ధ్వజారోహణం.. దేవతాహ్వానం
యాదగిరిగుట్ట: పూర్వగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గురువారం ధ్వజారోహణను పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారం జరిపించారు. గరుఢ ఆళ్వారుడిని వస్త్రంపై చిత్రించి పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యేక ఆరాధన చేశారు. ధ్వజ పటాన్ని ఆలయ ముఖ మండపం నుంచి ఊరేగింపుగా ధ్వజస్తంభం వరకు తీసుకెళ్లి, అక్కడ గరుఢ ఆళ్వారుడికి గరుఢ ముద్దలను నైవేద్యంగా సమర్పించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిత్యారాధనల అనంతరం వేదపారాయణం గావించారు. అనంతరం భేరీపూజ, దేవతాహ్వానం వైభవంగా నిర్వహించారు. వేడుకల్లో ఆలయ ఈఓ భవానీ శంకర్, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, డిప్యూటీ ఈఓ దోర్భాల భాస్కర్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి అలంకార సేవలు
నృసింహుడికి ఇష్టమైన అలంకార సేవలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. ఉదయం హవన పూజలు జరిపించిన అనంతరం సింహ వాహనంపై తిరువీధుల్లో సేవను ఊరేగించనున్నారు. రాత్రి స్వామి వారి ఎదుర్కోలు ఉత్సవం జరిపించనున్నారు. ఎదుర్కోలు ఉత్సవంలో భాగంగా స్వామి వారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
ఫ రెండో రోజుకు చేరిన పూర్వగిరి
శ్రీలక్ష్మీనరసింహస్వామి
వార్షిక బ్రహ్మోత్సవాలు
ఫ నేటి నుంచి అలంకార సేవలు, ఎదుర్కోలు


