నేటి నుంచి పోల్ చిట్టీల పంపిణీ
ఆశీర్వదించాలని కోరుతూ..
మున్సిపాలిటీలకు కాంగ్రెస్ కోఆర్డినేటర్ల నియామకం
భువనగిరిటౌన్ : ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలంటే పోల్ చిట్టీలే ప్రధానం. ఓటరు జాబితాలో పేరున్నప్పటికీ పోల్ చిట్టీ అందకపోతే ఓటు వేసేందుకు కొందరు ఓటర్లు విముఖత చూపుతుంటారు. అక్షరాస్యుల నుంచి నిరక్షరాస్యుల వరకు పోల్ చిట్టీలతోనే కేంద్రాలకు వెళ్లడం పరిపాటిగా మారింది. గతంలో ప్రధాన పార్టీల కార్యకర్తలు పంపిణీ చేసేవారు. ఓటింగ్ శాతం పెంచాలనే లక్ష్యంతో.. ప్రస్తుతం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారులు, సిబ్బంది నేరుగా ఓటర్ల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం భువనగిరి మున్సిపాలిటీలో బీఎల్‌ఓలు, అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. పోల్ చిట్టీల పంపిణీపై భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామలింగం, తహాసిల్దార్ అంజిరెడ్డి, మేనేజర్ నరేష్‌రెడ్డిలు ఉన్నారు.
జిల్లా వ్యాప్తంగా 104 వార్డుల్లో
జిల్లా వ్యాప్తంగా 6 మున్సిపాలిటీల పరిధిలో 104 వార్డుల్లో ఫొటో ఓటరు ఫోల్ చిట్టీల పంపిణీకి శుక్రవారం నుంచి శ్రీకారం చుట్టనున్నారు. బీఎల్‌ఓలు, వార్డు అధికారులు, సిబ్బంది ఆయా వార్డుల్లో పోలింగ్ కేంద్రాల వారీగా బృందాలుగా ఏర్పడి పంపిణీకి సన్నద్ధమవుతున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా నచ్చిన అభ్యర్థిని కౌన్సిలర్‌గా ఎన్నుకోవచ్చు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఎన్నికల సంఘం.. వివిధ రకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగంపై ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, పాఠశాలల్లో అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో మున్సిపల్ ఎన్నికల్లో పోల్ చిట్టీలు పంచుతూ ఓటింగ్ శాతం పెంచేలా అధికార యంత్రాంగం చర్యలు చేపడుతోంది
సాక్షి, యాదాద్రి : మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం ఊపందుకుంది. ఇంకా నాలుగు రోజులే గడువు ఉండడంతో ప్రధాన పార్టీల నాయకులు తమ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ర్యాలీలు, రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్‌లు, ఇంటింటి ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. అభ్యర్థులు.. ఓటర్లను వ్యక్తిగతంగా కలుస్తూ ఓటు వేయాలంటూ కోరుతున్నారు.
అభివృద్ధి మంత్రం..
మున్సిపాలిటీలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రభుత్వ విప్, డీసీసీఅధ్యక్షుడు బీర్ల ఐలయ్య ఆలేరు, యాదగిరిగుట్టలో ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. వివిధ వర్గాల ప్రజలను కలిసి వారి సమస్యలను వింటున్నారు. ఆలేరులో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇస్తున్నారు. ఐలయ్యతో పాటు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్ శోభారాణి ప్రచారం నిర్వహిస్తున్నారు. మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక నిధులు తెస్తానని ప్రజలకు హామి ఇస్తున్నారు. భువనగిరి, పోచంపల్లి మున్సిపాలిటీల్లో ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. భువనగిరిని మోడల్ సిటీగా అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నారు. చౌట్పుల్‌లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రోడ్ షో నిర్వహించారు. మోత్కూరులో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే మందుల సామేల్ ప్రచారం నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వం మున్సిపాలిటీలను అభివృద్ధి చేయకుండా విస్మరించిందని ప్రజలకు వివరిస్తున్నారు.
ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ..
తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ భువనగిరిలో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, ఆలేరులో మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునిత, బూడిద భిక్షమయ్యగౌడ్, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు గొంగిడి మహేందర్‌రెడ్డి, మోత్కూరులో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్, చౌటుప్పల్‌లో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, నాయకులు చింతల వెంకటేశ్వర్‌రెడ్డిలు ప్రచారం ముమ్మరం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలతో పాటు, తాము చేసిన అభివృద్ధిని ప్రచారంలో ఓటర్లకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు.
చాపకింద నీరులా..
