రోడ్డు భద్రత.. అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

రోడ్డు భద్రత.. అందరి బాధ్యత

Jan 28 2026 8:44 AM | Updated on Jan 28 2026 8:44 AM

రోడ్డ

రోడ్డు భద్రత.. అందరి బాధ్యత

భువనగిరి: రోడ్డు భద్రత అందరి బాధ్యత అని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. అరైవ్‌ అలైవ్‌ కార్యక్రమంలో భాగంగా మంగళవారం స్థానిక వివేరా హోటల్‌ కన్వెన్షన్‌ హాల్‌లో సర్పంచ్‌లు, విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, పారిశ్రామిక వేత్తలకు రోడ్డు భద్రత పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నేటి యువత హెల్మెట్‌ ధరించకుండా అతి వేగంగా వాహనాలు నడపడంవల్ల ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. వాహనాలను నడిపేటప్పుడు హెల్మెట్‌ ధరించడంతో పాటు కార్లు నడిపేవారు సీటు బెల్ట్‌ పెట్టుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలు వీధిన పడిన పరిస్థితులను అర్థం చేసుకుని వాహనాలను జాగ్రత్తగా నడపాలని కోరారు. అనంతరం ఆయనను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు, ఎస్పీ అక్షాంశ్‌ యాదవ్‌, డీటీఓ సాయికృష్ణ, అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ, యాదగిరిగుట్ట డీఎస్పీ శ్రీనివాస్‌నాయుడు, చౌటుప్పల్‌ డీఎస్పీ మధుసూదన్‌రెడ్డి, ఆర్డీఓ కృష్ణారెడ్డి, పట్టణ సీఐ రమేష్‌, ఎస్సైలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రెండు నెలల్లో ఇళ్లు పూర్తి చేస్తాం

భువనగిరిటౌన్‌ : భువనగిరిలోని డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను రెండు నెలల్లో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు, అధికారులతో కలిసి ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించి మాట్లాడారు. రెండు నెలల్లో 444 మంది లబ్ధిదారులకు పూర్తి వసతులతో కూడిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను అందజేస్తామన్నారు. గృహ ప్రవేశాలను ఘనంగా నిర్వహించుకుందామని అన్నారు. మున్సిపాలిటీలో వార్డుల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ రామలింగం,అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

ఫ ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి

రోడ్డు భద్రత.. అందరి బాధ్యత1
1/1

రోడ్డు భద్రత.. అందరి బాధ్యత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement