కమీషన్ వాటాల కోసమే కక్కుర్తి
చౌటుప్పల్ : కమీషన్లలో వాటాల కోసమే రాష్ట్ర మంత్రులు కక్కుర్తి పడుతున్నారని, ప్రజలను పట్టించుకోవడం లేదని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఆరోపించారు. చౌటుప్పల్‌లో శుక్రవారం నిర్వహించిన బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థుల నామినేషన్ల ర్యాలీకి ఆయన హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్నది ప్రజాప్రభుత్వం కాదని, అది పూర్తిగా కమీషన్ల ప్రభుత్వమని, అవినీతి ప్రభుత్వమని ధ్వజమెత్తారు. 1,200 మంది అమరుల త్యాగాలతో ఏర్పడిన రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు రాజభోగాలు అనుభవిస్తున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన సొంత ప్రచారం కోసం వందల కోట్లు ఖర్చు చేస్తూ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలో బీజేపీ అభ్యర్థులను గెలిపించి చైర్మన్ పీఠాన్ని అప్పగిస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే బాధ్యత తనదేనన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గంగిడి మనోహర్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు శాగ చంద్రశేఖర్‌రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ దూడల భిక్షంగౌడ్, కడారి కల్పన నాయకులు రమనగోని శంకర్, పోలోజు శ్రీధర్‌బాబు, ముత్యాల భూపాల్‌రెడ్డి, ఆలె చిరంజీవి, మసనం సంగీత, గుజ్జుల సురేందర్‌రెడ్డి, వనం ధనుంజయ్య, కంచర్ల గోవర్ధన్‌రెడ్డి, పోలేపల్లి ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
ఫ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్


