రాజకీయాలను శాసించే రోజు వస్తుంది
చౌటుప్పల్ : భవిష్యత్‌లో రాష్ట్ర రాజకీయాలను శాసించే పరిస్థితి మునుగోడు నుంచే ఉంటుందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సాయంత్రం పట్టణంలో కార్నర్ మీటింగ్‌లో మాట్లాడారు. తాను మొండోడినని, ఎవరికీ విననని చెప్పారు. తనను చూస్తే మంచిమంచోళ్లే భయడుతున్నారన్నారు. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఇంకా వందమార్లు పోటీ చేసినా గెలవడన్నారు. కూసుకుంట్ల అప్పటి సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లేందుకు గజగజ వణికేవాడన్నారు. అదే తాను ఒక్క ఫోన్ చేస్తే సీఎం వెంటనే లైన్లోకి వస్తాడన్నారు. తాము దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి ప్రియ శిష్యులమని ప్రజలకు మాట ఇస్తే తప్పబోమని, మడమ తిప్పబోమని స్పష్టం చేశారు. బతికినంతకాలం వైఎస్సార్ మాదిరిగా బతుకుతానని తెలిపారు. సమావేశంలో పీసీసీ ఽఅధికార ప్రతినిధి సంధ్యారెడ్డి, ప్రధానకార్యదర్శి కసుబ శ్రీనివాస్‌రావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పున్న కై లాష్, మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మున్సిపల్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు, మాజీ ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి, పబ్బు రాజుగౌడ్, ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ ప్రజలను కోరారు.చౌటుప్పల్ పట్టణంలోని పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు.
ఫ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి


