లిఫ్ట్‌ అడిగి.. క్యాబ్‌ డ్రైవర్‌పై కత్తితో దాడి | - | Sakshi
Sakshi News home page

లిఫ్ట్‌ అడిగి.. క్యాబ్‌ డ్రైవర్‌పై కత్తితో దాడి

Feb 4 2026 8:27 AM | Updated on Feb 4 2026 8:27 AM

లిఫ్ట్‌ అడిగి.. క్యాబ్‌ డ్రైవర్‌పై కత్తితో దాడి

లిఫ్ట్‌ అడిగి.. క్యాబ్‌ డ్రైవర్‌పై కత్తితో దాడి

చిట్యాల : క్యాబ్‌ డ్రైవర్‌ను లిఫ్ట్‌ అడిగిన గుర్తుతెలియని వ్యక్తి కొద్దిదూరం వెళ్లిన తర్వాత కత్తితో డ్రైవర్‌పై దాడి చేశాడు. ఈ ఘటన హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై చిట్యాల పట్టణ శివారులో సోమవారం రాత్రి జరిగింది. వివరాలు.. నల్లగొండకు చెందిన షేక్‌ ఇమ్రాన్‌ అలీ క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి నల్లగొండ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరాడు. మార్గమధ్యలో నార్కట్‌పల్లి– చిట్యాల మధ్యలో ఓ హోటల్‌ వద్ద గుర్తుతెలియని వ్యక్తి లిఫ్ట్‌ అడగడంతో అతడిని కారులో ఎక్కించుకున్నాడు. కారు చిట్యాల శివారులోకి రాగానే సదరు గుర్తుతెలియని వ్యక్తి కత్తితో ఇమ్రాన్‌ అలీపై దాడి చేయడంతో అతడి పొట్టలో రెండు చోట్ల కత్తిపోట్లు తగిలాయి. అనంతరం ఇమ్రాన్‌ అలీ వద్ద ఉన్న నగదు, సెల్‌ఫోన్‌ను లాక్కొనేందుకు ప్రయత్నించగా.. అతడు కేకలు వేయడంతో సదరు వ్యక్తి కారులోంచి దిగి పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న చిట్యాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇమ్రాన్‌ అలీని అంబులెన్స్‌లో నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దుండగుడు వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా దాడికి గురైన ఇమ్రాన్‌ అలీపై గతంలో పలు కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన దారి దోపిడీలో భాగంగా జరిగిందా లేదా పాత కక్షలతో ఇమ్రాన్‌ అలీపై దాడికి తెగబడ్డారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

జాతీయ స్థాయి మౌంటెన్‌ బైకింగ్‌

చాంపియన్‌షిప్‌కు ఎంపిక

తుర్కపల్లి: తుర్కపల్లి మండలం చౌక్లతండా గ్రామానికి చెందిన భూక్య నిఖిల్‌ ఈ నెల 7 నుంచి 15వ తేదీ వరకు అరుణాచల్‌ప్రదేశ్‌లో జరగనున్న జాతీయ స్థాయి మౌంటెన్‌ బైకింగ్‌(ఎంటీబీ) చాంపియన్‌షిప్‌కు ఎంపికయ్యాడు. నిఖిల్‌ కొన్ని సంవత్సరాలుగా సైక్లింగ్‌లో చురుకుగా పాల్గొంటూ జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ హనుమంతరావును నిఖిల్‌ కలిసి పోటీల్లో పాల్గొనడానికి అవసరమైన సహకారం అందించాలని వినతి పత్రం అందజేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement