్తున్న కలెక్టర్ భువనగిరి : బీబీనగర్ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం కలెక్టర్ హనుమంతరావు తనిఖీ చేశారు. ముందుగా పదో తరగతికి వెళ్లి అప్పటికే ఉపాధ్యాయుడు బోధిస్తున్న పాఠ్యాంశాన్ని పరిశీలించారు. తరువాత విద్యార్థులతో మాట్లాడారు. గణితం సబ్జెక్ట్ బోధించి వారికి పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. సాయంత్రం ప్రత్యేక తరగతులు జరుగుతున్నాయా, లేదా తెలుసుకున్నారు. సులభంగా అర్థమయ్యేలా బోధన చేయాలని, ప్రతి విద్యార్థి పాఠశాలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. గైర్హాజరైన విద్యార్థులకు ఫోన్ చేసి కారణాలపై వాకబు చేయాలన్నారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని రుచి చూసి విద్యార్థులకు స్వయంగా వడ్డించారు. -
పోచంపల్లిలో ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థులు
భూదాన్‌పోచంపల్లి : హైదరాబాద్‌లోని హమ్స్టెక్ కాలేజీకి చెందిన 25 మంది ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థులు శుక్రవారం భూదాన్‌పోచంపల్లిని సందర్శించారు. ఈ సందర్భంగా రూరల్ టూరిజం పార్కు, చేనేత గృహాలకు వెళ్లి మగ్గాలు, ఇక్కత్ వస్త్రాలు, చేనేత డిజైన్లు, రంగులద్దకం తదితర వస్త్ర తయారీ ప్రక్రియలను పరిశీలించారు. ఇక్కత్ వస్త్రాల ప్రాముఖ్యతను అడిగి తెలుసుకున్నారు. మగ్గం నేసి, రాట్నం వడికి, సెల్ఫీలు దిగి సందడి చేశారు. ఫ్యాకల్టీలు దివ్య, శ్రావణి మాట్లాడుతూ మగ్గాలపై ఇక్కత్ వస్త్రాలను నేసే ఇధానం, చేనేత కళాకారుల శ్రమ, కళానైపుణ్యాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు స్టడీ టూర్లో భాగంగా పోచంపల్లిని సందర్శనకు వచ్చామని తెలిపారు. -
చివరి దశకు కొనుగోళ్లు
రామన్నపేట: వానాకాలం ధాన్యం సేకరణ తుది దశకు చేరింది. మరో పది రోజుల్లో కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి కానుంది. జిల్లాలో 17 మండలాల్లో వరి సాగు చేశారు. జిల్లాలో సుమారు 3 లక్షల ఎకరాల్లో వరి సాగుచేశారు. 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుమతి వస్తుందని, 3.50 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. పీఏసీఎస్, ఐకేపీ, ఎఫ్పీఓల ద్వారా 330 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. శుక్రవారం వరకు కొనుగోలు చేసిన ధాన్యం శుక్రవారం సాయంత్రం వరకు 148 ఐకేపీ సెంటర్ల ద్వారా 1,01, 274 మెట్రిక్ టన్నులు, 164 పీఏసీఎస్ సెంటర్ల నుంచి 1,42,112 మెట్రిక్ టన్నులు, 15 ఎఫ్‌పీఓ కేంద్రాల ద్వారా 14,299 మెట్రిక్ టన్నులు, మూడు మెప్మా సెంటర్లలో 2,896 మెట్రిక్ టన్నుల ధాన్యం.. మొత్తం 2,60,582 మెట్రిక్ టన్నుల వడ్లు సేకరించారు. కాగా అందులో ఫైన్ రకం 4,999 మెట్రిక్ టన్నులు, గ్రేడ్–1 రకం 1,10,520 మెట్రి క్టన్నులు, సాధారణ రకం 1,45,062 మెట్రిక్ టన్నులు ఉన్నాయి. 67 కేంద్రాల్లో ధాన్యం సేకరణ పూర్తయింది. వెనువెంటనే చెల్లింపులు 35,722 మంది రైతుల నుంచి రూ.604.05 కోట్లు విలువ చేసే ధాన్యాన్ని కొనుగోలు చేశారు. శుక్రవారం నాటికి రైతుల ఖాతాల్లో రూ.542 కోట్లు జమ చేశారు. ట్రక్‌షీట్ జనరేట్ అయిన రెండుమూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరిగింది. రైతులకు ఇబ్బంది కలుగకుండా చూస్తున్నామని సివిల్ సప్లై జిల్లా మేనేజర్ హరికృష్ణ తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను టాబ్లో ఎంట్రీ చేసిన రెండుమూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతున్నట్లు పేర్కొన్నారు.యాసంగి సీజన్‌కు సంబంధించి వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. వానాకాలం వరికోతలు దాదాపు పూర్తవడంతో చాలా మంది రైతులు మడులను సిద్ధం చేసి తూకం పోస్తున్నారు. 3,12,500 ఎకరాల్లో వరి సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. భారీ వర్షాలకు చెరవులు, కుంటలు నిండి భూగర్భ జలమట్టం పెరిగింది. వీటికి తోడు మూసీ ఆధారిత కాలువలు, గోదావరి జలాలు అందుబాటులో ఉండడంతో అంచనాలకు మించి వరి సాగయ్యే అవకాశం ఉందని అధికారులు బావిస్తున్నారు. ట్రాక్టర్‌తో మడిని సిద్ధం చేస్తున్న రైతుఫ 2.60లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ ఫ రైతుల ఖాతాల్లో రూ.542 కోట్లు జమ -
రాష్ట్రస్థాయిలోనూ మేటిగా నిలుస్తాం
ఆలేరు: రాష్ట్రస్థాయి జూనియర్ బాలుర కబడ్డీ పోటీలకు యాదాద్రి భువనగిరి జిల్లా జట్టు బయలుదేరి వెళ్లింది. శుక్రవారం క్రీడాకారులతో పాటు జట్టు కోచ్, మేనేజర్ ఆలేరు నుంచి రైలులో బయలుదేరివెళ్లారు. రాష్ట్రస్థాయిలోనూ మేటిగా నిలుస్తామని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పూల నాగయ్యతోపాటు రాష్ట్ర,జిల్లా నాయకులు మంద సోమరాజు,పరిగెల రాములు, చింతల సాయిబాబా,పూలచంద్రకుమార్ తదితరులు క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. ఈనెల 5,6,7 తేదీల్లో మహబూబ్‌నగర్ జిల్లాలో 51వ జూనియర్ బాలుర కబడ్డీ రాష్ట్రస్థాయి పోటీలు జరగన్నట్టు నాగయ్య తెలిపారు. -
హైటెక్ ప్రచారం
ప్రచారంలో సోషల్ మీడియా కీలకపాత్ర పోషిస్తుండగా.. దానికి ఇప్పుడు ఏఐ టెక్నాలజీ కూడా తోడైంది. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ప్రచార వీడియోలు, ప్రకటనలు రూపొందించి వాట్సాప్ గ్రూప్‌లలో పోస్టు చేస్తున్నారు. తాము గెలిస్తే గ్రామాన్ని సుందరీకరిస్తాం, లైబ్రరీ ఏర్పాటు చేస్తాం, కమ్యూనిటీ హాల్ నిర్మిస్తాం, సీసీ రోడ్లు వేయిస్తాం.. అని ఇలా హామీలు ఇస్తున్నారు. అవన్నీ పూర్తయితే ఎలా ఉంటుందో ఏఐ ద్వారా కళ్లకు గట్టినట్లు చూపుతున్నారు. ఇవన్నీ తక్కువ సమయంలో ఎక్కువ మంది ఓటర్లకు చేరువయ్యేలా ఏఐ దోహదపడుతోంది. అంతేకాకుండా ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించడం, తమ గురించి పాజిటివ్‌గా ప్రచారం చేయడం వంటి పనులను చేస్తోంది. యాదగిరిగుట్ట మండలం మాసాయిపేటతో పాటు పలు పంచాయతీల్లో అభ్యర్థులు ఏఐ ద్వారా ప్రచారం చేస్తున్నారు. వీటితో పాటు రీల్స్ చేసి ఫేస్బుక్, ఇన్‌స్ర్ట్రాగామ్‌లో షేర్ చేసి ఓటర్లకు చేరువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సమస్తం ఫోన్లోనే.. గతంలో ఎన్నికల ప్రచారం వాల్‌రైటింగ్, డోర్, వాల్‌పోస్టర్లు, కరపత్రాలు, బ్యానర్లు, ఫ్లెక్సీలకు పరిమితం అయ్యేది. అభ్యర్థులు, వారి అనుచరులు ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసి తమకు ఓటేయాలని అభ్యర్థించేవారు. కాలానుగుణంగా ప్రచారశైలి మారిపోయింది. మారుమూల ప్రాంతాల్లో సైతం ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో సామాజిక మాద్యమాల వినియోగం కూడా విస్తృతంగా పెరిగిపోయింది. ఫేస్బుక్, వాట్సప్, ట్విట్టర్, యూట్యూబ్, ఇన్‌స్ర్ట్రాగామ్, ఎక్స్ తదితర సోషల్ మీడియా(సామాజిక మాధ్యమాలు)ను వేదికగా మార్చుకుంటున్నారు. గ్రామాలు, వార్డుల వారీగా వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేస్తున్నారు. మంచి అభ్యర్థిని గెలిపించాలని, తాము గెలిస్తే ఊరికి ఏం చేస్తారో చెబుతున్నారు. అభ్యర్థి ప్రసంగాలు, ప్రచార కార్యక్రమాలను వాటిలో పోస్టు చేస్తున్నారు. అలాగే కుల, మహిళా, యువజన సంఘాలు, ఫ్రెండ్స్, వాకర్స్.. ఇలా వర్గాల వారీగా వాట్సాప్ గ్రూప్‌లు చేసి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయోమయ స్థితిలో ఓటర్లు సామాజిక మాధ్యమాల్లో పంచాయతీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. అభ్యర్థులు ఎవరికి వారు తమకు నచ్చిన రీతిలో ప్రచారం సాగిస్తుండటం ఓటర్లను విసుగెత్తిస్తోంది. ఏది నిజమో, ఏది అబద్దమో తెలియని అయోమయ స్థితి నెలకొంది. దీంతో పలు గ్రూప్‌ల అడ్మిన్లు అభ్యర్థుల ప్రచా రాన్ని అడ్డుకునే మార్గాలు వెతుకుతున్నారు. అందులో భాగంగా వాట్సాప్ గ్రూప్‌లలో ఓన్లీ అడ్మిన్ సెండ్ ఆప్షన్, మరికొందరు ఆర్చీవ్డ్గా వాడుతున్నారు. ఫ సామాజిక మాధ్యమాలే వేదిక ఫ గ్రామాలు, వార్డుల వారీగా వాట్సాప్ గ్రూప్‌లు ఫ ఏఐ టెక్నాలజీ సైతం వినియోగం ఫ తక్కువ సమయంలో ఎక్కువ మంది ఓటర్లకు దగ్గర ఫ సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటున్న అభ్యర్థులుసాక్షి యాదాద్రి: భువనగిరి మండలంలోని ఓ గ్రామంలో సర్పంచ్‌గా పోటీ చేయాలనుకుంటున్న వ్యక్తి తన ప్రచార కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సామాజిక మాద్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఏకంగా ఒక వ్యక్తిని నియమించుకున్నాడు. యాదగిరిగుట్ట మండలంలోని ఓ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి సామాజిక మాద్యమాలు వేదిక ప్రచారం చేస్తున్నాడు. ఈసారి ఎన్నికల్లో తనకు అవకాశం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నాడు. తనను గెలిపిస్తే చేపట్టనున్న పనులను గ్రామ వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేశాడు.. మారుతున్న కాలానుగుణంగా అభ్యర్థులు పంచాయతీ ఎన్నికల్లో ప్రచారశైలిని మార్చారు. సామాజిక మాధ్యమాలను ప్రచారానికి వేదికలుగా మలుచుకుంటున్నారు. సామాజిక మాధ్యమాలు వేదికగా అభ్యర్థులు చేస్తున్న ప్రచారంపై ఎన్నికల బృందాలు నిఘా పెట్టాయి. ఎన్నికల నియమావళికి అనుగుణంగా ప్రచార కార్యక్రమాలు ఉండాలే తప్ప.. ఏ ఒక్క వర్గం మనోభావాలను కించపరిచే విధంగా, వక్రీకరించేలా, తప్పుదారి పట్టించే విధంగా ఉండవద్దు. డీప్‌ఫేక్స్, మహిళలపై అవమానకరమైన కంటెంట్, పిల్లలను ప్రచారంలో ఉపయోగించడం వంటివి నిషేధం. ఈ నిబంధనల ప్రకారం సోషల్ మీడియాలో ప్రచారం జరగాలి. ఏవిధమైన ఉల్లంఘనలు జరిగినా అభ్యర్థిపై చర్యలు తీసుకుంటారు. -
కూరగాయల సాగుకు ప్రోత్సాహం
గుర్రంపోడు : కూరగాయల సాగుకు ఉద్యానవన శాఖ ప్రోత్సాహం అందిస్తోంది. కొత్తగా కూరగాయలు సాగుచేసే రైతులకు రాయితీలు అందించాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 10 వేల ఎకరాల్లో కూరగాయల సాగు పెంచేందుకు ప్రణాళికలు రచించింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 350 ఎకరాల్లో సాగు పెంచనుంది. హెక్టార్‌కు గరిష్టంగా రూ.24 వేలు, ఎకరాకు రూ.9,600 రాయితీ అందించనుంది. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి ఎన్ఐఎన్ లెక్కల ప్రకారం ప్రతి వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు 300 గ్రాముల కూరగాయలు వినియోగించాలి. కానీ, జిల్లా ప్రజల అవసరాలకు తగ్గట్టుగా కూరగాయలు, ఆకుకూరలు సాగు కావడం లేదు. జిల్లాలోని అన్ని రకాల కూరగాయల సాగుకు నేలలు, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నా.. సరైన ప్రోత్సాహం లేక సాగు విస్తీర్ణం పెరగడం లేదని అధికారులు భావిస్తున్నారు. అయితే కర్నూలు నుంచి టమాట, మహారాష్ట్ర నుంచి ఉల్లిగడ్డ, పంజాబ్ నుంచి ఆలుగడ్డ, బెంగళూరు నుంచి క్యారెట్, బీట్రూట్ దిగుమతి చేసుకుంటున్నారు. కోతుల బెడదతో వెనుకంజ చాలా ప్రాంతాల్లో కూరగాయలు, ఆకుకూరలు సాగు చేసినా కోతులు బతకనివ్వడం లేదని భయాందోళనతో రైతులు కూరగాయల సాగుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కోతులను నివారించేందుకు టపాసులు పేల్చడం, మంకీగన్స్ ఉపయోగించడం, పంట చుట్టూ జే వైర్ లాంటివి కట్టాలంటే.. అధిక శ్రమకు గురికావాల్సి వస్తోందని అంటున్నారు. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది ఇళ్ల ఆవరణలో సొరకాయ ఇతర కూరగాయ పంటలు సాగు చేసుకునేవారు. ఇప్పుడు కోతుల వల్ల ఇంటి ఆవరణల్లో కూరగాయలు సాగు చేయడం లేదు. రాయితీ పొందడం ఇలా.. కూరగాయల పంటలను సాగు చేసుకునే రైతులు ముందుగా ప్రాంతీయ ఉద్యానవనశాఖ అధికారులకు దరఖాస్తు చేసుకుంటే వారు క్షేత్రస్థాయిలో పరిశీలించి అనుమతి ఇస్తారు. కూరగాయల నారును హైదరాబాద్‌లోని జీడిమెట్లలో గల సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో పెంచుతున్నారు. అక్కడి నుంచి నారు పొందితే రాయితీ డబ్బును.. నారు అందించిన కంపెనీకి చెల్లిస్తారు. కూరగాయల విత్తనాలను అధీకృత డీలర్ల వద్ద నుంచి రైతులు నేరుగా కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో 250 ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో 50, యాదాద్రి భువనగిరి జిల్లాలో 50 ఎకరాల్లో కూరగాయల సాగును ప్రోత్సహించాలని ఉద్యానవన శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఉమ్మడి జిల్లాలో కొత్తగా 350 ఎకరాల్లో సాగు చేయించాలని లక్ష్యం ఫ విత్తనాలు, నారు కొనుగోలుకు ఉద్యానశాఖ రాయితీ ఫ కూరగాయలు, ఆకుకూరల సాగు విస్తీర్ణం పెంచేలా ప్రణాళిక -
ఏఐ వీడియోలతో ప్రచారం
యాదగిరిగుట్ట రూరల్ : సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు కొత్త పద్ధతిలో ప్రచారాలు సాగిస్తున్నారు. యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచ్ అభ్యర్థి విన్నూత్నంగా ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్) వీడియోలతో గ్రామంలోని సోషల్ మీడియాలో ప్రచారం సాగిస్తున్నారు. ఈ ఏఐ వీడియోల ద్వారా తమను గెలిపించాలని, గ్రామాభివృద్ధి జరుగుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఏఐ వీడియోలను సర్పంచ్ ఎన్నికల్లో వినియోగించుకోవడం పట్ల గ్రామీణ ప్రజలు సోషల్ మీడియాలో ఆసక్తిగా తిలకిస్తున్నారు. -
అమ్మో.. పోస్టల్ బ్యాలెట్ !
ఫ ఓటు గోప్యత లేకపోవడంతో జంకుతున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, స్టేజ్–2, ప్రిసైడింగ్ అధికారి, ఇతర పోలింగ్ అధికారులు, బందోబస్తులో పాల్గొనే పోలీసులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ పోస్టల్ బ్యాలెట్‌ను జారీ చేస్తుంది. దీనిని ఉపయోగించుకుని వారు తమకు నచ్చిన వారికి పెన్నుతో టిక్ చేసి తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. అయితే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన తర్వాత అది సంబంధిత గ్రామపంచాయతీ స్టేజ్–2 ఆఫీసర్‌కి ఓట్ల లెక్కింపు కంటే ముందు అందజేస్తారు. సదరు పోస్టల్ బ్యాలెట్‌ను తెరిచి అభ్యర్థులకు చూపిస్తారు. తనకు ఓటు పడిన అభ్యర్థికి సంతోషంగా ఉన్నా, ఓటు పడని అభ్యర్థులు ఆ ఉద్యోగిపై కక్షగట్టి, గొడవలు పెట్టుకున్న సందర్భాలూ ఉన్నాయి. దీంతో ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి జంకుతున్నారు. ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ రహస్యతకు భంగం వాటిల్లకుండా ఆయా మండల కేంద్రాల్లో ప్రత్యేక పోలింగ్ బూత్ పెట్టాలని, ఓట్ల లెక్కింపు కంటే ముందే అందరి ఓట్లలో ఇవి కూడా కలపాలని వారు కోరుతున్నారు. బైండోవర్ అంటే .. తిరుమలగిరి (తుంగతుర్తి) : ఎన్నికల సమయంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. అందులో భాగంగా నేరస్థులు, రౌడీషీటర్లు, అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించే వారిపై నిఘా పెడతారు. అందుకే ఎన్నికలు రాగానే పాత నేరస్థులను బైండోవర్ చేస్తుంటారు. పోలీసులు వారిని స్థానిక తహసీల్దార్, ఆర్డీఓ ఎదుట హాజరు పర్చి జాగ్రత్తగా మసలుకోవాలని హెచ్చరిస్తారు. ప్రత్యేక బాండ్ పేపర్‌పై వారి నుంచి లిఖిత పూర్వక హామీ తీసుకుంటారు. స్వంత పూచీకత్తుపై విడుదల చేస్తారు. -
ప్రజా సేవకులే పాలకులు కావాలి
గుండాల : గ్రామాలలో స్థానిక సంస్థలు జరుగుతున్న నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని రామారం గ్రామానికి చెందిన తెలంగాణ రైతు సంక్షేమ సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఓర్సు ఇంద్రసేన ప్రజా సేవకులే ప్రజా పాలకులు కావాలని కోరుతూ తన ఇంటి ముందు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీపై.. ‘మన స్వతంత్య్ర భారత దేశంలో ఇప్పటి వరకు ప్రజలకు నచ్చిన పాలన జరుగ లేదు. గడిచిన కాలం గడిచింది .. వర్తమానాన్ని సరిదిద్దుకుందాం, అందుకు అనువైన సమయం జరగబోయే స్థానిక ఎన్నికలు, స్థానిక ఎన్నికలలో అధికారం కోసం ఆరాట పడే వ్యక్తులు వార్డు మెంబర్ నుంచి జడ్పీటీసీ సభ్యుడి దాక ఎన్నికల సమయంలో అక్కరకు రాని ఖర్చు , ఓటుకు నోటు ఇవ్వడాలు ఆపి ఎన్నికల తరువాత ప్రజల ఆరోగ్యం, విద్య, రైతు కోసం, యువకుల కోసం ఖర్చు చేయాల్సిన విధానం అవలంభించాలి’. అని ఫ్లెక్సీపై పేర్కొన్నారు. -
ముగిసిన అంతర్ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు
హాలియా : నల్లగొండ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో హాలియా పట్టణంలోని టైం స్కూల్లో ఈ నెల 2న ప్రారంభమైన 51వ అంతర్ జిల్లా స్థాయి జూనియర్ బాలికల కబడ్డీ పోటీలు గురువారంతో ముగిశాయి. ఈ పోటీల్లో 33 జిల్లాల జట్లు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో రంగారెడ్డి జిల్లా జట్టు ప్రథమ స్థానంలో నిలవగా.. నల్లగొండ జట్టు ద్వితీయ స్థానంలో, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలు తృతీయ స్థానంలో నిలిచాయి. ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర బాధ్యులు అనిల్, సత్యనారాయణ, చంద్రమౌళిగౌడ్, జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కారదర్శులు భూలోకరావు, కర్తయ్య, డీఎస్పీ శంకర్‌రెడ్డి, సీఐ అర్కపల్లి ఆంజనేయులు, ఎకై ్సజ్ సీఐ ఏడుకొండలు, టైం స్కూల్ డైరెక్టర్ మందా నరేందర్‌రెడ్డి, శ్లోక స్కూల్ గ్రూప్ డైరెక్టర్ కుకుడాల ఆంజనేయులు, జాతీయ కబడ్డీ క్రీడాకారుడు యడవెల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రథమ స్థానంలో రంగారెడ్డి జిల్లా జట్టు ద్వితీయ స్థానంలో నల్లగొండ జట్టు -
నిబంధనలకు లోబడి ఖర్చు చేయాలి
భువనగిరిటౌన్ : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నిబంధనలకు మించి ఖర్చు చేయకూడదని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకుడు శ్రీనివాస్ పేర్కొన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులకు ఎన్నికల వ్యయంపై అవగాహన కల్పించారు. 5 వేలకు పైగా జనాభా గల గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థికి రూ.2.50 లక్షలు, వార్డు సభ్యులు రూ.50 వేలకు మించి ఖర్చు చూయకూడదన్నారు. 5వేల లోపు జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థి రూ.1.50 లక్షలు, వార్డు సభ్యులకు రూ.30వేల వరకు ఖర్చు చేయడానికి పరిమితి ఉందన్నారు. అభ్యర్థులు ప్రచార నిమిత్తం ఉపయోగించే వాహనాలకు రిటర్నింగ్ అధికారుల వద్ద అనుమతి పొందాలని సూచించారు. తొలి విడత ఎన్నికలు జరిగే పంచాయతీల్లో 6వ తేదీన మొదటి విడత, 8న రెండో విడత.. రెండు దఫాలు అభ్యర్థుల వ్యయాన్ని లెక్కించనున్నట్లు వెల్లడించారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులతో పాటు ఓడిపోయిన అభ్యర్థులు సైతం ఫలితాలు వెలువడిన రోజు నుంచి 45 రోజుల్లో ఎన్నికల ఖర్చుకు సంబంధించిన తుది వివరాలు సమర్పించాలని సూచించారు. ప్రచార సమయంలో అభ్యర్థుల వద్ద ఆధారాలు లేకుండా వెయ్యి రూపాయలకు మించి నగదు ఉండటానికి వీలు లేదన్నారు.ఫ జిల్లా వ్యయ పరిశీలకుడు శ్రీనివాస్ -
పల్లెలకు సిద్ధమైన శ్రీనృసింహుడి రథం
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రచార రథం పల్లెలకు వెళ్లేందుకు సిద్ధమైంది. కొంతకాలంగా మరమ్మతులకు నోచుకోని శ్రీస్వామి వారి ప్రచార రథాన్ని ఆలయ ఈఓ వెంకట్రావ్ బాగుచేయించి, పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చారు. రాష్ట్రంలోని ఆయా గ్రామాలు, పట్టణాల్లో శ్రీస్వామి వారి కల్యాణోత్సవంతో పాటు ఆలయ విశిష్టతను ప్రచారం చేసేందుకు ఈ రథాన్ని వినియోగించనున్నట్లు ఆలయ ఈఓ వెంకట్రావ్ గురువారం వెల్లడించారు. ఈ నెల మూడవ, నాల్గవ వారంలో భూపాలపల్లి, నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రచార రథం ద్వారా శ్రీస్వామి వారి ఆశీస్సులు భక్తులకు అందజేసే కార్యక్రమంలో భాగంగా శ్రీస్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. భూపాలపల్లిలో జరిగే శ్రీస్వామి కల్యాణోత్సవానికి ఏఈఓ నవీన్, నాగర్‌కర్నూల్‌లో నిర్వహించే కల్యాణానికి ఏఈఓ రఘులను నోడల్ అధికారులుగా ఈఓ నియమించారు. దశల వారీగా వివిధ ప్రాంతాల్లో స్వామివారి ప్రచార రథాన్ని పంపి, ఆలయ విశిష్టత, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ప్రచారం నిర్వహించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
ఆరోగ్యకరమైన నేలలే భవిష్యత్తుకు పునాది
గరిడేపల్లి : వ్యవసాయంలో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి నేలలోని సారాన్ని కాపాడుకుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుంది. ప్రపంచ మృత్తిక దినోత్సవాన్ని ప్రతి ఏడాది డిసెంబర్ 5న జరుపుకుంటారు. ఈ ఏడాది మృత్తిక దినోత్సవం థీమ్‌ని శ్రీఆరోగ్యకరమైన నేలలు–ఆరోగ్యకరమైన నగరాలకు పునాదిశ్రీగా ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. ఆహార భద్రత, నీటి నాణ్యత, పర్యావరణ స్థిరత్వాన్ని మెరుగుపర్చడంలో నేలలు కీలకపాత్ర పోషిస్తాయని ఈ థీమ్ తెలియజేస్తుంది. నగరాల్లో సైతం కాలుష్యాన్ని తగ్గించడం, వర్షపు నీటిని భూమిలోకి ఇంకించుకునే సామర్థ్యాన్ని పెంచడం ద్వారా పర్యావరణ స్థిరత్వాన్ని సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన నేలలు పట్టణ వ్యవసాయానికి దారి తీసి నగరాల్లో సైతం ఆహార లభ్యతను పెంచుతాయి. నేలల్లోని ఇతర జీవులు జీవవైవిధ్యాన్ని కాపాడతాయి. నేల నాణ్యత మెరుగైతే నీరు భూమిలోకి సులభంగా ఇంకి కాలుష్యం తగ్గుతుంది. క్షీణిస్తున్న నేల నాణ్యత.. వ్యవసాయంలో ఎక్కువగా వాడుతున్న రసాయన ఎరువులు, అడ్డూ అదుపులేని నీటి వినియోగం, నేల క్రమక్షయం, సూక్ష్మపోషకాల కొరత వంటి సమస్యల వల్ల మట్టి నాణ్యత ప్రతి ఏడాది తగ్గిపోతుంది. ఇది భవిష్యత్తులో పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఆరోగ్యవంతమైన మట్టి పంటకు ఎక్కువ పోషకాలు అందిస్తుంది. నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. దీని వల్ల రసాయనాల వాడకం తగ్గి, రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయి. రైతులు పాటించాల్సిన పద్ధతులు.. రైతులు పంటలు వేసే ముందు మట్టి పరీక్ష చేయించడం చాలా అవసరం. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మట్టి పరీక్ష చేయించాలి. పరీక్ష ఫలితాల ఆధారంగా లోపించిన పోషకాలకు తగ్గట్టు ఎరువులు వినియోగించాలి. అంతేకాకుండా సేంద్రియ ఎరువుల వాడకం పెంచడం పెంచాలి. పశువుల ఎరువు, పచ్చి ఎరువు, కంపోస్టు ఎరువులు భూసార నాణ్యతను పెంచి, నేలలో సేంద్రియ పదార్థాల శాతాన్ని మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా డ్రిప్, స్పింక్లర్లు ఉపయోగిస్తే నీటి ఆదా జరగడమే కాకుండా నేల క్రమక్షయం నివారించబడుతుంది. అదేవిధంగా పంట మార్పిడి కూడా నేల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. వరి, కంది, పప్పు ధాన్యాలు వంటి పంటలను మారుస్తూ వేయడం వల్ల నేలకు విశ్రాంతి లభించి, పోషక సమతుల్యత మెరుగుపడుతుంది. పంట అవశేషాలను కాల్చకూడదు. అవశేషాలను నేలలో కలపడం ద్వారా నేలలో సేంద్రియ కర్బనం పెరిగి మట్టి, సూక్ష్మజీవులు రక్షించబడతాయి. మల్చింగ్ పద్ధతి ఉపయోగించడం మంచింది. నేలపై ఆకులు, గడ్డి వంటి పదార్థాలను కప్పడం వల్ల నేలలో తేమ నిల్వ ఉండి కలుపు మొక్కల పెరుగుదల తగ్గుతుంది. నేల క్షీణిస్తే పంటలే కాదు మానవ జీవన వ్యవస్థ ప్రమాదంలో పడుతుందని గుర్తుంచుకోవాలి. నేడు ప్రపంచ మృత్తిక దినోత్సవం -
