కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి
మోత్కూరు : మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ అన్నారు. మోత్కూరు మున్సిపల్ పోరులో బీఆర్‌ఎస్, సీపీఎం మిత్రపక్ష అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ శనివారం పట్టణంలో నిర్వహించిన ర్యాలీ, కార్నర్ సభలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను, నాయకులను బెదిరిస్తూ భయబ్రాతులకు గురిచేస్తున్న అధికార పార్టీ నాయకులు, పోలీసులు తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. తుంగతుర్తి ఎమ్మెల్యే.. కౌన్సిలర్ టిక్కెట్లు అమ్ముకున్నారని సొంతపార్టీ వారే విమర్శిస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మోత్కూరు మున్సిపాలిటీపై తిరిగి బీఆర్‌ఎస్ జెండాను ఎగురవేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జి నేవూరి ధర్మేంధర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు తీపిరెడ్డి మేఘారెడ్డి, కొణతం యాకూబ్‌రెడ్డి, చిప్పలపల్లి మహేంద్రనాథ్, బీఆర్‌ఎస్, సీపీఎం నాయకులు బయ్యని పిచ్చయ్య, ఉప్పనబోయిన రమేష్, జంగ శ్రీను, గజ్జి మల్లేష్, కూరపాటి రమేష్, మాటూరి బాలరాజు, బొల్లు యాదగిరి, గుండు వెంకటనర్సు, రాచకొండ రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్


