భక్తుల సౌకర్యాలపై దృష్టి పెట్టాలి
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలపై దృష్టి పెట్టాలని ఆయా శాఖల అధికారులకు ఈఓ భవానీ శంకర్ ఆదేశించారు. ఈఓగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం యాదగిరి కొండపైన తన చాంబర్‌లో గురువారం వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. శ్రీస్వామి వారి పై భక్తితో వచ్చే భక్తులకు ఆలయంలో ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూసుకోవాలన్నారు. భక్తుల విశ్వాసానికి, నమ్మకానికి అనుగుణంగా సేవలు అందించాలని కోరారు. ఆలయాభివృద్ధికి అధికారులంతా కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, డిప్యూటీ ఈఓ దోర్భాల భాస్కర్‌శర్మ, ఈఈ దయాకర్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.


