నామినేషన్లు 830
సాక్షి, యాదాద్రి : మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం శుక్రవారంతో ముగిసింది. చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. భువనగిరి, చౌటుప్పల్, పోచంపల్లి, ఆలేరు, యాదగిరిగుట్ట, మోత్కూరుతో కలిపి ఆరు ముుున్సిపాలిటీల్లో మొత్తం 104 వార్డు సభ్యుల పదవులకు మూడు రోజులుగా మొత్తం 830 నామినేషన్లు వచ్చాయి. నామినేషన్ల ముగింపు సందర్భంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలు తమ అభ్యర్థులకు మద్దతుగా ర్యాలీలు నిర్వహించాయి.
చివరి రోజు ఉత్సాహంగా..
నామినేషన్ల చివరి రోజు వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఉత్సాహంగా ర్యాలీలతో వెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు. ఆరు మున్సిపాలిటీల్లో శుక్రవారం ఒక్కరోజే 412 మంది 536 నామినేషన్లు దాఖలు చేశారు. భువనగిరి, చౌటుప్పల్‌లో ఐదు గంటల తర్వాత కూడా నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. ఐదు గంటల లోపు వచ్చిన వారిని లైన్‌లో నిలబెట్టి టోకెన్‌లు ఇచ్చారు. రాత్రి 8గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది.
నేడు నామినేషన్ల పరిశీలన
నామినేషన్ల పరిశీలన శనివారం చేయనున్నారు. నామినేషన్లు అన్ని ధ్రువీకరణ పత్రాలు సక్రమంగా ఉన్న వారి పేర్లను సాయంత్రం ఐదు గంటలకు అధికారులు ప్రకటిస్తారు. తిరస్కరణకు గురైన నామినేషన్లపై ఫిబ్రవరి 1న అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. 2న అప్పీళ్ల పరిష్కారం ఉంటుంది. 3వ తేదీ మద్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ, పోటీలో ఉండే అభ్యర్థుల పేర్లు ప్రకటన ఉంటుంది. 11న పోలింగ్, 13 ఓట్ల లెక్కిపు విజేతలను ప్రకటిస్తారు.
ర్యాలీలతో కోలాహలం
● నామినేషన్ల చివరి రోజు ఆయా పార్టీల నాయకులు తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. భువనగిరిలో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీ అఽభ్యర్థి చింతల కిష్టయ్య నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు. ఆయనతోపాటు నాయకులు కొలుపుల అమరేందర్ ఉన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్‌గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో నాయకులు ఆచారీ, పాశం భాస్కర్, గూడూరు నారాయణరెడ్డిలు ఉన్నారు.
● మోత్కూరులో బీజేపీ చేపట్టిన ర్యాలీలో సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ స్థానిక నాయకులు ర్యాలీగా వచ్చి అభ్యర్థుల నామినేష్లలో పాల్గొన్నారు.
● యాదగిరిగుట్టలో జరిగిన నామినేషన్ ర్యాలీలో ప్రభుత్వ విప్, డీసీసీ అధ్యక్షుడు బీర్ల ఐలయ్య, రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్ బండ్రు శోభారాణి, బీజేపీ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.
● భూదాన్‌పోచంపల్లిలో ఆయా పార్టీల అభ్యర్థులు తమ మద్దతుదారులతోకలిసి వెళ్లి నామినేషన్లు వేశారు.
● ఆలేరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ర్యాలీలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్ బండ్రు శోభారాణి స్థానిక నాయకులు పాల్గొన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, నాయకులు క్యామా మల్లేష్, పుట్ట మల్లేష్ పాల్గొన్నారు. బీజేపీ ర్యాలీలో రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షుడు గంధమల్ల ఆనంద్ గౌడ్, మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జ్‌లు పడాల శ్రీనివాస్, దోనూరి వీరారెడ్డి పాల్గొన్నారు. ఆయా ర్యాలీల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, బీజేపీ నుంచి ముఖ్య నాయకులుతోపాటు ఆయా పార్టీల ఎన్నికల ఇన్‌చార్జ్‌లు ర్యాలీల్లో పాల్గొనడంతో అన్ని మున్సిపాలిటీల్లో కోలాహలం నెలకొంది.
భువనగిరిలో బీజేపీ కార్యకర్త ఉత్సాహం
ఫ చివరి రోజు 536 నామినేషన్లు దాఖలు
ఫ ర్యాలీల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులు
ఫ కోలాహలంగా మన్సిపాలిటీలు
ఫ ముగిసిన నామినేషన్ల పర్వం
పార్టీల వారీగా అభ్యర్థుల నామినేషన్ల వివరాలు
కాంగ్రెస్ 271
బీఆర్‌ఎస్ 237
బీజేపీ 185
సీపీఎం 19
సీపీఐ 02
స్వతంత్రులు 94
గుర్తింపు 22
పొందిన పార్టీలు


