డాలర్ల మాయంలో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
ఫ మరో ఇద్దరికి చార్జ్ మెమో జారీ
ఫ వివరాలు వెల్లడించిన ఆలయ ఈవో భవానీ శంకర్
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో సంచలనం సృష్టించిన బంగారు, వెండి డాలర్ల మాయం విషయంలో ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేయడంతోపాటు మరో ఇద్దరికి చార్జ్ మెమోలు జారీ అయ్యాయి. కొత్తగా వచ్చిన ఆలయ ఈవో భవానీ శంకర్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని దీనిపై విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. దీంతో కమిటీ నివేదిక ఆధారంగా తగు శాఖ పరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఉత్తర్వులు జారీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రచార శాఖలో నిర్లక్ష్యంగా విధులు నిర్వహించిన జూనియర్ అసిస్టెంట్ పి.రామచంద్ర శేఖర్, రికార్డు అసిస్టెంట్ టి.లక్ష్మీలను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు ఈవో భవానీ శంకర్ వెల్లఇడించారు. ఇక పర్యవేక్షణలో లోపం కనబర్చిన పర్యవేక్షకులు కె.నటరాజు, కె.సీతారామచార్యులుకు చార్జ్ మెమోలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. సంబంధిత సహాయ కార్య నిర్వాహణాధికారి (ఏఈవో)కు షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునారావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఈవో చెప్పారు.