కట్టుదిట్టంగా ఎన్నికల నియమావళి : కలెక్టర్
భువనగిరిటౌన్ : గ్రామ పంచాయతీ ఎన్నికల నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని గురువారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తొలి విడత ఎన్నికల నిర్వహణకు తీసుకుంటన్న చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల నియమావళి పకడ్బందీగా అమలయ్యేలా ప్రత్యేక టీంల ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. బరిలో నిలిచిన అభ్యర్థులు, ఏకగ్రీవ స్థానాలు తదితర అంశాలపై ఎన్నికల కమిషనర్‌కు వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, డీపీఓ విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. చిరస్మరణీయుడు రోశయ్య భువనగిరిటౌన్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ హనుమంతరావు పేర్కొన్నారు. గురువారం కొణిజేటి రోశయ్య వర్ధంతిని పురస్కరించుకొని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్‌రావుతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. రోశయ్య సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ జయమ్మ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ జగన్మోహన్ప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాగా పేరు మార్పు గుండాల: ‘జిల్లా మారినా.. పేరు మారలే’ శీర్షికన గురువారం సాక్షి దిన పత్రికలో ప్రచురితమైన కథనానికి అధి కారులు స్పందించారు. మండల పరిషత్ కార్యాలయ భవనంపై జిల్లా పేరు మార్చారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఏర్పడి తొమ్మిదేళ్లు గడుస్తోంది. అయినా ఎంపీడీఓ కార్యాలయ భవనంపై నేటికీ నల్లగొండ జిల్లా పేరే ఉంది. దీన్ని సాక్షి వెలుగులోకి తేగా అధికారులు నల్ల గొండ పేరు తొలగించి యాదాద్రి భువనగిరి జిల్లా పేరు పెట్టారు. పాఠశాలల తనిఖీ గుండాల : మండలంలోని అంబాల ప్రాథమికోన్నత పాఠశాల, వస్తాకొండూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను డీఈఓ సత్యనారాయణ గురువారం తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి ఉపాధ్యాయులు బోధిస్తున్న తీరును పరిశీలించారు. విద్యార్థులకు ప్రశ్నలు వేసి వారి సామర్థ్యాలను పరిశీలించారు. మధ్యాహ్న భోజనాన్ని రుచి చూశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. టెన్త్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని పేర్కొన్నారు.ఆయన వెంట హెచ్ ఎలుగు లింగయ్య, సుమన్, శ్రీనివాస్ ఉన్నారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం భువనగిరి: ఆరోగ్య సంరక్షణకు యోగా కీలకమని బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్ అమితా అగర్వాల్ అన్నారు. యోగా శాస్త్రంపై గురువారం బీబీనగర్ ఎయిమ్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జీవనశైలిలో చోటు చేసుకుంటున్న మార్పులకోసం యోగా చేయడం తప్పనిసరి అన్నారు. యోగా శాస్త్రాన్ని పాఠ్యాంశంగా చేర్చడం ద్వారా విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ సంగీత సంపత్, రిమాదాదా, రాహుల్ మహోత్ర, డాక్టర్ కృష్ణమూర్తి, వెరోనిక్ నికోలాయ్, రోహిణి మోత్వాణి,మీలి పాండా పాల్గొన్నారు. -
నేత్రపర్వంగా తిరునక్షత్ర వేడుకలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్ర ఉత్సవ వేడుకలను గురువారం వైభవంగా జరిపించారు. ఉదయం ఆలయ ముఖ మండపంలో విశేష తిరుమంజన స్నపన ఉత్సవం జరిపించిన అర్చకులు.. అనంతరం ప్రబంధ సేవాకాలం, దివ్య ప్రబంధ పారాయణ వేడుకలు చేపట్టారు. సాయంత్రం తిరుమంగై ఆళ్వార్ పురవీధిసేవ, దివ్య ప్రబంధ సేవాకాలం, రాత్రి నివేదన, తీర్థప్రసాద గోష్టితో ఉత్సవాలకు ముగింపు పలికారు. సంప్రదాయ పూజలు ప్రదానాలయంలో సంప్రదాయ పూజలు ఆగమ శాస్త్రం ప్రకారం చేపట్టారు. వేకువజామున సుప్రభాతసేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూలను నిజాభిషేకం, తులసీదళ సహస్రనామార్చన జరిపించారు.ఇక ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజవా హన సేవ, ఉత్సవమూర్తులకు నిత్య తిరుకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర కై ంకర్యాలు గావించారు. సాయంత్రం ఆలయ ముఖమండపంలో స్వామివారి వెండి జోడు సేవలను ఊరేగించారు. వివిధ పూ జల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారికి రాత్రి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు. -
రెబల్స్‌తో ట్రబుల్స్!
సాక్షి,యాదాద్రి : ప్రధాన పార్టీలను రెబెల్స్ బెడద వెంటాడుతోంది. తొలి విడత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో చాలా చోట్ల అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ తరఫున నలుగురైదుగురు నామినేషన్ దాఖలు చేశారు. వారిలో కొందరు నామినేషన్ ఉపసంహరించుకోగా, మరికొందరు బరిలో ఉన్నారు. ఒకరి కంటే ఎక్కువ ఓట్లను చీల్చగలిగే తిరుగుబాటు అభ్యర్థులు ఉండటం ఆయా పార్టీలకు తలనొప్పిగా మారింది. ప్రచారంలో జోరు పెంచిన అభ్యర్థులు పల్లె పోరు వేడెక్కింది. తొలి విడత ఎన్నికలకు నేటి నుంచి ఆరు రోజులే సమయం ఉండటంతో అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. అనుచరులతో కలిసి ఇంటింటికి వెళ్లి తమ విజన్, సొంత మేనిఫెస్టోను వివరిస్తున్నారు. తమను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. మొదటి విడతలో ఆలేరు,యాదగిరిగుట్ట, తుర్కపల్లి, రాజాపేట, బొమ్మలరామారం, ఆత్మకూర్(ఎం) మండలాల్లోని 153 గ్రామ పంచాయతీలు, 1,286 వార్డు స్థానాలున్నాయి. ఇందులో 16 పంచాయతీలు, 243 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. అవి పోను 137 పంచాయతీలు, 1,040 వార్డులకు ఈనెల 11న ఎన్నికలు జరగనున్నాయి. ఆయా చోట్ల అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. బరి నుంచి తప్పుకోవడానికి ససేమిరా.. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్ తరఫున కొన్ని చోట్ల ఒకరి కంటే ఎక్కువ మంది బరిలో ఉన్నారు. వారంతా పోటీపడి జనంలోకి వెళ్తున్నారు. తామంటే తామే ప్రధాన అభ్యర్థులమంటూ ప్రచారం చేసుకోవడం ఆయా పార్టీలను ఆందోళనకు గురి చేస్తోంది. ప్రచారం నుంచి తప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నా ససేమిరా అంటున్నారు. పైగా కొందరు అభ్యర్థులు ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తిరిగి పార్టీలో చేరుతామని, పోటీ నుంచి మాత్రం ఉపసంహరించుకోబోమని స్పష్టం చేస్తున్నారు. పొత్తు కుదిరినా పోటీలో.. యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు, ఆలేరు మండలం శర్భనాపురం గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్, సీపీఎం పొత్తు అనుకున్నారు. ఆలేరు ఎమ్మెల్యే సమక్షంలో రెండుచోట్ల సీపీఎంకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. అయినా కాంగ్రెస్ తరఫున నామినేషన్ దాఖలు చేసిన పలువురు సానుభూతి పరులు తమ నామినేషన్ ఉపసంహరించుకోలేదు. పెద్దకందుకూరులో సీపీఎం, కాంగ్రెస్ మద్దతుదారులు పోటీలో ఉన్నారు. ఇక శర్బనాపురంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన బుగ్గ నవీన్‌కు బీజేపీ, సీపీఎం సీపీఐ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. ప్రధాన పార్టీల తరఫున ఒకరి కంటే ఎక్కువ మంది పోటీ ఫ తామే అసలైన అభ్యర్థులమంటూ ఎవరికి వారే ప్రచారం ఫ కాంగ్రెస్, బీఆర్ఎస్లో తలనొప్పులు ఫ విజయావకాశాలపై ప్రభావం ఫ రసవత్తరంగా పల్లె పోరుగ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌లో నెలకొన్న అసంతృప్తి ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. రాజాపేట మండలం సో మారం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులుగా శీలం జయంతి జగన్మోహన్రెడ్డి, గొలుసు అనూష, యాకుబ్ రెబెల్‌గా పోటీలో ఉన్నారు. బేగంపేట గ్రామ పంచాయతీలో జిల్ల బాలమణి భిక్షపతిగౌడ్. ఉస్తేపు జ్యోతికిరణ్, దూది వెంకటాపురంలో తుక్క ఏసుకుమార్, నడిమింటి నరేష్, ఎర్రోళ్లనరేష్, కొండ్రెడ్డిచెరువు పంచాయతీలో కర్రె శేఖర్, ఉప్పరి నరేష్. నమిల పంచాయతీలో పులి సత్యనారాయణ, పులిరాజు ఒకే పార్టీ తరఫున పోటీ పడుతున్నారు. యాదగిరిగుట్ట మండలం సైదాపురంలో కాల్నే సరిత, బత్తిని ధనలక్ష్మి, మల్లాపురంలో మంగ సత్యనారాయణ, కర్రె వీరయ్య, భూషాల్ల శ్రీనివాస్, చొల్లేరులో చిన్నం మమత, గడ్డమీది సంధ్య, మహబూబ్‌పేటలో ఆరె రమేష్, సామ వెంకటరెడ్డి.. వీరంతా కాంగ్రెస్ తరఫున పోటీలో ఉన్నారు. ఇక ఆలేరు మండలం రాఘవాపురం పంచాయతీలో బండ్ల శ్రీలత, తుంగ చంద్రకళ పోటీ చేస్తున్నారు. వీరిలో చంద్రకళ రెబెల్‌గా ఉన్నారు. తుర్కపల్లి మండలం గొల్లగూడెంలో కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులు ధారవత్ మల్లేష్, దారావత్ రమేష్ ఇద్దరూ సర్పంచ్‌గా బరిలో ఉన్నారు. బేగంపేటలో మంత్రాల అనూష సుమన్, గుండుకృప ప్రశాంత్, శర్బనాపురం గ్రామ పంచాయతీలో మొగులుగాని నరసయ్య, కందుల యాదమల్లయ్య పోటీ పడుతున్నారు. ఆత్మకూరు(ఎం) మండలం మోదుగుకుంటలో బీఆర్ఎస్ నుంచి సోలిపురం ఎల్లారెడ్డి, కాంగ్రెస్ నుంచి మామిడి మోహన్‌రెడ్డి నామినేషన్ వేశారు. రెండు రోజుల క్రితం బీఆర్ఎస్ అభ్యర్థి సోలిపురం ఎల్లారెడ్డిని ఎమ్మెల్యే వద్దకు తీసుకెళ్లి కాంగ్రెస్ కండువా కప్పించుకొని ఏకగ్రీవం చేద్దామని కాంగ్రెస్ అభ్యర్థి మామిడి మోహన్‌రెడ్డి ఉపసంహరణ పత్రాలపై సంతకాలు చేయించారు. అనంతరం గ్రామానికి వచ్చిన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి మామిడి మోహన్‌రెడ్డి ఉపసంహరణ చేయకపోవడంతో ఆ గ్రామం నుంచి ఒకే పార్టీ నుంచి ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు. మల్లాపురంలో, బీఆర్ఎస్ తరఫున కర్రె వెంకటయ్య, పల్లెపాటి మాధవి, మాసాయిపేటలో వాకిటి కిష్టయ్య, బుడిగే గౌతమి, పెద్ద కందుకూరులో మాజీ ఎంపీపీ గడ్డమీది స్వప్న, గుండ్లపల్లి మంగమ్మలు, బొమ్మలరామారం మండలం మర్యాల పంచాయతీలో సంగి రాజు, సందెగళ్ల పెద్దులు బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ పడుతున్నారు. -
మొదట శాసనసభకు.. తర్వాత సర్పంచ్‌గా
ఫ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసి సర్పంచ్‌గా ఎన్నికమోతె : ఎమ్మెల్యేగా నాలుగుసార్లు, సర్పంచ్‌గా ఒకసారి ఎన్నికై నా.. కుటుంబ పోషణకు కులవృత్తిని నమ్ముకున్న ఆదర్శ నేత ఉప్పల మల్సూర్. సూర్యాపేట జిల్లా మోతె మండలం సిరికొండ గ్రామానికి చెందిన ఉప్పల మల్సూర్ చిన్ననాటి నుంచే కమ్యూనిస్టు ఉద్యమాల్లో పాల్గొన్నారు. 20 ఏళ్ల వయసులోనే ప్రజా ఉద్యమాలు నిర్వహించారు. 1952లో జరిగిన తొలి శాసనసభ ఎన్నికల్లో సీడీపీ, సీపీఎం అభ్యర్థిగా సూర్యాపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి నుంచి 1972 వరకు ఏకధాటిగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత తన స్వగ్రామమైన సిరికొండలో కులవృత్తి అయిన చెప్పులు కుట్టే పనిచేస్తూ జీవనం సాగించారు. 1995లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామస్తులంతా ఏకమై ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు ప్రతిపాదించారు. కానీ సీపీఎంపై ఉన్న అభిమానంతో ఆ పార్టీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశారు. కాంగ్రెస్ మద్దతుతో బరిలో నిలిచిన వ్యక్తిపై 700 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సర్పంచ్‌గా పదవిలో ఉండగానే 1999లో ఆయన అనారోగ్యంతో మృతి చెందారు. -
మూడో విడతకు నేడు ఆఖరు
ఫ రెండో రోజు సర్పంచ్‌కు 147, వార్డులకు 641 సాక్షి,యాదాద్రి : మూడవ విడత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో రెండో రోజు గురువారం నామినేషన్లు వెల్లువెత్తాయి. సర్పంచ్‌కు 147, వార్డు స్థానాలకు 641 మంది నామినేషన్ వేశారు. రెండు రోజుల్లో కలిపి సర్పంచ్‌కు 281, వార్డులకు 888 నామినేషన్లు పడ్డాయి. ఈ విడతలో భువనగిరి, చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని చౌటుప్పల్, సంస్థాన్‌నారాయణపురం, మోత్కూరు, అడ్డగూడూరు, మోటకొండూరు, గుండాల మండలాల్లో 124 పంచాయతీలు, 1,086 వార్డులకు డిసెంబర్ 17న పోలింగ్ జరగనుంది. మూడో విడత నామినేషన్ల ఘట్టం శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. రెండో రోజు దాఖలైనవి.. మండలం జీపీలు నామినేషన్లు అడ్డగూడూరు 17 10 చౌటుప్పుల్ 26 36 గుండాల 20 24 మోటకొండూరు 20 28 మోత్కూరు 10 14 నారాయణపురం 31 35 మొత్తం 124 147 వార్డు సభ్యుల స్థానాలకు మండలం వార్డులు నామినేషన్లు అడ్డగూడూరు 150 55 చౌటుప్పుల్ 236 187 గుండాల 182 101 మోటకొండూరు 170 103 మోత్కూరు 88 60 నారాయణపురం 260 135 మొత్తం 1,086 641 -
ఓటేసిపోండి
అన్నా ఊరికి రండి..తిరుమలగిరి (తుంగతుర్తి) : మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్న గ్రామాల్లో సర్పంచ్, వార్డు స్థానాల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు వలస ఓటర్లపై దృష్టి పెట్టారు. ఓటర్లకు ఫోన్లు చేయడమే కాకుండా ప్రసన్నం చేసుకోవడానికి పట్నం బాట పట్టారు. వారిని పోలింగ్ రోజున రప్పించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎవరెవరు వలస వెళ్లారు.. ఎక్కడెక్కడ ఉంటున్నారు.. ఈనెల 11న సూర్యాపేట జిల్లాలోని ఎనిమిది మండలాల్లో గల 159 గ్రామాలు, 1,442 వార్డులు, యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆరు మండలాల్లో గల 153 పంచాయతీలు, 1286 వార్డులు, నల్లగొండ జిల్లాలోని 14 మండలాల్లో గల 318 పంచాయతీలు, 2870 వార్డులకు తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఆయా గ్రామాల్లోని వారు ఉపాధి కోసం హైదరాబాద్, నిజామాబాద్, విజయవాడ, ముంబయి తదితర ప్రాంతాలకు వెళ్లారు. బరిలో నిలిచిన అభ్యర్థులు ఓటరు లిస్టు దగ్గర పెట్టుకొని ఎవరెవరు వలస వెళ్లారు. ఎక్కడెక్కడ ఉంటున్నారు. వారి ఫోన్‌నంబర్లు తెలుకొని వారిని కలిసేందుకు వెళ్తున్నారు. మీరు వస్తారా? లేదా డబ్బులు పంపమంటారా అనే విషయాలు అడిగి తెలుసుకుంటున్నారు. వాహనాలు ఏర్పాటు చేసుకొని వచ్చి ఓటేసి వెంటనే వెళ్లిపోతామని అందుకు అయ్యే ఖర్చులు భరించాలని కొందరు ఓటర్లు చెబుతున్నట్లు సమాచారం. వారే కీలకం.. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడం, పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రకటించడంతో గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి మరింత వేడెక్కింది. అభ్యర్థుల ఇళ్లలో పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఓటర్లు ఎక్కడెక్కడ ఉన్నారనే సమాచార జాబితాను తయారు చేసి తమ వైపునకు తిప్పుకునేందుకు రూట్ల వారీగా ఒక్కో నాయకునికి బాధ్యతలు అప్పగిస్తున్నారు. హైదరాబాద్, భీమండి, నిజామాబాద్, విజయవాడ తదితర ప్రాంతాల్లో ఉన్న గ్రామ ఓటర్లను తీసుకువచ్చేందుకు ప్రత్యేక ట్రావెల్ బస్సులు, కార్లను ముందస్తుగా బుక్ చేస్తున్నారు. పోలింగ్ రోజున సుదూర ప్రాంతాల నుంచి ఓటర్లను తీసుకొచ్చి వాహనాలు ఆలస్యం కాకుండా ముందస్తు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు. ఓటింగ్ రోజు తప్పకుండా గ్రామానికి వచ్చి, తమకు ఓటు వేయాలని మెసేజ్‌లు పంపించి వేడుకుంటున్నారు. పలు గ్రామాలకు చెందిన నాయకులు ఇప్పటికే పట్నం బయలుదేరి ఊరి ఓటర్లు ఉన్న కాలనీలకు వెళ్లి సమావేశాలు ఏర్పాటు చేసి వారి మనస్సు గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరికొంత మంది అభ్యర్థులు ఓటర్లను వ్యక్తిగతంగా కలిసి మద్దతు కోరుతున్నారు. ఫ వలస ఓటర్లకు గాలం వేస్తున్న అభ్యర్థులు ఫ ప్రతి ఓటు కీలకం కావడంతో ఫోన్లు చేసి నజరానాల ప్రకటన ఫ వారిని ప్రసన్నం చేసుకునేందుకు పట్నం బాట ఓటర్లను ఆకర్షించేందుకు విందులు గ్రామాల్లో ఓటర్లను ఆకట్టుకునే విధంగా విందు రాజకీయాలకు తెరలేపుతున్నారు. పట్నంలో ఉండే ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు అక్కడికి వెళ్లి దావత్‌లు సైతం ఇస్తున్నారు. ఒక్కో ఏరియాకు ఇన్చార్జిలను నియమించి పోలింగ్ రోజు తీసుకొచ్చే బాధ్యతను కూడా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో మినీ దావత్‌లు నడుస్తుండగా మరో రెండు రోజుల్లో విందులు మొదలు కానున్నాయి. -
గ్లోబల్ సమ్మిట్‌కు సూర్యాపేట వాసి
● పేరిణి నృత్య కళాకారుడు రాజ్‌కుమార్ బృందానికి ఆహ్వానంసూర్యాపేటటౌన్ : రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో ఈ నెల 8, 9వ తేదీల్లో తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి ప్రతినిధులు రానున్నారు. సమ్మిట్ ప్రారంభోత్సవానికి ముందు పేరిణి నాట్యం ద్వారా స్వాగతం పలికేందుకు సూర్యాపేటకు చెందిన డ్యాన్స్ మాస్టర్ పేరిణి రాజ్‌కుమార్‌కు ఆహ్వానం అందింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద కంపెనీల సీఈఓలు నెల 7వ తేదీన సాయంత్రం శిల్పారామానికి రానుండడంతో వారికి పేరిణి నాట్యంతో స్వాగతం పలకనున్నట్లు పేరిణి రాజ్‌కుమార్ తెలిపారు. 8న గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి స్వాగతంతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జాతీయ రహదారిపై తనిఖీలు ముమ్మరంచౌటుప్పల్ రూరల్: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జాతీయ రహదారిపై పోలీసులు వాహనాల తనిఖీ ముమ్మరం చేశారు. చౌటుప్పల్ మండల పరిధిలో పంతంగి టోల్‌ప్లాజా వద్ద, తుప్రాన్‌పేట గ్రామ శివారులో పోలీసులు చెక్‌పోస్ట్ ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రచార వాహనం సీజ్యాదగిరిగుట్ట రూరల్ : గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో యాదగిరిగుట్ట మండలంలోని మల్లాపురం గ్రామ శివారులో గురువారం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. మల్లాపురం బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి కర్రె వెంకటయ్య ప్రచార వాహనాన్ని పోలీసులు తనిఖీ చేయగా అందులో కర్రె లింగస్వామి అక్రమంగా మద్యం తరలిస్తున్నట్లు గుర్తించారు. మద్యంతోపాటు, వాహనాన్ని సీజ్ చేసి, వారిపై కేసు నమోదు చేసినట్లు యాదగిరిగుట్ట సీఐ భాస్కర్ తెలిపారు. -
నామినేషన్ రుసుముగా రూపాయి నాణేలు
గరిడేపల్లి: సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం సర్వారం గ్రామ సర్పంచ్ అభ్యర్థి బుడిగె పుల్లమ్మ గ్రామస్తుల నుంచి సేకరించిన రూపాయి నాణేలతో రూ.1001 రుసుము చెల్లించి గురువారం నామినేషన్ వేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేద కుటుంబానికి చెందిన తాను పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేయడానికి కొన్ని రోజులుగా స్థానికుల వద్ద రూపాయి నాణేలను సేకరించి భద్రపర్చుకొని నామినేషన్ వేసినట్లు తెలిపారు. గ్రామంలో కొన్ని సంవత్సరాలుగా తన కుమారుడు రమేష్ గ్రామస్తుల ద్వారా, వాట్సాప్ గ్రూప్‌ల సాయంతో డబ్బులు సేకరించి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఆమె పేర్కొన్నారు. -
కిక్కిరిసిన బ్యాంకులు
చౌటుప్పల్ : సర్పంచ్‌గా పోటీ చేసే వారు తప్పనిసరిగా ప్రత్యేక బ్యాంకు ఖాతా కల్గి ఉండాలనే నిబంధన ఉండడంతో ఖాతా తెరిచేందుకు ఆశావహులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో బ్యాంకులు రద్దీగా మారాయి. జాతీయ బ్యాంకులలో ఖాతా తెరిచేందుకు ఎక్కువ సమయం పడుతుండడంతో ఆశావహులు ఎక్కువగా సహకార బ్యాంకులకు క్యూ కడుతున్నారు. చౌటుప్పల్ మండలంలోని మల్కాపురం, కొయ్యలగూడెం, పంతంగి గ్రామాల్లో మాత్రమే బ్యాంకులు అందుబాటులో ఉన్నాయి. బ్యాంకు సౌకర్యం లేని గ్రామాలకు చెందిన నాయకులు చౌటుప్పల్ మండల కేంద్రానికి వచ్చి ఖాతాలు తెరుస్తున్నారు. -
కేసుల పరిష్కారానికి చొరవ చూపాలి
భువనగిరిటౌన్ : జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చొరవ చూపాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మాధవిలత సూచించారు. ఈనెల 21న జాతీయ లోక్ అదాలత్ నేపథ్యంలో భువనగిరి కోర్టు కానిస్టేబుల్స్‌తో బుధవారం ఏర్పా టు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాజీపడదగిన కేసులను గుర్తించడంతో పాటు కక్షిదారులతో మాట్లాడి లోక్ అదాలత్‌లో పరి ష్కరించుకునేందుకు ముందుకు వచ్చేలా కృషి చేయాలని కోరారు. కరప్రతాల ద్వారా లోక్‌అదాలత్‌పై విస్తృత ప్రచారం చేయాలన్నారు. మానసిక వికలాంగులకు ఉచిత న్యాయ సేవలు భువనగిరి: మానసికంగా, వైకల్యంతో బాధపడే వారికోసం అనేక చట్టాలున్నాయని, న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచిత న్యాయసేవలు అందించనున్నట్లు న్యాయ సేవాధికారి సంస్థ ప్రధాన కార్యదర్శి మాధవిలత పేర్కొన్నారు. దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా బుధవారం భువనగిరి మండలం రాయగిరి వద్ద ఉన్న సహృదయ వయోవృద్ధుల అనాథ అశ్రమంలో నిర్వహించిన వైద్య శిబిరంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మానసిక వికలాంగులకు చట్టపరంగా అందాల్సిన సేవలను వర్తింపజేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో సీడబ్ల్యూసీ చైర్మన్ బండారు జయశ్రీ, రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా వైస్‌చైర్మన్ దిడ్డి బాలాజీ, డైరెక్టర్ జంపాల అంజయ్య, పట్టణ డైరెక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ జయశ్రీ, సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయికి జలాల్పూర్ జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు బొమ్మలరామారం: మండలంలోని జలా ల్పూర్ జెడ్పీ హైస్కూ ల్కు చెందిన ముగ్గు రు విద్యార్థులు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. నవంబర్ 25న సూర్యాపేట జిల్లా చింతలపాలెంలో జరిగిన ఉమ్మడి జిల్లాస్థాయి ఎస్జీఎఫ్ (స్కూల్ గేమ్స్ ఫెడరేషన్) పోటీల్లో సాఫ్ట్‌బాల్ క్రీడలో ఉత్తమ ప్రదర్శన కనబరిచారు. అండర్–14 బాలుర విభాగంలో గజ్జెల్లి లోకేష్, బాలికల విభాగంలో గజ్జెల్లి ప్రణవి, అండర్–17లో జాగిల్లపురం మహేందర్ ఎంపికయ్యారు. 7న సాయుధ దళాల పతాక దినోత్సవం నల్లగొండ టూటౌన్ : సాయుద దళాల పతాక దినోత్సవాన్ని ఈ నెల 7వ తేదీన నిర్వహించనున్నట్లు ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన నాటి నుంచి యుద్ధంలో గాయపడిన, వీరమరణం పొందిన వారికి ఆర్థిక సాయం అందించడం కోసం విరాళాల సేకరణ చేపట్టినట్లు పేర్కొన్నారు. -
పాఠం, వంట ఇక్కడే!
