చిల్లేపల్లి రేషన్ డీలర్‌పై కేసు నమోదు
నేరేడుచర్ల : నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి గ్రామంలోని రేషన్ దుకాణంపై మంగళవారం విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్, సివిల్ సప్లయ్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. బియ్యం నిల్వల్లో తేడాలు రావడంతో రేషన్ డీలర్ రవిగుప్తాపై కేసు నమోదు చేశారు. ఈ సంద్భంగా విజిలెన్ప్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నల్లగొండ విభాగం సీఐ దశరథ, సివిల్ సప్లయ్ రెవెన్యూ అధికారి ప్రమోద్ మాట్లాడుతూ.. చిల్లేపల్లి గ్రామంలోని రేషన్ షాపులో 46.96 క్వింటాళ్ల బియ్యం నిల్వలు ఉండాల్సి ఉండగా.. 36.67 క్వింటాళ్ల బియ్యం మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు రేషన్ డీలర్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా నేరేడుచర్ల మండలంలోని బొడలదిన్నె, సోమారం గ్రామాల్లోని రేషన్ దుకాణాలను కూడా తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు.


