రాజాపేట : వంట గ్యాస్ కొరత వల్ల చిరు వ్యాపారాలు చేసుకునే మహిళలు సైతం ఇబ్బందులు పడుతున్నారు. రాజాపేట మండల కేంద్రానికి చెందిన గొల్లెన జానమ్మ రోజూ సాయంత్ర వేళ మిరపకాయ బజ్జీలు (మిర్చీలు) వేస్తూ జీవనం సాగిస్తోంది. గ్యాస్ దొరకక మూడు రోజులపాటు ఇబ్బంది పడిన జానమ్మ రూ.వెయ్యి వరకు ఖర్చు చేసి ఇనుప డ్రమ్మును కట్టెలపొయ్యిగా మార్చుకుని మిర్చీలు వేస్తూ తన వ్యాపారం కొనసాగిస్తోంది. అయితే వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా మండల కేంద్రంలో కొన్ని చిన్న హోటల్స్‌తోపాటు టీ స్టాళ్లు మూతపడ్డాయి.


