ఒప్పించడం తలనొప్పే!
సాక్షి యాదాద్రి : నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో బుజ్జగింపుల పర్వానికి రాజకీయ పార్టీలు తెరలేపాయి. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో పెద్ద సంఖ్యలో ఆశావహులు పోటీకి దిగారు. కచ్చితంగా బరిలో ఉంటామని స్పష్టం చేయడం.. పార్టీల నేతలకు సమస్యగా మారింది. బీఫాం ఎవరికి ఇవ్వాలి.. ఎవరిని పోటీ నుంచి తప్పించాలో అర్థకాని పరిస్థితి నెలకొంది. టికెట్లు లభించని వారిని సముదాయించి పార్టీ అభ్యర్థికి ప్రచారం చేసేలా ఒప్పించడం తలనొప్పిగా మారింది. ఈ క్రమంలోనే అన్నిచోట్లా అభ్యర్థులను ప్రకటించడంలో జాప్యం చేస్తున్నాయి.
● చౌటుప్పల్ మున్సిపాలిటీలో 20 వార్డులకు బీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించలేదు. ఆశావహులు మాత్రం నామినేషన్లు వేశారు. పార్టీ సమన్వయ కర్త చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిలు అభ్యర్థులను ఎంపిక చేయడంలో తలమునకలయ్యారు. కాంగ్రెస్ నుంచి అన్ని వార్డులకు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మూడు, నాలుగు వార్డులు మినహా మిగతా వార్డుల్లో స్పష్టత లేదు. బీజేపీ నుంచి సైతం వార్డుల్లో నామినేషన్లు వేశారు. ఈ పార్టీలోనూ మూడు, నాలుగు స్థానాలు మినహా మిగతా వార్డుల్లో స్పష్టత రావాల్సి ఉంది.
● ఆలేరు మొత్తం 12 వార్డులకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులను ప్రకటించాయి. ఏ పార్టీలోనూ రెబల్స్ బెడద లేకుండా అభ్యర్థులను ప్రకటించారు. వారందరూ నామినేషన్లు దాఖలు చేశారు. బీసీ మహిళకు రిజర్వ్ అయినందున చైర్ పర్సన్ అభ్యర్థులను ఏ పార్టీ కూడా ప్రకటించలేదు. అయితే డమ్మీ అభ్యర్థులు వేసిన నామినేషన్లు ఉపసంహరణ కావాల్సి ఉంది.
● భూదాన్ పోచంపల్లి ´ù^èl…-ç³-ÍÏ Ð]l¬°Þ´ë-Ísîæ-ÌZ 13 ÐéÆý‡$z-ÌSMýS$ M>…{VðS-‹Ü ´ëÈt 9 ÐéÆý‡$z-ÌSMýS$ A¿ýæÅ-Æý‡$¦-ÌS¯]l$ A«¨M>Ç-MýS…-V> {ç³MýS-sìæ…_…¨. Ñ$VýS-™é ¯éË$VýS$ Ý릯éÌSMýS$ M>…{VðS-‹Ü ´ëÈtMìS ^ðl…¨¯]l C§ýlªÆý‡$, Ð]l¬VýS$YÆý‡$ ¯éÑ$¯ól-çÙ¯ŒS ÐólÔ>-Æý‡$.️ ½BÆŠ‡-G‹Ü ´ëÈt ¯]l$…_ A¿ýæÅ-Æý‡$¦-ÌS¯]l$ GÐ]l-ǰ MýS*yé A«¨M>Ç-MýS…-V> {ç³MýS-sìæ…^èl-MýS-´ù-Ð]l-yýl…-™ø JMöPMýSP ÐéÆý‡$z ¯]l$…_ BÔ>-çßæ$-Ë$ C§ýlªÆý‡$, Ð]l¬VýS$Y-Æó‡íÜ ¯éÑ$¯ól-çÙ¯]l$Ï §éQË$ ^ólÔ>Æý‡$. Ð]l$Ç Mö…§ýlÆý‡$ JMýSsìæ MýS…sôæ GMýS$PÐ]l ÐéÆý‡$z-ÌZÏ ¯éÑ$¯ól-çÙ¯ŒS ÐólÔ>Æý‡$. GÐðl$ÃÌôæÅ MýS$…¿ýæ… A°ÌŒæ-MýS$-Ð]l*-ÆŠ‡-Æð‡yìlz, Ð]l*i GÐðl$ÃÌôæÅ Oò³âýæÏ ÔóæQÆŠ‡-Æð‡yìlz ™èlÐ]l$ A¿ýæÅ-Æý‡$¦ÌS {ç³MýS-r¯]l-ÌZ Ð]lNÅà™èlÃ-MýS…-V> Ð]lÅÐ]l-çßæ-ÇçÜ$¢-¯é²Æý‡$.
● యాదగిరిగుట్ట మున్సిపాలిటిలో కాంగ్రెస్ , సీపీఐ పొత్తులు పెట్టుకున్నాయి. దీంతో 11 వార్డుల్లో కాంగ్రెస్, ఒక వార్డులో సీపీఐ అభ్యర్థులను ప్రకటించాయి. బీఆర్‌ఎస్ 10 వార్డుల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా రెండు వార్డుల్లో ప్రకటించాల్సి ఉంది. బీజేపీ 10 వార్డుల్లో నామినేషన్లు వేసినప్పటికీ అధికారికంగా అభ్యర్థులను ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐలకు చెందిన అభ్యర్థులు ఎక్కడా రెబల్స్‌గా నామినేషన్లు వేయలేదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థిగా 10వ వార్డులో పోటీ చేస్తున్న గుండ్లపల్లి వాణి భరత్‌గౌడ్‌ను ప్రకటించారు. ఇక బీఆర్‌ఎస్, బీజేపీలు చైర్మన్ అభ్యర్థులను ప్రకటించలేదు.
ఫ మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో నామినేషన్లు
ఫ బరిలోనే ఉంటామంటున్న ఆశావహులు
ఫ నచ్చజెప్పే పనిలో నాయకులు
ఫ భవిష్యత్‌లో న్యాయం చేస్తామంటూ హామీలు
భువనగిరి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ 32 మంది అభ్యర్థులను ప్రకటించింది. అసమ్మతి నేతలతో కలిపి 91 అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్లు వేశారు. అసమ్మతి లేకుండా చేయడానికి ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి చర్చలు జరుపుతున్నారు. బీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎం కలిసి 35 వార్డులకు అభ్యర్థులను ప్రకటించారు. బీఆర్‌ఎస్, సీపీఎం, సీపీఎం కలిసి పోటీ చేస్తున్నాయి. ప్రతి వార్డుకు ఇద్దరు, ముగ్గురు చొప్పున 82 మంది నామినేషన్లు వేశారు. బీజేపీ నుంచి 77 మంది నామినేషన్ వేశారు. కాగా ఇప్పటి వరకు ఏ పార్టీ అభ్యర్థికి బీ ఫాం ఇవ్వలేదు. పోటీలో ఉన్న రెబల్స్ ను బుజ్జగించే పనిలో ఉన్నారు.
రెండు నామినేషన్ల తిరస్కరణ
భువనగిరి టౌన్: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పరిశీలన శనివారం ముగిసింది. ఆరు మున్సిపాలిటీల్లో 786 నామినేషన్లు దాఖలు కాగా అందులో భువనగిరిలో రెండు తిరస్కరణకు గురయ్యాయి. 545 మంది అభ్యర్థులకు చెందిన 784 నామినేషన్ల సవ్యంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
మోత్కూర్ కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలు అభ్యర్థులను ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. 12 వార్డులకు107 నామినేషన్లు వేశారు. చైర్మన్ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో వివిధ పార్టీల ముఖ్యనేతలు వైస్ చైర్మన్ కోసం పోటాపోటీగా నామినేషన్లు వేశారు. చైర్మన్ అభ్యర్థిని ప్రకటించక పోయినా బీసీ, జనరల్ అభ్యర్థులు వైస్ చైర్మన్ పీఠం దక్కించుకోవాలని చూస్తున్నారు. ఎమ్మెల్యే మందుల సామేల్ .. పార్టీ నేతలతో మాట్లాడి బుజ్జగిస్తున్నారు. కాంగ్రెస్‌లో టికెట్ దక్కని రెబల్స్‌ను తమపార్టీలోకి ఆహ్వానించి టికెట్ ఇవ్వాలన్న ఆలోచనలో బీఆర్‌ఎస్ ఉంది. కాంగ్రెస్ ముందుగా అభ్యర్థుల పేర్లు ప్రకటించకుండా జాగ్రత్త పడుతోంది. టికెట్ రాని వారు బీఆర్‌ఎస్, లేదా ఇండిపెండెంట్‌గా రంగంలోకిదిగే అవకాశం ఉందని అధికార పార్టీ అనుమానిస్తోంది. విత్ డ్రా తర్వాత చివరి క్షణంలో అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.