ఫ తుర్కపల్లి మండల పాఠశాలల్లో గదుల కొరత ఫ ఒకే గది, ఐదు తరగతులు ఫ బోధనకు అంతరాయం తుర్కపల్లి: ఉన్నది ఒక్క గది.. అక్కడే వంట, సరుకులు నిలువ, ఆఫీస్ నిర్వహణ, పాఠాలు వినాల్సిన దుస్థితి. తుర్కపల్లి మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు పడుతున్న ఇక్కట్లు అన్నీఇన్నీ కావు. దాదాపు పది పాఠశాలల్లో గదుల కొరత వెంటాడుతోంది. ఒకటి, రెండు గదులకు మించి లేకపోవడంతో బోధనకు అంతరాయం ఏర్పడుతోంది. చౌక్లతండా, బాబ్లనాయక్తండా, సంగ్యాతండా, జేతిరాంతండా, వాసాలమర్రి, వీరారెడ్డిపల్లి, గంధమల్ల, మోతిరాంతండా, గడ్డతండా, జగ్గారెడ్డికుంట, కోనాపూర్, బద్దుతండాలో ప్రాథమిక పాఠశాలల్లో 1నుంచి 5వరకు తరగతులు ఉన్నాయి. వరండాలో పాఠాలు ఆయా పాఠశాలల్లో గదుల కొరత వల్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల ఒక్కగానొక్క గదిలో మూడు తరగతులు, వరండాలో రెండు తరగతులకు బోధన చేస్తున్నారు. చిన్న పిల్లల అల్లరితో పెద్ద తరగతుల విద్యార్థులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొన్నది. చదువుపై ఏకాగ్రత కోల్పోవాల్సి వస్తుంది. సింగిల్ తరగతి గదులు ఉన్న పాఠశాలలో అదనపు తరగతి గదులు నిర్మించి సమస్యను పరిష్కరించాలని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
వైకల్యం శరీరానికే.. మనసుకు కాదు
భువనగిరిటౌన్ : వైకల్యం శరీరానికే కానీ, మనసుకు సంబంధించింది కాదని.. ఆత్మస్థైర్యంతో చదివితే ఉన్నత స్థాయిలో ఉంటారని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు. అదనపు కలెక్టర్ భాస్కర్‌రావుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ఉచిత సేవలు అందజేస్తున్నాయన్నారు. ఉచిత ట్రై సైకిళ్లు, బ్యాటరీ సైకిళ్లు, ఉపకరణాలు, ఫిజియోథెరపీ తదితర సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ భాస్కరరావు మాట్లాడుతూ.. జిల్లాలో 12,626 మంది దివ్యాంగులు ఉన్నారని, వారికి ప్రతి నెలా రూ.5 కోటకు పైగా పింఛన్ 5 కోట్ల పైగా ఇస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగుల సామర్థ్యాన్ని బట్టి ఉపాధిహామీ పనులు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం క్రీడాపోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. దివ్యాంగుల కమిటీ సభ్యులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, డీఆర్డీఓ నాగిరెడ్డి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి నరసింహారావు, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ పాండునాయక్. మెప్మా అధికారి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ హనుమంతరావు -
హిందూ దేవుళ్లపై సీఎం వ్యాఖ్యలు హేయం
భువనగిరి: హిందూ దేవుళ్లపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసనగా బుధవారం భువనగిరిలో బీజేపీ పట్టణ కమిటీ అధ్యక్షుడు రత్నపురం బలరాం ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్ మాట్లాడుతూ.. సీఎం చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. ఉన్నతమైన హోదాలో ఉన్న వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు పోతంశెట్టి రవీందర్, కిసాన్‌మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్రెడ్డి, సుర్వి శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్మాఽయ దశరథ, నాయకులు కోళ్ల భిక్షపతి, లక్ష్మీనారాయణ, నర్సింహారావు, నల్లమాస వెంకటేశ్వర్లు, రాళ్లబండి కృష్ణాచారి, ఉడుత భాస్కర్, సతీష్, వెంకటేష్, మల్లికార్జున్ పాల్గొన్నారు. -
‘మొదటి’ లెక్క తేలింది..
సర్పంచ్ బరిలో 568, వార్డు స్థానాలకు 2,899 మంది పోటీసాక్షి యాదాద్రి : గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో మరో అంకం పూర్తయ్యింది. తొలి విడత బరిలో నిలిచే అభ్యర్థుల లెక్క తేలింది. బుధవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో తుది పోరులో తలపడే అభ్యర్థుల జాబి తాను ఎన్నికల అధికారులు ప్రకటించారు. సర్పంచ్ స్థానాల్లో 130, వార్డు స్థానాల్లో 168 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో రిటర్నింగ్ అధికారులు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాన పార్టీల మద్దతుదారులు.. గురువారం నుంచి మరింత వేడెక్కించనున్నారు. పోటీలో మిగిలిన అభ్యర్థులు.. తొలి విడతలో తుర్కపల్లి, రాజాపేట, ఆలేరు, యాదగిరిగుట్ట, బొమ్మలరామారం, ఆత్మకూర్(ఎం) మండలాల్లోని 153 గ్రామ పంచాయతీలు, 1,284 వార్డు స్థానాలకు డిసెంబర్ 11న ఎన్నికలు జరగనున్నాయి. 153 పంచాయతీల్లో 10 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. 698 మంది నామినేషన్ వేయగా, ఇందులో 130 మంది ఉపంహరించుకున్నారు. దీంతో 143 సర్పంచ్ పదవులకు 568 మంది పోటీ పడుతున్నారు. ఇక 1,284 వార్డులకు గాను 191 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 1,094 వార్డు స్థానాలకు 3,067 మంది నామినేషన్ వేయగా.. అందులో 168 మంది విత్‌డ్రా చేసుకున్నారు. 2,899 మంది పోటీలో మిగిలారు. ఇక ప్రచార జోరు మొదటి విడత ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించిన అభ్యర్థులు.. జోరు పెంచనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఓటర్లను ఎలాగైనా తమ వైపు తిప్పుకునేందుకు ప్రణాళికలు అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ఓటర్ల లెక్కలు తీసే పనిలో అభ్యర్థులు, వారి అనుచరులు నిమగ్నమయ్యారు. అనుకూలురు, వ్యతిరేకులు, నూట్రల్స్ ఎవరో లెక్కలు తీస్తున్నారు. అంతేకాకుండా గ్రామ అభివృద్ధికి తాము ఏం చేయదలుచుకున్నారో రూపొందించిన సొంత మేనిఫెస్టోలను ఓటర్లకు వివరించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే పలువురు అభ్యర్థులు కరపత్రాలు, సోషల్ మీడియా ద్వారా సొంత మేనిఫెస్టెలను ప్రకటించారు. వాల్‌పోస్టర్లు, డోర్ పోస్టర్లు, బ్యానర్లు తయారు చేయించారు. కొందరు ప్రత్యేకంగా ప్రచార వాహనాలను సిద్ధం చేసుకున్నారు.ఎన్నికల్లో గెలవాలంటే ప్రతి ఓటూ కీలకమే. పలుచోట్ల అభ్యర్థుల గెలుపోటములను ప్రభావం చూపే స్థాయిలో వలస ఓటర్లు ఉన్నారు. వారిపై అభ్యర్థులు, వారి అనుచరులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా నుంచి జీవనోపాధి కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్లను గుర్తించి.. పోలింగ్‌రోజున తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలతో పాటు చైన్నె, సూరత్, మహారాష్ట్రకు ప్రజలు వలస వెళ్లారు. వారంతా ప్రతి ఎన్నికల్లో సొంతూళ్లకు వచ్చి ఓట్లు వేస్తుంటారు. అభ్యర్థులు ఈ ఓటర్లను గుర్తించి, వారికి ఫోన్లు చేసి ప్రసన్నం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రానుపోను రవాణా చార్జీలు, భోజనం ఇతరత్రా వాటికి లెక్కకట్టి ఫోన్ పే, గూగుల్ పే ద్వారా ముందస్తుగానే చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామ పంచాయతీలు 153 ఫ ముగిసిన తొలి విడత నామినేషన్ల ఉపసంహరణ ఫ అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు ఫ నేటి నుంచి వేడెక్కనున్న ప్రచారం బరిలో మిగిలింది వీరే వార్డు స్థానాలు 1,284 191 1,094 3,0671682,899 10 ఏకగ్రీవం 143 ఎన్నికలు జరిగేవి 698 నామినేషన్లు 130 విత్‌డ్రా 568 పోటీలో ఉన్నది -
శ్రీకాంతాచారి త్యాగం మరువలేనిది
భువనగిరి : తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతిని బుధవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భువనగిరిలోని అమరవీరుల స్మారకస్థూపం వద్ద ఏర్పాటు చేసిన శ్రీకాంతాచారి చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పైళ్ల శేఖర్‌రెడ్డి, పలువురు నాయకులు మాట్లాడు తూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను అర్పించిన శ్రీకాంతాచారి త్యాగం ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. శ్రీకాంతాచారి త్యాగం వల్ల స్వరాష్ట్ర ఉద్యమం ఉధృతం దాల్చిందన్నారు. ఆయన ఆశయాలను సాకారం చేయాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణవాదిపై ఉందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఏవీ కిరణ్‌కుమార్, రచ్చ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ పెంట నర్సింహ్మ, మాజీ కౌన్సిలర్ అజీమోద్దీన్, నాయకులు ఇట్టబోయిన గోపాల్, కర్తాల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
యాదగిరీశుడికి సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: పంచనారసింహుడి క్షేత్రంలో బుధవారం సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వేకువజామున స్వామి, అమ్మవారికి సుప్రభాత సేవ చేపట్టి, గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను నిజాభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ఆలయ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహనసేవ, ఉత్సవమూర్తులకు నిత్య తిరుకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర నిత్యారాధనలు జరిపించారు. ఇక ఆలయ ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు చేశారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు. -
క్రీడాకారులు దేశం గర్వించేలా రాణించాలి
హాలియా : క్రీడాకారులు దేశం గర్వించేలా రాణించాలని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో హాలియా పట్టణంలోని టైం స్కూల్లో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న 51వ అంతర్ జిల్లాల రాష్ట్రస్థాయి అండర్– 20 బాలికల కబడ్డీ పోటీలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయి బాలికల కబడ్డీ పోటీలు ఈ ప్రాంతంలో నిర్వహించడం గర్వించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కాసాని వీరేష్ ముదిరాజ్, మద్ది మహేందర్‌రెడ్డి, జిల్లా అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు భూలోకరావు, కర్తయ్య, హాలియా మార్కెట్ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కుందూరు వెంకట్‌రెడ్డి, నాయకులు కాకునూరి నారాయణ గౌడ్, టైం స్కూల్ డైరెక్టర్ మందా నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి -
ఎవల్ నిలబడుతుండ్రే..
మల్లయ్య తాత గజగజ వణికే చలిలో పొద్దుగాల లేచి నెత్తికి రుమాలు సుట్టుకొని, కంబళి కప్పుకొని, నోట్లో యాప పుల్లేసుకొని పండ్లు తోముకుంటూ చేతిలో కర్రతో నిమ్మలంగా నడుసుకుంటూ పోయి నడూళ్ల గుడిబండ కాడ కూకుండు. చిత్తుకాగితాలు ఏరి కుప్పగాపోసి కీస నుంచి అగ్గిపెట్టెగీరి చలిమంటకాగుతున్నడు. ఇంతలో అట్నుంచి పోతున్న నర్సయ్యను చూసి ఏమోయ్.. మనవడా గిట్రా అని పిలిచిండు. నర్సయ్య.. మల్లయ్య తాత దగ్గరికొచ్చి కూసుండు. అప్పుడు.. మల్లయ్య తాత : ఏమోయ్ మనవడా గిప్పుడు ఓట్ల పండ్గొచ్చిందిగా మనూళ్లె పెసిడెంట్గా ఎవలెవలు నిలబడ్తరంట నర్సయ్య : యాద్గిరి కొడ్కు నవీన్ లేడు ఎలచ్చన్ల నిలబడ్తడంట.. గా పిల్గాడు పట్నంల బాగా సదువుకుండంట. పిల్గాడు మంచోడేనంట మల్లయ్య : పుల్లయ్య కొడుకు సోమయ్యగూడా పోటీజేత్తడంట. గియ్యాల నామినేషన్ ఏస్తడంట. గా పిల్గాని దగ్గర పైసల్ మస్తుగున్నయంట. ఖర్చు బానే పెడ్తడంట. ఇంతలో.. అట్నుంచి పోతున్న వెంకన్న.. గుడిబండకాడ కూకున్న మల్లయ్య, నర్సయ్యలను చూసి దగ్గరికి వచ్చి కూకుండు.వెంకన్న : పొద్దుపొద్దుగాల ఇద్దరూ తీర్బాటంగా కూకున్నరేందే.. మల్లయ్య : ఏం లేదు మనవడా గీ ఎలచ్చన్ల గురించి ముచ్చట బెట్టుకుంటున్నం వెంకన్న : తాతా.. పట్నంల ఉంటున్న మనూరి చంద్రయ్యసార్ గూడా పోటీజేత్తడంటగా మల్లయ్య : సార్ గిప్పుడు కొలువు జేత్తలేడానే వెంకన్న : జేత్తలేడే ఎన్నడో దిగిపోయిండు. గా సార్ గూడా మంచోడేనే. ఇంతలోనే సుట్ట కాల్చుకుంటూ రామయ్య గూడా వాళ్ల దగ్గరికొచ్చి కూకొని మాటళ్లమాట గలిపిండు. రామయ్య : గా సంజీవ గూడా నిలబడ్తడంట . మల్లయ్య : గాయనకు ముగ్గురు పిల్లలుగా.. ఎట్ల నిలబడ్తడు వెంకన్న : గిప్పుడు అదిలేదే ..ముగ్గురు పిల్లలున్నా నిలబడొచ్చు. ఎవలు నిలబడ్తేందే.. ఊరిని బాగుచేసేటోడు కావాలే. మలయ్య: అవునోయ్ మనవడా.. రామయ్య: అవునవును.. వెంకన్న: ఈ ఎలచ్చన్ల ఏమైతదో సూద్దాం మరి. మల్లయ్య తాతా.. నేను ఐకేపీ కేంద్రం కాడికి బోతనే .. వడ్లు పోసి రెండ్రోజులైతంది . గియ్యాల నా సీరియల్ వత్తదే. గా వడ్లు అమ్మాలే. మల్లయ్య : సరేపో మనవడా నర్సయ్య : నేను గూడ పోత బర్రెకు పాలుపిండాలే మల్లయ్య : సరే నేను గూడ ఇంటికిబోత మల్లయ్యతాత నోట్లో ఉన్న యాపపుల్లను తీసి పక్కన బడేసి ఇంటిబాట పట్టిండు.. రామయ్య కూడా సుట్ట పీల్చుకుంటూ ఎళ్లిపోయిండు. – నల్లగొండ డెస్క్ -
పల్లెల్లో స్మార్ట్ ప్రచారం
హాలియా : గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంలో గ్రామాల్లో రచ్చబండ వద్ద స్థానికులు సమావేశమై సమస్యలు, అభివృద్ధితో పాటు ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై మాట్లాడుకునే వారు. పోటీ చేసే వారు సైతం రచ్చబండ వద్దకే వచ్చి తమ అజెండా, హామీలను వివరించేవారు. కానీ ఇప్పుడు అందరూ సోషల్ మీడియానే ఎంచుకుంటున్నారు. ఎలాంటి అభ్యర్థిని ఎన్నుకోవాలి, ప్రధాన సమస్యలేమిటనే విషయాన్ని కూడా గ్రామ వాట్సాప్ గ్రూపుల్లోనే చర్చిస్తున్నారు. అభ్యర్థులు తమ అజెండాను స్థానిక గ్రూపుల్లో పోస్ట్ చేస్తూ, ఫోన్లో స్టేటస్ ద్వారా ప్రజలకు చేరవేస్తున్నారు. భువనగిరి : గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు స్మార్ట్ఫోన్లతో ప్రచారంలో కొత్త పుంతలు తొక్కుతున్నారు. గతంలో కరపత్రాలు, వాల్‌పోస్టర్లు, వాల్పెయింటింగ్తో ప్రచారం నిర్వహించేవారు. ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను ఇస్తూ వాల్‌పోస్టర్లను గోడలకు అతికించేవారు. కానీ ఇప్పుడు సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యుల పోటీదారులు సోషల్ మీడియానే ప్రధాన ప్రచారాస్త్రంగా మార్చుకుంటున్నారు. వాట్సాప్‌లో పోస్టులు గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే కొంత మంది ఆశావహులు తాము ఈ సారి ఎన్నికల బరిలో ఉంటున్నామంటూ సోషల్‌మీడియా వేదికగా ప్రచారం మొదలు పెట్టారు. ఇక నోటిఫికేషన్ రాగానే విస్తృతంగా ప్రచారాన్ని ప్రారంభించారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్‌లో నిత్యం పోస్టులు పెడుతూ ప్రచారం ముమ్మురం చేస్తున్నారు. గ్రామానికి చెందిన ఓటర్ల ఫోన్ నంబర్లను తెలుసుకుని ప్రతిరోజూ ప్రచారం వీడియోలను, తమకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్న పోటోలను పంపిస్తున్నారు. తాము గెలిస్తే ఏం చేస్తారో ఆ విషయాన్ని కూడా పోస్టుల ద్వారా షేర్ చేస్తున్నారు. తమ కుల సంఘాల వారికి ఫోన్లు చేస్తూ తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. స్టేటస్‌గా ప్రచార వీడియోలు సర్పంచ్, వార్డు సభ్యుల పోటీదారులు తమను గెలిపించాలని కోరుతున్న వీడియోలను తమ అనుచరుల ఫోన్లలో స్టేటస్ పెట్టుకొని మరీ ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం యువకులు ప్రతి గ్రామానికి ఒక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేయగా ఆయా గ్రామాల గ్రూపులలో వీడియోలు షేర్ చేస్తున్నారు. ఇప్పటి వరకు గ్రామంలో తాము చేసిన సేవలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఎడిట్ చేసి వాటికి బ్యాగ్గ్రౌడ్ పాటలను సెట్ చేసి మరీ పంపిస్తున్నారు. మరి కొందరు అభ్యర్థులు ఇప్పటికే తమ పేరు మీద ప్రత్యేకంగా పాటలను రాయించుకొని మరీ ప్రచారంలోకి దిగారు. ఓటర్లను ఆకట్టుకునేలా సోషల్ మీడియాలో నిత్యం పోస్టులు పెడుతున్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల వరకు కొంత మంది యువకులతో కమిటీ వేసి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఫ సోషల్‌మీడియా ద్వారా ప్రచారం చేస్తున్న అభ్యర్థులు ఫ పంచాయతీలు, వార్డుల వారీగా వాట్సాప్ గ్రూపులు ఫ తమను గెలిపించాలంటూ పోస్టులు, వీడియోలు -
నాడు సర్పంచ్.. నేడు కూలీ
అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం కాసర్లపహాడ్ గ్రామానికి ఐదేళ్లు సర్పంచ్‌గా పనిచేసిన మాదగాని నాగమ్మ ప్రస్తుతం వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తోంది. తన హయాంలో గ్రామంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టారు. అయినా రూపాయి కూడా సొంతానికి వినియోగించుకోకుండా నిధులను గ్రామానికే ఖర్చు చేశారు. కాసర్లపహాడ్ సర్పంచ్ మాదగాని నాగమ్మది నిరుపేద కుటుంబం. 2014లో ఆమెను గ్రామస్తులు సర్పంచ్‌గా నిలబెట్టించి మరీ గెలిపించారు. 2019 వరకు ఐదేళ్లు సర్పంచ్‌గా పనిచేశారు. నిరక్షరాస్యురాలైనప్పటికీ ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను సక్రమంగా ఖర్చు చేస్తూ గ్రామంలో సీసీ రోడ్లు, వాటర్ ప్లాంట్, పల్లె దవాఖాన, బోర్లు పైప్‌లైన్ నిర్మాణం చేయించారు. సర్పంచ్ కాకముందుకు ఉన్న పాత రేకుల ఇంట్లోనే నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం జీవనోపాధి కోసం ఉపాధి పనులతో కూలీగా పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న వితంతు పింఛన్‌తో కాలం వెల్లదీస్తున్నారు. -
హామీ పత్రం
తుర్కపల్లి : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజల విశ్వాసం పొందేందుకు అభ్యర్థులు కొత్త పోకడలను అనుసరిస్తున్నారు. తుర్కపల్లి మండలంలోని రుస్తాపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కొండాపురం శ్రీహరికుమార్ తాను గెలిస్తే చేసే పనులను బాండ్ పేపర్‌పై రాసి ప్రజలకు దాని ప్రతులు అందిస్తున్నారు. ప్రజ లకు ఉచిత మంచినీటిసరఫరా, బస్టాప్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఆరోగ్య కేంద్రం, పశువుల దవాఖాన నిర్మాణంతో పాటు 15 అంశాలతో కూడిన హామీ పత్రాన్ని విడుదల చేశాడు. ఈ పనులను 2.5 సంవత్సరాల్లో పూర్తి చేస్తానంటూ ప్రకటించిన హామీ పత్రాన్ని ప్రచురించి ప్రజలకు అందిస్తున్నాడు. -
కాంగ్రెస్ మంత్రులు స్పృహలో లేరు
సూర్యాపేట : కాంగ్రెస్ మంత్రులు స్పృహలో లేరని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ తెలంగాణ ప్రజలను అవమాన పరిచేలా మాట్లాడిన వ్యాఖ్యలపై పది రోజుల తర్వాత తెలంగాణ మంత్రులు స్పందించడం హాస్యాస్పదంగా ఉందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొందరు వాటర్ లో నీళ్లు కలుపుకొని స్పృహ కోల్పోతున్నారని, మరికొందరు కమిషన్లు పంచుకునే పనిలో బిజీగా ఉంటున్నారని ఆరోపించారు. ఉద్యమ సమయంలో తామెప్పుడూ ప్రాంతాలను దూషించలేదని, అన్నదమ్ములుగా విడిపోయి వేర్వేరుగా కలిసి బతుకుదామని కేసీఆర్ అనాడే చెప్పారని పేర్కొన్నారు. ఇప్పటికై నా పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే మంచిదని హితవు పలికారు. అంతే కానీ సినిమాలు ఆపుతామని ఇక్కడి మంత్రి కామెడీగా మాట్లాడుతున్నారని, వాస్తవానికి అభిమానం వేరు.. రాజకీయం వేరన్నారు. తమ అభిమాన హీరోగా జనం ఎవరి సినిమాలైనా ఆదరిస్తారని పేర్కొన్నారు. ఫ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి -
సీఎం బందోబస్తుకు వెళ్లొస్తుండగా ప్రమాదం
గుర్రంపోడు, నల్ల గొండ: నారాయణ్‌పేట జిల్లా మక్తల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి బందోబస్తుకు వెళ్లి నల్లగొండకు కారులో వస్తుండగా అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో ముగ్గురు ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. ఈ సంఘటన సోమవారం రాత్రి గుర్రంపోడు మండలం తానేదార్పల్లి సమీపంలో చోటుచేసుకుంది. ఎస్సై మధు తెలిపిన వివరాల ప్రకారం. నల్లగొండ టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్సైలుగా పనిచేస్తున్న నర్సింహారెడ్డి, శ్రీధర్, సత్యనారాయణ, హెడ్‌కానిస్టేబుల్ వెంకటేశ్వర్లుకు గాయాలు కాగా నల్లగొండ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడ్డ సిబ్బందిని ఎస్పీ శరత్చంద్ర పవార్ పరామర్శించారు. అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత వలిగొండ : కారులో అక్రమంగా మద్యం తరలిస్తుండగా పోలీసులు కేసు నమోదు చేశారు. పంచాయతీ ఎన్నికల విధుల్లో భాగంగా మంగళవారం వలిగొండ మండల కేంద్రంలోని తొర్రూరు చౌరస్తాలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. సుంకిశాలకు చెందిన మొగిలిపాక శ్రీకాంత్ కారులో సుమారుగా రూ.42,500 విలువగల 39 లీటర్ల మద్యం రవాణా చేస్తుండగా పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. ఈమేరకు శ్రీకాంత్‌పై కేసు నమోదు చేసి కారును సీజ్ చేసినట్లు ఎస్సై యుగంధర్ తెలిపారు.ఫ చెట్టును ఢీకొన్న కారు ఫ నలుగురికి గాయాలు -
భూభారతి అర్జీలను పరిష్కరించాలి
భువనగిరి : భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం బీబీనగర్ తహసీల్దార్ కార్యాలయంలో భూభారతిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి మాట్లాడారు. సాదాబైనామా దరఖాస్తులను చిన్నచిన్న కారణాలతో రిజెక్ట్ చేయకుండా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అర్హులుగా నిర్ధారించి పరిష్కారం చూపాలన్నారు. అనంతరం పెండింగ్ దరఖాస్తుల వివరాలు తెలుసుకున్నారు. ఆయన వెంట తహసీల్దార్ శ్యాంసుందర్, డీటీ భగత్ ఉన్నారు. ఫ కలెక్టర్ హనుమంతరావు -
ఎక్కడిదక్కడే!
