నేటి ప్రజావాణి రద్దు | - | Sakshi
Sakshi News home page

నేటి ప్రజావాణి రద్దు

Feb 1 2026 7:30 AM | Updated on Feb 1 2026 7:30 AM

నేటి

నేటి ప్రజావాణి రద్దు

భువనగిరిటౌన్‌ : మున్సిపల్‌ ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్‌ హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని జిల్లాలోని ప్రజలు గమనించి వివిధ సమస్యల పై అర్జీలు ఇచ్చేందుకు కలెక్టరేట్‌కు రావొద్దని సూచించారు.

దివ్యాంగుల ఉపకరణాలకు దరఖాస్తుల ఆహ్వానం

భువనగిరిటౌన్‌ : దివ్యాంగుల ఉపకరణాల కోసం 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలోని అర్హులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారి కె. నరసింహారావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తు గడువును వచ్చె నెల 10వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. ఓబీ ఎంఎంఎస్‌ పోర్టల్‌ ద్వారా దరఖా స్తులు చేసుకోవాలని సూచించారు.

ఆరోగ్య రక్షణకు టీకా

భువనగిరి: జిల్లా వ్యాప్తంగా వైద్యులు, సిబ్బందికి ఆరోగ్య రక్షణ కోసం హెపటైటిస్‌బీ టీకాకు సంబంధించి మొదటి డోసు శనివారం వేశారు. హెపటైటిస్‌ వ్యాది ఎక్కువగా సాధారణ ప్రజలకంటే వైద్యసేవలందించే వారికే సోకే అవకాశం ఉంటుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వైద్యులు, సిబ్బందికి హెపటైటిస్‌ టీకా అందించేందుకు చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న 21ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 143 సబ్‌ సెంటర్లలో పనిచేస్తున్న 642 మంది హెల్‌కేర్‌ వర్కర్స్‌కు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆద్వర్యంలో హెపటైటిస్‌ టీకాకు సంబందించి మొదటి డోసు ఇచ్చారు.

పూర్వ విద్యార్థుల సహకారం అభినందనీయం

మోటకొండూర్‌ : పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు సహకారం అందించడం అభినందనీయమని డీఈఓ సత్యనారాయణ పేర్కొన్నారు. మోటకొండూర్‌ మండలంలోని చాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల 130వ వార్షికోత్సవాన్ని స్థానిక స్కూల్‌లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థుల ఆర్థిక సహకారంతో ఎలక్ట్రిక్‌ కేబుల్‌, బోర్‌ మోటార్‌, కంప్యూటర్‌, కళావేదిక నిర్మాణం, బెంచీలు, ప్రొజెక్టర్‌, పాఠశాలకు రంగులతో చిత్రాలు వేయించి కొత్త శోభను తీసుకువచ్చారు. అనంతరం ఉపాధ్యాయులకు, పూర్వ విద్యార్థులకు శాలువాలు మెమొంటోలు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు మోర బాలగంగాధర్‌రెడ్డి, ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజివ్‌ లిమిటెడ్‌ ఎండీ టీవి చౌదరి, ఎస్‌ఐ అశోక్‌, జెక్క రోషిరెడ్డి, బేతి వెంకటేశ్వర్లు, సిగ విజయ్‌ గౌడ్‌, గ్రామసర్పంచ్‌ ఆకుల శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

సమగ్ర విచారణ చేయాలని సీఎంకు లేఖ

యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఉద్యోగులు, అధికారుల అవినీతిపై సమగ్ర విచారణకు ఆదేశించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాసినట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్‌ తెలిపారు. ఇటీవల యాదగిరి క్షేత్రంలో జరిగిన బంగారు, వెండి డాలర్ల అపహరణపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ యాదగిరిగుట్ట పట్టణంలోని వైకుంఠద్వారం వద్ద శనివారం ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు గడ్డం వెంకటేష్‌, నాయకులు ఈశ్వర్‌రెడ్డి, ఉస్మాన్‌ షరీఫ్‌, సీస శ్రీనివాస్‌, మల్లయ్య, జానీ, శ్రీశైలం, నగేష్‌, అనిల్‌ తదితరులున్నారు.

నేటి ప్రజావాణి రద్దు1
1/2

నేటి ప్రజావాణి రద్దు

నేటి ప్రజావాణి రద్దు2
2/2

నేటి ప్రజావాణి రద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement