ఎన్నికల నిర్వహణలో అధికారుల పాత్ర కీలకం
భువనగిరి: ఎన్నికల నిర్వహణంలో అధికారుల పాత్రకీలకమైందని అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు పేర్కొన్నారు. మంగళవారం భువనగిరి మున్సిపల్ కార్యాలయంలో పీవో, ఏపీవోలకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల నిర్వహణ విషయంలో పీవోలు, ఏపీవోలకు పూర్తి అవగాహన ఉండాలన్నారు. అధికారులు ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా విధులు నిర్వహించాలన్నారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్ శాతాన్ని టీ యాప్‌లో అప్‌లోడ్ చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రామలింగం, పీవోలు, ఏపీవోలు పాల్గొన్నారు.
పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి
భూదాన్‌పోచంపల్లి: ప్రణాళికాబద్ధంగా చదువుకొని పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ జినుకల శ్యామ్‌సుందర్ సూచించారు. మంగళవారం భూదాన్‌పోచంపల్లి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించారు. పదో తరగతి విద్యార్థుల ప్రోగ్రెస్‌ను పరిశీలించి చదువులో వెనుకబడిన విద్యార్థినుల ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడారు. పిల్లలను చదువులో మరింత ప్రోత్సహించాలని సూచించారు. వారి ఆర్థిక, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకొని పౌష్టికాహారం అందించాలని కోరుతూ రూ.1000ల నగదును అందజేశారు. ఈకార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
యాదగిరీశుడి సేవలో విజయేంద్ర ప్రసాద్
యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని మంగళవారం ప్రముఖ రచయిత, దర్శకుడు, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు సంప్రదాయంగా స్వాగతం పలికారు. గర్భాలయంలో స్వయంభువును దర్శించుకొని ప్రత్యేక పూ జలు చేశారు. అనంతరం విజయేంద్ర ప్రసాద్‌కు అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. ఈఓ భవానీశంకర్ లడ్డూ ప్రసాదం అందించారు.
నీటి ఎద్దడి ఏర్పడకుండా చూడాలి
యాదగిరిగుట్ట రూరల్ : గ్రామాల్లో నీటి ఎద్దడి ఏర్పడకుండా చూడాలని జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కరుణాకర్ సూచించారు. మిషన్ భగీరథ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా మండలంలోని చొల్లేరు గ్రామంలో మంగళవారం ఆయన పర్యటించారు. రానున్న వేసవిలో గ్రామాల్లో నీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాటర్ ట్యాంకులను నెలలో మూడు సార్లు బ్లీచింగ్‌తో శుభ్రం చేయాలన్నారు. పైప్‌లైన్లకు లీకేజీలు ఉంటే సరి చేయాలని సూచించారు. తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడితే ముందస్తు చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. అంతకు ముందు గ్రామ పంచాయతీలో రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట ఇంట్రా ఏఈఈ ప్రజ్ఞ, గ్రిడ్ ఏఈఈ గణేశ్, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, సర్పంచ్ చిన్నం మమత, సిబ్బంది ఉన్నారు.
ఎన్నికల నిర్వహణలో అధికారుల పాత్ర కీలకం
ఎన్నికల నిర్వహణలో అధికారుల పాత్ర కీలకం
ఎన్నికల నిర్వహణలో అధికారుల పాత్ర కీలకం


