వార్షిక బ్రహ్మోత్సవాల్లో పారితోషికం పెంచాలి
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాల్లో పారాయణదారులకు పారితోషికం పెంచాలని కోరుతూ ఆలయ ఈఓ భవానీ శంకర్, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తిలకు శ్రీవైష్ణవ సమాఖ్య అధ్యక్షుడు కారంపుడి నరసింహాచార్యులు, ఉపాధ్యక్షుడు ముడుంబై గిరిధర్, ప్రధాన కార్యదర్శి వుండ్రకొండ కిరణ్‌కుమార్‌లు శనివారం వినతి పత్రం అందజేశారు. సరైన సదుపాయాలు కూడా అందించాలన్నారు. అంతే కాకుండా ప్రభాతభేరీ, భోజన సదుపాయాలపై దృష్టి పెట్టాలని కోరారు.