బుధవారం శ్రీ 3 శ్రీ డిసెంబర్ శ్రీ 2025సాక్షి, యాదాద్రి : జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) జిల్లా పరిధిలోని బ్లాక్ స్పాట్ల వద్ద చేపట్టిన ఆరు వరుసల ఫ్లై ఓవర్ నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. అండర్‌పాస్‌లతో కూడిన వీటి నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం గతేడాది ఆగస్టులో ఆమోదం తెలిపింది. దీంతో హైదరాబాద్– వరంగల్ హైవే–163పై నాలుగు చోట్ల ఫ్లై ఓవర్లు మంజూరు కాగా మూడు చోట్ల పనులు జరుగుతుండగా, ఒకచోట టెండర్ల దశలోనే ఉంది. పనులు ప్రారంభించిన నాటి నుంచి పద్దెనిమిది నెలల్లో పనులు పూర్తి చేయాల్సి ఉన్నా ఏడాది గడిచినా రెండు చోట్ల నెమ్మదిగా మిగతా రెండు చోట్ల అంతంత మాత్రంగా నిర్మాణాలు సాగుతున్నాయి. ఫ్లై ఓవర్లు ఎక్కడెక్కడంటే.. హైదరాబాద్– వరంగల్ జాతీయ రహదారి–165పై యాదగిరిగుట్ట మండలం వంగపల్లి, భువనగిరి మున్సిపల్ పరిధిలోని సింగన్నగూడెం, బీబీనగర్ ఎయిమ్స్, బీబీనగర్ మండలం కొండమడుగు వద్ద ఆరు వరుసల్లో అండర్ పాసులతో కూడిన నాలుగు ఫ్లై ఓవర్లు మంజూరయ్యారు. కొండమడుగు మెట్టు వద్ద పనులు వేగం బీబీనగర్ మండలం కొండమడుగు మెట్టు వద్ద గతనెలలో చేపట్టిన ఫ్లైఓవర్ పనులు కొనసాగుతున్నాయి. ఆరు లేన్ల ఫ్లైఓవర్‌ను 1,200 మీటర్ల పొడవునా నిర్మించనున్నారు. ఇప్పటికే పనులు ప్రారంభం కాగా డైవర్షన్ రోడ్లను ఏర్పాటు చేసి సర్వీస్ రోడ్డులో రాకపోకలను అనుమతించారు. వంగపల్లి వద్ద కాంక్రీట్ పనులు పూర్తి యాదగిరిగుట్ట మండలం వంగపల్లి వద్ద ఫ్లైఓవర్ పనులు పూర్తి కావొచ్చాయి. ఇక్కడ రూ.15 కోట్ల అంచనా వ్యయంతో గతేడాది ఫిబ్రవరిలో పనులు ప్రారంభించారు. ఆరు వరుసలతో కాంక్రీట్ పనులు పూర్తికాగా, మట్టి పనులు పూర్తి కావొస్తున్నాయి. దీనితోపాటు స్థానిక రోడ్లు, వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లే మార్గాలు, గ్రామాల మధ్య ప్రమాద రహిత ప్రయాణం కోసం అధికారులు డీపీఆర్‌లు రూపొందించి ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. వీటి పనులు పద్దెనిమిది నెలల్లో పూర్తి కావాల్సి ఉంది. అలాగే భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని సింగన్నగడెం వద్ద ఫ్లై ఓవర్ పనులు నెమ్మదిగా కొనసాగుతుండడంతో నిర్ణీత 18 నెలల గడువులోగా పూర్తి అవుతాయో లేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏడాది గడిచినా.. -
నామినేషన్ల ప్రక్రియ పరిశీలన
భువనగిరి : రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను మంగళవారం భువనగిరి మండలం అనంతారం క్లస్టర్ సెంటర్లో ఎన్నికల సాధారణ పరిశీలకరాలు, ఐఏఎస్ అధికారి గోతమి పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందిని అడిగి నామినేషన్ల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆమె వెంట సిబ్బంది ఉన్నారు. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలిమోటకొండూర్ : పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు అన్నారు. మంగళవారం మోటకొండూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో క్లస్టర్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. నామినేషన్ స్వీకరణపై ఆర్ఓలకు పలు సూచనలు చేశారు. ఎన్నికల నియమావళిని తప్పకుండా పాటించాలన్నారు. ఎన్నికలు సజావుగా సాగేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఇందిర, తహసీల్దార్ నాగదివ్య, చొల్లేటి శ్రావణ్, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు మోర బాలగంగాధర్‌రెడ్డి, ఎండీ గఫార్, శ్రీకాంత్‌రెడ్డి, రాజగోపాల్, చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు, జ్యోతి, మహేష్‌రెడ్డి పాల్గొన్నారు. రేపు ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్ల ఎంపిక నల్లగొండ టూటౌన్ : ఉమ్మడి జిల్లా స్థాయి అండర్ –16 బాలుర క్రికెట్ జట్ల ఎంపిక ఈనెల 4వ తేదీన నల్లగొండ పట్టణంలోని మేకల అభినవ్ స్టేడియంలో నిర్వహించబడునని క్రికెట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి అమీనొద్దీన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో ఎంపికై న జట్లతో లీగ్ పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇందులో ప్రతిభ కనభర్చిన వారిని ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపిక చేస్తామని తెలిపారు. 01–09–2009 నుంచి 31–08–2011 మధ్య జన్మించిన వారు, జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డు, బోనఫైడ్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. ఇతర వివరాలకు 9885717996, 6303430756 ఫోన్ నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు. వైభవంగా నిత్యకల్యాణంమఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం నిత్యకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు చేశారు. ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం రక్తి గట్టించారు. అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలతో కల్యాణం జరిపారు. శ్రీస్వామి వారిని గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, పణిభూషణ మంగాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. -
సెల్లార్లు ఖాళీ చేయించేదెప్పుడు?
భువనగిరి టౌన్ : జిల్లా కేంద్రంలోని వివిధ దుకాణాల ఎదుట పార్కింగ్‌కు స్థలం లేక వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు విస్తరించకపోవడంతో వాహనాల పార్కింగ్ పెద్ద సమస్యగా తయారైంది. ప్రధాన కూడళ్లకు కారులో వెళ్లలేని పరిస్థితి నెలకొంది. కిలోమీటర్ దూరంలో పెద్ద వాహనాలను నిలిపి ప్రధాన షాపింగ్ మాల్స్, ఇతర దుకాణాలకు వెళ్లాల్సి వస్తోందని వాహనదారులు వాపోతున్నారు. సెల్లార్ షాపింగులతో ఇబ్బందులు భువనగిరి మున్సిపాలిటీలో బహుళ అంతస్తుల భవనాల సెల్లార్లను కిరాయికి ఇవ్వడంతో పార్కింగ్ సమస్య తలెత్తుతోంది. మున్సిపల్ నిబంధనల ప్రకారం సెల్లార్లను వాహనాల పార్కింగ్ కోసం వదిలివేయాలి. కానీ సెల్లార్లలో షాపింగ్ మాల్స్, ఇతర వ్యాపారాలు నిర్వహిస్తుండటంతో వాహనాలు రోడ్ల పక్కన పార్క్ చేయాల్సి వస్తోంది. ప్రధాన రోడ్డులో సెల్లార్లను వ్యాపార నిమిత్తం ఉపయోగిస్తున్నారు. సెల్లార్లను కిరాయిలకు ఇస్తూ వేలకు వేలు సంపాదిస్తున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. సెల్లార్లను ఖాళీ చేయించి, వాటిని పార్కింగ్ స్థలాలుగా ఉపయోగిస్తే ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండే అవకాశం ఉంది. ఆదేశాలు బేఖాతర్.. సెల్లార్లలో షాపులను ఖాళీ చేసి వాటిని వాహనాల పార్కింగ్ కోసం వినియోగించేలా చర్యలు తీసుకోవాలని గతంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీచేసినా వారు పట్టించుకోవడం లేదు. గత నెలలో ఏర్పాటు చేసిన మున్సిపల్ ప్రత్యేక సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు. స్పందించిన అధికారులు సెల్లార్ షాపులకు ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేశారు. నెల రోజులు గడుస్తున్నా ఖాళీ చేయకుండా వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఈ విషయంలో ముడుపులు తీసుకుని సెల్లార్ దుకాణాలను ఖాళీ చేయించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతనెల 31 వరకే ఖాళీ చేయాలని చివరి గడువు విధించినా అధికారులు ఏమి పట్టనట్లుగా వ్యహరిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్ ఆదేశాలు సైతం లెక్కచేయకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. షాపింగ్ చేసే జనం ఇబ్బందులను గుర్తించి జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలంటే సెల్లార్లలో కొనసాగే దుకాణాలను ఖాళీ చేయించి వాటిని పార్కింగ్ స్థలాలుగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఫ నోటీసులిచ్చి చేతులు దులుపుకున్న అధికారులు ఫ ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు ఫ యథేచ్ఛగా కొనసాగుతున్న సెల్లార్ దుకాణాలు -
భారీగా నామినేషన్లు
ఫ ముగిసిన రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ఫ నేటి నుంచి మూడో విడత షురూ ఫ ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు సాక్షి, యాదాద్రి : రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మంగళవారం ముగిసింది. చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. తొలి విడత నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ బుధవారం ముగియనుండంతో పెద్ద ఎత్తున బేరసారాలు, బుజ్జగింపులు మొదలయ్యాయి. అయితే మూడో విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. కాగా ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు తలమునకలైయ్యారు. ఇదిలా ఉంటే రాజకీయ పార్టీల నేతలు, ఆశావహులు తీరిక లేకుండా గడుపుతున్నారు. టోకెన్లు తీసుకుని..క్యూలో నిలబడి రెండో విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మంగళవారం రాత్రి వరకు కొనసాగింది. చివరి రోజు కావడంతో సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్లు వేయడానికి అభ్యర్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సాయంత్రం 5 గంటలలోపు క్లస్టర్ కేంద్రాలకు చేరుకున్న వారికి అధికారులు టోకెన్లు ఇచ్చి రాత్రి పొద్దుపోయే వరకు నామినేషన్లు స్వీకరించారు. వార్డు సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో కాస్త జాప్యం జరిగింది. మూడో విడత నేటి నుంచే.. గ్రామ పంచాయతీ ఎన్నికల మూడో విడత నామినేషన్లు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మండలాల వారీగా కలెక్టర్ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేస్తారు. ఈ నెల 3, 4, 5 తేదీల్లో క్లస్టర్ల వారీగా 124 గ్రామ పంచాయతీలు, 1,086 వార్డులకు నామినేషన్లు స్వీకరిస్తారు. భువనగిరి, చౌటుప్పల్ ఆర్డీఓ పరిధిలోని చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం, అడ్డగూడూరు, మోత్కూరు, గుండాల, మోటకొండూరు మండలాల్లో నామినేషన్ల స్వీకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉపసంహరణ నేడే.. ఆలేరు, యాదగిరిగుట్ట, తుర్కపల్లి, బొమ్మలరామారం, ఆత్మకూర్(ఎం), రాజాపేట మండలాల్లో ఈనెల 11న జరగనున్న తొలి విడత ఎన్నికలకు సంబంధించి బుధవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. అయితే పలుచోట్ల ప్రధానపార్టీల అభ్యర్థులకు రెబల్స్ తలనొప్పి ఉంది. కొన్నిచోట్ల బుజ్జగింపులతో ఉపసంహరించుకోగా, మరికొన్ని చోట్ల బెదిరింపులు, బేరసారాలు నడిచాయి. అయితే బుధవారం భారీగానే నామినేషన్ల ఉపసంహరణ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వలిగొండ మండలంలో నామినేషన్ల స్వీకరణఅర్ధరాత్రి వరకు కొనసాగుతూనే ఉంది.మైనర్, కొత్త గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవ ఎన్నిక కోసం తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. అంతర్గతంగా వేలం పాటలు పాడారు. గ్రామాభివృద్ధికోసం నిధులు ఇచ్చేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. కొన్నిచోట్ల రెండు పార్టీలు సర్పంచ్–ఉపసర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలను పంచుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఏకగ్రీవం సర్పంచ్‌లు, వార్డు సభ్యుల లెక్కలు తేలనుంది. నామినేషన్ల వివరాలు మండలం జీపీలు చివరి రోజు మొత్తం భూదాన్‌పోచంపల్లి 21 65 117 భువనగిరి 34 130 202 బీబీనగర్ 34 84 177 రామన్నపేట 24 69 136 మండలం వార్డులు చివరి రోజు మొత్తం భూదాన్‌పోచంపల్లి 192 340 487 భువనగిరి 294 506 743 బీబీనగర్ 284 386 736 రామన్నపేట 232 421 607 -
ఆదర్శ నేత రాఘవరెడ్డి
ఫసర్పంచ్ నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన నాయకుడు చిట్యాల : రాజకీయాలలో నీతి,నిజాయితీకి మారు పేరుగా నిలిచిన నేత దివంగత నర్రా రాఘవరెడ్డి. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామానికి చెందిన రాఘవరెడ్డి పంచాయతీ సర్పంచ్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిత్యం కృషి చేశారు. వట్టిమర్తి సర్పంచ్‌గా ఏక గ్రీవం చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి 1959లో (నాడు వట్టిమర్తి, శివనేనిగూడెం కలిసి ఉండేవి) జరిగిన ఎన్నికల్లో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఇదే సమయంలో నార్కట్‌పల్లి సమితి ప్రెసిడెంట్‌గానూ ఆయన ఎన్నికయ్యారు. 1964 వరకు సర్పంచ్‌గా పని చేశారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా.. 1967లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నకిరేకల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1972లో ఒకసారి ఓటమి పాలైనప్పటికీ తిరిగి 1977లో జరిగిన ఎన్నికల్లో నకిరేకల్ నుంచే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి 1999 వరకు వరుసగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఘనత రాఘవరెడ్డికే దక్కింది. 2015 ఏప్రిల్ 15న రాఘవరెడ్డి వృద్ధాప్య సమస్యలతో మృతి చెందారు. ప్రజాప్రతినిధిగా ఆయన చేసిన సేవలకు గుర్తుగా వట్టిమర్తి వద్ద ఎన్‌హెచ్ 65 పక్కన రాఘవరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. -
అన్నప్రసాద కేంద్రంలో ఇబ్బందులు తలెత్తొద్దు
యాదగిరిగుట్ట : నూతనంగా ప్రారంభించిన అన్నప్రసాద వితరణ కేంద్రంలో అవసరమైన వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఈఓ ఈఓ వెంకట్రావ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన తన చాంబర్లో ఆలయంలోని వివిధ విభాగాల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ.. అన్న ప్రసాదం వితరణ సమయంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. ఏవైనా సౌకర్యాలు లేకపోతే వెంటనే సమకూర్చాలని సూచించారు. ఆలయంలో స్వామివారికి నిర్వహించే సేవలు, పూజలు, దర్శన వేళలు తదితర అంశాలకు సంబంధించి వివరాలతో కూడిన సూచిక బోర్డులను ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. భక్తుల రద్దీ అధికంగా ఉన్నప్పుడు సదుపాయాలను మరింత మెరుగుపరచడం, సమన్వయ విధానాలను బలోపేతం చేయడంపై మార్గదర్శకాలను జారీ చేశారు. అయ్యప్ప మాలధారణ భక్తులు గిరిప్రదక్షిణ సందర్భంగా తగిన చర్యలు తీసుకొని జయప్రదం చేసినందుకు స్పెషల్ ప్రొటక్షన్ గ్రూఫ్ (ఎస్పీఎఫ్) సిబ్బందిని ఈఓ వెంకట్రావ్ అభినందించారు. గుట్ట ఆలయ ఈఓ వెంకట్రావ్ -
ముగిసిన అండర్–19 ఖోఖో ఎంపిక పోటీలు
కనగల్: కనగల్ ఎస్ఏవీఎం తెలంగాణ మోడల్ స్కూల్లో సోమవారం నిర్వహించిన ఉమ్మడి నల్ల గొండ జిల్లా అండర్–19 బాలబాలికల ఖోఖో ఎంపిక పోటీలు ముగిశాయి. బాలబాలికలు 200 మంది ఎంపిక పోటీలకు హాజరు కాగా.. బాలికల నుంచి 12 మంది, బాలుర నుంచి 12 మందిని ఎంపిక చేసినట్టు ఎస్జీఎఫ్ జిల్లా సెక్రటరీ కుంభం నర్సిరెడ్డి తెలిపారు. ఈ నెల 5, 6, 7 తేదీల్లో సికింద్రాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో జిల్లా తరఫున వీరు పాల్గొంటారని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులకు రిటైర్డు ఎస్ఐ పందుల శంకరయ్య క్రీడా దుస్తులను బహూకరించారు. కార్యక్రమంలో ఎంఈఓ పద్మ, పాఠశాల ప్రిన్సిపాల్ థామాసయ్య, ఎస్ఐ కే.రాజీవ్‌రెడ్డి, తరాల జగదీష్, పీడీ విజయ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత చివ్వెంల(సూర్యాపేట) : కారులో అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన చివ్వెంల మండల పరిధిలోని దురాజ్‌పల్లి గ్రామ స్టేజీ వద్ద సోమవారం జరిగింది. ఎస్ఐ వి.మహేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. దురాజ్‌పల్లి గ్రామ స్టేజీ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా.. సూర్యాపేట నుంచి కారులో అక్రమంగా తరలిస్తున్న 11 కాటన్ల మద్యాన్ని పోలీసులు స్వాఽధీనం చేసుకున్నారు. -
రూ.24 కోట్ల లిక్కర్
