వైభవంగా సహస్రకలశాభిషేకం
వలిగొండ : మండల కేంద్రంలోని శ్రీ హరిహర త్రిశక్తి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సహస్ర కలశాభిషేకం వైభవంగా నిర్వహించారు. మహిళలు కలశాలతో శోభాయాత్రగా వచ్చి అమ్మవార్లకు పూజలు నిర్వహించారు. వేడుకల్లో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి పాల్గొని పూజలు చేశారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ గాయకురాలు విశాలాక్షి శిష్య బృందం కలశా పాదయాత్రలో పాల్గొన్నారు. మహిళలకు, భక్తులకు భారతి సిమెంట్ సౌజన్యంతో మజ్జిగ పంపిణీ చేశారు. రామన్నపేట సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ యుగంధర్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. భక్తులకు ఆలయ నిర్వాహకులు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుంభం వెంకటపాపిరెడ్డి, కుంభం విద్యాసాగర్‌రెడ్డి, పాశం సత్తిరెడ్డి, నూతి రమేష్, బొల్ల శ్రీనివాస్, బత్తిని సహదేవ, లింగయ్య, చిలుగురి సత్తిరెడ్డి, చెరుకు శివ్వయ్య,కంకల కిష్టయ్య, ఆలయ నిర్వాహకులు బిన్నూరు గోపలకృష్ణ శాస్త్రి, కమలాకర్ శర్మ, శ్రీనివాస్ గుప్తా, అనురాధ, మనోహరి, దత్తాత్రేయ, లక్ష్మీనారాయణ శాస్త్రి పాల్గొన్నారు.


