ఫామ్ ఎ, బి అంటే ..
భువనగిరిటౌన్ : ఎన్నికల సమయంలో ఫామ్–ఎ, బి–ఫామ్ పేర్లు వినిపిస్తుంటాయి. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల గుర్తులు అభ్యర్థులకు రావాలంటే ఈ ఫారం అందించాల్సి ఉంటుంది.
ఎ– ఫామ్
రాజకీయ పార్టీ తన అభ్యర్థిగా ఎంపిక చేసిన వారికి బి–ఫామ్ అందిస్తారు. అయితే ఆ పార్టీ తరఫున బి–ఫామ్ అందించే వ్యక్తికి ముందుగా ఫామ్–ఎ అందిస్తారు. పార్టీ నుంచి ఫామ్–ఎ అందుకున్న వ్యక్తి మాత్రమే బి–ఫామ్ జారీ చేసేందుకు అర్హత కలిగి ఉంటాడు. అయితే సదరు వ్యక్తి పార్టీ నుంచి తనకు లభించిన ఫామ్–ఎను ఎన్నికల అధికారులకు అందించాల్సి ఉంటుంది.
బి–ఫామ్
గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు తమ పార్టీ గుర్తుపై ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వీరే అని తెలుపుతూ ఇచ్చేదే బి–ఫామ్ నామినేషన్ వేసే సమయంలో ఎన్నికల అధికారులకు ఈ ఫారాన్ని ఇస్తేనే పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును సదరు అభ్యర్థికి కేటాయిస్తారు. పార్టీ అధ్యక్షుడు, ప్రత్యేకంగా నియమితులైన ప్రతినిధుల ద్వారా బి–ఫామ్‌ని అందిస్తారు.
మున్సిపల్ బరిలో
మాజీ సర్పంచ్‌లు
కోదాడ : మున్సిపాలిటీ ఎన్నికల బరిలో మాజీ సర్పంచ్‌లు, వారి సతీమణులు పోటీ పడుతున్నారు. కోదాడ గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో సర్పంచ్‌లుగా పని చేసిన ఎర్నేని బాబు, ఎర్నేని కుసుమతో పాటు గతంలో తమ్మర సర్పంచ్‌గా పనిచేసిన సామినేని ప్రమీల, కొమరబండ సర్పంచ్‌గా పని చేసిన సంపెట రవి ప్రస్తుతం కౌన్సిలర్‌లుగా నామినేషన్ దాఖలు చేశారు. దాంతో పాటు మాజీ సర్పంచ్‌లు పారా సీతయ్య సతీమణి సత్యవతి, వాడపల్లి వెంకటేశ్వర్లు సతీమణి రంగమ్మ కూడా నామినేషన్ వేశారు.
ఫామ్ ఎ, బి అంటే ..


