రెండో రోజు నామినేషన్ల జోరు | - | Sakshi
Sakshi News home page

రెండో రోజు నామినేషన్ల జోరు

Jan 30 2026 6:35 AM | Updated on Jan 30 2026 6:35 AM

రెండో

రెండో రోజు నామినేషన్ల జోరు

భువనగిరిలో హోరాహోరీ

సాక్షి,యాదాద్రి : మున్సిపల్‌ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. రెండో రోజు పెద్ద సంఖ్యలో నామినేషన్ల దాఖలయ్యాయి. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పరిధిలో మొదటి రోజు 41నామినేషన్లు రాగా గురువారం 264 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండు రోజుల్లో మొత్తం 305 నామినేషన్లు వచ్చాయి. శుక్రవారంతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుంది. టికెట్‌ ఖరారుకానున్నా నామినేషన్ల వేయడానికి ఆశావహులు ముందుకొస్తున్నారు.

సాక్షి, యాదాద్రి: నామినేషన్ల గడువు శుక్రవారంతో ముగియనుండగా ఇంకా అన్ని చోట్లా అభ్యర్థులు ఖరారు కాలేదు. దీంతో తమకు టికెట్‌ వస్తుందా లేదా అన్న టెన్షన్‌ ఆశావహుల్లో నెలకొంది. పార్టీ అభ్యర్థిత్వం ఖరారు కానప్పటికీ పలువురు గురువారం నామినేషన్లు వేశారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ, వామపక్ష పార్టీలు విజయమే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపికపై వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి.

వ్యూహాత్మకంగా..

చివరి రోజైన శుక్రవారం నామినేషన్లు వేసే సమయానికి బీఫాం రాకపోతే ఇండిపెండెంట్‌గా నైనా పోటీలో ఉండవచ్చని కొందరు.. బీఫాం వచ్చిన తర్వాత మరో సెట్‌ నామినేషన్‌ వేసే ఆలోచనను మరికొందరు ఆశావహులు చేస్తున్నారు. మరో వైపు పార్టీలు సైతం విభిన్నంగా ఆలోచిస్తున్నాయి. పోటీ పెద్దగా లేని చోట అభ్యర్థులను ప్రకటించి.. పోటీ ఎక్కువగా ఉన్న చోట్ల అభ్యర్థి ప్రకటన విషయంలో ఆచితూచి కసరత్తు చేస్తున్నాయి. ఎవరో ఒకరికి టికెట్‌ ప్రకటిస్తే రానివారు ఇతర పార్టీలో చేరి టికెట్‌ తెచ్చుకుని పోటీలో ఉండే అవకాశం ఉంది. దీంతో చివరి నిమిషంలో అభ్యర్థులను ప్రకటించే వ్యూహాత్మక ధోరణిని ప్రధాన పార్టీలు అవలంబిస్తున్నాయి.

ఐదు మున్సిపాలిటీల్లో..

● భూదాన్‌ పోచంపల్లి లో 13 వార్డులకు కాంగ్రెస్‌ పార్టీ గురువారం 9 మంది అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించింది. మరో నలుగురి పేర్లు శుక్రవారం ప్రకటిస్తారు. బీఆర్‌ఎస్‌ పార్టీ తమ అభ్యర్థుల ప్రకటనపై తుది కసరత్తు చేస్తోంది. బీజేపీ సైతం అదే బాటలో ఉంది.

● చౌటుప్పల్‌ లో అభ్యర్థుల ఎంపిక ప్రధాన పార్టీలకు సవాల్‌గా మారింది. మున్సిపాలిటీలో 20 వార్డులకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ, సీపీఎం.. పార్టీలు ఎవరినీ అధికారికంగా ప్రకటించలేదు. ముందుగా బీఫామ్‌ లు ఇస్తే టికెట్‌ దక్కని వారు ఇతర పార్టీలోకి వెళ్లే అవకాశం ఉందని అభ్యర్థుల ప్రకటనలో జాప్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఓ ప్రధాన పార్టీ కోటి రూపాయలు ఉంటేనే ఒక అభ్యర్థికి టికెట్‌ ఇస్తామన్న దిశగా పరిశీలన చేస్తున్నట్లు సమాచారం. బీఆర్‌ఎస్‌, సీపీఎం, బీజేపీల నడుమ పొత్తుల చర్చలు కొలిక్కి రావడం లేదు.

● ఆలేరు మున్సిపాలిటీలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు తమ అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించాయి. బీజేపీ మాత్రం ఆరుగురు అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. శుక్రవారం మిగతావి ప్రకటించనుంది.

● యాదగిరిగుట్టలో 12 వార్డుల్లో కాంగ్రెస్‌ పార్టీ 11 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఒక స్థానంలో సీపీఐ తో పొత్తు కుదిరింది. బీఆర్‌ఎస్‌ పార్టీ తొమ్మిది మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. మరో ముగ్గురి పేర్లను శుక్రవారం ప్రకటించే అవకాశం ఉంది. బీజేపీ సైతం నామినేషన్ల చివరి రోజైన శుక్రవారం అభ్యర్థులను ప్రకటించనుంది.

● మోత్కూరు మున్సిపాలిటీలో 12 వార్డులకు కాంగ్రెస్‌ ,బీఆర్‌ఎస్‌ పార్టీలు తమ అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. నేడు నామినేషన్లు వేసే సమయం ముగియడానికి కొద్ది ముందు బీఫామ్స్‌ ఇచ్చే అవకాశాన్ని రెండు పార్టీలు పరిశీలిస్తున్నాయి.

గుట్ట ఈఓగా భవానీ శంకర్‌ బాధ్యతలు

యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ ఈఓగా భవానీ శంకర్‌ బాధ్యతలు స్వీకరించారు. గురువారం ఉదయం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి యాదగిరీశుడిని దర్శించుకున్న అనంతరం ప్రధాన కార్యాలయంలో ఆలయ అర్చకుల వేద ఆశీర్వచనం మధ్య బాధ్యతలు స్వీకరించారు. కాగా.. గతంలో ఇక్కడ పని చేసిన ఈఓ వెంకట్రావ్‌ వ్యకిగత కారణాలు, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఈ నెల 1వ తేదీన తన ఈఓ బాధ్యతలకు రాజీనామా చేశారు. కాగా ఈ నెల 17వ తేదీన గవర్నర్‌ జాయింట్‌ సెక్రటరీగా విధుల్లో ఉన్న జె.భవానీ శంకర్‌ను ఆలయ ఈఓగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఉత్తర్వులు జారీ అయిన 12 రోజులకు భవానీ శంకర్‌ బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. నూతన ఈఓ భవానీ శంకర్‌కు ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, డిప్యూటీ ఈఓ భాస్కర్‌శర్మలతో పాటు ఆలయ అధికారులు, సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం పూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు.

జిల్లాలోనే 35 వార్డులతో అతిపెద్ద మున్సిపాలిటీగా ఉన్న భువనగిరిలో ప్రధాన పార్టీల మధ్య పోరు హోరా హోరీగా సాగనుంది. ఎంపిక చేసే అభ్యర్థికి డబ్బు, కులం, పలుకుబడిని అత్యంత ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అభ్యర్థుల ఎంపికలోనే ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ బుధవారం రాత్రి వరకు రెండు విడతలో 22 మంది అభ్యర్థులను ప్రకటించింది. మిగతా అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తి కావచ్చింది. ఈ క్రమంలో కాంగ్రెస్‌ అభ్యర్థుల పేర్లు ప్రకటించగానే బీఆర్‌ఎస్‌ అప్పటికే ఎంపిక చేసిన కొందరు అభ్యర్థుల పేర్లను ప్రకటించకుండా నిలిపివేసింది. అలాంటి అభ్యర్థులను వెంటనే మార్పు చేస్తోంది. దీంతో ఆపార్టీ అభ్యర్థుల ప్రకటన జాప్యం అయ్యింది. మరో ప్రధాన పార్టీ బీజేపీ సైతం అభ్యర్థుల ఎంపికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల అభ్యర్థులకు దీటుగా తమ పార్టీ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నామని బీజేపీ నాయకుడొకరు చెప్పారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు వామపక్షాల పొత్తుప్రయత్నాల్లో ఉన్నాయి.

ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ

ఫ నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు

ఫ అన్నిచోట్ల ఖరారు కాని అభ్యర్థులు

ఫ నామినేషన్‌ వేసి వేచిచూసే ధోరణిలో ఆశావహులు

మున్సిపాలిటీ వార్డులు మొదటి రోజు రెండో రోజు మొత్తం

భువనగిరి 35 5 109 114

ఆలేరు 12 10 25 35

చౌటుప్పల్‌ 20 6 59 65

మోత్కూరు 12 3 34 37

పోచంపల్లి 13 2 16 18

యాదగిరిగుట్ట 12 15 21 36

ఫ ఒక్క రోజే 264 నామినేషన్లు దాఖలు

ఫ మొదటి రోజు 41.. రెండు రోజుల్లో మొత్తం 305నామినేషన్లు

ఫ నేడు నామినేషన్లకు ఆఖరు

రెండో రోజు నామినేషన్ల జోరు1
1/3

రెండో రోజు నామినేషన్ల జోరు

రెండో రోజు నామినేషన్ల జోరు2
2/3

రెండో రోజు నామినేషన్ల జోరు

రెండో రోజు నామినేషన్ల జోరు3
3/3

రెండో రోజు నామినేషన్ల జోరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement