ఈ రైతు పేరు వేలిమినేటి ముత్యంరెడ్డి. ఈయనది మోత్కూరు మండలం ముసిపట్ల. గ్రామంలో తనకున్న ఆరెకరాల భూమితోపాటు, మరో ఎకరంన్నర భూమి కౌలుకు తీసుకొని వరిసాగు చేశాడు. భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో బోరు ఆగిఆగి సన్నగా పోస్తుంది. పక్షం రోజుల నుంచి నీరందడం లేదు. ఎకరం పొలం నెర్రెలు వారి పోయింది. కౌలుకూడా ఎల్లే పరిస్థితి లేదని రైతు వాపోతున్నాడు.
ఈ చిత్రంలోని రైతు గుండాల మండలం మాసంపల్లి గ్రామానికి చెందిన మలిపెద్ది మైపాల్‌రెడ్డి. ఈయన తనకున్న ఎకరంన్నర పొలంతోపాటు మరో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకొని వరిపంటసాగు చేశాడు. వ్యవసాయ బావిలో నీటి ఊటలు తగ్గి సాగుకు నీరందడం లేదు. దీంతో ఇప్పటికే సుమారుగా ఎకరంన్నర పొలం ఎండిపోయింది.


