వనదేవతల జాతర ప్రారంభం
రాజాపేట : రాజాపేట మండలంలోని చిన్నమేడారం, చల్లూరులోని యాదాద్రి మేడారంలో నాలుగు రోజులపాటు నిర్వహించనున్న సమ్మక్క–సారలమ్మల జాతరను మంగళవారం నిర్వాహకులు ఎల్లమ్మ దేవతకు పూజలు చేసి సంప్రదాయబద్ధంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బూర్గుపల్లి, కుర్రారం, చల్లూరు గ్రామాల ప్రజలు బోనాలను డప్పు వాయిద్యాలు, శివస్తుల పూనకాలతో ఊరేగింపుగా వెళ్లి సమ్మక్క– సారమ్మ దేవాలయ ప్రాంగణంలోని ఎల్లమ్మ తల్లికి సమర్పించారు.
నేడు గద్దైపెకి రానున్న సారలమ్మ
సమ్మక్క సారమ్మల జారలో భాగంగా నిర్వాహకులు బుధవారం ఏదులగుట్ట నుండి సారలమ్మను డప్పు వాయిద్యాలతో గద్దైపెకి తీసుకురానున్నారు. గురువారం సమ్మక్క తల్లిని పులిగుట్ట నుంచి గద్దైపెకి తీసుకురావడంతో వనదేవతలు భక్తులకు దర్శనమివ్వనున్నారు. జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
నేటి నుంచి వద్ద సమ్మక్క సారలమ్మ జాతర
పెద్దవూర: పెద్దవూర మండలంలోని పొట్టిచల్మ ఎక్స్‌రోడ్డు వద్ద కృష్ణానది సమీపంలో కొలువై ఉన్న వనదేవతలు సమ్మక్క–సారలమ్మ జాతర బుధవారం నుంచి ప్రారంభం కానుంది. సమీప జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు. మేడారం జాతరకు వెళ్లలేని భక్తులు పొట్టిచెల్మ ఎక్స్‌రోడ్డు వద్ద కొలువై ఉన్న సమ్మక్క–సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ పూజారులు గుంజ అంజమ్మ, నాగపురి లక్ష్మీనాగరాజు, గుంజ కృష్ణంరాజు మంగళవారం తెలిపారు.
ఫ రాజాపేటలోని చిన్నమేడారంలో
ఎల్లమ్మ తల్లికి బోనాల సమర్పణ
వనదేవతల జాతర ప్రారంభం


