యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. శనివారం ఉదయాన్నే ఆలయాన్ని తీసిన అర్చకులు సుప్రఽభాతం, ఆరాధన నిర్వహించారు. అనంతరం గర్భాలయంలో స్వయంభూ మూర్తులకు నిజాభిషేకం జరిపించి, అర్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమాన్ని అర్చకులు నిర్వహించి, అనంతరం గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలు భక్తుల నడుమన చేపట్టారు. ముఖ మండపంలో ఉత్సవ మూర్తులకు అష్టోత్తర, సువర్ణ పుష్పార్చన పూజలు చేశారు. సాయంత్రం ఆలయ తిరు, మాడ వీధుల్లో జోడు సేవను భక్తుల మధ్య ఊరేగించారు. రాత్రికి శ్రీస్వామి అమ్మవార్లకు శయనోత్సవం నిర్వహించి ద్వార బంధనం చేశారు.


