సజావుగా నామినేషన్లు
చౌటుప్పల్ : మున్సిపాలిటీల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో జాగ్రత్తగా వ్యవహరించాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఆర్‌ఓలు, ఏఆర్‌ఓలు, నామినేషన్ వేసేందుకు వచ్చిన అభ్యర్ధులతో మాట్లాడారు. అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్నారు. నామినేషన్లు దాఖలు చేసే క్రమంలో ఎలాంటి గందరగోళ పరిస్థితులకు అవకాశం ఇవ్వొద్దన్నారు. ఆయన వెంట ఆర్డీఓ వెల్మ శేఖర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ గుత్తా వెంకట్రామ్‌రెడ్డి, మేనేజర్ శ్రీధర్‌రెడ్డి ఉన్నారు.
భూదాన్‌పోచంపల్లి: జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా సాగుతోందని కలెక్టర్ హనుమంతరావు పేర్కొన్నారు. పోచంపల్లి పట్టణంలోని వినోబాభావే మందిరంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించారు. అక్కడ నామినేషన్లు వేయడానికి వచ్చిన అభ్యర్థుల నామినేషన్‌లను పరిశీలించారు. ఇప్పటి వరకు ఎన్ని నామినేషన్లు వచ్చాయని ప్రత్యేకాధికారి, తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అంజన్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. హెల్ప్‌డెస్క్ సిబ్బందితో మాట్లాడి అభ్యర్థులకు అందిస్తున్న సేవలు, సందేహాలను అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ కేంద్రం వద్ద అధికారులు, పోలీసులు చేసిన ఏర్పాట్లు, వసతుల పట్ల సంతృప్తి వ్యక్తం చేసి అభినందించారు. నామినేషన్ కేంద్రం వద్ద రాత్రివేళలో పోలీస్, మున్సిపల్ సిబ్బంది కాపలా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ శుక్రవారం చివరిరోజు కావడంతో భారీగా నామినేషన్లు వస్తాయని భావిస్తున్నామని అన్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని రాజకీయపార్టీలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారులు రాపర్తి భాస్కర్, నాగేశ్వర్‌రావు, మాజిద్, దామోదర్, ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు


