కౌంటింగ్ కేంద్రంలో వసతులు కల్పించాలి
సాక్షి, యాదాద్రి : మున్సిపల్ ఓట్ల లెక్కింపునకు ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో అన్నిరకాల వతసులు కల్పించాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో భువనగిరి పరిధిలోని దివ్యబాల స్కూల్‌లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని శనివారం జిల్లా ఎస్పీ అక్షాంశ్‌యాదవ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావుతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలన్నారు. వారి వెంట భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామలింగం, అధికారులు ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు ఓటు వేసేందుకు ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు శని వారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 8, 9 తేదీల్లో భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరు, పోచంపల్లి, చౌటుప్పల్, మోత్కూరు మున్సిపాలిటీల్లో పోస్టల్ బ్యాలెట్ కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
సోమవారం ప్రజావాణి రద్దు
భువనగిరిటౌన్ : మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున భువనగిరి కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్టు కలెక్టర్ హనుమంతరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విషయాన్ని ప్రజలు గమనించి ఎవరు కూడా కలెక్టరేట్‌కు రావొద్దని సూచించారు.
కలెక్టర్ హనుమంతరావు


