గంజాయి కేసులో ఆరుగురు అరెస్ట్
హుజూర్‌నగర్ : హుజూర్‌నగర్‌లో మంగళవారం గంజాయి కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ చరమందరాజు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన వీరమల్ల ఉపేందర్ తన మోటార్ సైకిల్‌ను రూ.20 వేలకు హైదరాబాద్‌లో అమ్మాడు. ఆ డబ్బులతో ఉపేందర్, జయంత్‌లు ఒడిశాలో 6 కేజీల గంజాయి కొనుగోలు చేశారు. దానిని పట్టణ శివారులోని రామస్వామిగట్టు వద్ద సాముల ప్రతాప్ రెడ్డి, చిల్ల వికాస్, సయ్యద్ రహమద్ బాబా, జడ లింగస్వామి అలియాస్ దగడ్ సాయికి అమ్ముతుండగా ఎస్‌ఐ మోహన్‌బాబు తన సిబ్బందితో కలిసి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 6 కేజీల గంజాయి, బైక్, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.