ఆలేరు: మొన్నటి వరకు స్టాక్ లేక బోసిబోయిన మద్యం దుకాణాలు కళకళలాడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుకువచ్చిన నూతన మద్యం పాలసీ సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. జిల్లావ్యాప్తంగా 82 మద్యం షాప్‌లు కొత్త యజమానుల చేతికి మారాయి.దుకాణాలను నిర్వాహకులు మామిడి తోరణాలు, పూలతో అలంకరించి, ముహూర్తం చూసి ప్రారంభించారు. ఈ నూతన పాలసీ 2027 నవంబర్ వరకు అమల్లో ఉండనుంది. వరుస ఎన్నికలు, మేడారం జాతర ఉండటంతో ఖజానాకు భారీగా నిధులు సమకూరే అవకాశం ఉందని ఎకై ్సజ్ శాఖ అంచనా వేస్తోంది. నాలుగు సర్కిళ్లు, 82 వైన్స్లుజిల్లాలోని ఆలేరు, మోత్కూరు, రామన్నపేట, భువనగరి ఆబ్కారీ సర్కిళ్ల పరిధిలో 82 మద్యం దుకాణాలు ఉన్నాయి. పాత దుకాణాలకు లైసెన్స్ గడువు నవంబర్ 30 తేదీ రాత్రి 10 గంటలకు ముగిసింది. వచ్చే రెండేళ్లకు గాను కొత్తగా లైసెన్స్ పొందిన వ్యాపారులు 29,30 తేదీల్లో మద్యం లిఫ్టింగ్‌కు ఇండెంట్ పెట్టారు. ఆదివారం రాత్రి నుంచి బోగారంలోని లిక్కర్ డిపోనుంచి మద్యం స్టాక్‌ను తమ దుకాణాలకు తరలించారు. చీఫ్ లిక్కర్ నుంచి ఖరీదైన మద్యం వరకు లిఫ్ట్ చేశారు భారీగా స్టాక్సాధారణ రోజుల్లో అయితే మూడు రోజులకోసారి జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.15 కోట్ల మద్యం స్టాక్‌ను వైన్స్‌ల యజమానులు లిఫ్ట్ చేస్తుంటారని సమాచారం. తాజాగా పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఒక్కో షాప్ నిర్వాహకులు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల చొప్పున జిల్లా మొత్తం రూ.20.50 కోట్ల నుంచి రూ.24.60 కోట్లు విలువ చేసే లిక్కర్ దుకాణాలకు లిఫ్ట్ చేసినట్టు తెలిసింది. మడిగెలపై అభ్యంతరాలుపాత వైన్స్‌లు కొనసాగిన చోటే కొత్తవాటిని కొనసాగించడంపై స్థానికుల నుంచి ఆభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రధాన రహదారుల పక్కన, జనా వాసాల మధ్య దుకాణాలు ఉండటం వల్ల స్థానికులకు ఇబ్బందులు తలెత్తుతాయని, రోడ్డు ప్రమాదాలకు ఆస్కారం ఉంటుందని పలు ప్రాంతాల ప్రజలు అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఈ విషయమై ఆబ్కారీ అధికారులు దృష్టిసారించారు.నృసింహుడికి లక్ష పుష్పార్చన యాదగిరిగుట్ట: ఏకాదశిని పురస్కరించుకొని సోమవారం యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తుల ను పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, వైజ్రవైఢూర్యాలు, వివిధ పుష్పమాలికలతో దివ్యమనోహరంగా అలంకరించిన అర్చకులు.. ప్రత్యేక వేదికపై అధిష్ఠింపజేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ సహస్రనామ పఠనాలు పఠిస్తూ లక్ష పుష్పార్చన నిర్వహించారు. అంతకుముందు వేకువజామున సుప్రభాత సేవతో స్వామి వారిని మేల్కొలిపి, గర్భాలయంలోని స్వయంభూలకు అభిషేకం, సహస్రనామార్చనతో కొలిచారు. ప్రాకా ర మండపంలో సుదర్శన నారసింహ హోమం, నిత్య తిరుకల్యాణోత్సవం తదితర పర్వాలను పాంచారాత్రగమశాస్త్ర రీతిలో చేపట్టారు. ● స్వామియే.. శరణం అయ్యప్పాగిరి ప్రదక్షిణ అనంతరం శ్రీస్వామి వారి దర్శనానికి ప్రధానాలయంలో బారులుదీరిన అయ్యప్ప స్వాములు రికార్డు స్థాయిలో వచ్చిన స్టాక్ కళకళలాడుతున్న లిక్కర్ షాప్‌లు అమల్లోకి వచ్చిన నూతన మద్యం పాలసీఉల్లంఘనులపై నజర్ఆలేరు : పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మద్యం అమ్మకాలపై ఎకై ్సజ్ అధికారులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా నూతన మద్యం దుకాణాల్లో తనిఖీ చేశారు. ఆలేరు ఎకై ్సజ్ సర్కిల్ పరిధిలోని ఆలేరు, యాదగిరిగుట్ట, తుర్కపల్లి, మోటకొండూరు మండలాల్లోని వైన్స్‌ల్లో సోమవారం రాత్రి తనిఖీలు చేశారు. ఇండెంట్ ప్రకారం లిక్కర్ తరలించారా లేదా రికార్డులను పరిశీలించారు. నిర్వాహకులకు నిబంధనలపై అవగాహన కల్పించారు. నిబంధనలకు లోబడి అమ్మకాలు చేయాలని, లేని పక్షంలో లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. -
ట్యాంక్‌బండ్ తరహాలో సుందరీకరణ
ఆలేరు: చెరువులకు పూర్వ వైభవం తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. సోమవారం ఆలేరు మున్సిపాలిటీ పరిధిలోని బహదూర్‌పేట పెద్ద చెరువు సుందరీకరణ పనులకు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌తో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఆహ్లాదం అందించేలా చెరువుల సుందరీకరణకు ప్రభుత్వ ప్రాధాన్యమిస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్రాల నిధులతో చెరువులను మినీ ట్యాంక్బండ్లుగా సుందరీకరించడమే లక్ష్యమన్నారు. రైతులకు సాగునీరు అందేలా భవిష్యత్‌లో చెరువుల వద్ద చెక్‌డ్యాంల నిర్మాణాలకు కృషి చేస్తానని చెప్పారు. ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి పెద్ద ఎత్తున నిధులు తెచ్చి అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ చెరువు చుట్టూ బండింగ్, జంగల్ కటింగ్, వాకింగ్ ట్రాక్, రకరకాల మొక్కలతో సుందరీకరణ, విద్యుత్‌దీపాలు తదితరు పనులు చేపట్టనున్నట్టు వివరించారు. ఆలేరు మున్సిపల్ మాజీ చైర్మన్ వస్పరి శంకరయ్య, మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇజాజ్, కాంగ్రెస్ నాయకులు చింతలఫణి శ్రీనివాస్‌రెడ్డి, సాగర్‌రెడ్డి, జెట్ట సిద్ధులు, పబ్లిక్‌హెల్త్ అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య -
ఆశీర్వదించండి అమ్మా నాన్న
రోడ్డేస్తేనే ఓటేస్తాం.. వేములపల్లి : తమ కాలనీకి సర్వీస్ రోడ్డు వేస్తేనే ఓటు వేస్తాం లేదంటే ఓటింగ్‌ను బహిష్కరిస్తామంటూ నల్లగొండ జిల్లా వేములపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వాట్సాప్‌లలో చక్కర్లు కొడుతోంది. వేములపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఎన్ఎస్పీ క్యాంపు కాలనీకి రాకపోకలు కొనసాగించాలంటే వేములపల్లి మండల కేంద్రం నంచి నార్కట్‌పల్లి–అద్దంకి రహదారిపై రాంగ్ రూట్లో ప్రయాణించాల్సి ఉంటుంది. దీంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ విషయమై పలుమార్లు గ్రామ ప్రజాప్రతినిధులకు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గ్రామంలో జరగబోయే ఎన్నికలను పూర్తిగా బహిష్కరిస్తామంటూ ఎన్ఎస్పీ కాలనీ ప్రజలు వాట్యాప్ గ్రూప్‌లో షేర్ చేస్తున్నారు. రోడ్డు వేయిస్తామని హామీ ఇస్తే తప్ప ఓటు వేసేది లేదని పేర్కొంటున్నారు. -
ఆదర్శం.. రేణికుంట పంచాయతీ
రాజాపేట : ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకుంటూ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన రేణికుంట గ్రామం రాష్ట్రస్థాయిలో ఉత్తమ పంచాయతీగా నిలిచింది. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలోని రేణిగుంట గ్రామానికి సర్పంచ్‌గా ఉన్న బూరు భాగ్యమ్మానర్సిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న హరితహారం, స్వచ్ఛ సర్వేక్షణ్, పల్లె ప్రగతి పథకాలను పూర్తిస్థాయిలో వినియోగించుకొని గ్రామాన్ని అభివృద్ధి చేశారు. జాతీయ అవార్డులురేణికుంట గ్రామానికి 19 జూన్ 2023న రాష్ట్రస్థాయి ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డు లభించింది. మౌళిక వసతుల కల్పన, స్వయం సమృద్ధి విభాగంలో 2021–2022లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు గానూ జాతీయ పంచాయతీ అవార్డు లభించింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా ఇంకుడు గుంతలు, సేంద్రియ ఎరువుల తయారి, పల్లె ప్రగతి కార్యక్రమం సమగ్రంగా అమలు చేసినందుకు 26 జనవరి 2020లో జిల్లా ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డు లభించింది. అభివృద్ధి పనులుగ్రామంలో ప్రతి కాలనీలో 80 లక్షల నిధులతో సీసీ రోడ్లు వేశారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి ఎదుట, ప్రభుత్వ స్థలాల్లో మొక్కలు నాటడంతో వాటిని 100 శాతం బతికించారు. అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ, ఇంకుడు గుంతల నిర్మాణం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, ప్రతీ కాలనీలో, రోడ్డుకు ఇరువైపులా వీధి దీపాలు ఏర్పాటు చేశారు. దాంతో పాటు రేణిగుంట నుంచి, రాజాపేట వరకు లైట్లు ఏర్పాటు చేయడంతో గ్రామానికి కొత్త కళ వచ్చింది. కొత్త హంగులతో గ్రామపంచాయతీ భవనాన్ని నిర్మించడంతో పాటు శిథిలావస్థకు చేరిన పాఠశాలను ఆధునీకరించి గ్రంథాలయంగా ఏర్పాటు చేశారు. ప్రజలకు కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దారు. రాష్ట్రస్థాయి ఉత్తమ పంచాయతీగా ఎంపిక హరితహారం, స్వచ్ఛ భారత్ మిషన్, పల్లె ప్రగతి నిర్వహణలో జాతీయ అవార్డు -
ఒక కుటుంబంలో ముగ్గురు సర్పంచ్‌లు
బొమ్మలరామారం : మండలంలోని చీకటిమామిడి గ్రామానికి చెందిన మచ్చ చంద్రమౌళిగౌడ్ కుటుంబ సభ్యులు నాలుగు పర్యాయాలు సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. మచ్చ చంద్రమౌళి తొలిసారిగా 1995లో చీకటిమామిడి గ్రామానికి సర్పంచ్‌గా ఎన్నికై య్యారు. ఐదేండ్లు ప్రజలతో మమేకమై పని చేయడంతో 2001లో సైతం రెండో సారి ఆయనను సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. 2007లో చంద్రమౌళిగౌడ్ మాతృమూర్తి కళావతి సర్పంచ్‌గా పోటీ చేసి విజయం సాధించారు. 2013లో చంద్రమౌళి గౌడ్ సోదరుడు శ్రీనివాస్‌గౌడ్ ఎంపీటీసీగా గెలుపొందగా 2019లో మచ్చ శ్రీనివాస్‌గౌడ్ సతీమణి మచ్చ వసంత సర్పంచ్‌గా గెలిచారు. దాదాపు 20 సంవత్సరాల పాటు మచ్చ చంద్రమౌళిగౌడ్ కుటుంబం గ్రామానికి నిస్వార్థంగా సేవలందించి ప్రశంసలు పొందారు. సర్పంచ్‌గా 30 ఏళ్లు..కొండమల్లేపల్లి : రాష్ట్రంలో అత్యధిక ఆదాయం వస్తున్న గ్రామపంచాయతీల జాబితాలో కొండమల్లేపల్లి పేరు ఉటుంది. దానిని ఆస్థాయిలో తీర్చి దిద్దిన ఘనత గ్రామ మొదటి సర్పంచ్ కుంభం పుల్లారెడ్డికే దక్కుతుంది. 1959లో కొండమల్లేపల్లి గ్రామపంచాయతీ ఏర్పడింది. మొదటి సర్పంచ్‌గా కుంభం పుల్లారెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఆ తరువాత 1964లో రెండో సర్పంచ్‌గా నాయిని పుల్లారెడ్డి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1969 నుంచి 2000 సంవత్సరం వరకు సుమారు వరుసగా 30 సంవత్సరాల పాటు కుంభం పుల్లారెడ్డి సర్పంచ్‌గా వ్యవహరించారు. ఆయన హయాంలోనే కొండమల్లేపల్లి పశువుల సంతను అభివృద్ధి చేశారు. దాంతో ప్రస్తుతం సంత నుంచి ప్రతి ఏటా రూ. 1.23కోట్ల ఆదాయం గ్రామపంచాయతీకి సమకూరుతోంది. మేము డబ్బులు తీసుకోము..ఆత్మకూర్(ఎస్) (సూర్యాపేట) : ఎన్నికల్లో డబ్బులు, మద్యం ప్రభావం అధికం. పోటీ చేసే అభ్యర్థులు ఓటుకు ఇంత అంటూ రేటు నిర్ణయించి ఓటర్లను ప్రభావితం చేసేందుకు యత్నిస్తుంటారు. కానీ సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన యల్లంకొండ వెంకట్‌రెడ్డి తన ఇంటి గోడపై రాయించిన వాల్ పేయింటింగ్ గ్రామంలో చర్చనీయాంశమైంది. ‘మేము డబ్బులు తీసుకొని ఓటు వెయ్యం.. ప్రభావితం చేసేందుకు యత్నిస్తే చర్యలు తీసుకుంటాం’ అని తన ఇంటి ప్రహరీపై రాయించాడు. మచ్చ వసంతమచ్చ కళావతిచంద్రమౌళి గౌడ్ -
ప్రజారోగ్య రక్షణలో నర్సులు కీలకం
భువనగిరి : ప్రజల ఆరోగ్యం, వారి శ్రేయస్సును కాంక్షిస్తూ నిస్వార్థంగా సేవలందించడంలో నర్సుల పాత్ర కీలకమని బీబీనగర్ ఎయిమ్స్ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ లత పేర్కొన్నారు. ఎయిమ్స్‌లో బీఎస్సీ నర్సింగ్–2025 విద్యార్థుల కోసం దీపాలంకరణ, ప్రమాణస్వీకార కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నర్సింగ్ విద్యార్థులు తమ క్లీనికల్ ప్రాక్టీస్‌లో భాగంగా రోగుల నుంచి ఎన్నో విషయాలను నేర్చుకోవడంతో పాటు సీనియర్లను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రోగుల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో నర్సింగ్ విద్యార్థులు పోషించాల్సిన పాత్రపై వారికి అవగాహన కల్పించారు. అనంతరం వారిచే ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ మహేశ్వర్ లక్కిరెడ్డి, నితిన్ జాన్, నాగ్‌పూర్ ఎయిమ్స్ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ రజనీ తదితరులు పాల్గొన్నారు. బీబీనగర్ ఎయిమ్స్ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ లత -
‘అయాన్’ పై రైతుల ఆసక్తి
నల్లగొండ అగ్రికల్చర్ : పంటకాలం ఎక్కువగా ఉండడంతోపాటు వాతావరణ పరిస్థితులను తట్టుకోలేకపోవడం.. చీడపీడల బారిన పడడం వల్ల గతంలో రైతులు సన్నరకం ధాన్యం సాగుపై పెద్దగా దృష్టి సారించలేదు. అయితే దశాబ్ద కాలంగా తక్కువ పంటకాలం.. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ అధిక దిగుబడి సాధించే బ్రీడెడ్ సన్నరకం వైరెటీలను ప్రైవేట్ కంపెనీలు మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. వీటిని సాగుచేస్తున్న రైతులకు అధిక దిగుబడులతోపాటు మంచి లాభాలు వస్తున్నాయి. ఈ సీజన్లో ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా 5.70 లక్షల ఎకరాల్లో సన్నరకం వరి ధాన్యం సాగయ్యింది. ప్రధానంగా ప్రభుత్వ వైరెటీలైన బీపీటీ–5204 స్వర్ణమసూరి, తెలంగాణ సోనా, సాంబ లాంటి విత్తనాలతోపాటు జీనెక్స్ సీడ్స్‌కు చెందిన ఆయాన్–2025 వైరెటీ విత్తనాలను రైతులు భారీగా సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ వంగడాలు భారీ దిగుబడి రావడంతోపాటు బహిరంగ మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో రైతులు వీటి సాగుకు మొగ్గు చూపుతున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అయాన్–2025పై రైతుల ఆసక్తి రైతుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని అనేక కంపెనీలు మేలు రకమైన వంగడాలు మార్కెట్లోకి తెస్తున్నాయి. ప్రధానంగా జీనెక్స్ సీడ్స్ కంపెనీ మార్కెట్లోకి తెచ్చిన అయాన్–2025 అనే ఫైన్ వైరెటీ సీడ్ చీడపీడలను తట్టుకోవడంతోపాటు అధిక దిగుబడి ఇస్తున్న నేపథ్యంలో రైతులు ఈ రకం వరిని అధికంగా సాగు చేస్తున్నారు. 135 నుంచి 140 రోజుల్లో పంట చేతికొస్తున్న ఈ రకం వరి ఎకరానికి 55 నుంచి 60 బస్తాల వరకు దిగుబడి ఇస్తుంది. ఎక్కువ పిలకలు రావడం.. తక్కువ ఎత్తు పెరగడం.. మొక్క కాండం ధృడంగా ఉండడంతో గాలి వానకు కూడా కింద పడడం లేదని రైతులు అంటున్నారు. రైస్‌లో ఆయిల్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల ఇతర రాష్ట్రాలు, దేశాల్లో భారీ డిమాండ్ ఏర్పడడంతో అక్కడికి సైతం ఎగుమతి చేస్తున్నామని మిల్లర్లు చెబుతున్నారు. సన్న ధాన్యం ఐకేపీ కేంద్రాల్లో విక్రయిస్తే క్వింటాకు రూ.500 బోనస్ రావడంతో రైతులు సన్నధాన్యం సాగుకు మొగ్గు చూపుతున్నారు. ప్రతికూల వాతావరణాన్ని తట్టుకుంటున్న ఫైన్ వైరెటీ వంగడాలు అధిక దిగుబడి ఇస్తున్న అయాన్–2025 రకం ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్న వ్యాపారులు సాగుపై ఆసక్తి చూపుతున్న రైతులు -
రెండో రోజు నామినేషన్ల కోలాహలం
సాక్షి, యాదాద్రి : మలి విడత పంచాయతీ ఎన్నికలు జరిగే స్థానాల్లో రెండో రోజు సోమవారం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. క్లస్టర్ కేంద్రాల్లో నామినేషన్వేయడానికి అభ్యర్థులు బారులుదీరారు. సర్పంచ్‌లకు 270, వార్డుసభ్యుల స్థానాలకు 957 నామినేషన్లు పడ్డాయి. రెండో రోజుల్లో కలిపి సర్పంచ్‌లకు 380, వార్డులకు 1,123 నామినేషన్లు దాఖలయ్యాయి. భువనగిరి, చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని ఐదు మండలాల్లో 150 సర్పంచ్‌లు, 1,332 వార్డు స్థానాలకు ఈ నెల 14 రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. రేపటి నుంచి మూడవ విడతమూడో విడత ఎన్నికలు జరిగే స్థానాల్లో బుధవారం నుంచి నామినేషన్ల ఘట్ట ప్రారంభం కానుంది. 5వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. చౌటుప్పల్, సంస్థాన్‌నారాయణపురం, మోత్కూ రు, అడ్దగూడూరు, మోటకొండూరు, గుండాల మండలాల్లోని 124 సర్పంచ్ స్థానాలు, 1,086 వార్ఢు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. బుధవారం ఉదయం 10 గంటలకు జిల్లా ఎన్నికల అధికారి ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తారు. తొలి దశలోఅర్హత సాధించిన నామినేషన్లు తొలివిడత నామినేషన్ల ఉపసంహరణ బుధవారం నుంచి మొదలుకానుంది. పరిశీలన అనంతరం 153 గ్రామ పంచాయతీల్లో 698 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు ఎన్నికల అధికారులు నిర్ధారించారు. 1,284 వార్డులకు 3,065 నామినేషన్లు అర్హత సాధించాయి. రెండో విడత.. రెండో రోజు సర్పంచ్ స్థానాలకు మండలం జీపీలు నామినేషన్లుపోచంపల్లి 21 37 భువనగిరి 34 41 బీబీనగర్ 34 69 వలిగొండ 37 79 రామన్నపేట 24 44 మొత్తం 150 270 వార్డు సభ్యులకు.. పోచంపల్లి 192 123 భువనగిరి 294 173 బీబీనగర్ 284 297 వలిగొండ 330 189 రామన్నపేట 232 175 మొత్తం 1332 957 సర్పంచ్‌లకు 270, వార్డు స్థానాలకు 957 టోకెన్లు జారీ చేసి సమయం ముగిసినా అనుమతి నేటితో ముగియనున్న మలి విడత నామినేషన్ల స్వీకరణ -
మంత్రి కోమటిరెడ్డిని విమర్శిస్తే ఊరుకోం
నల్లగొండ : నల్లగొండ నియోజకవర్గంలో 30 ఏళ్లుగా బీసీలకు పెద్దపీట వేస్తూ జనరల్ స్థానాల్లో అవకాశాలు కల్పిస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని తీన్మార్ మల్లన్న విమర్శించడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలు అన్నారు. సోమవారం నల్ల గొండలోని మంత్రి కోమటిరెడ్డి క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ జెడ్పీటీసీలు నర్సింగ్ శ్రీనివాస్‌గౌడ్, వంగూరి లక్ష్మయ్య.. పలువురు బీసీ సంఘాల నేతలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంలో యాదగిరి అనే వ్యక్తి కిడ్నాప్ ఒక రాజకీయ డ్రామా అని, ఆ పంచాయితీలో జోక్యం చేసుకొని మంత్రి కోమటిరెడ్డిని విమర్శిస్తే చింతపండు నవీన్ (మల్లన్న) వీపు చింతపండు అవుద్దని హెచ్చరించారు. పంచాయతీ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక బాధ్యతను ఆయా గ్రామాల నాయకులకే మంత్రి అప్పగించారని, ఇలాంటి పంచాయితీలో తలదూర్చలేదన్నారు. కిడ్నాప్ అంటూ నాటకాలు ఆడే యాదగిరికి తన భార్యను కొట్టడంతో పాటు తల్లిదండ్రులకు అన్నం పెట్టని చరిత్ర ఉందని, అలాంటి వ్యక్తి మాటలు నమ్మి మంత్రిని విమర్శించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డికి ఇలాంటివి చేయడం కొత్తేమీ కాదని అన్నారు. తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీగా గెలిపించడంలో కోమటిరెడ్డి కృషి ఉందని చెప్పారు. మల్లన్న బీసీల కోసం పోరాడితే తమ మద్దతు ఉంటుందని.. కానీ మంత్రిని విమర్శిస్తే ఊరుకోమన్నారు. గతంలో రెండు పర్యాయాలు పుల్లెంల వెంకటనారాయణగౌడ్‌ను మున్సిపల్ చైర్మన్‌గా చేశారని, జనరల్ స్థానంలో కూడా బీసీ అయిన వెంకటనారాయణగౌడ్కు పదవి ఇచ్చి రాష్ట్ర మున్సిపల్ చాంబర్ చైర్మన్ పదవిని కూడా ఇప్పించారని గుర్తుచేశారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ కౌన్సిలర్లు, బీసీ సంఘాల నేతలు జూలకంటి శ్రీనివాస్, ప్రదీప్ నాయక్, జెర్రిపోతుల భాస్కర్, బొజ్జ రమేష్‌యాదవ్, అల్లి సుభాష్‌యాదవ్, ఇటికాల శ్రీనివాస్, పిల్లి రమేష్‌యాదవ్, గోగుల గణేష్‌యాదవ్, గోవర్ధన్‌గౌడ్, బొడ్డుపల్లి రాజేష్, భువనగిరి ప్రభాకర్, పాలకూరి శ్రీధర్, రంజిత్ పాల్గొన్నారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేష్‌గౌడ్ -
బొలేరో ఢీకొని ముగ్గురికి గాయాలు
చివ్వెంల(సూర్యాపేట) : అతివేగంగా వస్తున్న బొలేరో వాహనం అదుపు తప్పి బైక్‌ను ఢీ కొట్టడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన చివ్వెంల మండల కేంద్రం శివారులో సూర్యాపేట–ఖమ్మం రహదారిపై సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ నుంచి ఖమ్మం పట్టణానికి ఇంటి సామగ్రి లోడ్ కోసం వెళ్తున్న బొలేరో వాహనం.. చివ్వెంల మండల కేంద్రం శివారులో మోతె మండలం మామిళ్లగూడెం గ్రామం నుంచి సూర్యాపేటకు వస్తున్న బైక్‌ను ఢీ కొట్టింది. అనంతరం రహదారిపై పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో బొలేరోలో ప్రయాణిస్తున్న మహబూబ్‌నగర్‌కు చెందిన రవి, మహేష్ కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. అదేవిధంగా బైక్‌పై వెళ్తున్న వ్యక్తి తల, కాళ్లకు గాయాలయ్యాయి. అదే సమయంలో చివ్వెంల మండల కేంద్రంలో ఎన్నికల నామినేషన్లను పరిశీలించి సూర్యాపేటకు వెళ్తున్న ఎస్పీ నరసింహ సంఘటనను చూసి ఆగారు. రహదారిపై పడిఉన్న వాహనాన్ని స్వయంగా సిబ్బందితో కలిసి పక్కకు తీయించి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. అనంతరం క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సూర్యాపేట జనరల్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ విషయమై ఎస్ఐ మహేశ్వర్‌ను వివరణ కోరగా.. ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని తెలిపారు. -
గ్రామ శివారుకు తరలిన మద్యం దుకాణాలు
మునుగోడు : ఎంతో కాలంగా నల్లగొండ జిల్లా మునుగోడులోని ప్రధాన కూడలిలో కొనసాగుతున్న మద్యం దుకాణాలు గ్రామ శివారుకు తరలాయి. మద్యం దుకాణాలను ఊరికి దూరంగా ఏర్పాటు చేయాలని మండల ప్రజలు ఎన్నో రోజులుగా కోరుతూ వస్తున్నారు. దీనికితోడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సైతం ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మద్యం దుకాణాలు గ్రామ శివారుల్లో ఏర్పాటుచేయాలని, అలాగే సిట్టింగ్ అనుమతి కూడా ఉండొద్దని నెలరోజు క్రితం ఎకై ్సజ్ అధికారులకు సూచించారు. అదేవిధంగా కొత్తగా మద్యం దుకాణాలు దక్కించుకున్న యజమానులతో సమావేశమై మద్యం విక్రయాలపై పలు ఆంక్షలు విధించారు. దీంతో యజమానులంతా గ్రామ శివారులో మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి సోమవారం ప్రారంభించారు. మునుగోడులో మొత్తం నాలుగు దుకాణాలు ఉండగా నల్లగొండ రోడ్డులో ఒకటి, చండూరు రోడ్డులో మరొకటి, చౌటుప్పల్ రోడ్డులో ఇంకొకటి ప్రారంభించారు. నాలుగోది ఇంకా ప్రారంభించలేదు. పల్లెపహాడ్ గ్రామంలో విషాదంతుర్కపల్లి: తుర్కపల్లి మండలంలోని పల్లెపహాడ్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పల్లెపహాడ్ గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానం ఎస్సీ (మహిళ) రిజర్వ్ అయ్యింది. కాగా గ్రామానికి చెందిన పంగాల బాలరాజ్ భార్య పంగాల చంద్రకళను గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి పోటీ చేయాలంటూ గ్రామస్తులు ప్రోత్సహించారు. దీంతో ఆమె నామినేషన్ దాఖలు చేసింది. అయితే ఆదివారం రాత్రి గుండెపోటు రావడంతో బాలరాజు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఽతెలిపారు. బాలరాజు మరణంపై గ్రామస్తులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. -
రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక
వలిగొండ: మండలంలోని లోతుకుంట గ్రామ మోడల్‌స్కూల్ విద్యార్థి నకబోయిన బాల్‌రాజు రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికయ్యాడు. నల్లగొండ జిల్లా కనగల్‌లో జరిగిన ఉమ్మడి జిల్లాస్థాయి ఖోఖో పోటీల్లో బాలరాజు ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. దీంతో అతన్ని రాష్ట్రస్థాయికి ఎంపిక చేసినట్లు ఫిజికల్ డైరెక్టర్ ఐలయ్య తెలిపారు. నిబద్ధతకు మారుపేరు భారతీయులుమోత్కూరు : నమ్మకం, నిబద్ధతకు మారుపేరు భారతీయులని, అందుకే భారతీయులకు ప్ర పంచస్థాయిలో గుర్తింపు ఉందని మోత్కూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థి, డీఎస్పీ కొత్త బాలకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. అంతర్జాతీయంగా పేరొందిన మైక్రోసాప్ట్, గూగుల్ తదితర సంస్థలకు భారతీయులు సారథ్యం వహిస్తున్నారని పేర్కొన్నారు. కా ర్యక్రమంలో ఇండియన్ రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ గుర్రం లక్ష్మీనర్సింహారెడ్డి, ప్రిన్సిపాల్ పరశురాములు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ నరసింహారెడ్డి, స్టూడెంట్ కౌన్సిలర్లు లింగస్వామి, సీహెచ్అంజయ్య, లెక్చరర్లు ఈశ్వర్రావు, నరసింహ, వై.నర్సిరెడ్డి, ఎం.సుజాత, డి.మంజుల, సతీష్, కె.శ్యామ్ పాల్గొన్నారు. ఉపాధి పనుల్లో పారదర్శకత పాటించాలిభూదాన్పోచంపల్లి: ఉపాధిహామీ పనుల్లో పా రదర్శకత పాటించాలని, లక్ష్యానికి అనుగుణంగా పని చేయాలని అడిషనల్ డీఆర్డీఏ సురేశ్ అధికారులకు సూచించారు. సోమవారం భూదాన్‌పోచంపల్లిలోని మండల మహిళాస మాఖ్య భవనంలో నిర్వహించిన 16 వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పనులకు ఖర్చు చేసిన డబ్బులు, ఆడిట్ రిపోర్టులో వ్యత్యాసం లేదన్నారు. మెరుగైన పనితీరును కనబర్చిన సిబ్బందిని అభినందించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భాస్కర్, ఏపీఓ పీవీజీ కృష్ణమూర్తి, అంబుడ్మెన్ వీరమల్లు పాల్గొన్నారు. రక్తదానం.. మరొకరికి ప్రాణదానం చౌటుప్పల్ : రక్తదానం చేయడం వల్ల ప్రాణా పాయ స్థితిలో ఉన్నవారిని కాపాడవచ్చని చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. లింగోజిగూడెంలోని దివీస్ పరిశ్రమమ జనరల్ మేనేజర్ సత్యచంద్ర దివి వర్ధంతి సందర్భంగా సోమవారం కంపెనీలో రక్తదాన శిబిరాన్ని ప్రా రంభించి మాట్లాడారు. యువత రక్తం ఇచ్చేందుకు ముందుకురావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐ మన్మథకుమార్, దివీస్ పరిశ్రమ వైస్ ప్రెసిడెంట్లు రామకృష్ణ, హేమంత్‌కుమార్, పి.శ్రీనివాస్, జనరల్ మేనేజర్ పెండ్యాల సుధాకర్, లైజాన్ ఆఫీసర్లు బి.కిషోర్‌కుమార్‌చౌదరి, కె.శివప్రసాద్, ఆర్కేసీ ప్రతినిధులు సావిత్రి, మోహన్‌రావు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
నార్కట్‌పల్లి : నార్కట్‌పల్లి మండల కేంద్రంలోని నల్లగొండ చౌరస్తా వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్కట్‌పల్లికి చెందిన గుంటూరు అభిరామ్(21) నల్లగొండ క్రాస్ రోడ్డు వద్ద పండ్లు కొనుక్కునేందుకు వెళ్లాడు. అదే సమయంలో నల్లగొండ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న డీసీఎంను డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా నడపడంతో అదుపుతప్పి అభిరామ్‌ను ఢీకొట్టి ఎదురుగా షాపులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అభిరామ్ మృతిచెందగా.. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక కామినేని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ క్రాంతికుమార్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను నియంత్రించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
మీ చేతుల్లోనే నా భవిష్యత్తు
కోదాడ : దేశానికి పట్టుగొమ్మలు మన పల్లెలు.. ఇది జాతిపిత మహాత్మాగాంధీ నాకు ఇచ్చిన గొప్ప గౌరవం. కానీ పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లుగా నా పరిస్థితి తయారయ్యింది. నా పల్లె బిడ్డలకు కనీస సౌకర్యాలు కల్పించడానికి నానా కష్టాలు పడుతున్నాను. తాజాగా నా ఆలనాపాలన చూసేందుకు గ్రామ ప్రథమ పౌరుడిగా గౌరవాన్ని పొందడానికి ఆశావహులు ఎన్నికల బరిలో పోటాపోటీగా తలపడడానికి సిద్ధపడుతున్నారు. ఏడు దశాబ్దాల నా ప్రస్థానాన్ని ఒకసారి అవలోకనం చేసుకుంటే నాకు నిరాశే కలుగుతుంది. నా పరిస్థితి చూస్తే నాకే జాలేస్తుంది. అభివృద్ధిలో అందరికి ఆదర్శంగా ఉండాల్సిన నేను నా పల్లె బిడ్డలకు కనీస సౌకర్యాలను కూడా అందించలేకపోతున్నాను. గుంతలు పడిన రోడ్లు, కంపుకొడుతున్న మురికి కాలువలు, నాలుగు రోజులకు ఒకసారి వచ్చే నల్లా నీళ్లు, వెలగని వీధి దీపాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే నా సమస్యలు చాంతాడంత అవుతుంది. పట్టించుకోవాల్సిన పెద్ద నేతలు పట్టణాలకే పరిమితం అవుతుండడంతో నా పరిస్థితి నానాటికి తీసికట్టుగా తయారవుతుంది. అప్పుడప్పుడు ప్రభుత్వాలు అరకొర విదిల్చే నిధులతో నా వాకిట చేపడుతున్న పనుల్లో అధికారుల, పాలకుల కమీషన్ల కక్కుర్తి వల్ల నాణ్యత నేతి బీరకాయలో నెయ్యి అన్న చందంగా మారింది. సీసీ రోడ్లు కాస్తా ఛీ..ఛీ.. రోడ్లుగా దర్శనం ఇస్తున్నాయి. వీధి దీపాలు మిణుకు మిణుకుమంటూ నా వీధుల్లో మూడువందల అరవై రోజులు అమవాస్య చీకట్లే కనిపిస్తాయి. ఇక గ్రామంలో స్వైరవీహారం చేస్తూ చిన్నారులపై దాడి చేస్తున్న గ్రామ సింహాలను, ఇళ్లపై దండెత్తుతున్న వానర మూకలను కట్టడి చేయలేక, ఎవరికి చెప్పుకోవాలో తెలియక, నాలో నేనే మదనపడుతున్నాను. ఇదిలా ఉండగా నా గుండెల మీద కుంపటిలా వీధికి రెండు మూడు బెల్ట్ షాపులు వెలిసి మంచినీరు దొరకని చోట రేయింబవళ్లు మద్యం అమ్మకాలు చేస్తూ యువతను మత్తులో జోగేలా చేస్తున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించే వారి కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాను. గ్రామ స్వరాజ్యానికి బాటలు వేస్తారని.. ప్రజాస్వామ్యానికి పునాదైన పల్లెలు పటిష్టంగా ఉండాలంటే అది మీ చేతుల్లో, చేతల్లోనే ఉంది. ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకోవాల్సింది మీరే. మరో వారం, పది రోజుల్లో ఐదు సంవత్సరాలు నా, మీ బాగోగులు చూసే ప్రథమ పౌరుడిని ఎంపిక చేసుకొనే అవకాశం మీకు వచ్చింది. ఓటే వజ్రాయుధమంటారు. దాన్ని మీరు సక్రమంగా వినియోగించి మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి బాటలు వేస్తారని ఆశిస్తున్నాను. చివరగా గ్రామ సేవ చేయాలని సర్పంచ్‌గా నిలబడాలనుకుంటున్న ఔత్సహికులకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. సొంతూరిని బాగు చేసుకోవాలనే మీ సంకల్పం మంచిదే. దీని కోసం లక్షలు ఖర్చుచేసి అప్పులపాలై కుటుంబాలను వీధిన పడేయకండి. ప్రజా బలంతో నిజాయితీగా ఎన్నికకావడానికి ప్రయత్నించండి.. ఇట్లు మీ పల్లెడబ్బు, మద్యానికి ఓటు అమ్ముకోనుఫ ఇందూర్తిలో ఇంటి గోడపై రాసిన రామచంద్రంమర్రిగూడ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో డబ్బు, మద్యానికి ఓటును అమ్ముకోను అంటూ మర్రిగూడ మండలంలోని ఇందూర్తి గ్రామానికి చెందిన పగిళ్ల రామచంద్రం తన ఇంటి ప్రహరీపై రాసి ఉంచాడు. ప్రజలకు కనువిప్పు కావాలన్న ఉద్దేశంతో ఓట్లను డబ్బు, బిర్యానీకి అమ్ముకోవద్దని, ఓటును గ్రామాభివృద్ధికి పాటుపడే అభ్యర్థులకు స్వచ్ఛందంగా ఓటు వేసి గెలిపించుకోవాలని రామచంద్రం కోరారు. ఈ సందర్భంగా రామచంద్రం దంపతులను మేటిచందాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న ఏర్పుల యాదయ్య, ఏరుకొండ అబ్బయ్య శాలువాలతో ఘనంగా సన్మానించారు. -
ఊరికి సర్పంచే సుప్రీం
రామన్నపేట,చిట్యాల : గ్రామానికి సంబంధించిన సర్వాధికారాలు పంచాయతీవే. గ్రామపంచాయతీలో సర్పంచే సుప్రీం. గ్రామసభల తీర్మానాలే శాసనాలు. పంచాయతీరాజ్ 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థలో ఐదెంచెల విధానం అమలులోకి వచ్చింది. ఈ చట్టం గ్రామపంచాయతీలకు విశేష అధికారాలను కట్టబెట్టింది. గ్రామంలో వసతుల కల్పన గ్రామంలోని సమస్యల పరిష్కార వేదికగా గ్రామ పంచాయతీ ఉంటుంది. గ్రామపంచాయతీ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు అత్యంత కీలకమైనవి. గ్రామంలోని రోడ్లు, పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, వీధిదీపాల ఏర్పాటుతో పాటు పలు సౌకర్యాల కల్పనకు సంబంధించిన అంశాలను సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఈ సమావేశాలకు సర్పంచ్ అధ్యక్షత వహిస్తారు. గ్రామపంచాయతీ పాలకవర్గం గ్రామాభివృద్ధి కోసం చేపట్టిన పనులు, ఖర్చులు, భవిష్యత్‌లో చేపట్టబోయే పనులు, పథకాలకు అయ్యే ఖర్చులు, ఆదాయ వ్యయాలను ప్రజల దృష్టికి తీసుకు వచ్చేందుకు గ్రామసభను నిర్వహిస్తారు. ఈ సభలో చేసే తీర్మానాలను గ్రామచట్టాలుగా పరిగణిస్తారు. సర్పంచ్ విధులు, బాధ్యతలుu గ్రామపంచాయతీ సమావేశాలు, గ్రామసభలకు సర్పంచ్ అధ్యక్షత వహిస్తారు. సర్పంచ్ అందుబాటులో లేకపోతే ఉపసర్పంచ్ అధ్యక్షత వహిస్తారు. u గ్రామపంచాయతీ పాలకవర్గం, గ్రామసభల తీర్మానాలతో జరిగే పనులను పర్యవేక్షించడం. u రోజువారి కార్యాలయ నిర్వహణ, ప్రభుత్వం ఆమోదించిన మేరకు నిధులు ఖర్చు చేసే అధికారం సర్పంచ్‌కు ఉంటుంది. u పంచాయతీ కార్యదర్శి కార్యకలాపాలపై సర్పంచ్‌కు పరిపాలనా పరమైన అధికారం ఉంటుంది. u గ్రామ సర్పంచ్ గ్రామంలోని అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన నిధుల విడుదలకు చెక్ పవర్ కలిగి ఉంటాడు. u గ్రామ పంచాయతీ సర్పంచ్‌కు ప్రభుత్వం ప్రతినెలా రూ. 6500 వేతనాన్ని అందిస్తుంది. u ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికయ్యే సర్పంచ్‌పైన అవిశ్వాసం పెట్టే అధికారం సభ్యులకు ఉండదు. సక్రమంగా నిర్వర్తించక పోతేu గ్రామసభలు సకాలంలో నిర్వహించక పోవడం, ఆదాయ వ్యయాలపై ఆడిట్ చేయించక పోవడం, నిధుల దుర్వినియోగం జరిగినప్పుడు, అధికార దుర్వినియోగానికి పాల్పడినప్పుడు, పంచాయతీ నిర్వహణకు అవసరమైన ఉన్నతాధికారుల ఆదేశాలను పట్టించుకోని పక్షంలో సర్పంచ్‌లపై చర్యలు తీసుకునే అధికారం కలెక్టర్లకు ఉంటుంది. u సర్పంచ్ ఏదైన కారణం చేత రాజీనామా చేయాల్సి వస్తే రాజీనామా పత్రాన్ని జిల్లా పంచాయతీ అధికారికి ఇచ్చి పదవిలోంచి దిగిపోవాల్సి ఉంటుంది. u ఏదైన కారణంతో గ్రామ సర్పంచ్ పదవి ఖాళీ అయితే 120 రోజులలోపు ఎన్నిక నిర్వహించి తిరిగి కొత్త సర్పంచ్‌ను ఎన్నుకోవాల్సి ఉంటుంది. అప్పటి వరకు ఉపసర్పంచ్ బాధ్యతలు నిర్వహిస్తాడు. గ్రామ సర్వాధికారాలు పంచాయతీకే విశేష అధికారాలు కల్పించిన నూతన పంచాయతీరాజ్ చట్టం -
విద్యార్థులకు మానవీయ విలువలు నేర్పాలి
సూర్యాపేట టౌన్ : విద్యార్థులకు ఉపాధ్యాయులు మానవీయ విలువలు నేర్పించాలని అఖిల భారత విద్యావేదిక సభ్యుడు, ప్రొఫెసర్ జి. హరగోపాల్ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, డీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ యోగానందచారి ఉద్యోగ విరమణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వృత్తి నిబద్ధతకు, సామాజిక బాధ్యతకు లోబడి ఉపాధ్యాయులు పనిచేస్తేనే మంచి సమాజం నిర్మాణమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాలమూరు అధ్యయన వేదిక ప్రతినిధి రాఘవాచారి, డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. సోమయ్య, కార్యదర్శి లింగారెడ్డి, జిల్లా అధ్యక్షుడు పబ్బతి వెంకటేశ్వర్లు, అధ్యాపక జ్వాల ప్రధాన సంపాదకుడు ఎం. గంగాధర్, ప్రతినిధులు ఆర్. లింగయ్య, లక్ష్మణ్, సుదర్శన్, నాగయ్య, వేణు తదితరులు పాల్గొన్నారు. -
ఒక కుటుంబం.. ముగ్గురు సర్పంచ్‌లు
మఠంపల్లి: మఠంపల్లి మండలం పాతదొనబండతండాకు చెందిన సామాన్య గిరిజన కుటుంబానికి చెందిన ముగ్గురు సర్పంచ్‌లుగా పని చేశారు. గతంలో పెదవీడు గ్రామ పంచాయతీకి ఆవాసంగా ఉన్న దొనబండతండాకు చెందిన భూక్యా భక్షానాయక్ 1981లో పెదవీడు గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 1995లో పెదవీడు నుంచి దొనబండతండా విడిపోయి ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పడింది. 1995లో పంచాయతీకి మొదటి సారి జరిగిన ఎన్నికల్లో భక్షానాయక్ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. భక్షానాయక్ సతీమణి చాందీబాయి కూడా 2000 నుంచి 2005 వరకు దొనబండతండాకు సర్పంచ్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఆయన పెద్ద కుమారుడు హనుమానాయక్ 2006 నుంచి 2011 వరకు సర్పంచ్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ప్రజాక్షేత్రంలోనే కొనసాగుతున్నారు. ప్రస్తుతం వృద్ధాప్యంలో ఉన్న చాందీబాయి కూడా గ్రామంలోని గిరిజనులకు నేటికీ అన్ని రంగాల్లో సహాయ సహకారాలు అందిస్తున్నారు. భక్షానాయక్ కుటుంబం ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రజలకు సేవలందించి ఆదర్శంగా నిలిచింది. -
కుటుంబ సభ్యులందరూ ప్రజాప్రతినిధులే..
అనంతగిరి: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రజా ప్రతినిధులుగా పనిచేసే అవకాశం దక్కించుకున్నారు. ఉమ్మడి కోదాడ మండలం కొత్తగోల్‌తండాకు చెందిన బాణోతు పాశ్చానాయక్ 1964లో వార్డు సభ్యుడి ఎన్నికయ్యారు. ఆయన కుమారుడు బాణోతు బాబునాయక్ కొత్తగోల్‌తండా పంచాయతీ ఎన్నికల్లో 1996లో వార్డు మెంబర్‌గా, 2006లో సర్పంచ్‌గా పోటీచేసి విజయం సాధించారు. 2013లో బాబునాయక్ తల్లి బాణోతు మంగ్లీ సర్పంచ్‌గా గెలుపొందారు. బాబునాయక్ పెద్ద కుమార్తె ధరావత్ ధనలక్ష్మి 2014లో జెడ్పీటీసీగా విజయం సాధించింది. 2019లో బాబునాయక్ చిన్నకుమార్తె బాణోతు త్రివేణి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.ఫ ముగ్గురు సర్పంచ్‌లుగా, ఒకరు జెడ్పీటీసీ, మరొకరు వార్డుమెంబర్ -
15 ఏళ్లు సర్పంచ్‌గా..