భువనగిరి, చౌటుప్పల్, ఆలేరుతోపాటు అన్ని మున్సిపాలిటీల్లోనూ బీజేపీ చాపకింద నీరులా ప్రచా రాన్ని కొనసాగిస్తోంది. తమ పార్టీ అభ్యర్థుల తరఫున జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్ గౌడ్, జిల్లా మాజీ అధ్యక్షుడు పాశం భాస్కర్, నాయకుడు పడాల శ్రీనివాస్ , పార్టీ ఎన్నికల ఇన్‌చార్జిలు ప్రచారం ముమ్మరం చేశారు.
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అవసరమైన సమన్వయం సాధించేందుకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) కోఆర్డినేటర్లను నియమించింది. ఒక్కో మున్సిపాలిటీకి ఒకరిద్దరు చొప్పున కోఆర్డినేటర్లను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ నియమించారు. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కోఆర్డినేటర్‌గా ఎంఆర్‌జీ వినోద్‌రెడ్డిని నియమించారు. చండూరు మున్సిపాలిటీకి పీసరి మహిపాల్‌రెడ్డి, హాలియాకు నాగసీతారాములు, దేవరకొండకు కొట్నాల తిరుపతి నియమితులయ్యారు. మిర్యాలగూడ మున్సిపాలిటీకి కుందూరు రఘువీర్‌రెడ్డి, పొట్ల నాగేశ్వర్‌రావు, నందికొండ మున్సిపాలిటీకి మద్ది శ్రీనివాస్‌రెడ్డి, హుజూర్‌నగర్‌కు నూతి శ్రీకాంత్‌గౌడ్, నేరేడుచర్లకు ముత్తినేని వీరయ్య, కోదాడకు ఇ.సుబ్బారావు, సూర్యాపేటకు కోటింరెడ్డి వినయ్‌రెడ్డి, భువనగిరికి ఎం.పరమేశ్వర్‌రెడ్డి, చౌటుప్పల్‌కు కస్బ శ్రీనివాసరావు, పోంచపల్లికి కె.శ్రీకాంత్‌యాదవ్, తిరుమలగిరికి కె.రవళిరెడ్డి, మోత్కూరుకు బొజ్జ సంధ్యారెడ్డి, ఆలేరుకు జి.శశికళయాదవ్‌రెడ్డి, యాదగిరిగుట్టకు ఎం.సత్యనారాయణగౌడ్, చిట్యా లకు గౌరిసతీష్‌ను నియమించారు.
ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ పార్టీ గుర్తులు, ఇండిపెండెంట్లు తమకు కేటాయించిన గుర్తులతో ప్రచారం ముమ్మరం చేశారు. గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార, ప్రతిపక్ష అభ్యర్థులు ప్రచారంలో ఢీ అంటే ఢీ అన్నట్లు గా దూసుకుపోతున్నారు. ఉదయం, సాయంత్రం తమ అనుచరులతో కలిసి వార్డుల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇల్లిల్లు తిరుగుతూ తమ ఎన్నికల మేనిఫెస్టోను పంచుతున్నారు. సమస్యలను పరిష్కరించడానికి తమను ఆశీర్వదించాలని వేడుకుంటున్నారు. కుల సంఘాలు, యువత, మహిళా సంఘాలను కలిసి తమకు ఓటు వేయాలని కోరుతున్నారు. ఇప్పటికే అభ్యర్థులు ఒక్కో ఇంటికి నాలుగైదు సార్లు వెళ్లి కలిసి ఓటు అభ్యర్థించారు. ప్రచార వాహనాలు ఏర్పాటు చేసి వార్డుల్లో తిప్పుతున్నారు.
ఫ మున్సిపల్ వార్డుల్లో దూసుకెళ్తున్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులు
ఫ ఓటు వేయాలని వినతి
ఫ అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమంటున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు
ఫ ప్రభుత్వ వైఫల్యాలే అస్త్రంగా బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేల ప్రచారం
ఫ ఇంటింటికీ తిరిగి అందజేయనున్న బీఎల్‌ఓలు
మున్సిపాలిటీ ఓటర్లు
భువనగిరి 57,840
మోత్కూరు 14,416
ఆలేరు 13,670
యాదగిరిగుట్ట 13,817
చౌటుప్పల్ 27,216
పోచంపల్లి 15,839
మొత్తం 1,42,798
నేటి నుంచి పోల్ చిట్టీల పంపిణీ
నేటి నుంచి పోల్ చిట్టీల పంపిణీ
నేటి నుంచి పోల్ చిట్టీల పంపిణీ
నేటి నుంచి పోల్ చిట్టీల పంపిణీ
నేటి నుంచి పోల్ చిట్టీల పంపిణీ


