పేదలకు ఇళ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దే
మోత్కూరు : గత కేసీఆర్ ప్రభుత్వం హయాంలో ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారని, ప్రస్తుత రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే రూ.70 వేల ఉద్యోగాలు, 4.5 లక్షల ఇళ్లు పేదలకు ఇచ్చిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి డి.సీతక్క అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీలో శనివారం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, కాంగ్రెస్ అభ్యర్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సభలో ఆమె మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి మహిళలకు పెద్ద పీట వేస్తున్నారని అన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో దోచుకొని దాచుకున్న సొమ్ము పంపకాలలో తేడాలతోనే కేసీఆర్ కుటుంబం కొట్లాడుకుంటుందన్నారు. మున్సిపాలిటీలలో కాంగ్రెస్‌కు పట్టం కడితే అభివృద్ధి మరింత వేగంగా పరుగులు పెడుతుందన్నారు. కార్యక్రమంలో మున్సి పల్ ఎన్నికల ఇన్‌చార్జి బొజ్జ సంధ్యారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పైళ్ల సోమిరెడ్డి, లక్ష్మీనర్సింహారెడ్డి, మండల, పట్టణ అధ్యక్షుడు వంగాల సత్యనారాయణ, రామచంద్రు గౌడ్, మహిళ అధ్యక్షులు ముద్దం జయశ్రీ పాల్గొన్నారు.
ఫ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క