రాజాపేట : యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బొందుగుల గ్రామానికి చెందిన సంఘం నారాయణరెడ్డి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొనడంతో పాటు గ్రామ సర్పంచ్‌గా 15ఏళ్ల పాటు పని చేశారు. 1957లో బొందుగుల గ్రామానికి మొదటి సర్పంచ్‌గా ప్రభుత్వం ఆయనను నామినేట్ చేసింది. ఆతరువాత జరిగిన ఎన్నికల్లో వరుసగా రెండు పర్యాయాలు సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. అనంతరం ఆయన తల్లి మాణిక్యమ్మ కూడా సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. తాను సర్పంచ్‌గా ఉన్న సమయంలో చెరువుల నిర్మాణం, సాగులో ఆధునిక పద్ధతులు ప్రవేశ పెట్టించారు. కలరా, మసూచి వంటి వ్యాధులతో పాటు పాము, తేలుకాటుకు తాను నేర్చుకున్న ఆయుర్వేద వైద్యంతో మందులు అందించారు. ఆయన ప్రజలతో మమేకమై ఉంటుండడంతో గ్రామ ప్రజలు ఆయనను సంఘం నారాయణరెడ్డికి బదులుగా బొందుగుల నారాయణరెడ్డిగా పిలిచేవారు. నారాయణరెడ్డి 1994లో మృతి చెందారు. ఊట్కూరులో ‘నర్సింగ్’ కుటుంబానిదే హవా నిడమనూరు : నిడమనూరు మండలం ఊట్కూరు గ్రామంలో రెండు దశాబ్దాలుగా నర్సింగ్ కృష్ణయ్య కుటుంబం నుంచే సర్పంచ్‌గా గెలుపొందుతున్నారు. నర్సింగ్ కృష్ణయ్య 2006లో, ఆయన భార్య సత్యమ్మ 2013లో వరుసగా రెండు పర్యాయాలు సర్పంచ్‌లుగా కొనసాగగా.. 2019లో వారి కుమారుడు నర్సింగ్ విజయ్‌కుమార్ సర్పంచ్‌గా గెలుపొందారు. నాకు గెలుపు యోగ్యం ఉందా..!● జ్యోతిష్యులను ఆశ్రయిస్తున్న సర్పంచ్ అభ్యర్థులు హాలియా : పంతులూ.. ఎన్నికల బరిలో దిగితే గెలుస్తానా, నా జాతక చక్రం ఎలా ఉందంటూ నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని ఆయా గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచే ఆశావహులు పలువురు జ్యోతిష్యులు, పురోహితులను ఆశ్రయిస్తున్నారు. మాకు అనుకూలంగా రిజర్వేషన్ ఉంది, సర్పంచ్ కావాలని ఎప్పటి నుంచో కోరిక ఉంది, పోటీ చేయాలనుకుంటున్నా.. ఇంతకు నా జాతకం బాగుందా..? నామినేషన్ ఎప్పుడు వేయాలి. పక్కాగా గెలుస్తానా అని ఆరా తీస్తున్నారు. ఫలానా పంతులు బాగా చెబుతాడు అంటే అక్కడికి వెళ్లి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కొంతమంది ఆశావహులు పురోహితులు, జ్యోతిషుల సూచన మేరకు పలు ఆలయాల్లో పూజలు, అభిషేకాలు చేయిస్తుండగా.. మరికొంత మంది ఆశావహులు తిధి, నక్షత్రం, ముహూర్త బలం చూసుకొని నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. -
సర్పంచ్ ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలి
ఫ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతిప్పర్తి : సర్పంచ్ ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రభుత్వం చూడాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కోరారు. తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామ సర్పంచ్ అభ్యర్థి మామిడి నాగలక్ష్మి భర్త యాదగిరిని ఇటీవల కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేయడంతో తీన్మార్ మల్లన్న ఆదివారం బాధితుడు యాదగిరిని పరామర్శించారు, అగ్రవర్ణాల వారు బీసీలను ఇబ్బంది పెడుతున్నారన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బీసీలకు క్షమాపణలు చెప్పాలని అన్నారు. యాదగిరిని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేయడం సరికాదన్నారు. అరాచక శక్తులను కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రోత్సహిస్తున్నారన్నారు. నల్లగొండ నియోజకవర్గంలో బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎల్ల ప్పుడూ బీసీలకు అండగా ఉంటుందన్నారు. జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి ఎల్లమ్మగూడెంలో సర్పంచ్ ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని, బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలాని తీన్మార్ మల్లన్న కోరారు. ఆయన వెంట వట్టె జానయ్య, సైదులు, బీసీ సంఘం నాయకులు తదితరులు ఉన్నారు. -
యాదగిరిగుట్టలో అన్నప్రసాద కేంద్రం ప్రారంభం
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆధ్యాత్మిక వాడలో అధునాత హంగులతో వేగేశ్న ఫౌండేషన్ సహకారంతో నిర్మించిన శ్రీ శాంతా రుష్య శృంగ అన్నప్రసాద కేంద్రాన్ని ఈఓ వెంకట్రావ్, అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తితో కలిసి ఆదివారం వేగేశ్న ఫౌండేషన్ నిర్వాహకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వేగేశ్న ఫౌండేషన్ అధినేత అనంతకోటి రాజు మాట్లాడుతూ.. గత 25 సంవత్సరాలుగా ఆయా ఆలయాలకు వచ్చే భక్తులకు తమ ఫౌండేషన్ ద్వారా అన్నప్రసాదం అందజేస్తున్నామని తెలిపారు. గతంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం, ద్వారకా తిరుమలలో అన్నప్రసాద కేంద్రాలను ప్రారంభించామని, ఇప్పుడు యాదగిరిగుట్ట ఆలయంలో ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఇందుకు సహకరించిన గత, ప్రస్తుత ప్రభుత్వంతో పాటు ఆలయ అధికారులు పూర్తిగా సహకరించారన్నారు. అనంతరం ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి మాట్లాడుతూ.. 5 ఏళ్ల క్రితం వేగేశ్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రారంభమైన అన్నప్రసాద కేంద్రాన్ని రూ.21కోట్లతో అద్భుతంగా నిర్మించినట్లు పేర్కొన్నారు. మొదటి రోజు అన్నప్రసాద కేంద్రంలో పులిహోర, సిర, చిన్న లడ్డూ, మిర్చి, పన్నీరు కూర్మ, ఆలు కర్రీ, పెరుగు, పప్పుచారు, టమాట పచ్చడి, పాపడం భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వేగేశ్న ఫౌండేషన్ నిర్వాహకులు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
జాతీయ రహదారిపై వాహనాల రద్దీ
చౌటుప్పల్ : విజ యవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆదివారం చౌటుప్పల్ పట్టణంలో వాహనాల రద్దీ నెలకొంది. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో సైతం ప్రయాణికులు కిటకిటలాడారు. ఉదయం 11గంటల వరకు విజయవాడ మార్గంలో వాహనాల రద్దీ ఉండగా, సాయంత్రం తర్వాత నుంచి అర్ధరాత్రి వరకు హైదరాబాద్ మార్గంలో రద్దీ ఉంది. దీంతో చౌటుప్పల్ పట్టణంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వాహనాలు సాఫీగా వెళ్లేందుకుగాను ట్రాఫిక్ పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సు సర్వీసులు లేక చౌటుప్పల్ బస్టాండ్‌లో గంటల తరబడి నిరీక్షించారు. ‘కల వస్తే బాగుండును’ పుస్తకావిష్కరణనల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఆదివారం మట్టి కవి, ప్రొఫెసర్ బెల్లి యాదయ్య సాహిత్య మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బెల్లి యాదయ్య రచించిన ‘కల వస్తే బాగుండును’ కవితా సంపుటిని ప్రకృతి కవి జయరాజు ఆవిష్కరించి మాట్లాడారు. బెల్లి యాదయ్య నేటి సమాజం కోసం ఎన్నో మంచి పుస్తకాలు రచించారని కొనియాడారు. అనంతరం బెల్లి యాదయ్య కవిత్వం, సాహిత్య దృక్పథంపై పరిశోధకుడు, హైకోర్టు న్యాయవాది విప్లవ్‌కుమార్ చేసిన పరిశోధనా పుస్తకం అవుట్‌లుక్‌ను సినీ రచయిత, జాతీయ అవార్డు గ్రహీత సుద్దాల అశోక్ తేజ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాశీం, ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, ఆనందం, అనితారాణి, తెలంగాణ వాగ్గేయకారుడు చింతల యాదగిరి, కృష్ణ కౌండిన్య, పగడాల నాగేందర్, కవి మునాస వెంకట్ పాల్గొన్నారు. -
గేటు పడితే.. గుండెల్లో రైళ్లు
ఆలేరురూరల్ : గుండ్లగూడెం రైల్వే గేటు మీదుగా వెళ్లాలంటేనే ప్రయాణికులు అమ్మో అంటూ భయపడే పరిస్థితి నెలకొంది. గేటు పడితే ఎండైనా.. వానొచ్చినా.. అరగంట పైగా వేచి ఉండాల్సిందే.. నాలుగైదు రైళ్లు వెళ్లే వరకూ గేటు తీయకపోవడంతో 30 నిమిషాల పాటు నిలిచి ఉండాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. ఏళ్లతరబడి ఇదే సమస్య నెలకొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైల్వేగేటు స్థానంలో అండర్‌పాస్, లేదా ఫ్లయ్ ఓవర్ నిర్మించి సమస్య పరిష్కరించాలని గుండ్లగూడెం, శివలాల్ తండా, పటేల్‌గూడెం, శ్రీనివాస్పురంతో పాటు మరికొన్ని గ్రామాల ప్రజలు కోరుతున్నారు. 150 వరకు రైళ్ల రాకపోకలుఆలేరు పట్టణ పరిధిలో సుమారు 7 కిలో మీటర్ల మేర రైల్వే లైన్ విస్తరించి ఉంది. ఈ మార్గంలో సికింద్రాబాద్–ఖాజీపేట, నాందేడ్, సిర్పూర్ ఖాగజ్‌నగర్, ముంబయి, ఢిల్లీ వైపు ప్యాసింజర్, గూడ్స్ రైళ్లు కలిపి రోజూ 100 నుంచి 150 రైళ్ల వరకు రాకపోకలు సాగిస్తుంటాయి. ప్యాసింజర్ రైలు వచ్చిన ప్రతీసారి 5 నుంచి 10 నిమిషాలు గేట్ పడుతుంది. అదే గూడ్స్ రైలు వస్తే కనీసం 15 నిమిషాలు గేట్ వేస్తున్నారు. రైలు వెళ్లాక గేటు ఎత్తాలంటే మరో 10 నిమిషాలైనా వేచి ఉండాలి. దీంతో కాలినడకన ప్రయాణికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదొక్కటే మార్గంగుండ్లగూడెం, శివలాల్‌తండా, పటేల్‌గూడెం, శ్రీనివాస్పురంతో పాటు ఇతర ప్రాంతాల ప్రజలు రాకపోకలు సాగించాలంటే గుండ్లగూడెం రైల్వే గేట్ మీదుగా ఉన్న మార్గం ఒక్కటే. వారంతా ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులు.. ఇలా వివిధ పనుల నిమిత్తం ఆలేరు, భువనగిరి తదితర ప్రాంతాలకు వెళ్లొస్తుంటారు. వందల సంఖ్యలో విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్తుంటారు. రైలు వచ్చిన ప్రతీసారి ఐదు నిమిషాల ముందే గేట్ పడుతుండటంతో యాతన పడుతున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు సకాలంలో గమ్యస్థానాలకు చేరుకోలేకపోతున్నారు. అంబులెన్స్ వచ్చినా ఆగాల్సిందే. అత్యవసరం ఉంటే 12 కిలో మీటర్లు జనగాం అయినా వెళ్లాలి, లేదా చుట్టూ 8 కిలో మీటర్ల తిరిగి ఆలేరుకు రావాలి.రైల్వే గేట్ దాటడానికి ప్రజ లు, ప్రయాణికులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం, ఓ రైలు పోతుందనుకుంటే మరొకటి వస్తుంది. కొన్ని సందర్భాల్లో అరగంట వరకు నిలబడాల్సి వస్తుంది. కొందరు గేటు దాటే ప్రయత్నంలో ప్రాణాలు పోగోట్టుకున్నారు. ఇప్పటికైనా అండర్‌పాస్ నిర్మించాలి. – బండ జహంగీర్, పటేల్‌గూడెం, ఆలేరు మండలంగుండ్లగూడెం రైల్వే గేట్ వద్ద నిత్యం నరకం ఫ ఇరువైపులా భారీగా నిలిచిపోతున్న వాహనాలు ఫ ఇబ్బందులు పడుతున్న ప్రజలు, ప్రయాణికులు ఫ సాకారం కాని అండర్‌పాస్ కలగతం కంటే రైళ్ల సంఖ్య పెరిగింది. ప్రయాణికుల రైళ్లు, గూడ్సు రైళ్లు కలిపి రోజూ వందకు పైనే పోతుంటాయి. అరగంటకోసారి గేటు పడుతుండటంతో వివిధ పనులు నిమిత్తం ఆలేరు, జనగామ, భువనగిరికి వివిధ పనులకు వెళ్లేవారు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నాం. ఎమ్మెల్యే చొరవ చూపితే సమస్య తీరుతుంది. – ఏసీరెడ్డి. మహేందర్‌రెడ్డి, గుండ్లగూడెం మాజీ సర్పంచ్ దీక్షలు, నిరసనలుగుండ్లగూడెం రైల్వే గేట్ వద్ద అండర్‌పాస్ లేదా ఫ్లై ఓవర్ నిర్మించాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. ఆయా గ్రామాల ప్రజలు పలుమార్లు ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేపట్టడంతో పాటు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఇటీవల బీజేపీ నాయకులు ఆలేరులో రిలే నిరాహర దీక్ష చేయగా.. స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వచ్చి ఆరు నెలల్లో అండర్‌పాస్ మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. -
సర్పంచ్‌లకు 110.. వార్డు సభ్యులకు 166
సాక్షి,యాదాద్రి: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మలిదశలోకి ప్రవేశించింది. ఇప్పటికే మొదటి విడత సజావుగా పూర్తికాగా.. ఆదివారం నుంచి రెండో విడత నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు ఆదివారం ఉదయం నోటిఫికేషన్ విడుదల చేశారు. రెండో విడతలో భువనగిరి, భూదాన్‌పోచంపల్లి, బీబీనగర్, వలిగొండ, రామన్నపేట మండలాల్లోని 150 పంచాయతీలు, 1,332 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల స్వీకరణకు 46 క్లస్టర్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరించారు. ఈనెల 2వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. మొదటి రోజు సర్పంచ్ స్థానాలకు 110, వార్డులకు 166 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆలస్యంగా ప్రారంభం..నామినేషన్ల ప్రక్రియ ఆలస్యంగా మొదలైంది. నామినేషన్ల పత్రాలకు జతపర్చాల్సిన సర్టిఫికెట్లు, బ్యాంకు అకౌంట్లు అందడం జాప్యం కావడంతో మధ్యాహ్నం తర్వాత ప్రారంభమై నాలుగు గంటల తర్వాత ఊపందుకున్నాయి. సోమ, మంగళవారాల్లో నామినేషన్లు భారీగా దాఖలయ్యే వకాశం ఉంది. వలిగొండ, రామన్నపేట, ఇంద్రపాలనగరం తదితర గ్రామాల్లో నామినేషన్లను కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. తొలి విడుత ఎన్నికలు జరిగే స్థానాల్లో సర్పంచ్ అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లలో ఒకటి తిరస్కరణకు గురైంది. తుర్కపల్లి మండలంలోని ఓ పంచాయతీ జనరల్ కావడంతో భార్యాభర్తలు ఇద్దరూ నామినేషన్ వేశారు. భార్య నామినేషన్న సరిగా నింపకపోవడంతో ఎన్నికల అధికారులు తిరస్కరించారు. వార్డు సభ్యుల నామినేషన్లు తుర్కపల్లి మండలంలో 9, ఆత్మకూర్(ఎం) 2, యాదగిరిగుట్ట, బొమ్మలరామారం మండలాల్లో ఒక్కోటి చొప్పున తిరస్కరణకు గురయ్యాయి. రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం ఫ తొలి రోజు తక్కువగా దాఖలు ఫ నేడు, రేపు రెట్టింపు సంఖ్యలో పడే అవకాశంసర్పంచ్ స్థానాలకు దాఖలైన నామినేషన్లు మండలం జీపీలు నామినేషన్లుపోచంపల్లి 21 15 భువనగిరి 34 31 బీబీనగర్ 34 24 వలిగొండ 37 17 రామన్నపేట 24 23 మొత్తం 150 110 వార్డు సభ్యులకు.. పోచంపల్లి 192 24 భువనగిరి 294 64 బీబీనగర్ 284 53 వలిగొండ 330 14 రామన్నపేట 232 11 మొత్తం 1,332 166 -
శ్రీకాంతాచారి వర్ధంతికి తరలిరావాలి
మోత్కూరు : తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతిని డిసెంబర్ 3న హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్లో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించ తలపెట్టిందని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దామరోజు వీరాచారి తెలిపారు. ఆదివారం ఆయన మోత్కూరులో విలేకరులతో మాట్లాడుతూ.. శ్రీకాంతాచారి ప్రాణాలర్పించడం వల్లే తెలంగాణ ఉద్యమం మలుపు తిరిగిందన్నారు. ఆయన ప్రాణత్యాగం తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరిచిపోరన్నారు. వర్ధంతి కార్యక్రమానికి ఉద్యమకారులు పెద్దసంఖ్యలో తరలివచ్చి శ్రీకాంతాచారికి నివాళులర్పించాలని కోరారు. జిల్లాలోనే శ్రీకాంతాచారి వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలిభువనగిరి : 2010కి ముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) నాయకులు డిమాండ్ చేశారు. తపస్ జిల్లా అధ్యక్షురాలు రేపాక ఉమ ఆధ్వర్యంలో ఆదివారం భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. రెండేళ్లలో టెట్ పాస్ కావాలనే నిబంధన పెట్టడం సమంజసం కాదన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో టెట్‌పై ప్రస్తావించాలని వారు ఎంపీని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో తపస్ జిల్లా గౌరవ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, యాదగిరిగుట్ట, రాజా పేట, తుర్కపల్లి మండలాల అధ్యక్షులు సైదారావు, జానయ్య, మంజుల ఉన్నారు. నేటి నుంచి కొత్త వైన్స్‌లు సాక్షి యాదాద్రి : నూతన మద్యం పాలసీ సోమవారం నుంచి ప్రారంభంకానుంది. రెండేళ్లకాల పరిమితితో జిల్లాలో 84 మద్యం షాపులను డ్రా పద్ధతిలో కేటాయించిన విషయం తెలిసిందే. పాత దుకాణాలకు నవంబర్ 30వ తేదీతో గడువు పూర్తి కావడంతో నేటి నుంచి కొత్త వైన్స్‌లు తెరుచుకోనున్నాయి. టెండర్లు దక్కించుకున్న వ్యాపారులు అవసరమైన సర్టిఫికెట్లను ఎకై ్సజ్ అధికారులకు సమర్పించి మద్యం దుకాణాలు ప్రారంభించేందుకు లైసెన్స్ పొందారు. పాత వైన్స్‌లు నిర్వహించిన చోటే కొత్తవాటి ఏర్పాటుకు వ్యాపారులు అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే స్థానికుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో వేరే చోటుకు మారాయి. -
పట్టణదారి.. నరకంగా మారి
ప్రశాంత్‌నగర్, చెక్‌పోస్టు ప్రాంతా ల్లో పైప్‌లైన్ వేయడానికి రోడ్లను తవ్వి వదిలేశారు. అధికారులు పట్టించుకోవడం లేదు. రోడ్లపై కంకర, మట్టి పెల్లలు అదే విధంగా ఉండటంతో వాహనదారులు కింద పడుతున్నారు. వెంటనే మరమ్మతులు చేయాలి. –బుచ్చిబాబు, ప్రశాంత్నగర్యాదగిరిగుట్ట: అత్యవసరం పేరుతో చేపడుతున్న రోడ్ల తవ్వకాలతో ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు. తిరిగి మరమ్మతులు చేపట్టకపోవడంతో రాకపోకలు సాగించేందుకు నానా యాతన పడుతున్నారు.యాదగిరిగుట్టలో అమృత్ 2.0 స్కీం కింద తాగునీటి పైప్లైన్లు వేస్తున్నారు. ఇందులో భాగంగా కొత్తగుండ్లపల్లిలోని చెక్‌పోస్టు వద్ద నిర్మిస్తున్న ఓవర్ హెడ్ ట్యాంకులకు నీటిని సరఫరా చేసేందుకు ప్రశాంత్‌నగర్, చెక్‌పోస్టు ప్రాంతాల్లో 10 కిలో మీటర్ల మేర తవ్వకాలు జరిపారు. ఇందులో 2 కిలో మీటర్లకు పైగా నివాస గృహాల ముందు నుంచి పైప్‌లైన్ వేశారు. రోడ్లను తవ్విన కాంట్రాక్టర్లు తిరిగి మరమ్మతులు చేపట్టలేదు. సిమెంట్, కంకర తొలగించకుండా ఎక్కడికక్కడ వదిలేయడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఫ గుట్టలో భగీరథ పైపులైన్ల కోసం తవ్వకాలు ఫ మరమ్మతులకు దిక్కులేదు -
నారాయణపురం వాసికి డాక్టరేట్
సంస్థాన్‌నారాయణపురం: మండల కేంద్రానికి చెందిన ఎస్.గోవర్థన్ అన్నమలై యూ నివర్సిటీ నుంచి పీహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్‌కు ఎంపికయ్యాడు. ఫర్ఫార్మెన్స్ ఈవాల్యుయేషన్ ఆఫ్ గోల్డ్ ఎక్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఇన్ ఇండియా– ప్రీ అండ్ పోస్ట్ కోవిడ్–19 సీనారియో.. అనే అంశంపై గోవర్థన్ పరిశోధన చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేస్తూ ఎంబీఏ విభాగానికి హెచఓడీగా కొనసాగుతున్నారు.యాదగిరీశుడికి సంప్రదాయ పూజలుయాదగిరిగుట్ట: యాదగిరీశుడి క్షేత్రంలో ఆదివారం సంప్రదాయ పర్వాలు అర్చకులు ఆగమశాస్త్రం ప్రకారం నేత్రపర్వంగా చేపట్టారు. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు.. స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాతం సేవ చేపట్టారు. గర్భాలయంలోని స్వయంభూలకు నిజాభిషేకం, తులసీదళ అర్చన చేశారు. అనంతరం ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, ఆ తరువాత గజవాహన సేవ, స్వామి, అమ్మవారికి నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర కై ంకర్యాలు గావించారు. సాయంత్రం వెండి జోడు సేవలను ఆలయంలో భక్తుల మధ్య ఊరేగించారు. -
సజావుగా నామినేషన్ల స్వీకరణ
వలిగొండ : నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా కొనసాగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. వలిగొండ, పుల్లిగిల్లలో నామినేషన్ కేంద్రాలను సందర్శించి నామినేషన్ ప్రక్రియను పర్యవేక్షించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ)కి సూచనలు చేశారు. నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అనంతరం నాగారం వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును తనిఖీ చేశారు. మద్యం, డబ్బు అక్రమ రవాణా జరగకుండా నిఘా ఉంచాలని, ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని పేర్కొన్నారు. ఆయన వెంట డీఆర్డీఓ నాగిరెడ్డి, ఎంపీడీఓ జలేందర్ రెడ్డి, తహసీల్దార్ దశరథ పాల్గొన్నారు.ఫ కలెక్టర్ హనుమంతరావు -
40 ఏళ్లు సర్పంచ్‌గా..
కనగల్: కనగల్ మండలంలోని చర్లగౌరారం గ్రామానికి చెందిన చిలకరాజు చిన మారయ్య చర్లగౌరార, పర్వతగిరి, దర్వేశి పురం ఉమ్మడి గ్రామపంచాయతీకి 1957లో సర్పంచ్‌గా నామినేట్ అయ్యారు. అప్పటి నుంచి 1977 వరకు 20 ఏళ్లపాటు సర్పంచ్‌గా పనిచేశారు. ఆ తర్వాత పర్వతగిరి, దర్వేశిపురం, చర్లగౌరారం గ్రామాలు మూడు ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పడ్డాయి. ఈ క్రమంలో 1977లో చర్లగౌరారం గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో చిన మారయ్య విజయం సాధించి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి కంటిన్యూగా 20 ఏళ్ల పాటు సర్పంచ్‌గా కొనసాగారు. ఇలా ఏకధాటిగా 40 ఏళ్లపాటు సర్పంచ్‌గా పనిచేసిన వ్యక్తిగా రికార్డుల్లోకి ఎక్కారు. 1997లో ఆయన మృతిచెందారు. ఎలాంటి మద్యం, డబ్బును ఆశించకుండా స్వచ్ఛందంగా మారయ్యకు ఓటేసినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. నామినేషన్ తిప్పలుయాదగిరిగుట్ట రూరల్ : సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ వేయడానికి అభ్యర్థులు నానా పాట్లు పడుతున్నారు. యాదగిరిగుట్ట మండలం లప్పానాయక్ తండా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు శనివారం దాతర్పల్లి క్లస్టర్ కేంద్రానికి వచ్చాడు. అయితే అక్కడ జిరాక్స్ మిషన్ అందుబాటులో లేదని తెలుసుకుని.. ఆ అభ్యర్థి స్వయంగా జిరాక్స్ మిషన్‌ను తన వెంట తెచ్చుకున్నాడు. నామినేషన్‌కు వేయడానికి కావాల్సిన పత్రాలను జిరాక్స్ మిషన్ సహాయంతో ప్రింట్ తీసుకుని నామినేషన్ సమర్పించాడు. అతడితో పాటు తన వెంట వచ్చిన వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసే వారు సైతం ఈ జిరాక్స్ మిషన్ సహాయంతో తగిన పత్రాలను జిరాక్స్ తీసుకుని తమ నామినేషన్ల ప్రక్రియ పూర్తిచేశారు. -
కేసీఆర్ దీక్షతోనే కేంద్రం దిగొచ్చింది
భువనగిరి : స్వరాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన అమరణ దీక్షతోనే నాటి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. శనివారం భువనగిరిలోని ప్రిన్స్ చౌరస్తా వద్ద నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో నవంబర్ 29వ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం చావు అంచులదాకా వెళ్లిన గొప్ప నాయుకుడు కేసీఆర్ అని, అలాంటి నాయకుడిపై ఎవరైనా నోరు జారితే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. తెలంగాణ సమాజానికి కేసీఆర్ దేవుడని, ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న మహానేత అని కొనియాడారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీరు అందించిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. కాంగ్రెస్ నాయకులు అనుభవిస్తున్న పదవులు కేసీఆర్ చలువేనని పేర్కొన్నారు. అటువంటి మహానేతను ఆరోగ్యం బాగలేదని కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేయడం దారుణమన్నారు. తెలంగాణ అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యమని, మళ్లీ సీఎం కావడం ఖాయమన్నారు. రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ నుంచి విముక్తి కలిగే వరకు పోరాటం చేస్తామన్నారు.అంతకుముందు అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గొంగిడి సునీత, గాదరి కిషోర్‌కుమార్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, భిక్షమయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, కల్లూరి రాంచంద్రారెడ్డి, గాదె నరేందర్‌రెడ్డి, రాకేశ్‌రెడ్డి, కొల్పుల అమరేందర్, పట్టణ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఏవీ కిరణ్‌కుమార్, రచ్చ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ తెలంగాణకు కాంగ్రెస్ నుంచి విముక్తి కలిగే వరకు పోరాటం -
కోడ్ ఉల్లంఘిస్తే.. ఎన్నికలకు దూరం
భువనగిరిటౌన్ : గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన నాటినుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి(మోడ్ ఆఫ్ కండక్ట్) అమల్లోకి వచ్చింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ కోడ్ అమల్లో ఉంటుంది. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేందుకు ఎన్నికల సంఘం కొన్ని నిబంధనలను రూపొందించింది. దీనినే ‘మోడల్ ఆఫ్ కండక్ట్’ అంటారు. ఏదైనా రాజకీయ పార్టీ, అభ్యర్థి ఈ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే ఎన్నికల సంఘం వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినవారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించే అవకాశం ఉంటుంది. అవసరమైతే ఎన్నికల సంఘం వారిపై క్రిమినల్ కేసును దాఖలు చేయవచ్చు. నేరం రుజువైతే జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది. ● ఎన్నికల నిర్వహణతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధమున్న అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లపై నిషేధం ఉంటుంది. ఎవరైనా అధికారి బదిలీ అవసరమని భావిస్తే ముందస్తు అనుమతి తీసుకోవాలి. ● కోడ్ ప్రాంతాల్లో లౌడ్ స్పీకర్లు ఉపయోగించరాదు. ఊరేగింపులు, బహిరంగ సభలు నిర్వహించవద్దు. ● మంత్రులు, ఇతర అధికారులు కొత్త పథకాలు లేదా ప్రాజెక్టులకు ఆర్థిక గ్రాంట్‌ను, వాటికి సంబంధించిన హామీలను ప్రకటించకూడదు. ఎక్కడ శంకుస్థాపనలు చేయడానికి వీల్లేదు. మంత్రులు అధికారిక యంత్రాంగాన్ని, వాహనాలను వినియోగించరాదు. ● ఎవరైనా అధికారి, సిబ్బంది మంత్రిని కలిస్తే తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్‌న్ 218లో పేర్కొన్న విధంగా సర్వీసు నిబంధనలను ఉల్లంఘించినట్లు భావించి క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలి. ● ఎన్నికలు ప్రకటించిన సమయం నుంచి మంత్రులు ఇతర అధికారులు విచక్షణ నిధుల నుంచి గ్రాంట్లు/చెల్లింపులను మంజూరు చేయవద్దు. ● గృహ నిర్మాణ పథకం మంజూరై, పని ప్రారంభిస్తే, లబ్ధిదారులకు నిబంధనల ప్రకారం సహాయం అందాలి. ఈ ఎన్నికలు పూర్తయ్యేవరకు కొత్త నిర్మాణాలను చేపట్టడం లేదా కొత్త లబ్ధిదారులకు సహాయాన్ని మంజూరు చేయడం చేయరాదు. ● కరవు, వరదలు, తెగుళ్లు, ఇతర ప్రకతి వైపరీత్యాలు సంభవిస్తే బాధిత ప్రజలకు సహాయాన్ని ఎస్ఈసీ అనుమతితో ప్రభుత్వం అందించాలి. 1960 కేరళ అసెంబ్లీ ఎన్నికలతో శ్రీమోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్శ్రీ మొదలైంది. రాజకీయ పార్టీలతో చర్చలు జరిపి అంగీకారం తెలిపిన తర్వాతే ప్రవర్తనా నియమావళిని సిద్ధం చేశారు. ఇందులో ఎలాంటి నిబంధనల్ని పాటించాలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు నిర్ణయించుకున్నారు. 1962 సార్వత్రిక ఎన్నికల తర్వాత, 1967 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రవర్తనా నియమావళిని అనుసరించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఒక వ్యక్తి రూ.50 వేల నగదు మాత్రమే తన వెంట తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. అంతకన్నా ఎక్కువ డబ్బు ఉండి దానికి సంబంధించిన సరైన పత్రాలు చూపలేక పోతే ఆ డబ్బులను పోలీసులు సీజ్ చేస్తారు. తక్కువ మొత్తంలో దొరికిన డబ్బును రెవెన్యూ అధి కారుల వద్ద జమ చేస్తారు. ఎక్కువగా ఉంటే ఎన్నికల అధికారులు ఆదాయ పన్ను, జీఎస్టీ అధికారులకు సమాచారం అందించి సదరు డబ్బులను కోర్టులో జమ చేస్తారు. -
చికిత్స పొందుతూ మృతి
శాలిగౌరారం : కుటుంబ సమస్యలతో పురుగుల మందు తాగిన గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ ఉద్యోగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందాడు. శాలిగౌరారం మండలం ఊట్కూరు గ్రామానికి చెందిన బుర్రె రాములు–యల్లమ్మ దంపతులకు దంపతులకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు సంతానం. రెండో కుమారుడు బుర్రె మహేశ్(28) స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో మల్టీపర్పస్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. మహేశ్ తండ్రి రాములు మూడేళ్ల క్రితం పక్షవాతానికి గురై మంచాన పడ్డాడు. ఉన్నారు. పెద్ద కుమారుడితో పాటు కుమార్తెల వివాహాలు చేశారు. ఈ నేపథ్యంలో రాములు కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో మనోవేదనకు గురైన మహేశ్ ఈ నెల 27న ఇంటి వద్ద పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి నకిరేకల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పర్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. మహేశ్ కళ్లను హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి దానం చేశారు. -
హైవేలపై ఇక నో టెన్షన్
ఆలేరు బైపాస్ వద్ద జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ బోర్డు ఆలేరు: నేషనల్ హైవేలపై ప్రయాణించే వారికి భద్రత, మెరుగైన సౌకర్యం కల్పించేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) ప్రత్యేక దృష్టి సారించింది. జాతీయ రహదారుల పొడవునా క్యూఆర్ (క్విక్ రియాక్షన్)కోడ్లతో కూడిన సమాచార సైన్బోర్డులను ఏర్పాటు చేస్తోంది. ప్రయాణికులకు ఏదైనా అత్యవసర సమయం ఎదురైనపుడు తక్షణమే సులభంగా సేవలు కల్పించేందుకు క్యూఆర్ కోడ్లు దోహదపడుతాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. 13 చోట్ల క్యూఆర్ కోడ్లు హైదరాబాద్ – వరంగల్ జాతీయ రహదారిపై రాయగిరి 53 నుంచి వరంగల్ బైపాస్ వరకు క్యూఆర్ కోడ్ బోర్డులు ఏర్పాటు చేశారు. కోమల్ల, కోమటిపల్లి టోల్‌ప్లాజాలతో పాటు పెట్రోల్ బంక్‌లు, ముఖ్యమైన కూడళ్ల వద్ద మొత్తం 13 చోట్ల క్యూఆర్ కోడ్ బోర్డులు సేవలందిస్తున్నాయి. సమాచారం పొందడం ఇలా.. వాహనదారులు క్యూఆర్ కోడ్‌ను తమ సెల్‌ఫోన్ ద్వారా స్కాన్ చేయాలి. స్కాన్ చేయగానే ఫోన్లో జాతీయ కిలో మీటర్ల పరిధి, గస్తీ అధికారుల నంబర్లు, రెసిడెంట్ ఇంజనీర్ల ఫోన్ నంబర్లు, పోలీసుస్టేషన్లు, ఆస్పత్రులు,హైవే నిర్వహణ అధికారుల సమాచారం,హెల్ప్‌లైన్ నంబర్లు, టాయిలెట్లు, హోటళ్లు, వాహన సర్వీస్ కేంద్రాలు, సెల్ చార్జింగ్ సెంటర్లు, ట్రక్ల పార్కింగ్ స్థలాలు, టోల్‌ప్లాజాలు, ఫంక్చర్ షాప్‌లు.. తదితర వాటికి సంబంధించిన సమాచారం స్క్రీన్‌పై వస్తుందని ఎన్హెచ్ఐఏ రెసిడెంట్ ఇంజనీర్ మధుసూదన్ తెలిపారు. ఫ ఎన్‌హెచ్–163పై క్యూఆర్ కోడ్లతో సైన్ బోర్డులు ఏర్పాటు ఫ అత్యవసర సమయంలో తక్షణమే సులభంగా సేవలు -
అధునాతన హంగులతో అన్నప్రసాద కేంద్రం
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు అన్న ప్రసాదాన్ని అందించేందుకు గాను శాంత రుష్యశృంగ అన్నప్రసాద కేంద్రాన్ని వైటీడీఏ ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్మాణం చేశారు. ఈ అన్న ప్రసాద భవనాన్ని ఆదివారం ఉదయం 10.42గంటలకు దాతలు వేగేశ్న సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. 2021లో పనులు ప్రారంభం.. యాదగిరి కొండకు దిగువన ఆధ్యాత్మిక వాడలో అన్నదాన భవన నిర్మాణ పనులకు 2021 మార్చిలో శంకుస్థాపన చేశారు. ఈ ఏడాది మార్చి 23న పనులు పూర్తయినప్పటికీ కొన్ని కారణాల చేత భవనాన్ని ప్రారంభించలేదు. ఈ అన్న ప్రసాద కేంద్రం నిర్మాణానికి 2.7ఎకరాల స్థలాన్ని వైటీడీఏ కేటాయించగా.. 1.3 ఎకరాల్లో అన్నదాన భవనాన్ని నిర్మించారు. ఈ నిర్మాణానికి వేగేశ్న ఫౌండేషన్ సంస్థ మొదట రూ.11కోట్లు విరాళం అందజేసింది. ఆ తర్వాత వైటీడీఏ సుమారు రూ.11కోట్ల వరకు ఖర్చు చేసింది. గతేడాది క్రితం మిగిలిన పనుల కోసం తిరిగి వేగెశ్న సంస్థ మరో రూ.2కోట్లు ఇచ్చింది. ఒకేసారి 900 మంది భోజనం చేసేలా.. అన్నదాన భవనంలో 2 డైనింగ్ హాల్స్, రెండు వెయిటింగ్ హాల్స్, 12 స్టోర్‌రూమ్‌లు నిర్మించారు. అంతేకాకుండా 25శాతం స్థలంలో కిచెన్ సైతం ఏర్పాటు చేశారు. ఒకేసారి ఒక్కో హాల్లో సుమారు 450 మంది భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించవచ్చు. భక్తుల కోసం బయట గార్డెన్ సైతం ఏర్పాటు చేశారు. దీంతో గత మూడు, నాలుగు సంవత్సరాలుగా కొండకు దిగువన లక్ష్మీ పుష్కరిణి పక్కన దీక్షాపరుల మండపంలో తాత్కాలికంగా కొనసాగుతున్న అన్న ప్రసాద కేంద్రంలో సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న భక్తులకు ఊరట లభించనుంది. ఫ యాదగిరిగుట్టలో నేడు ప్రారంభం -
ప్రజావాణి రద్దు
భువనగిరిటౌన్ : కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ హనుమంతరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న దష్ట్యా నిబంధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. డిసెంబర్ 17 వరకు కోడ్ అమల్లో ఉంటుందని, ప్రజలు గమనించి అధికారులకు సహకరించాలని కోరారు. రెండు తండాలు.. ఒక్కో నామినేషన్ బొమ్మలరామారం : మండలంలోని లక్ష్మీతండా, రామస్వామి తండాల్లో సర్పంచ్ పదవులకు ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలయ్యాయి. లక్ష్మీతండా సర్పంచ్ అభ్యర్థిగా దీరావత్ భిక్షపతి , రామస్వామితండా సర్పంచ్ అభ్యర్థిగా దీరావత్ సునీత నామినేషన్ వేశారు. వీరి నామినేషన్లలో అన్నీ సవ్యంగా ఉంటే వారిద్దరూ ఏకగ్రీవం కానున్నారు. అదే విధంగా లక్ష్మీతండాలో 8 వార్డుకు, రామస్వామి తండాలోని 6 వార్డులకు గాను ఒక్కో నామినేషన్ మాత్రమే వచ్చింది. వార్డు సభ్యుల స్థానాలు కూడా ఏకగ్రీవం కానున్నాయి.21న లోక్ అదాలత్ భువనగిరిటౌన్ : డిసెంబర్ 21న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా న్యాయవాదులు, పోలీస్ అధికారులు చొరవ చూపాలని జిల్లా న్యాయసేవ అధికారి సంస్థ కార్యదర్శి, జడ్జి మాధవిలత కోరారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జయరాజు సూచనల మేరకు మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ముక్తిదాతో కలిసి జిల్లాలోని ఏసీపీలతో వర్చువల్‌గా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజీపడదగిన కేసులను గుర్తించడంతో పాటు కక్షిదారులు రాజమార్గం అనుసరించేలా కృషి చేయాలని పేర్కొన్నారు. లోక్‌అదాలత్‌పై అవగాహన కల్పించాలని సూచించారు. నామినేషన్ల పరిశీలన తుర్కపల్లి: మండలంలోని మాదాపురంలో నామినేషన్ల ప్రక్రియను శనివారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతురావు పరిశీలించారు. మూడు రోజుల్లో మొత్తం దాఖలైన నామినేషన్ల వివరాలు తెలుసుకున్నారు. ఎన్నికల సిబ్బందికి సూచనలు చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. గిరి ప్రదక్షిణను విజయవంతం చేయాలి యాదగిరిగుట్ట: రాష్ట్రంలో అయ్యప్ప మాల ధరించిన భక్తుల కోసం యాదగిరిగుట్ట దేవస్థానం డిసెంబర్ 1న ప్రత్యేకంగా గిరిప్రదక్షిణ నిర్వహించనుందని ఆలయ ఈఓ వెంకట్రావ్, అయ్యప్ప సేవా సమితి నిర్వాహకులు శనివారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ఉదయం 5గంటలకు యాదగిరి కొండ చుట్టూ ప్రదక్షిణ ప్రారంభం అవుతుందన్నారు. గిరి ప్రదక్షిణ అనంతరం నేరుగా వెళ్లి కొండపైన శ్రీస్వామి వారిని దర్శించుకునే అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. అయ్యప్ప మాలధారులు గిరి ప్రదక్షిణలో పాల్గొని, శ్రీస్వామి వారి ఆశీస్సులు పొందాలన్నారు. ‘ప్రీ ప్రైమరీ’ బలోపేతంలో బోధకుల పాత్ర కీలకం భువనగిరి : ప్రీ ప్రైమరీ పాఠశాలలను బలోపేతం చేయడంలో బోధకుల పాత్ర కీలకమని డీఈఓ సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రీ ప్రైమరీ పాఠశాలల్లోని బోధకులకు భువనగిరిలోని బీచ్ మహల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఐదు రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు శనివారం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. శిక్షణ తరగతుల్లోని అంశాలను ఓపిక, సహనంతో చిన్నారులకు నేర్పించాలన్నారు. ఏఎంఓ జాని అఫ్ఘని, జిల్లా రిసోర్స్ పర్సన్లు జ్యోతిర్మయి, కృష్ణవేణి, భిక్షమయ్య, రహీం పాల్గొన్నారు. -
సిటీ సబర్బన్ బస్సులు నడపండి
భూదాన్‌పోచంపల్లి: పర్యాటక కేంద్రమైన పోచంపల్లికి దిల్సుఖ్నగర్ నుంచి సిటీ సబర్బన్ బస్సులు నడిపించాలని కోరుతూ శనివారం భూదాన్‌పోచంపల్లికి చెందిన పలువురు నాయకులు హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. నిత్యం దేశ, విదేశీయులు వస్తుంటారని, పోచంపల్లి నుంచి హైదరాబాద్‌కు వందలాది మంది విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు రాకపోకలు సాగిస్తుంటారని పేర్కొన్నారు. వారంతా సరిపోను బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నారని, అదనపు సర్వీసులను నడపాలని విజ్ఞప్తి చేశారు. అందుకు ఆర్టీసీ ఎండీ సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. ఎండీకి వినతిపత్రం అందజేసిన వారిలో తడక రమేశ్, బిజిలి కుమార్, సీత కృష్ణ, భారత గిరివాసు, తడక విష్ణుదాస్, పెండెం పాండురంగం, కడవేరు వెంకటేశం, గుండు ఉప్పలయ్య, సీత జగదీశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా దివ్యాంగుల క్రీడలు
భువనగిరి: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా శనివారం భువనగిరిలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో సీ్త్ర శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీలు ఉత్సాహంగా సాగాయి. అండర్–18, అంతకు పైబడిన దివ్యాంగులకు పరుగు పందెం, షాట్‌పుట్, క్యారమ్స్, చెస్‌లో పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.అంతకుముందు క్రీడా పోటీలను జిల్లా సంక్షేమ శాఖ అధికారి నరసింహరావు, యువజన, క్రీడల అభివృద్ధి అధికారి ధనుంజనేయులు ప్రారంభించి మాట్లాడారు. దివ్యాంగుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు క్రీడా పోటీలు దోహదపడుతాయన్నారు. కార్యక్రమంలో దివ్యాంగుల అసోసియేషన్ సభ్యులు, పీడీలు, పీఈటీలు, సిబ్బంది పాల్గొన్నారు. -
వెల్లువెత్తిన నామినేషన్లు
సర్పంచ్‌కు 844, వార్డు సభ్యుల స్థానాలకు 2,450సాక్షి యాదాద్రి : గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తొలి విడత నామినేషన్ల ఘట్టం శనివారంతో ముగిసింది. 153 సర్పంచ్, 1,286 వార్డు స్థానాలకు డిసెంబర్ 11న ఎన్నికలు జరగనున్నాయి. కాగా ఆయా స్థానాల్లో చివరి రోజూ నామినేషన్లు వెల్లువెత్తాయి. ఈ ఒక్క రోజే సర్పంచ్ 440, వార్డు సభ్యుల స్థానాలకు 1,776 నామినేషన్లు పడ్డాయి. మూడు రోజుల్లో మొత్తం నామినేషన్లు సర్పంచ్ 844, వార్డు స్థానాలకు 2,450 దాఖలయ్యాయి. ఆదివారం (నేడు) నామినేషన్ల పరిశీలన, 3వ తేదీన ఉపసంహరణ ఉంటుంది. సమయం ముగిసినా అనుమతి తొలి విడత ఎన్నికలు జరిగే ఆలేరు, రాజాపేట, యాదగిరిగుట్ట, తుర్కపల్లి, ఆత్మకూర్(ఎం), బొమ్మలరామారం మండలాల్లో క్లస్టర్ కేంద్రాలకు అభ్యర్థులు నామినేషన్ వేయడానికి బారులుదీరారు. చివరి రోజు కావడంతో వందలాది మంది తమ అనుచరులతో కలిసి వచ్చి నామినేషన్ వేశారు. ఈ క్రమంలో ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు అభ్యర్థులకు టోకెన్లు జారీ చేశారు. నామినేషన్ సమయం ముగిసినా టోకెన్లు జారీ చేసిన అభ్యర్థులందరినీ నామినేషన్ దాఖలు చేయడానికి అనుమతించారు. రాజాపేట, తుర్కపల్లి సర్పంచ్ అభ్యర్థులు క్లస్టర్ కేంద్రాలకు తమ అనుచరులతో కలిసి భారీ ర్యాలీ వచ్చారు. యాదగిరిగుట్ట మండలం దాతర్పల్లి సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ వేయడానికి స్వయంగా జిరాక్స్ మిషన్ కూడా వెంట తెచ్చుకోవడం విశేషం. జిరాక్స్ సెంటర్లన్నీ రద్దీగా ఉండటం, సమయం తక్కువగా ఉండటంతో నామినేషన్‌కు జతపర్చాల్సిన ధ్రువీకరణ పత్రాలను తానే జిరాక్స్ తీసుకున్నారు. ముగిసిన తొలి విడత నామినేషన్లు ఫ చివరి రోజు క్లస్టర్ కేంద్రాల్లో బారులుదీరిన అభ్యర్థులు ఫ టోకెన్లు ఇచ్చి సమయం ముగిసినా నామినేషన్ దాఖలుకు అనుమతి ఫ రాత్రి పొద్దుపోయే దాకా కొనసాగిన ప్రక్రియ ఫ నేడు నామినేషన్ల పరిశీలన.. ఫ 3న ఉపసంహరణ, అభ్యర్థుల ప్రకటన మొదటి విడత నామినేషన్లు మొత్తం మండలం జీపీలు చివరి రోజు మొత్తం ఆలేరు 16 61 101 ఆత్మకూర్ 23 80 156 బి.రామారం 35 104 171 రాజాపేట 23 33 89 తుర్కపల్లి 33 102 198 యాదగిరిగుట్ట 23 60 129 మొత్తం 153 440 844 వార్డు స్థానాలుఆలేరు 140 230 276 ఆత్మకూర్ 192 369 433 బి.రామారం 284 406 524 రాజాపేట 206 142 237 తుర్కపలి 266 380 564 యాదగిరిగుట్ట 198 249 416 మొత్తం 1,286 1,776 2,450 -
కేంద్రాల వద్దే కుల ధ్రువీకరణ
యాదగిరిగుట్ట రూరల్ : రిజర్వేషన్ స్థానాల్లో నామినేషన్ వేసే అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా జత చేయాల్సి ఉంటుంది. శనివారం నామినేషన్ల స్వీకరణకు చివరి రోజు కావడంతో పలువురు అభ్యర్థులు నామి నేషన్ పత్రాల్లో కుల ధ్రువీకరణకు ఇచ్చిన ప్రత్యేక కాలమ్‌లో తమ కులానికి సంబంధించిన వివరాలు నింపారు. యాదగిరిగుట్ట తహసీల్దార్ గణేశ్‌నాయక్ స్వయంగా మండలంలోని ఐదు క్లస్టర్లలో నామినేషన్ కేంద్రాల వద్దకే వెళ్లి అభ్యర్థితో పాటు అతడిని ప్రతిపాదించిన వారిని విచారించి కుల ధ్రువీకరణ చేశారు. దీంతో అభ్యర్థులు ప్రత్యేకంగా కుల ధ్రువీకరణ పత్రం జత చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. తహసీల్దార్ కార్యాలయంలో కుల ధ్రువీకరణ కోసం డిప్యూటీ తహసీల్దార్ కూడా అందుబాటులో ఉన్నారు. -
వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు
చౌటుప్పల్ : సంస్థాన్‌నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి చెందిన వ్యక్తి శుక్రవారం రాత్రి అదృశ్యమయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుట్టపాకకు చెందిన పున్న అనిత చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని మాంగళ్య షాపింగ్‌మాల్‌లో పనిచేస్తోంది. ఆమె భర్త బ్రహ్మయ్య చేనేత కార్మికుడు. శుక్రవారం సాయంత్రం అతడు పుట్టపాక నుంచి క్యారేజీ బ్యాగులు తీసుకొని తన భార్య పనిచేస్తున్న షాపింగ్‌మాల్ వద్దకు వెళ్లాడు. అక్కడ ఆమెకు ఆ బ్యాగులు చూపించి ఎలా ఉన్నాయని అడిగాడు. అవి బాగాలేవు, మరో కలర్ తీసుకురమ్మని ఆమె చెప్పింది. దీంతో అతడు స్వగ్రామానికి వెళ్తున్నానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. భార్య అనిత తన డ్యూటీ ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో భర్త ఇంట్లో కన్పించలేదు. ఎక్కడ ఉన్నాడో తెలుసుకునేందుకు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. ఎంత వెతికినా బ్రహ్మయ్య ఆచూకీ లభించకపోవడంతో శనివారం ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడి నగదు చోరీ ఫ దొంగను వెంబడించడంతో బస్టాండ్ ఆవరణలో నగదు పారేసి పరార్ సూర్యాపేటటౌన్ : ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడి నగదు చోరీ చేసిన దొంగ.. ఆ నగదును బస్టాండ్ ఆవర ణలో పారేిఠిస పరార య్యాడు. ఆ నగదు ఆర్టీసీ అధికారులు, పోలీసులు బాధితుడికి అప్పగించారు. ఆర్టీసీ అధికారులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిరాల మండలం గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన రామగిరి రాములు వడ్లు అమ్ముకున్న డబ్బులతో శనివారం తన సొంత గ్రామానికి వెళ్లేందుకు సూర్యాపేట పట్టణంలోని కొత్త బస్టాండ్‌లో తొర్రూర్ బస్సు ఎక్కుతుండగా.. అతడి జేబులోంచి రూ.44 వేల నగదును గుర్తుతెలియని వ్యక్తి దొంగిలించాడు. అది గమనించిన రాములు తోటి ప్రయాణికుల సహాయంతో ఆ దొంగను వెంబడించగా వారికి చిక్కకుండా బస్టాండ్ ఆవరణలో డబ్బులు వదిలేసి పారిపోయాడు. అది గమనించిన ఓ ప్రయాణికుడు విధి నిర్వహణలో ఉన్న కండక్టర్‌కు సమాచారం ఇవ్వగా కింద పడేసిన డబ్బులను బస్టాండ్‌లో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ స్టేషన్ మేనేజర్ ఆర్వీ సింగ్‌కు అందజేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు బస్టాండ్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఎండీ అఫ్సర్, ఆర్టీసీ స్టేషన్ మేనేజర్ చేతులమీదుగా బాధితుడు రాములుకు డబ్బును అందజేశారు. -
ఏకగ్రీవాలకు అందని నజరానా
సాక్షి యాదాద్రి: సర్పంచ్ ఎన్నికను ఏకగ్రీవం చేస్తే ప్రభుత్వ పరంగా రూ.10 లక్షలు చెల్లిస్తామని గత ప్రభుత్వం ప్రకటించింది. దీనికి తోడు ఆప్పటి ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత రూ.15లక్షలు, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి రూ.10లక్షలు ఇస్తామని ప్రకటించారు. ఆ ఫండ్ వస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చనే ఆశతో కలిసికట్టుగా 59 పంచాయతీలను జనం ఏకగ్రీవం చేసుకున్నారు. పాలకవర్గాల పదవీకాలం ముగిసి రెండేళ్లవుతున్నా ఏ ఒక్క పంచాయతీకి పైసా నిధులు రాలేదు. ఏకగ్రీవంపై గ్రామాల్లో చర్చ తాజాగా గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధమయ్యారు. జిల్లాలో 427 సర్పంచ్‌లు, 3,826 వార్డు సభ్యుల స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడత ఎన్నికలు జరిగే స్థానాల్లో ఇప్పటికే నామినేషన్ల పర్వం మొదలు కావడంతో గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. శనివారం(నేడు)తో తొలి విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. ఏకగ్రీవాలపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. ఏకగ్రీవం కోసం ఆశావహులు భారీగా ఆఫర్లు ప్రకటిస్తున్నారు. వ్యక్తిగత మేనిఫెస్టోలు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ఏకగ్రీవంపై గ్రామాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. మంత్రి వెంకట్‌రెడ్డి ప్రకటనతో ఆశలు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఏకగ్రీవ పంచాయతీలకు రూ.30 లక్షల నజారానా ప్రకటించడం యాదాద్రి జిల్లాలోనూ చర్చనీయాంశంగా మారింది. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కూడా పంచాయతీలను ఏకగ్రీవం చేయుటకు కసరత్తు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఫ 2019 ఎన్నికల్లో 59 పంచాయతీలు ఏకగ్రీవం ఫ ఈసారైనా నజరానా అందేనా? -
దీక్షా దివస్‌ను జయప్రదం చేయాలి
భువనగిరి: బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 29న నిర్వహించే దీక్షా దివస్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి పిలుపునిచ్చారు. భువనగిరిలో దీక్షా దివస్ నిర్వహించే ప్రాంతాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. స్వరాష్ట్ర సాధన కోసం నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిందన్నారు. ఆ దీక్షతో కేంద్రం దిగివచ్చి ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించిందన్నారు. కేసీఆర్ చేపట్టిన దీక్షా దివస్ గురించి భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉదయం 10 గంటలకు దీక్షా దివస్ ప్రారంభం అవుతుందని, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణ, పట్టణ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఏవీ కిరణ్‌కుమార్, రచ్చ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మున్సిపల్ అంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఫ మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి -
ఎన్నికల నిర్వహణలో పీఓల పాత్ర కీలకం
భూదాన్‌పోచంపల్లి: ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించడంతో ప్రిసైడింగ్ ఆఫీసర్ల (పీఓ) పాత్ర కీలకమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు పేర్కొన్నారు. శుక్రవారం భూదాన్‌పోచంపల్లి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో పీఓలు, ఓపీఓలకు స్థానిక ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. పోలింగ్ కేంద్రాల నిర్వహణ, పోలింగ్‌కు సన్నద్ధత, బ్యాలెట్ బాక్స్‌లు, బ్యాలెట్ పత్రాలు తదితర విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు నిబద్ధత, క్రమశిక్షణతో పని చేస్తారని, అందువల్లనే ఎన్నికల నిర్వహణలో ఉపాధ్యాయులను నియమించడం జరుగుతుందన్నారు.పోలింగ్ బాక్స్ ఓపెన్ చేయడం , సీల్ వేసే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. పోలింగ్ కేంద్రంలో ఎన్నికల సామగ్రిని పలుమార్లు సరి చూసుకోవాలని పేర్కొన్నారు. సర్పంచ్, వార్డు సభ్యుడికి రెండు ఓట్లు వేయాల్సి ఉన్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు. అంతకు ముందు జూలూరులో ధాన్యం కొనుగోళ్లన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భాస్కర్, తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, ఎంఈఓ ప్రభాకర్, సూపరింటెండెంట్ సత్యనారాయణరెడ్డి, పాల్గొన్నారు.ఫ కలెక్టర్ హనుమంతరావు


